Monday, 9 July 2012
Sunday, 18 March 2012
సమైక్యాంధ్ర మనకెందుకు?
బిడ్డా,
తెలంగాణ వస్తే నీకేమొస్తది?
కూడొస్తది, గూడొస్తది
తాగేటందుకు నీళ్ళొస్తయి
మన పొలం తడుస్తది
మన తమ్ముల్లకు నౌకర్లొస్తయి
గందుకే పెద్దాయినా
మనతెలంగాణ మనగ్గావాలె!!
బాబుగోరూ,
సమైక్యాంధ్ర మనకెందుకు?
హైదరబాదుల కబ్జాలకు
నాకంపనీ కాంట్రాక్టులకు
కాలువకింది బినామీపొలాల్లో
మూడోపంటకు నీల్లకొరకు
అంతా నాబాగుకోసమే
మీరంతా సమైక్యంగుండాలి!
Friday, 24 February 2012
సీమాంధ్ర అసెంబ్లీ సర్వం తిట్లమయం
నాలుగురోజులు తెలంగాణ అంశంపై చర్చజరగాలని కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఘొరావ్ చేస్తే చివరికి తెరాస ఎమ్మెల్యేలనందరినీ బయటికి గెంటివేసి అధికార, ప్రతిపక్షపార్టీలు కలిసి అసెంబ్లీని నడుపుకుంటున్నారు. మధ్యలో ఒకటీ అరా సీట్లు కలిగిన బీజేపీ, లోక్‌సత్తా కాకుండా తమేపార్టీలో ఉన్నామో తెలియని వైఎస్సార్ అభిమాన(?)ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
ఇంతకూ తెలంగాణపై చర్చను కాదని, తెరాసను గెంటివేసి వీరు దేనిగురించి చర్చించారు అంటే షరా మామూలే. ఒకర్నొకరు తిట్టుకోవడం, ఎవరిడబ్బాలు వాళ్ళు కొట్టుకోవడం. మీదంతా అవినీతిమయం అని ప్రతిపక్షం అంటే మీహయాంలోనే అవినీతి మొదలయింది అని అధికార పార్టి అంటుంది. నువ్వు కేందరం సీట్లో కూర్చోబెడితే కూర్చునే డమ్మీ ముఖ్యమంత్రివి అని ప్రతిపక్షం అంటే నువ్వు మామను వెన్నుపోటుపొడిచి కుర్చీలాక్కున్నావని అధికారపక్షం.
ఏమాటకామాటే చెప్పుకోవాలి, తిట్లపురాణం ఇప్పుడు కాస్త తగ్గింది, అదే మన ప్రియతమ మహామేత ఫాక్షనిస్టు ముఖ్యమంత్రి హయాంలో నయితే తిట్లు మరోలాఉండేవి. నిన్ను కడిగేస్తా, అసలు తల్లికడుపులోనుంచి ఎందుకు బయటికి వచ్చానో అనుకునేలా చేస్తా అంటూ సవాళ్ళు వినిపించేయి. ఈతిట్లు వినడంకోసమేనా వీల్లను గెలిపించి పంపించింది? ఏనాడయినా అర్ధవంతమయిన చర్చలు వీరెప్పుడయినా జరగనిచ్చారా? ఒక ఆరోపణ వస్తే ఆఅరోపణకు సమాధానం ఇచ్చుకోవాలి గానీ మీహయాంలో కూడా ఇలాగే ఉండేది అంటే అది సమాధానమా? దొంగలూ దొంగలూ ఊళ్ళు పంచుకున్నట్టు!
తెలంగాణ అంశంపై రెండు సంవత్సరాలుగా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంటే తెలంగాణ అంశంపై చర్చించడానికి వీరికి భయం. ఈఅంశం కేంద్రం దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు అని తప్పించుకుంటున్నారు. రాష్ట్రానికీ, రాష్ట్రప్రజలకూ సంబంధించి నిర్ణయం కేంద్రం తీసుకోవాలంటే ఆనిర్ణయం మంచిచెడ్డలగురించి చర్చించాల్సిన అవసరం వీరికి లేదా? వీరు చర్చించి ఆసమస్యకు పర్ష్కారాన్ని వెతకలేకపోవచ్చు, వీరిచర్చ కేంద్రనిర్ణయంపై ప్రభావం చూపలేకపోవచ్చు కానీ రాష్ట్రభవిష్యత్తుకు సంబంధించి రాష్ట్రప్రతినిధులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది, ఎన్నాల్లిలా తప్పించుకు తిరుగుతారు చేవలేని దద్దమ్మల్లా?
నలుగురైదుగురు రైతులు ఆత్మహత్యచేసుకుంటే అదో పెద్ద ఇష్యూ అవుతుంది, అసెంబ్లీనుంచి పార్లమెంటుదాకా చర్చిస్తారు, అన్నిరాజకీయపార్టీలూ ఆసమస్యపై రైతుయాత్రలనీ, పోరుయాత్రలనీ చేస్తాయి, మరి వందలకొద్ది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటే సమస్యే లేనట్టు ఎన్నాల్లు నటిస్తారు? ఈమాత్రం సభ జరిగితే ఎంత జరగకపోతే ఎంత? వీల్ల చర్చలద్వారా జనానికి ఏంఒరుగుతుంది?
Monday, 23 January 2012
చంద్రబాబు దండయాత్ర దేనికోసం?
చంద్రబాబు మొత్తానికి రైతుయాత్ర పేరుతో తెలంగాణా ప్రజలపై తన దండయాత్రను దిగ్విజయంగా ముగించాడు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణాలో అడుగుపెట్టడానికి మొహం చెల్లకపోగా కనీసం ఎక్కడయినా తెదేపా మీటింగు జరిగితే చంద్రబాబు ఫోటో కూడా పెట్టుకోకుండానే సభ జరుపుకునే పరిస్థితి నుంచి బయటపడి నేనూ తెలంగాణాలో తిరిగాను అని చెప్పుకునేలా ఒక యాత్రను కొనసాగించాడు.
