Thursday 7 July 2011

ఏం చేస్తే ఏం జరుగుతుంది?



తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు సమర్పించినతరువాత ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం సంక్లిష్ట స్థ్తితిలోకి వచ్చింది. అసలే బొటాబొటి మెజారిటీతో ఉండి అందులోనూ అవినీతి కూపంలో కూరుకుపోయి మంత్రులపైనే విచారణలెదుర్కుంటూ, మరో పక్క లోక్‌పాల్ విషయంతో కొట్టుమిట్టాడుతున్న కేంద్రానికి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో అని భయంతో ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిని ఇలాగే కొనసాగించడం అసలు సాధ్యం కాదు కనుక కేంద్ర ఏం చెయ్యాలి? ఇప్పుడు కేంద్ర దగ్గర ఉన్న మార్గాలు ఏమిటి? ఇంతకూ కేంద్రం ఏం చేస్తే ఏం జరుగుతుంది?

రెండు మూడు రోజుల్లో జగన్ తన స్టాండును కూడా చెప్పాల్సి వస్తుంది. జగన్ నిర్ణయం కూడా కొంతవరకూ భవిష్యత్ పరిణామాలను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం కొండా సురేఖ, జయసుధల రాజీనామాలను బట్టి జగన్ తెలంగాణ సమర్ధిస్తాడనుకోవచ్చు. కాకపోతే జగన్ మద్దతు ఇవ్వడం, ఇవ్వకపోవడం వల్ల ఈక్వేషన్లు పెద్దగా మారకపోవచ్చు.

1) గవర్నర్ పాలన: కేంద్ర ఎటూ తేల్చక, అందరి రాజీనామాలు తీసుకుని రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించవచ్చు. ఇదే నియంత గవర్నర్ నరసింహన్‌ను కొనసాగించి రాబోయే మూడేల్లలో ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివెయ్యొచ్చు. తరువాత నిదానంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు 2014లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరుపవచ్చు.

ఫలితం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రేస్, తెలుగుదేశం పూర్తిగా ఓడిపోతాయి. టీఆరెస్, బీజేపీ, సీపీఐ ఒక కూటమి లాగా మారవచ్చు. జగన్ అనుకూల నిర్ణయం తీసుకుంటే జగన్ కూడా కూటమిలో చేరవచ్చు. టీఆరెస్, బీజేపీ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు. సీట్ల పంపిణీ ద్వారా సీపీఎం, జగన్ పార్టీలు తెలంగాణలో కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు. మజ్లీస్‌కు బాగా సీట్లు తగ్గిపోయి ఒకటి లేదా రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకోవచ్చు. పార్లమెంటు సీట్లలో కాంగ్రేస్్‌కు బహుషా ఒక్కటి కూడా దక్కక పోవచ్చు.

గవర్నర్ పాలన వలన సీమాంధ్ర ప్రజలు కూడా విసిగిపొయి ఉంటారు కాబట్టి కాంగ్రేస్‌కు సీమాంధ్రలో కూడా 4-5 కంటే ఎక్కువపార్లమెంటు స్థానాలకంటే ఎక్కువ రావు. జగన్‌కు ఎక్కువ సీట్లు , కొన్ని సీట్లు టీడీపీకి దక్కొచ్చు. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్కుండి 4,5 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటే కాంగ్రేస్ మల్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఎండీయే అధికారంలోకి వస్తే వెంటనే తెలంగాణ ఇస్తుంది. అప్పుడు రాష్ట్రంలో కూడా జగన్, టీఆరెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ఉంటే వారు విభజనకు అభ్యంతరాలు పెట్టరు. తెలంగాణలో టీఆరెస్, ఆంధ్రాలో జగన్ పార్టీ అధికారంలోకి రావొచ్చు.


2) సమస్యను సాగదీయడం: ఏదో ఒకలాగా కాంగ్రేస్ ప్రజాప్రతినిధులను మెత్తబరిచి, సమస్యను పరిష్కరిస్తున్నట్లు నటించి రాజీనామాలు వెనక్కి తీసుకునేట్టు చేసి కాలయాపన చెయ్యడం. రెండు సంవత్సరాలు అలాగే గడపెయ్యడం.

అప్పుడు కూడా వెచ్చే ఎలక్షన్లలో కాంగ్రేస్ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. తెలుగుదేశానికి ఇప్పటికే అడ్రస్ లేదు. ఎలక్షన్ రిజల్ట్సు మొదటి ఆప్షన్ లాగానే ఉంటాయి. తరువాత జరిగే పరిణామాలు కూడా భిన్నంగా ఉండవు, ఎండీయే అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇస్తుంది.

