Monday, 23 January 2012

చంద్రబాబు దండయాత్ర దేనికోసం?


చంద్రబాబు మొత్తానికి రైతుయాత్ర పేరుతో తెలంగాణా ప్రజలపై తన దండయాత్రను దిగ్విజయంగా ముగించాడు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణాలో అడుగుపెట్టడానికి మొహం చెల్లకపోగా కనీసం ఎక్కడయినా తెదేపా మీటింగు జరిగితే చంద్రబాబు ఫోటో కూడా పెట్టుకోకుండానే సభ జరుపుకునే పరిస్థితి నుంచి బయటపడి నేనూ తెలంగాణాలో తిరిగాను అని చెప్పుకునేలా ఒక యాత్రను కొనసాగించాడు.

రైతులకోసం జరిపిన పోరుయాత్ర అని చెప్పుకున్నా నిజానికి అది రైతులకోసం కాదనేది అందరికీ తెలిసిందే. ఇంతకూ తెలంగాణా ప్రజలను భయభ్రాంతులను చేస్తూ వేలాది గూండాలను వందలాది సుమోల్లో తరలించి దుడ్డుకర్రలు వెంట తెచ్చుకుని, వేలాది పోలీసుల పహారాలో తన యాత్రను సాగించి చంద్రబాబు సాధించింది ఏమిటి? సీమాంధ్ర నుండి తరలించిన చంద్రదండు గూండాలతో ఇక్కడ అడ్డువచ్చిన పేదవిద్యార్థులను దుడ్డుకర్రలతో కొట్టించి ఈయన ఇక్కడి రైతుల లేదా ప్రజల్ హృదయాలను గెలుచుకుంటాడా? ఇలా బెదిరింపులు, రౌడీజులుంతో చేసిన దండయాత్రలతో తనకు ఇక్కడ వోట్లు పడవు సరికదా ఇంకా ఏమన్నా ప్రజలమద్దతు ఇక్కడ ఉంటే అదికూడా పోతుందని నక్కజిత్తుల బాబుకు తెలియదా? మరి ఇంత తెలిసీ ఇలా ప్రజావ్యతిరేక దండయాత్ర సాగించింది దేనికోసం అనేది ఒక పెద్ద ప్రశ్న.

 ఇలా దౌర్జన్యపు దండయాత్రలు చేసి ఇక్కడి ప్రజల మద్దతు రాబట్టడ సాధ్యం కాదని చంద్రబాబుకు బాగా తెలుసు. అసలు తాను డిసెంబరు 9 తరువాత చేసిన మోసానికి మల్లీ ఇక్కడ ఎప్పటికైనా ప్రజల మద్దతు కూడగట్టుకొని సీట్లు గెలుచుకోవడం అస్సధ్యమని బహుషా చంద్రబాబుకు ఈపాటికి అర్ధం అయుంటుంది. అయినా చంద్రబాబు తన దండయాత్రను సాగించడమేకాకుండా మొదట T-JAC కానీ, టీఆరెస్ కానీ అంతగా పట్టించుకోకపోతే తానే కవ్వించి తన చంచాలతో టీఆరెస్‌పై, కోదండరాంపై రోజూ అడ్డమైన కూతలు కూయించి మరీ ఉద్రిక్తవాతావరణం తయారు చెయ్యడం దేనికోసం?

దీనికి సమాధానం చంద్రబాబు తెలంగాణా యాత్ర తెలంగాణలో వోట్లకోసం కాదు, సీమాంధ్రలో వోట్లకోసం. ఇప్పుడీవిధంగా తెలంగాణాపై దండయాత్ర ముగించిన చంద్రబాబు సీమాధ్రప్రజలకు నేణు తెలంగాణ అడ్డుకోవడానికి ఎంతకైనా తెగించగలను అనే సిగ్నల్ ఇచ్చినట్టయింది. చూశారా తెలంగాణప్రజలు నన్ను వ్యతిరేకిస్తున్నా నేను తెలంగాణాలో యాత్ర చేశాను, అంతేకాదు నాతోపాటు కొంతమంది ఫాక్షనిస్టు నేటలను, వేలమంది గూండాలను కూడా తీసుకెల్లి అక్కడ అడ్డం వచ్చినవాల్లను కొట్టించాను. అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉండే నేను ఇక్కడీనుండి అక్కడీకి గూండాలను తీసుకెల్లి మరీ కొట్టించానంటే ఇక నాకధికారం ఇస్తే ఎలాగుంటుందో చూడండి, బషీర్‌బాగ్ లో కాల్పులు జరిపినట్లు తెలంగాణ పేరు చెప్పినవాన్ని చెప్పినట్లు కాల్చి పారేస్తాను. కాబట్టి మీరు నాకే వోటేయండి అని ఈయాత్ర ద్వారా చంద్రబాబు సీమాంధ్ర ప్రాంతం వారిని వేడుకొన్నట్లు కనిపిస్తోంది.

ఇందుకోసమే చంద్రబాబు తన చంచాలతో మీటింగుల్లో 2014 తరువాత చంద్రాబాబే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పించాడు. మరి చంద్రబాబు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కావాలంటే రాష్ట్రం విడీపోతే అది సాధ్యం కాదు. కాబట్టి రాష్ట్రం విడిపోకుండా చూడడమే మా అజెండా అని చెప్పకనే చెప్పాడు.

మరి చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా? ఈయన దండయాత్రలను చూసి సీమాంధ్ర ప్రజలు తమ ప్రాంతంలో చంద్రబాబుకు వోట్లేస్తారా? సీమాంధ్ర ప్రజల్లో రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తుంది కొద్దిమంది భూస్వామ్య వర్గాలు, ఒకట్రెండు సామాజిక వర్గాలు తప్ప బీదా మధ్యతరగతి వర్గాలకు రాష్ట్రాన్ని కలిపి ఉంచితే ఒరిగేదేం ఉండదు. వారికి కావాల్సింది అక్కడీ ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారనే. చంద్రబాబూ, జాగ్రత్త.. నీనక్కజిత్తులు ప్రజలకందరికీ తెలిసిపోయాయి, ఇంకా మోసం చేద్దామనుకుంటే లాభం లేదు.
1 comment:

  1. మొన్న బాబ్లీయాత్ర ఎందుకో ఇదీ అందుకే. ఉప ఎన్నికలలో డిపాజిట్ పోవడానికి:)

    ReplyDelete