రైతులకోసం జరిపిన పోరుయాత్ర అని చెప్పుకున్నా నిజానికి అది రైతులకోసం కాదనేది అందరికీ తెలిసిందే. ఇంతకూ తెలంగాణా ప్రజలను భయభ్రాంతులను చేస్తూ వేలాది గూండాలను వందలాది సుమోల్లో తరలించి దుడ్డుకర్రలు వెంట తెచ్చుకుని, వేలాది పోలీసుల పహారాలో తన యాత్రను సాగించి చంద్రబాబు సాధించింది ఏమిటి? సీమాంధ్ర నుండి తరలించిన చంద్రదండు గూండాలతో ఇక్కడ అడ్డువచ్చిన పేదవిద్యార్థులను దుడ్డుకర్రలతో కొట్టించి ఈయన ఇక్కడి రైతుల లేదా ప్రజల్ హృదయాలను గెలుచుకుంటాడా? ఇలా బెదిరింపులు, రౌడీజులుంతో చేసిన దండయాత్రలతో తనకు ఇక్కడ వోట్లు పడవు సరికదా ఇంకా ఏమన్నా ప్రజలమద్దతు ఇక్కడ ఉంటే అదికూడా పోతుందని నక్కజిత్తుల బాబుకు తెలియదా? మరి ఇంత తెలిసీ ఇలా ప్రజావ్యతిరేక దండయాత్ర సాగించింది దేనికోసం అనేది ఒక పెద్ద ప్రశ్న.
ఇలా దౌర్జన్యపు దండయాత్రలు చేసి ఇక్కడి ప్రజల మద్దతు రాబట్టడ సాధ్యం కాదని చంద్రబాబుకు బాగా తెలుసు. అసలు తాను డిసెంబరు 9 తరువాత చేసిన మోసానికి మల్లీ ఇక్కడ ఎప్పటికైనా ప్రజల మద్దతు కూడగట్టుకొని సీట్లు గెలుచుకోవడం అస్సధ్యమని బహుషా చంద్రబాబుకు ఈపాటికి అర్ధం అయుంటుంది. అయినా చంద్రబాబు తన దండయాత్రను సాగించడమేకాకుండా మొదట T-JAC కానీ, టీఆరెస్ కానీ అంతగా పట్టించుకోకపోతే తానే కవ్వించి తన చంచాలతో టీఆరెస్‌పై, కోదండరాంపై రోజూ అడ్డమైన కూతలు కూయించి మరీ ఉద్రిక్తవాతావరణం తయారు చెయ్యడం దేనికోసం?
దీనికి సమాధానం చంద్రబాబు తెలంగాణా యాత్ర తెలంగాణలో వోట్లకోసం కాదు, సీమాంధ్రలో వోట్లకోసం. ఇప్పుడీవిధంగా తెలంగాణాపై దండయాత్ర ముగించిన చంద్రబాబు సీమాధ్రప్రజలకు నేణు తెలంగాణ అడ్డుకోవడానికి ఎంతకైనా తెగించగలను అనే సిగ్నల్ ఇచ్చినట్టయింది. చూశారా తెలంగాణప్రజలు నన్ను వ్యతిరేకిస్తున్నా నేను తెలంగాణాలో యాత్ర చేశాను, అంతేకాదు నాతోపాటు కొంతమంది ఫాక్షనిస్టు నేటలను, వేలమంది గూండాలను కూడా తీసుకెల్లి అక్కడ అడ్డం వచ్చినవాల్లను కొట్టించాను. అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉండే నేను ఇక్కడీనుండి అక్కడీకి గూండాలను తీసుకెల్లి మరీ కొట్టించానంటే ఇక నాకధికారం ఇస్తే ఎలాగుంటుందో చూడండి, బషీర్‌బాగ్ లో కాల్పులు జరిపినట్లు తెలంగాణ పేరు చెప్పినవాన్ని చెప్పినట్లు కాల్చి పారేస్తాను. కాబట్టి మీరు నాకే వోటేయండి అని ఈయాత్ర ద్వారా చంద్రబాబు సీమాంధ్ర ప్రాంతం వారిని వేడుకొన్నట్లు కనిపిస్తోంది.
ఇందుకోసమే చంద్రబాబు తన చంచాలతో మీటింగుల్లో 2014 తరువాత చంద్రాబాబే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పించాడు. మరి చంద్రబాబు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కావాలంటే రాష్ట్రం విడీపోతే అది సాధ్యం కాదు. కాబట్టి రాష్ట్రం విడిపోకుండా చూడడమే మా అజెండా అని చెప్పకనే చెప్పాడు.
మరి చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా? ఈయన దండయాత్రలను చూసి సీమాంధ్ర ప్రజలు తమ ప్రాంతంలో చంద్రబాబుకు వోట్లేస్తారా? సీమాంధ్ర ప్రజల్లో రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తుంది కొద్దిమంది భూస్వామ్య వర్గాలు, ఒకట్రెండు సామాజిక వర్గాలు తప్ప బీదా మధ్యతరగతి వర్గాలకు రాష్ట్రాన్ని కలిపి ఉంచితే ఒరిగేదేం ఉండదు. వారికి కావాల్సింది అక్కడీ ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారనే. చంద్రబాబూ, జాగ్రత్త.. నీనక్కజిత్తులు ప్రజలకందరికీ తెలిసిపోయాయి, ఇంకా మోసం చేద్దామనుకుంటే లాభం లేదు.
Sunday, 22 January 2012
ఎన్‌టిఆర్ వధ, టీడీపీ చెర
ఎన్‌టిఆర్ మహాత్మాగాంధీ, అంబేద్కర్ అంతటి మహనీయుడు. ఆయన విగ్రహం పార్లమెంటులో ప్రతిష్టించాలి.
-టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు
నేను స్థాపించిన తెలుగుదేశంలోనే కాంగ్రెస్ అక్రమ శిశువులు, గోముఖ వ్యాఘ్రాలు, మేక వన్నె పులులు తలెత్తుతున్నాయని ముందుగా తెలుసుకోలేకపోయాను...నేనే దేవున్ని అని చెబుతూ చాపకింద నీళ్లలాగా, పుట్టలో తేళ్లలాగా, పొదల్లో నక్కల్లాగా కుట్రలు, కుతం త్రాలు అల్లారు...ఇంతనీచానికి ఒడిగట్టిన చంద్రబాబు ఎన్‌టిఆర్ మా దేవుడు ఆయన విధానాలే అమలు జరుపుతానంటున్నాడు. చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకి పేల్చి గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సేను మించిన హంతకుడు చంద్రబాబు.
-1995 ఆగస్టులో తనకు వ్యతిరేకంగా జరిగిన విద్రోహంపై ఎన్‌టిఆర్ ఆగ్రహం ఇది.
‘నారా, నారా, పోరా, పోరా...’, ‘గతంలో ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్‌రావు కొంతయినా చరిత్ర మిగిల్చుకున్నారు. చంద్రబాబుకు అదికూడా మిగలదు’.
-ఎన్‌టిఆర్‌ను గద్దెదింపినందుకు నిరసనగా 1995 డిసెంబరులో నిర్వహించిన మాక్
అసెంబ్లీలో చంద్రబాబునాయుడుపై మోత్కుపల్లి నర్సింహులు ఆక్రోశం ఇది.
నారా చంద్రబాబునాయుడుకు నాడున్న ఇమేజి అది. ఎన్‌టిఆర్ ఆభిమానుల్లో ఉన్న ఆగ్రహానికి ప్రతీక ఆ నినాదం. చంద్రబా బు ఎన్‌టిఆర్‌కు చేసి న ద్రోహాన్ని జీర్ణించుకోలేనివారు ఇప్పటికీ కోట్లాది మంది ఉన్నా రు. అందుకే చంద్రబాబు తెలుగుజాతి ఆత్మగౌరవం గురించి, ఎన్‌టిఆర్ ఖ్యాతి గురించి మాట్లాడుతుంటే మనసు వెక్కిరిస్తూ ఉంటుంది. బతికి ఉన్నప్పుడు చిత్రవధ చేసి ఆయనను బలితీసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆయన విగ్రహాలకు దండలు వేస్తున్నారు. ఒక్క ఎన్‌టిఆర్‌నే కాదు తిరుగుబాటులో తన పల్లకీ మోసిన తోడల్లుడు దగ్గుబాటి వెంక బావ మరిది హరికృష్ణను, అనేక మంది సీనియర్ నాయకులను ఆయన ఆ తర్వాత కరివేపాకులాగా తీసి పారేశారు. రాజకీయాల్లో ‘యూజ్ అండ్ త్రో’ విధానాన్ని పక్కా గా అమలు చేసిన నేత చంద్రబాబే. స్నేహమయినా, బంధుత్వమయినా ఉపయో గపడితేనే కలుపుకుంటారాయన. ఆంతరంగికులను సైతం ఎప్పటికప్పుడు మార్చే చంద్రబాబుకు శాశ్వత శత్రుత్వాలు, మిత్రుత్వాలు, శాశ్వత బంధుత్వాలు ఉండవు.
విధా నాలయినా అంతే. ఎప్పటికప్పుడు మార్చకపోతే ఆయన చంద్రబాబే కాదు. ఇప్పటికీ వెల్లడి కాని విషయం- అభినవ గాడ్సే ఎన్‌టిఆర్ వారసుడెలా అయ్యారు? ఎన్‌టిఆర్‌ను అర్ధంతరంగా బలితీసుకున్నవాడు ఆయన కుటుంబానికి ఆత్మబంధు అయ్యారు? ‘వివూదోహ చంద్రబాబు’ను ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, పార్టీ రక్షకునిగా సమ్మతిని, సమర్థనను మాన్యుఫాక్చర్ చేసిన శక్తులు ఏవి?
విషాదం ఏమంటే 1995లో ఎన్‌టిఆర్‌కు జరిగిన దుర్మార్గంపై ఇంతవరకు లోతైన పరిశోధన జరుగక పోవడం. వైస్రాయ్‌లో జరిగిన కుట్ర చరివూతను రికార్డు చేయకపోవడం. చంద్రబాబు, ఆయన వందిమాగధ మీడియా రాసిన అనుకూల చరిత్ర తప్ప, అసలేం జరిగిందన్న అంశంపై ఎవరూ శ్రద్ధపెట్టకపోవడం యాదృచ్ఛికంగా జరుగలేదు. అధికారంలో ఉన్నవారి చరిత్రే తర్వాతి తరాలకు చరివూతగా సంక్రమిస్తోంది. ఓడిపోయి పడిపోయిన వారి చరిత్ర రికార్డుల్లోకి రాకపోవడం అనాదిగా ఉంది.
వర్తమానంలోనూ అదే జరుగుతోంది. గెలిచినవాడి చరిత్ర చీకటి పార్శ్వాలు బయటికి రావడం లేదు. ఎన్‌టి ఆర్‌పైన, చంద్రబాబుపైన, ఆ కాలపు రాజకీయాలపైన కొన్ని పుస్తకాలు వచ్చినమాట వాస్తవం. కానీ అన్నీ రాయించినవి, చేసిన నేరాలను సమర్థించుకునేవే తప్ప, వాస్తవాలను ఆవిష్కరించే చరిత్ర రాలేదు. ఇప్పటికీ అందరినీ వేధించే ప్రశ్న ఒక్కటే-1984ఆగస్టులో నాదెండ్ల భాస్కర్‌రావు చేసిన ప్రయత్నమే, 1995 ఆగస్టులో చంద్రబాబు చేశారు. నాదెండ్లది వెన్నుపోటు ఎలా అయింది? చంద్రబాబు ది ప్రజాస్వామ్యం ఎలా అయింది? ఒకే తరహా ఘాతుకానికి రెండు నిర్వచనాలు ఎలా సాధ్యం? నాదెండ్ల ఎందుకు విఫలమయ్యాడు? చంద్రబాబు ఎలా సఫలీకృతు డయ్యాడు? చంద్రబాబును గెలిపించిన శక్తులేవి?