3) తెలంగాణ ఇవ్వడం:  కేంద్రానికి మిగిలిన ఏకైక మార్గం తెలంగాణ ఇచ్చెయ్యడం. అప్పుడు ఉద్యమం సీమాంధ్రాకు మారుతుంది. కొన్నిరోజులు బంద్‌లూ గట్రా జరుగుతాయి. తెలంగాణా నుండి స్పషల్ ఫోర్సులను ఆంధ్రాకు తరలిస్తే రెండువారాల్లో అక్కడ పరిస్థితి మామూలు దశకు తీసుకురావొచ్చు.

ఎలాగూ అక్కడ ప్రజల్లో విభజన విషయంలోగానీ సమైక్యత విషయంలో గానీ పెద్ద ఆసక్తి లేదు. ఉద్యమాన్ని నడిపించేది ఎలాగూ నాయకులే. కాంగ్రేస్ నాయకులు సోనియా ఒక్కసారి కన్నెర్రజేస్తే నోరుమూసుకుంటారు. జగన్ బూచిని చూపి చంద్రబాబును దారిలోకి తెచ్చుకుంటే తెలుగుదేశం నాయకులు కూడా మెత్తబడుతారు. జగన్ ఎలాగూ రెండు రోజుల్లో తెలంగాణ అనుకూల ప్రకతన చేస్తాడనుకుంటే జగన్ సమైక్య ఉద్యమం చేసే అవకాశాలు అస్సలు లెవ్వు.

వచ్చే ఎలక్షన్లలో తెలంగాణలో కాంగ్రేస్ తెరాసతో పొత్తు పెట్టుకోవచ్చు, లేక తెరాసను కలిపేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణలో కొన్ని సీట్లు కాంగ్రేస్ గెలుచుకోవచ్చు. సీమాంధ్రాలో విభజన వద్దనే పార్టీ ఏదీ ఉండదు కాబట్టి సీమాంధ్రాలో ఈఅంశం ఎన్నికలపై ప్రభావం చూపకపోవచ్చు. చంద్రబాబు పని ఇప్పటికే అయిపోయింది కాబట్టి సీమాంధ్రలో జగన్, కాంగ్రేస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు. దీనివల్ల వచ్చే ఎలక్షన్లలో కేంద్రంలో కాంగ్రేస్ మల్లీ అధికారంలోకి రాకపోయినా కనీసం కొన్ని సీట్లు పెరుగుతాయి, ఆంధ్ర, తెలంగాణాల్లో తన ఉనికిని కాంగ్రేస్ కాపాడుకుంటుంది.

కాబట్టి ఎలా చూసినా తెలంగాణా ఇస్తేనే కాంగ్రేస్‌కు లాభం. ఏం జరిగినా వచ్చే మూడేల్లలో పూర్తిగా జోకర్లుగా మిగిలేది మాత్రం చంద్రబాబు, చిరంజీవి
.

21 comments:

  1. //ఎండీయే అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇస్తుంది//
    మీకు కొన్ని బేసిక్స్ తెలవవు అనుకుంటా. రాష్ట్రం ఏర్పరచాలి అంటే పార్లమెంట్ లో 2 /3 మెజారిటీ తో రాజ్యాంగ సవరణ చెయ్యాలి. రెండు సభల్లో ఎన్ డి ఎ కు అంత మెజారిటీ లేదు. కనీసం రెండు సభలని ఉమ్మడిగా సమావేశ పరిచి అయినా 2 /3 మెజారిటీ ఉండాలి. కాంగ్రెస్స్ మద్దతు లేక పొతే ఆ మెజారిటీ ఎన్ డి ఎ తలకిందులుగా తపస్సు చేసినా సాధించలేదు. కాంగ్రెస్స్ సప్పోర్ట్ ఇవ్వకపోతే మీరు తెలంగాణా గురించి కలలో మాత్రమె ఊహించుకోవాలి.అందుకే సోనియమ్మా ను ఒక్క మాట కూడా అనడు కారు దొర.

    //ప్రస్తుతం కొణ్దా సురేఖ, జయసుధల రాజీనామాలను బట్టి జగన్ తెలంగాణ సమర్ధిస్తాడనుకోవచ్చు.//
    నాకయితే నమ్మకం లేదు. జగన్ సమైఖ్య ఆంధ్ర కి మద్దతు ఇవ్వ వచ్చు అని అనుకుంటున్నాను.

    //ఎలాగూ అక్కడ ప్రజల్లో విభజన విషయంలోగానీ సమైక్యత విషయంలో గానీ పెద్ద ఆసక్తి లేదు//
    మీరు అనుకుంటే సరిపోతుందా?

    //కాబట్టి ఎలా చూసినా తెలంగాణా ఇస్తేనే కాంగ్రేస్‌కు లాభం//
    అందరూ మీలాగే ఆలోచిస్తే తెలంగాణా ఎప్పుడో వచ్చేది. చాలా ఇతర లెక్కలు ఉంటాయి.

    ReplyDelete
  2. @ఇంద్రసేనా
    1. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎన్‌డీయే మిత్ర పక్షాలకు 2/3 కంటే ఎక్కువే లోక్స్ సభలో గెలుస్తుందనిపిస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యమయిన విషయం బిల్లు పెడితే కాంగ్రేస్ వ్యతిరేకంగా ఓటెయ్యలేదు, అలా చేస్తే తెలంగాణ శాశ్వతంగా వదులుకోవాలి. బహుషా వోటింగ్‌లో పాల్గొనదు. ఎన్‌డీయేకి చెందని కొన్ని వర్గాలు కూడా తెలంగాణకు మద్దతివ్వొచ్చు.
    2. జగన్ తెలంగాణకు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద తేడా ఏం ఉండదు. తెలంగాణలో జగన్ ఎలాగూ ఊడబొడిచేదేం లేదు. సీమాంధ్రలో ఎలాగూ చంద్రబాబు కంటే ముందే ఉన్నాడు. అయినా పార్టీ పెట్టి ఇన్నాల్లు తేల్చని వాడు ఇప్పుడు ఏం చెబితే మాత్రం దానికి ప్రజలు ఎంత విలువిస్తారు?
    3. సీమాంధ్రలో ఇంతకుముందు ఉద్యమం ఎలా జరిగిందో తెలిసిందే కదా, ఆవిషయం మీకు తెలియదా?
    4. ఇవి నా లెక్కలు. చాలామంది అసలు ఎలా లెక్కలేయాలో, ఎటు ఉండాలో తేల్చుకోకుండానే సంవత్సరాలు గడిపేస్తున్నారు, మీజగన్‌తో సహా.

    ReplyDelete
  3. @సత్యాన్వేషి గారు,

    //రస్తుత పరిస్థితి చూస్తే ఎన్‌డీయే మిత్ర పక్షాలకు 2/3 కంటే ఎక్కువే లోక్స్ సభలో గెలుస్తుందనిపిస్తోంది.//
    రాజ్య సభ లో సీట్లు రావాలంటే రాష్ట్రాల్లో అధికారం లో ఉండాలి. NDA మిత్ర పక్షాలు ఎన్ని రాష్ట్రాలో ఉన్నాయి. వాస్తవం లోకి రండి సర్.

    // బహుషా వోటింగ్‌లో పాల్గొనదు. //
    మీకు ఇంకా కనీస నాలెడ్జి లేదు. కోరం లేక పొతే అసలు స్పీకర్ కానీ,ఉప రాష్ట్ర పతి కానీ బిల్ ప్రవేశ పెట్టలేరు. కాంగ్రెస్స్ వాకౌట్ చేస్తే అసలు పుట్టి మునుగుతుంది.

    //కాబట్టి ఎలా చూసినా తెలంగాణా ఇస్తేనే కాంగ్రేస్‌కు లాభం//

    తెలంగాణా ఇస్తే రాజధాని లేక ఆంధ్ర వాళ్ళ బాధలు వర్ణనాతీతం. మళ్ళీ డేరాల లోకి వస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రచార సాధనాలు మూలాన భావోద్వేగాలు విపరీతంగా వ్యాపిస్తాయి. మనకు కాంగ్రెస్స్ అన్యాయం చేసింది అనే భావన ఎక్కువ అవుతుంది.
    మనల్ని వెళ్ళగొట్టారు అనే భావన మూలాన ఉన్న ఉన్న ముసలమ్మ నుండి, చిన్న పిల్లాడి వరకు వ్యాపిస్తుంది. ఆ కోపాన్ని మొత్తం కాంగ్రెస్స్ మీద ప్రతీకారంగా తీర్చుకుంటారు. కనీసం వంద ఏళ్ళు కనీసం పంచాయతి ప్రెసిడెంట్ గా కూడా కాంగ్రెస్స్ గెలవలేదు. ఇక ఎం ఎల్ ఎ , ఎం పి సీట్లు మర్చిపోండి. రాజకీయంగా కాంగ్రెస్స్ కి అతి పెద్ద దెబ్బ. అన్ని ఇతర రాజకీయ పార్టీ లు ప్లేట్ ఫిరాయిస్తాయి.