నాదెండ్ల అసంతృప్తి, అవమానాలతోనే తిరుగుబాటు ప్రయత్నం చేశారు. చంద్రబాబు కూడా ఇవే కారణాలు చెప్పారు. నాదెండ్ల లక్ష్యం అధికారాన్ని చేజిక్కించుకోవడమే. చంద్రబాబు అంతిమంగా ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు. నాదెండ్ల తిరుగుబాటు చేసినప్పుడు ఆయనతో ఉన్నది చాలా కొద్ది మంది. చంద్రబాబు పరిస్థితీ అదే. కానీ చంద్రబాబు అతివేగంగా పావులు కదిపి బలసమీకరణలో సక్సెస్ అయ్యారు. నాదెండ్ల విఫలమయ్యారు. ఇక్కడే చాలా శక్తులు పనిచేశాయి. నాదెండ్ల తిరుగుబాటు జెండా ఎగరేయగానే ఎన్‌టిఆర్‌ను అధి కారంలోకి తేవడానికి భూమీ ఆకాశం ఏకంచేసిన పత్రికలు దానిని ‘వెన్ను పోటు’గా, ‘ప్రజాస్వామ్యానికి విద్రోహం’గా చిత్రీకరిస్తూ అభివూపాయాన్ని కూడగట్టాయి. అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావడానికి, ఎన్‌టిఆర్‌కు వెన్నుదన్నుగా నిలవడానికి భూమికను పత్రికలు సృష్టించాయి. నాదెండ్ల వెంట ఎంతమంది ఉన్నారో, ఎన్‌టిఆర్‌తో ఎంత మంది ఉన్నారో ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ నాదెండ్ల వెనుక ఎమ్మెల్యేలు చేరకుండా సైకలాజికల్ వార్‌ఫేర్ నిర్వహించాయిపజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని పత్రికలు ముందుండి నడిపించాయి. రాజకీయాలు, పత్రికలు కలసిపోయి పనిచేశాయి. నాదెండ్ల పప్పులు ఉడకలేదు.
1995లో సీను రివర్సయింది. ఎన్‌టిఆర్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ఆరాట పడిన పత్రికలకు ఆయనపై మోజు తీరిపోయింది. ఎన్‌టిఆర్ మునుపటిలా పత్రికలు, పారిక్షిశామికవేత్తలు చెప్పినట్టు నడుచుకునే రోజులు పోయాయి. అమాయక ఎన్‌టిఆర్ కాస్తా ముదిరిపోయారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తూ వచ్చా రు. ఆయన స్వతంవూతించి వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌టిఆర్‌పై యుద్ధం మొదలయింది. ఆయనతో ఎదురుపడి యుద్ధం చేయడం అసాధ్యం. ఆయనను ఓడించడం మామూలుగా అయ్యేపనికాదు. పైగా అఖండ విజయం సాధించి అప్పటికి ఎంతోకాలం కాలేదు. అందుకే లక్ష్మీపార్వతిని బూచిగా చూపడం మొదలు పెట్టారు. ఆమెను వివాహం చేసుకోవడం, ఆమెకు మర్యాద మన్ననలు ఇవ్వడం ద్వారా ఎన్‌టిఆర్ తెలుగుజాతి కొంపలు కూల్చుతున్నారన్నంత యాగీ చేశాయి ఆ పత్రికలు.
ఆమె వల్ల ప్రజాస్వామ్యం పాడుబడిపోతున్నదని, కుటుంబ గౌరవం నవ్వులపాలవుతున్నదని ఆ పత్రికలు రచ్చ చేశాయి. ఆమె ఎన్‌టిఆర్‌తో కలసి చైతన్యరథంపై ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఎటువంటి చర్చ జరగలేదు. ఎవరూ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ అధికారం అనుభవించే విషయం వచ్చే సరికి మాత్రం ఆమె పాత్ర కంటగింపయింది. మంత్రిపదవుల పంపకం దగ్గర మొదలయిన అసంతృప్తి, డిసిసిబి చైర్మన్ల ఎంపిక వరకు వచ్చే సరికి ముదిరి పాకాన పడ్డ ది. చంద్రబాబునాయుడు పావులు కదపడంమొదలు పెట్టా రు. మంతనాలు ప్రారంభించారు. తెలుగు దేశంలో అత్యధికులు చంద్రబాబుతో వెళ్లడానికి భయపడ్డారు. కానీ అప్పటికే లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా మీడియాను యధేచ్ఛగా వాడుకుంటున్న చంద్రబాబు తిరుగుబాటు కుట్రలో మీడియాను ప్రధాన భాగస్వాములను చేశాడు.
నాడు నాదెండ్లకు అడ్డం తిరిగిన మీడియా ఈసారి చంద్రబాబును భుజానికెత్తుకుంది. వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు వైపు సమీకరించడానికి అదే మీడియా మరోసారి సైకాలాజికల్ వార్‌ఫేర్ నిర్వహించింది. జర్నలిస్టులను, ఎడిటర్లను ప్రత్యక్షంగా రంగంలోకి దింపారు చంద్రబాబు. వాడొస్తున్నాడని వీడికి, వీడొస్తున్నాడని వాడికి జర్నలిస్టులతో, ఎడిటర్లతో చెప్పించి నమ్మబలికారు. వైస్రాయ్‌లో ఎంతమంది చేరారో తెలియదు, కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు పోగయ్యారని, ఎన్‌టిఆర్ పని అయిపోయిందని కొందరు జర్నలిస్టులు ఎమ్మెల్యేలకు అదేపనిగా ఫోను చేసి భయపెట్టారు. దగ్గుబాటి సన్నిహితులకు ఫోను చేసి ఆయన వెంట ఉండే ఎమ్మెల్యేలంతా చంద్రబాబుతో రావడానికి తయారయ్యారని, చంద్రబాబుతో చేతులు కలుపకపోతే ఏకాకి అవుతారని ఊదరగొట్టారు.