    ప్రస్తుతం హైదరాబాద్,రంగా రెడ్డి, జంట నగరాల శివారు నియోజక వర్గాలు, ఖమ్మం, లలో ఎటువంటి తెలంగాణా రాష్ట్ర భావన లేదు. ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్స్ వ్యతిరేఖులు గెలుస్తారు. కనీసం 50 సీట్లలో ఎటువంటి తెలంగాణా భావన లేదు.
    మిగతా 70 సీట్లలో కెసిఆర్ కి తోక లాగ మారాలి. ఆయన దయ, కాంగ్రెస్స్ వాళ్ళ ప్రాప్తం. తెలంగాణా రాష్ట్రం ఇవడం కాంగ్రెస్స్ కి ఎంత మాత్రం రాజకీయంగా లాభం కాదు.

    // తెరాసను కలిపేసుకోవచ్//
    కెసిఆర్ అంత పిచ్చోడా? మళ్ళీ కొత్త పార్టీ పెడతాడు.

    //అప్పుడు రాష్ట్రంలో కూడా జగన్, టీఆరెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ఉంటే వారు విభజనకు అభ్యంతరాలు పెట్టరు.//
    నిజమా!!!తెలంగాణా ఇవ్వకపోతే బోట బోటీ మెజారిటీ తో నయినా ,MIM సప్పోర్ట్ తో నయినా జగన్ అధికారం లోకి వస్తాడు. జగన్ చేతిలో అధికారం ఉంటె కెసిఆర్ ను రాజకీయంగా అధః పాతాల లోకం లోకి తొక్కి వేస్తాడు.
    రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాడు.మళ్ళీ ప్రత్యెక రాష్ట్ర సౌండ్ ఎంత మాత్రం వినపడదు.

    ఇది అసలు వాస్తవం .మీరు కొంచెం మీ తెలంగాణా రంగుటద్దలు తీసి చూస్తె సరిగ్గా వాస్తవం కనపడుతుంది.

    ReplyDelete
  4. 1) కోరంకు కావల్సింది పది శాతం మాత్రమే. వాస్తవంలోకి రావల్సింది మీరు. కాంగ్రేస్ వాకౌట్ చేస్తుందని నేననలేదు, కేవలం వోటింగ్ సమయంలో దూరం ఉండొచ్చు, లేదా సపోర్ట్‌గా వొటేయొచ్చు కూడా. తానధికారంలో ఉండగా కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి, ఇస్తామని ఒకసారి ప్రకటన చేసి ప్రతిపక్షంలో ఉంటే వ్యతిరేకించే అంత సీన్ కాంగ్రేస్‌కు లేదు. వోటింగ్‌లో పాల్గొనకపోయినా, మద్దతుగా వోటేసినా సీమాంధ్రలో అంత వ్యతిరేకత కాంగ్రేస్‌కు రాదు, బిల్లు పెట్టింది బీజేపీ కాబట్టి బీజేపీ ఇచ్చినట్టుగానే పేరొస్తుంది కాబట్టి ఆంధ్రాలో కాంగ్రేస్‌కు నష్టం లేదు. వ్యతిరేకిస్తే అలా కాదు.

    2) పోయినసారి అంటే రాజాజీ ఒక్కరోజు కూడా ఉండొద్దని వెల్లగొట్టాడు గానీ ఇప్పుడు డేరాల్లోకి వెల్లాల్సిన పనిలేదు. రాజధాని వసతులు సమకూరే వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. రాజధాని పేరు చెప్పి కేంద్రం దగ్గర ప్యాకేజీ కొట్టెయ్యొచ్చు..అంటే ఎవరైతే కలిసుండి లాభపడ్డారో వారికే విడిపోయినా ప్యాకేజీ వస్తుంది అంతకన్న కావలసిందేముంది?

    పైగా కొత్త రాష్ట్రం ఏర్పడితే రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది. సీమాంధ్రా జనాల రియల్ ఎస్టేట్ పిచ్చి తెలియందేముంది? సంతోషిస్తారు. ఇంకా అక్కడ కొత్త ఉద్యోగాలొస్తాయి, ఇక్కడి ఉద్యోగాల్లో మత్రం వెనక్కి వెల్లేవారెవరూ ఉండరు..అంటే అన్నిరకాలుగా ఆంధ్రాకే లాభం. ఏదో కొద్దిమంది లగడపాటి, కావూరిలాంటి వారికి నష్టం కావొచ్చు. కాబట్టి జనాల్లో అంత వ్యతిరేకత ఏం రాదు. ఒకవేళ వస్తే అది రాజధాని గురించి రాదు గానీ ఇప్పుడు అప్పనంగా వస్తున్న క్రిష్ణా నీల్లు ఇకముందు రావేమో అన్న భయంతో వ్యతిరేకత రావొచ్చు.

    హైదరాబాద్‌లో ఉన్నవాల్లెవరూ వెల్లే సమస్యే ఉండదు కనుక మమ్మల్ని వెల్లగొట్టారు అనే భావన కొద్దిరోజులు ఉన్నా ఎలక్షన్లలోపు అది పోతుంది.

    3) తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం లాంటి చోట్ల మీరన్నట్టు ఆంధ్రా వారున్నా, ఇప్పటిదాకా ఎలాగైతే తెలంగాణ అనుకూల వోట్లు చీలిపొయి తెరాస పెద్దగా గెలవలేదో అలాగే భవిస్యత్తులో తెలంగాణ వ్యతిరేక వోట్లు కాంగ్రేస్, టీడీపీ, జగన్ల మధ్య చీలిపొయి వారు హైదరాబాద్‌లో, ఖమ్మంలో గెలవరు.

    సీమాంధ్రలో తెలంగాణలో తెరాసలాగ సమైక్యంగా ఉండడంకోసమే పుట్టిన పార్టీ అంటూ ఏదీ లేదు కాబట్టి విడిపోయినాక విభజన వ్యతిరేక వోటు ఎవరికి వెయ్యాలో తెలియదు, కనుక అక్కడ పెద్ద నష్తం ఉండదు.

    4) విభజన జరగకపోతే జగన్ బొటాబొటీగా కూడా అధికారమ్ళొకి రావడం కల్ల. మీరు వైఎస్సార్ రంగు కల్లజోల్లు కాస్త తీస్తే మంచిది.

    ReplyDelete
  5. //కోరంకు కావల్సింది పది శాతం మాత్రమే.//
    // కేవలం వోటింగ్ సమయంలో దూరం ఉండొచ్చు//

    తెలంగాణా ఎందుకు రాదు అంటే ఇందుకే. రాజ్యాంగ సవరణ కి పది శాతం కోరం ఉంటె సరిపోతుందా? ఏనాడయినా మీరు రాజ్యాంగం మొహం చూసారా? అబద్దాలు ఆడిన అతికినట్లు ఉండాలి.
    మీరు, మీ సత్యాలు బాగానే ఉన్నాయి. కనీసం సగం మంది వోటింగ్ అప్పుడు ఉండాలి. వోటింగ్ కి దూరం అంటే వాక్ అవుట్ చేస్తే అసలు సవరనే జరగదు.

    http://lawmin.nic.in/coi/coiason29july08.pdf
    http://en.wikipedia.org/wiki/Amendment_of_the_Constitution_of_India#Procedure

    //రాజధాని వసతులు సమకూరే వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది//
    మీ కారు దొర ని ఒప్పిస్తారా? మీరేమన్న తెలంగాణా ప్రతినిదా?

    //తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం లాంటి చోట్ల మీరన్నట్టు ఆంధ్రా వారున్నా, ఇప్పటిదాకా ఎలాగైతే తెలంగాణ అనుకూల వోట్లు చీలిపొయి తెరాస పెద్దగా గెలవలేదో అలాగే భవిస్యత్తులో తెలంగాణ వ్యతిరేక వోట్లు కాంగ్రేస్, టీడీపీ, జగన్ల మధ్య చీలిపొయి వారు హైదరాబాద్‌లో, ఖమ్మంలో గెలవరు.//

    ఇటువంటి లేక్కలేసి 2009 లో కారు దొర చావు దెబ్బలు తిన్నాడు.

    //విభజన జరగకపోతే జగన్ బొటాబొటీగా కూడా అధికారమ్ళొకి రావడం కల్ల.//

    చూద్దాం. ఎవరి మాటలు నిజమవుతాయో.