దగ్గుబాటి వర్గం ఎమ్మెల్యేలకు ఫోను చేసి దగ్గుబాటి కుటుంబ సభ్యులందరితోపాటే చంద్రబాబుతో వచ్చేస్తున్నారని చెప్పారు. మరోవైపు వచ్చిన ఎమ్మెల్యేలను కట్టిపడేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ చంద్రబాబు వైస్రాయ్ నీడలో గుట్టుగా చేసుకుపోయారు. బయట జరుగుతున్నది లోపలివారికి, లోన జరుగుతున్నది బయటి వారికి తెలియనీయలేదు. పత్రికలకు ప్రజాస్వామ్యం కనిపించలేదు. ప్రజలు ఎన్‌టిఆర్‌ను చూసి గెలిపించారన్న సోయి లేకపోయింది. తెలుగుదేశాన్ని కాపాడడానికి తాను తిరుగుబాటు చేయాల్సివచ్చిందని చంద్రబాబు చెప్పారు. పత్రికలు దానిని జస్టిఫై చేశాయి. ప్రతి సంఘటనను విమర్శనాత్మకంగా విశ్లేషించే సిపిఐ, సిపిఎంలు సైతం పత్రికలు, రాజకీయ మ్యానిపులేటర్లు సృష్టించిన కొత్త నిర్వచనాన్నే స్వీకరించాయి. చంద్రబాబుకు జైకొట్టాయి. తాను నిర్మించిన రాజకీయ మహాసౌధం తన కళ్లముందే చేజారిపోవడం చూసి, తన రక్తం పంచుకుపుట్టినవారే తనపై కుట్రచేసిన తీరును చూసి, తాను గెలిపించిన వారే తనపై కత్తిగట్టిన మోసాన్ని చూసి, వగచి, విలపించి, గుండెలు పగిలి, ఐదుమాసాలు తిరగకుండానే ఎన్‌టిఆర్ కన్నుమూశారు.
ఎప్పుడయినా చంద్రబాబు ఉపయోగించే ట్రిక్కు ఒక్కటే. ఎవరినయినా దెబ్బకొట్టాలంటే వారికి వ్యతిరేకంగా ఒక అబద్ధాన్ని ఆయనే సృష్టిస్తారు. ఆ అబద్ధాన్ని వందిమాగధ పత్రికలు పతాక శీర్షికల్లో అచ్చేస్తాయి. ఆ అబద్ధాన్ని పదేపదే వాగడానికి కొన్ని పెంపుడు కుక్కలను చంద్రబాబే ఎగదోస్తుంటాడు. ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి జోక్యం అనే ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి, నాడు ఎన్‌టిఆర్‌ను దెబ్బకొట్టారు.
అధికారంలోకి వస్తూనే ఎన్‌టిఆర్‌ను మరిపించడానికి, చంద్రబాబును మహానుభావుడిని చేయడానికి పత్రికలు మేళ తాల సహితంగా ఆరున్నొక్కరాగం అందుకున్నాయి. ఆయన లోని సుగుణాలను కీర్తించడానికి, ఆయనను బిల్ క్లింటన్ సరసన కూర్చోబెట్టడానికి, ఆయనకు స్టార్ ఆఫ్ ఏసియా కిరీటం తొడగడానికి మీడియా తన్మయత్వంతో పనిచేసుకుంటూ పోయింది.
నిజానికి, చంద్రబాబుకు జనామోదం ఎప్పుడూ లభించ లేదు. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును శిక్షించారు. ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచినందుకు జనంలో ఆగ్రహం ఉండడం వల్లే రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మెజారిటీ లోక్‌సభ స్థానాలను(22) గెల్చుకోగలిగింది. టీడీపీ కూటమి ఒకసారి 20, రెండోసారి 15 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 1999లో కూడా కార్గిల్ యుద్ధ నేపథ్యం, వాజ్‌పేయి ఇమేజి ఎన్‌డిఏతోపాటు చంద్రబాబును గెలిపించింది. చంద్ర బాబు గొప్పతనమేమీ లేదు. ఎన్‌టిఆర్ అకాలమరణానికి కారకుడయిన చంద్రబాబును తెలుగు ప్రజలు ఇప్పటికీ క్షమించలేదు. ఎప్పటికీ క్షమించలేరు. ఆ పాపం చంద్రబాబును పటి ్టకుదుపుతూనే ఉంది.
ఇక ముందు కూడా అదే జరుగనున్నది. తెలుగుదేశంపై ఇప్పటికీ ఏదైనా అభిమానం మిగిలి ఉందీ అంటే అది ఎన్‌టిఆర్‌పై ఉన్న అభిమానమే తప్ప, చంద్రబాబుపై అభిమానం కాదు. చంద్రబాబు తెలంగాణలో కూడా ఇప్పుడు పాత ట్రిక్కులనే ఉపయోగిస్తున్నారు. అబద్ధాల ప్రచారం, పెంపుడు కుక్కల వీరవిహారం, వంది మాగధ పత్రికల పులకింత ఇవన్నీ చంద్రబాబు నాటకంలో భాగం. కానీ ఆ రోజు ఎన్‌టి ఆర్ మోసపోయి ఉండవచ్చు. ఇప్పుడు తెలంగాణ మోసపోవడానికి సిద్ధంగా లేదు.