    ReplyDelete
  6. రాజ్యాంగం మొహం నేను చూల్లేదు గానీ ఒక రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగసవరణ ఎందుకో? ఇంతకుముందు ఎన్‌డీయే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినపుడు ఎన్‌డీయేకి ఎంత మెజారిటీ ఉంది?
    Article 2 reads as, “Admission or establishment of new States.—Parliament may by law admit into the Union, or establish, new States on such terms and conditions as it thinks fit”.[4]

    ReplyDelete
  7. // ఎన్‌డీయేకి ఎంత మెజారిటీ ఉంది//
    ఏది సత్యం గారు, ఆ మూడు రాష్ట్రాల ఏర్పాటుకు కాంగ్రెస్స్ సహకరించింది అనేది సత్యము.
    ఎన్ డి ఎ మెజారిటి ఎంత మాత్రం సరిపోదు. కొంచెం వాస్తవ లోకి రండి సర్. సరే కానీ 10 శాతం సభ్యులు ఉంటె రాజ్యాంగ సవరణ చెయ్య వచ్చు అనే సత్యం మీకు ఎవరు చెప్పారు. సభ్యులు పార్లమెంట్ లో ఉండి కూడా వోటింగ్ కు దూరంగా ఉండవచ్చు అనే సత్యాలు మీకు ఎవరు చెప్పారు? సరికొత్త పార్లమెంట్ నియమాలు చెప్తున్నారు.మీ సత్యాలు మాత్రం అల్టిమేట్. కీప్ ఇట్ అప్.

    ReplyDelete
  8. నేను చెప్పింది పార్లమెంటులో బిల్లు పెట్టడానికి కావలసింది. ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యడానికి రాజ్యాంగ సవరనదాకా అసలు ఎందుకు వెల్లారో మీరు కాస్త సెలవిస్తారా, ప్లీజ్? మీజగన్ అలా చెయ్యాలని చెబుతున్నాడా? క్రితం సారి మూడు రాష్ట్రాల ఏర్పాటుకు ఎంత అయిష్టంగా కాంగ్రెస్ సహకరించిందో ఇప్పుడూ అదే చేస్తుంది, మరో దారి లేదు.

    ReplyDelete
  9. //నేను చెప్పింది పార్లమెంటులో బిల్లు పెట్టడానికి కావలసింది//

    తెలంగాణా రావడానికి బిల్ పెడితే సరిపోతుందా ? రాజ్యాంగ సవరణ అక్కరలేదా? తెలిసి కూడా ఏదో వాదన కోసం మాట్లాడితే ఇలాగే ఉంటుంది.

    //క్రితం సారి మూడు రాష్ట్రాల ఏర్పాటుకు ఎంత అయిష్టంగా కాంగ్రెస్ సహకరించిందో ఇప్పుడూ అదే చేస్తుంది,//

    చెప్పండీ? ఏ రాష్ట్రాలు ఒద్దు అని కాంగ్రెస్స్ చెప్పిందో? దేశ రాజకీయం మొత్తం మీకే తెలిసినట్లు చెప్తున్నారు కదా? ఇష్టం లేక పోయినా వోటింగ్ చెయ్యడం ఏందో ? మీ లాజిక్ నాకు అసలు అర్ధం కాలేదు. కాంగ్రెస్స్ కి ఇష్టం లేక పొతే అసలు ఆ మూడు రాష్ట్రాలు ఉండేవి కావు.

    ReplyDelete
  10. a quick link.
    http://www.mightylaws.in/725/telangana-constitutional-issues-state-formation

    state formation is constitutional, why is a constitutional amendment required? that too constitutional experts like you should not say this.

    ReplyDelete
  11. already I posted this article 2 from constitution for your sake, still why do you drag same argument? is it just for the sake of argument?

    “Admission or establishment of new States.—Parliament may by law admit into the Union, or establish, new States on such terms and conditions as it thinks fit”.[4]

    ReplyDelete
  12. @ఏది సత్యం గారు,

    ఎవరో బ్లాగు లింక్ ఇవ్వడం కాదు. కింద భారత రాజ్యాంగం లోని కొన్ని భాగాలు చూడండి.

    ఆర్టికల్ 2 , ఆర్టికల్ 3 లో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి ఖచ్చితంగా ఫస్ట్ ,ఫోర్త్ షెడ్యూల్ కి అమెండ్ చెయ్యాలి అని క్లియర్ గా చెప్పారు. 4th పాయింట్ చూడండి.
    రాజ్యంగా సవరణ లేక పొతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ,కింద మూడు రాష్ట్రాల కోసం ఎందుకు రాజ్యాంగ సవరణ చేసారు. మొత్తం అమెండ్మెంట్ ల లిస్టు మీకు ఇవ్వగలను. కొంచెం సత్యాలు చెప్తే బాగుంటుంది.


    Chhattisgarh

    Formed by the Constitutional Amendment Act, 2000 by dividing Madhya Pradesh on November 1, 2000.

    Uttarakhand

    Formed by the Constitutional Amendment Act, 2000 by dividing Uttar Pradesh on November 9, 2000.

    Jharkhand

    Formed by the Constitutional Amendment Act, 2000 by dividing Bihar on November 15, 2000


    Parliament may by law—
    (a) form a new State by separation of territory
    from any State or by uniting two or more States or
    parts of States or by uniting any territory to a part of
    any State;
    (b) increase the area of any State;
    (c) diminish the area of any State;
    (d) alter the boundaries of any State;
    (e) alter the name of any State:
    4[Provided that no Bill for the purpose shall be
    introduced in either House of Parliament except on the
    recommendation of the President and unless, where the
    proposal contained in the Bill affects the area, boundaries
    Name and territory
    of the Union.
    Admission or
    establishment of
    new States.


    Formation of new
    States and
    alteration of areas,
    boundaries or
    names of existing
    States.
    1Subs. by the Constitution (Seventh Amendment) Act, 1956, s. 2, for cl. (2).
    2Subs. by s. 2, ibid., for sub-clause (b).
    3Article 2A was ins. by the Constitution (Thirty-fifth Amendment) Act, 1974, s. 2 (w.e.f.
    1-3-1975).
    4Subs. by the Constitution (Fifth Amendment) Act, 1955, s. 2, for the proviso.
    2
    or name of any of the States 1***, the Bill has been referred
    by the President to the Legislature of that State for
    expressing its views thereon within such period as may
    be specified in the reference or within such further period
    as the President may allow and the period so specified or
    allowed has expired.]

    2[Explanation I.—In this article, in clauses (a) to (e),
    "State'' includes a Union territory, but in the proviso,
    "State'' does not include a Union territory.
    Explanation II.—The power conferred on Parliament
    by clause (a) includes the power to form a new State or
    Union territory by uniting a part of any State or Union
    territory to any other State or Union territory.]


    4. (1) Any law referred to in article 2 or article 3 shall
    contain such provisions for the amendment of the First
    Schedule and the Fourth Schedule as may be necessary
    to give effect to the provisions of the law and may also
    contain such supplemental, incidental and consequential
    provisions (including provisions as to representation in
    Parliament and in the Legislature or Legislatures of the
    State or States affected by such law) as Parliament may
    deem necessary.

    ReplyDelete
  13. come on my friend..let truth prevails..don't kill he truth..please publish my comment..

    ReplyDelete
  14. You are killing the facts.let the facts known to the world dude..as your name suggests get the truth..

    ReplyDelete
  15. @indrasena
    hello, I have to sleep, eat and do other things as well. can't you wait some minutes for comment approval?

    I will answer later when I have time in detail for you.

    ReplyDelete
  16. మీకు ప్రజాస్వామ్య బద్దంగా ప్రత్యెక రాష్ట్రం కోసం పోరాడే హక్కు ఉంది. కానీ అబద్దాలతో పోరాడితే నాన్న పులి సామెత లాగ, పచ్చ పత్రికల విశ్వసనీయత లాగ తయారవుతుంది మీ పరిస్థితి. జాగ్రత్త అండీ.

    ReplyDelete
  17. @ఇంద్రసేనా

    మీదగ్గర రాజ్యాంగం అంతా ఉంది కానీ దాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్నట్లు లేరు. ఆర్టికల్ 2 ప్రకారాం రాష్ట్రాలను పునర్విభజించే హక్కు పార్లమెంటుకు ఉంది. దానికి పార్లమెంటులో బిల్లు సరిపోతుంది. బిల్లు పాసయిన తరువాత ఆటోమేటిగ్గా కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన సమాచారం రాజ్యాంగంలో అమెండ్ చేస్తారు. ఇది రాజ్యాంగ సవరన కాదు.

    ఎండీయే మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు, ఇతర కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఆ సమాచారం రాజ్యాంగంలో అమెండ్ చెయ్యబడింది కానీ రాజ్యాంగానికి సవరణ రాలేదు. మీరు చెప్పిందే నిజమయితే ఆర్టికల్ 2 self contradictory కావాలి. అందుకే అందరూ పార్లమెంటులో బిల్లు పెట్టమని అడిగేది.