-కట్టా శేఖర్‌రెడ్డి
Friday, 23 December 2011
సామల సదాశివ మాస్టారుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
‘స్వర లయలు’వ్యాస సంపుటికి దక్కిన గౌరవం
సంగీతం విని స్వర లయలు రాసి
మారుమూల పల్లె నుంచి ఎదిగిన మహారచయిత
పలు భాషల్లో అందెవేసిన చెయ్యి
సంతోషంగా ఉందన్న సరస్వతీ పుత్రుడు
ఇది తెలంగాణకే అవార్డు
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 21(టీ న్యూస్): దశాబ్దాల సాహితీ సేద్యానికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ మాగాణ ప్రతిభ మరోసారి దేశాన తలెత్తి నిలిచింది. అడవి బిడ్డల ఒడిలో పుట్టిన కలం అక్షరాలను సానపడుతున్న తీరుకు జాతీయ అవార్డు ఆదిలాబాద్‌కు నడిచివచ్చింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు డాక్టర్ సామల సదాశివ మాస్టారును కేంద్ర ప్రభుత్వం ఈ యేడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక చేసింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత నేపథ్యంలో ఆయన రాసిన ‘స్వరలయలు’ పుస్తకానికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఫిబ్రవరి 14న ఈ అవార్డును ఢిల్లీలో ప్రదానం చేయనున్నారు. తెలుగు, ఉర్దూ, పార్శీ తదితర భాషల్లో సాహిత్యానికి ఆయన చేస్తొన్న కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం విశేషం. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్8 చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన రాజీవ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2010 సంవత్సరానికి కళారత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తాజాగా ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయనను వరించింది. అవార్డును అందించిన ఈ పుస్తకాన్ని వేద్‌కుమార్ సారథ్యంలోని చెలిమి ఫౌండేషన్ ప్రచురించింది.
మరాఠీ సంగీతం వినీ వినీ స్వర లయలు రాశాను
అవార్డు రావడం సంతోషంగా ఉంది. అయితే నేను ఎప్పుడు అవార్డుల కోసం ఏదీ రాయలేదు... ఇనాం కేలియే నహీ లిక్తా... (బహుమతుల కోసం రాయను ) స్వరలయలను మరాఠాలో సూరానిలయ్ అంటారు. మరాఠీ సంగీతం వినీ వినీ స్వరలయలు రాశాను. చాలా సంతోషం. గత రెండేండ్ల క్రితమే అవార్డు వస్తుందని ఒక అభిమాని చెప్పాడు. యాద్ జిందగీ హై... సంతోషం
- సామల సదాశివ
తెలంగాణ ఆణిముత్యం, సరస్వతి ముద్దుబిడ్డ సదాశివ
అడవుల జిల్లా ఆదిలాబాద్ లో పుట్టి పెరిగిన సాహితీవేత్త సామల సదాశివకు జాతీయ సాహిత్యఅకాడమీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణకే ఆణి ముత్యంగా గుర్తింపు తెచ్చుకున్న సదాశివ పండితుల, పామరుల నుంచి కూడా అభినందనలు అందుకుంటున్నారు... ఈ ఆణిముత్యం తెలంగాణ మాగానంలోని మారుమూల దహెగాం మండలం తెనుగుపప్లూలో జన్మించి జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. 2011, మే 11న 84 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ వైతాళికుడి శిష్యులు, అభిమానులు, అనుచరులు అక్షర కుసుమాలతో ఘనంగా నీరాజనం పలుకుతూ ఆయనను సాహిత్యం ద్వారా వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు... సదాశివ కావ్యసుధ పేరుతో ఆ రచనలను గ్రంథస్తం చేశారు. మూడు సంవత్సరాల క్రితం ఈ గ్రంథంను కాగజ్‌నగర్ పట్టణంలో ఆయన శిష్యులు ఘనంగా ఆవిష్కరించారు. సాహితీ లోకంలో సామల సదాశివ గురించి తెలియని వారుండరు.
పుట్టింది మారుమూల తెనుగుపప్లూలో...
సామల సదాశివ దహెగాం మండలంలో తెనుగుపప్లూలో 1928, మే 11న జన్మించారు. ఆయన తల్లిదంవూడులు సామన నాగయ్య పంతులు,చిన్నమ్మలు. ఎంఏ, బీఎడ్, డీ లిట్ చదివారు. డైట్ కళాశాల, ఆదిలాబాద్ ప్రిన్సిపాల్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్థుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఆయన నివసిస్తున్నారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, ఫారసి, మరాఠీ భాషలలో ఆయన పాండిత్యాన్ని సాగించారు. ఉర్దూ, ఫారసీ, హిందీ, మరాఠీ భాషలకు చెందిన ప్రసిద్ధ కవుల, రచయితల సాహిత్యాన్ని ఆయన అనువదించారు. మూడు వేల వ్యాసాలు ఉర్దూలోనూ, 450 వ్యాసాలు తెలుగులోనూ రాసి ప్రముఖ దిన, వార, పక్ష, మాస పత్రికలలో ప్రచురింపజేశారు. హైదరాబాద్, వరంగల్, కొత్తగూడెం, విశాఖపట్నం, ఆదిలాబాద్, ఆకాశవాణి కేంద్రాల నుంచి అసంఖ్యాకంగా ప్రసంగాలు, ఇంటర్వ్యూలు ఇచ్చారు.
సామల సదాశివ 1963 నుంచి 1983 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉర్దూ సలహా సంఘం సభ్యులుగా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులుగా పని చేశారు. ఆయన చేసిన అంజత్ రుబాయిలు అనువాదానికి 1964లో రాష్ర్ట ప్రభుత్వం ఉత్తమ అనువాద రచనగా గుర్తించింది. 1968లో పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ప్రదానం. 1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రతిభా పురస్కారం, 2002లో కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ప్రదానం, 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్8 రాజశేఖర్ రెడ్డి ప్రతిభా రాజీవ పురస్కారం ప్రదానం. 2011, డిసెంబర్ 21న స్వరలయలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటన.
ప్రచురించిన పుస్తకాలు
ప్రభాతము (పద్య సంకలనం), సాంబ శివ శతకము (పద్యాలు), నిరీక్షణము (పద్య సంకలనం), మంచి మాటలు (పద్యాలు), అపశృతి(నవల), ఉర్దూ సాహిత్య చరిత్ర (అనువాదం), అంజద్ రుబాయిలు(అనువాదం), మౌలానా రూమీ మన్నవి (ఫారసీ నుంచి అనువాదం), మీర్జా గాలీబ్ (జీవితం - రచనలు), ఉర్దూ కవుల కవితా సామాగ్రి (కేశవసూత్, మరాఠీ కవి జీవితం ), ఫారసీ కవుల ప్రసక్తి, అర్తి (పద్య కవిత), మలయమారుతాలు(వ్యాసాలు), ఉర్దూభాష కవితా సౌందర్యం (వ్యాస సంపుటి), యాది (జ్ఞాపకాలు), సంగీత శిఖరాలు (వ్యాసాలు)
ప్రచురించాల్సినవి
రేవతి (నవల), రాముడు( పిలాసఫీ ఆఫ్ రామా), సునోబాయి సాదూ(కభీర్ దోహల అనువాదం), సాహిత్య అవలోకనం (ఉర్ధూ సాహిత్య చరిత్ర), సాకీనామా(పద్యకావ్యం), విశ్వమివూతము(పద్యకావ్యం), సదాశివలేఖలు పాచీన ఆధునిక భాషా సాహిత్య విమర్శ)
ఇది తెలంగాణకే అరుదైన గౌరవం
ప్రముఖ రచయిత, తెలంగాణ ఆణిముత్యంగా అందరూ భావించే సామల సదాశివగారి రచనకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించడం, అది అతనికే కాక తెలంగాణ గడ్డకే లభించిన అవార్డుగా భావించాలి.
నవల ప్రక్రియకు అరుదైన గౌరవం
కేంద్రసాహిత్య అకాడమీ వెల్లడించిన పురస్కారాల్లో పలుభాషల నవలలు ఉండడం ఈ యేటి విశేషం. జీవితంలో అనేక సంఘటనలను కావ్యంగా మలచడంలో భారతీయ సృజనకారులు చేస్తొన్న కృషిని అకాడమీ గుర్తించింది. ఈ విభాగంలో హిందీ నవలా రచయిత కాశీనాథ్ సింగ్ రచించిన ‘‘రహేనా పర్ రగ్గు’’, కన్నడ రచయిత గోపాలకృష్ణ రచించిన ‘‘స్వప్న సరస్వత’’ నవలలకు ఈ గౌరవం దక్కింది. నవలలతో పాటు పలువరు కవులు రాసిన కవుల కావ్యాలకు అవార్డు ప్రకటించిన అకాడమీ ప్రముఖ కాలమిస్టు రామచంద్ర గుహ రచించిన ‘‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’’ చారివూతక కథనానికి కూడా కేంద్రసాహిత్య అకాడమి అవార్డును ప్రకటించింది.
(నమస్తే తెలంగాణ నుంచి)

Monday, 21 November 2011
పసలేని పరకాలవాదం
మూడు నాల్గు పార్టీలు మారి నాలుగుసార్లు ఎలక్షన్లలో నిలబడి డిపాజిట్టు కోల్పోయినప్పటికీ రాష్ట్రంలో పరకాల అంటే పెద్దగా ఇంతకుముందు ఎవరికీ తెలియదు. పీఆర్పీలో టికెట్ దొరక్క బయటికి వచ్చి అదోవిషవృక్షం అంటూ పరకాల హడావిడీ చేసినతరువాత మాత్రం కొన్నిరోజులు పరకాలకు టీవీల్లో మంచి పబ్లిసిటీ దొరికింది. ఆతరువాత మల్లీ ఎవరూ పట్టించుకోకపోయేసరికి ఎలాగోలా మల్లీ టీవీ హెడ్లైన్లలోకెక్కాలని ఈమధ్యన విశాలాంధ్ర మహాసభ అంటూ ఒక వెబ్‌సైటు పెట్టుకుని హడావిడీ చేస్తున్నాడు. అసలిది విశాలాంధ్ర మహాసభ కాదు, ఇదొక విషాంధ్ర మహాసభ, వీరికంటూ ఒక వాదం గట్రా ఏంఈలేదు, తెలంగాణా వాదాన్ని, తెలంగాణ ఉద్యమకారులను తిట్టడమే వీరి ఏకైక అజెండా అని జనాలు చెప్పుతున్నారనేది వేరే విషయం.
సరే ఈవెబ్సైటుతో మీడియా వర్క్‌షాప్ గట్రా అంటూ హడావిడీ చేసి తెలంగాణవాదుల్ని రెచ్చగొట్టి ఎలాగయితేనేం పరకాల మల్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎలాగూ పరకాలకు కావల్సిందదే, వార్తల్లోకి ఎక్కడం, పబ్లిసిటీ పెంచుకోవడం. ఇప్పటికే మూడు పార్టీలు మార్చి వెల్తూ వెల్తూ పీఆర్పీని తిట్టిని తిట్లకు ఎలాగూ ఇప్పుడూ ఎవరూ ఈయన్న పార్టీలోకి చేర్చుకోరు.
ఈవిషాంధ్ర మహాసభ వెబ్‌సైటూ, బ్లాగూ నడుపుతూ ఇంతవరకూ సాధించింది ఏంతయ్యా అంటే ఫలానా తెలంగాణ నాయకుడు ఫలానా టైంలో సమైక్యాంధ్రకు జైకొట్టాడు అంటూ పేపర్ కటింగులు పెట్టడం, లేదా తెలంగాణ వాదుల్ని వేర్పాటువాదులు అంటూ తిట్టిపొయ్యడం. మొదట్లో కొన్నిరోజులు అసలు తెలంగాణకు నీటిపారుదలలో ఎలాంటి వివక్షా జరగలేదంటూ లోక్‌సత్తా రిపోర్టును సాక్ష్యంగా చూపుతూ హడావిడీ చేశారు కానీ అవన్నీ తప్పని బ్లాగుల్లో నిరూపించబడడంతో సమాధానం చెప్పలేక నోర్మూసుకున్నారు.