    అబద్దాలు ఎవరు ప్రచారం చేస్తున్నారో ఇప్పుడు అర్ధమయింది అనుకుంటా. నేణిక్కడ ఉద్యమం చెయ్యట్లేదు, నాభిప్రాయం చెబుతున్నాను. మీకు నచ్చకపోతే ఊరుకోండి, మీరు అబద్దాలు చెబుతూ ఇతరులను నిందించొద్దు. అబద్దాలు ఎలాగుంటాయో తెలుసు కదా.. మొదటి ఫేజు ఎలక్షన్లలో తెలంగాణకు మేం కట్టుబడి ఉన్నామని చెబుతూ మొదటి ఫేజు ముగియగానే మనం హైదరాబాదు వెల్లాలంటే వీసాలు తీసుకోవాలా అని చెప్పే దుర్గుణాలు మావొల్లకు లేవు. విశ్వసనీయత గురించి నరహంతకులూ, ముఖ్యమంత్రులను దింపేయడానికి అల్లర్లు సృష్టించేవారు, ముఠాతత్వాన్ని పెంచి పోషించేవారు మాట్లాడడం మన దురదృష్టం.

    చర్చను విషయం మీద చెయ్యగలిగితే చెయ్యండి, లేదా ఊరుకోండి..మీరు మమ్మల్ని అనడం తరువాత మేము మీ జగన్ను,వైఎస్సార్ను తిట్టడం ఇవన్నీ పిల్లచేష్తలు అని నాఉద్దేషం.

    ReplyDelete
  18. // రాజ్యాంగంలో అమెండ్ చేస్తారు// // ఇది రాజ్యాంగ సవరన కాదు.//

    అయ్యో !!! 'అమెండ్' అనే ఇంగ్లీష్ పదానికి 'సవరణ' అనేది తెలుగు అర్ధం కాదా? కొత్త ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ మీరే రాయొచ్చు కదా?
    అబ్బో? మహా చక్కగా చెప్పారు. తప్పు లేదు, మీ అబద్దాల ని ఇలా బహిర్గతం చేసుకోవడం లో. చట్టం చేసే ముందు కూడా బిల్ ప్రవేశ పెడతారు. ప్రతి చట్టాన్ని "రాజ్యాంగంలో అమెండ్" ఎందుకు చెయ్యరు.
    అసలు బిల్ అంటే ఏమిటీ,చట్టం అంటే ఏమిటీ?ఆర్డినెన్స్ అంటే ఏమిటీ? రాజ్యంగ సవరణ అంటే ఏమిటో కొంచెం వివరిస్తే మేము విని తరిస్తాము.

    ReplyDelete
  19. @indrasenaa,

    //అప్పుడు రాష్ట్రంలో కూడా జగన్, టీఆరెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ఉంటే వారు విభజనకు అభ్యంతరాలు పెట్టరు.//
    నిజమా!!!తెలంగాణా ఇవ్వకపోతే బోట బోటీ మెజారిటీ తో నయినా ,MIM సప్పోర్ట్ తో నయినా జగన్ అధికారం లోకి వస్తాడు. జగన్ చేతిలో అధికారం ఉంటె కెసిఆర్ ను రాజకీయంగా అధః పాతాల లోకం లోకి తొక్కి వేస్తాడు.
    రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాడు.మళ్ళీ ప్రత్యెక రాష్ట్ర సౌండ్ ఎంత మాత్రం వినపడదు.

    mee ysj mottam raashtraanni develop chestaadaa...mottam raashtraanni dochukokunte chaalu babu..

    ReplyDelete
  20. @ఇంద్రసేనా,

    అన్నింటికీ లిటరల్ మీనింగులు తీసి మొండి వాదం చేస్తానంటే చేస్కోండి, మీ ఇష్టం. రాజ్యాంగంలో ఒక కొత్త ఇంఫర్మేషన్ను పొందుపరచడం, ఒక నిబంధనను మార్చడం రెండింటినీ ఒకే గాటన కట్టి రెండింటికీ ఒకే ప్రాసెస్ ఉంటుందని మీజగన్ చెప్పాడా?

    ఒక రాష్ట్రం ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరం అంటూ ఎవరికీ తెలియని విషయాన్ని మీరే కనుక్కొని ఎంత పొడుగు సాగదీస్తారు, అనవసర విషయంపై ఎన్ని కామెంట్లు పెడతారు? ఎంత మెజారిటీ ఉందని ఎండీయే మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసింది? అప్పుడు ఎన్‌డీయే చంద్రబాబుమీదా ఆధారపడి లేకపోతే తెలంగాణ కూడా అప్పుడే వచ్చేది.

    ReplyDelete