పరకాల ఈమధ్య టీవీల్లో బాగా హడావిడీ చేస్తున్నాడు. పరకాలకు, ప్రొఫెసర్ హరగోపాల్‌కు మధ్యన మహాటీవీలో ఒక చర్చా కార్యక్రమం జరిగింది. ఆసక్తి కరంగా ఉంది కదా అని నేనూ ఓపిగ్గా అన్ని వీడియోలు చూశాను. లండన్లో పీహెచ్డీ చేసిన ఈమహానుభావుడు ఏంచెబుతాడో చూద్దామంటే అసలు ఎంతసేపూ చెప్పిందే చెప్పి బోరుకొట్టించడం లేకపోతే ఎదుటివారిని ఎగతాళి చెయ్యడం తప్ప ఈయన వాదన శూన్యం. కాలికేస్తే మెడకేస్తాను, మెడకేస్తే కాలికేస్తాను అదే నావాదన అని నిరూపించుకుంటున్న ఈయన ఒకే అర్ధం వచ్చే విషయానికి వరుసగా పది పర్యాయపదాలు చెబుతూ అదే వాదన అని భ్రమ పడుతున్నాడు.
"సమైక్యవాదం ఒక గొప్ప ఉదాత్తమమయిన వాదం, తెలంగాణ అన్నిరంగాలలోనూ ఈఈ సూచీల్లో మిగతా ప్రాతాల్లోకన్నా ముందుంది, తెలంగాణలో లక్షలాది ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు." ఇవే విషయాలను పదే పదే వల్లించడం తప్ప ఇంక ముందుకు వెల్లడు, ఆయా వాదనలపై హరగోపాల్ అడిగే సహేతుక ప్రశ్నలకు ఈఅయన దగ్గర సమాధానం ఉండదు, పైగా మల్లీ మల్లీ వేర్పాటువాదుల వాదనలో పస లేదు అంటూ అరవడం. అసలు తెలంగాణవాదుల్ని వేర్పాటువాదులు అని పిలిచేవారినీ, అలా పిలవడాన్ని సమర్ధించే టీవీ చానెల్లను బొక్కలో వెయ్యాలని నా అభిప్రాయం, ప్రస్తుతం ఉన్న సీమాంధ్రప్రభుత్వంలో అది సాధ్యం కాదుగానీ.
జీడీపీలు, తలసరి ఆదాయాలు అభివృద్ధిని చెప్పలేవు, వాస్తవపరిస్థుతులు అలాలేవు. అన్నీ బాగా ఉంటే మరి క్రిష్నా పక్కనే ఉండగా నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య, మహబూబ్నగర్లో కరువు ఎందుకు ఉంటుంది అంటే అందుకు సీమాంధ్ర ఎలా కారణం అంటూ దాటవేస్తాడు. తెలంగాణ అన్ని రంగాల్లో మిగతాప్రాంతాలకంటే చాలా అభ్వృద్ధి చెందిందనే ఈయన వాస్తవపరిస్థుతులు చెబుతుంటే తప్పించుకోవడం ఎందుకు? అక్కడ వాదన మహబూబ్నగర్ ఎండిపోవడానికి సీమాంధ్ర ప్రజలే కారణమని కాదు, ఈయన చెప్పే తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది అనేది తప్పని చెప్పడం.
లక్షలాది ప్రజలు తెలంగాణలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అని పదేపదే వల్లిస్తాడు, మరి అందుకు సాక్ష్యం ఏది, ఏదయినా మహాసభ నిర్వహించారా, ర్యాలీ జరిగిందా అంటే సమాధానం ఉండదు. కానీ ఇదిగో నలమోతు తెలంగాణవాడే అని చెబుతాడు. ఆ బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టయితే ఈయనకు నలమోతు ఒక్కడే లక్షలాది ప్రజల్లాగా కనిపిస్తున్నారేమో.
సమైక్యభావన గొప్ప ఉదాత్తమమయిన భావన అనేది ఈయన మరో పాయింటు. మరి సమైక్యవాదంలో ప్రజలను సంతృప్తి పరచడానికి ఏదయిన ఆదాయవనరు ఉందా, సమైక్యవాదంలో కలిపిఉంచే అంశమేంటి అనడిగితే దానికీ సమాధానం ఉండదు. ఊరికే మమ్మల్ని సమైక్యవాదం ప్రచారం చేసుకోనీయట్లేదు అంటూ దొంగ ఏడుపులు మాత్రం ఏడుస్తుంటాడు. అయ్యా పరకాలా, నీవాదానికి నిజంగా నువ్వు చెప్పేట్లు లక్షలాది ప్రజల మద్దతు ఉంటే ఒకరు నీవాదాన్ని వినిపించకుండా ఆపలేరు, ప్రజలే నీకు మద్దతుగా వస్తారు, ఇక్కడ ఎవరూ సమైక్యంగా ఉండాలని కోరుకోవట్లేదు కాబట్టే నీకు ఒక మీటింగు పెట్టుకోవడం కూడా గగనమవుతుంది. నువ్విక్కడీకొచ్చి వేర్పాటువాదులూ లాంటి భాషను ఉపయోగితూ ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలను అగౌరవపరచడం రెచ్చగొట్టడం తప్ప మరోటి కాదు, ఈవిషయం నీక్కూడా తెలుసుననుకో, అయినా ఇలా చెప్పాల్సి వస్తుంది.
Subscribe to:
Posts (Atom)