Thursday, 20 October 2011

ఇద్దరన్నదమ్ముల కథ

అనగనగా ఒక ఊర్లో ఇద్దరన్నదమ్ములు. అన్న ఏపని చేసేవాడు కాదు. ఉట్టినే బలాదూరుగా తిరగడం వల్ల ఊర్లో మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు. తమ్ముడు అదో ఇదో పనిచేసి సంపాదిస్తే వచ్చిన డబ్బుతో కుటుంబం గడిచేది. సంపాదించేది తమ్ముడయినా పెద్దవాల్లు కాబట్టి ఇంట్లో అన్నా, అన్న భార్యల పెత్తనమే సాగేది.గంపెడు చాకిరీ చేస్తే తమ్ముడి భార్యకు తినడానికి కడుపునిండా భోజనం కూడా దొరికేది కాదు.

తమ్ముడి పెల్లయినప్పుడు తమ్ముడి భార్యకు అరణంగా పుట్టింటివారు ఒక ఆవును ఇచ్చారు. కాలం గడుస్తున్నకొద్దీ ఆవు పెద్దదయి బాగానే పాలిస్తుంది. అయితే పాలన్నీ అన్న పిల్లలే తాగేవారు. తమ్ముడి పిల్లలకు పాలూ, పెరుగు దొరికేవి కావు. ఇంట్లో ఒక దానిమ్మ చెట్టుండేది. ఆ దానిమ్మ పల్లు కూడా అన్ని అన్న పిల్లలే తినేవారు. కాలం గడుస్తున్నకొద్దీ సరైన ఆహారం దొరక్క తమ్ముడు, తమ్ముడి భార్యా పిల్లలూ బక్కచిక్కిపొయ్యారు. దాంతో వీరికంటే బలంగా తయారయిన అన్న పిల్లలు ఇంకాస్త దౌర్జన్యం చేసే వారు, తమ్ముడి పిల్లలను గేలిచేసేవారు.


కొన్నాల్లకు వల్లుమండిన తమ్ముడి భార్య  భర్తతో మనం దోపిడీకి గురవుతున్నాం, ఇలాగయితే కష్టం, ఉమ్మడి కుటుంబంలో తమకు ఇబ్బందిగా ఉంది, విడిపోదామని తెగేసి చెప్పింది. ఊర్లో పెద్దమనుషుల పంచాయితీ పెట్టి ఇలా నామొగుడు పనిచేసి సంపాదిస్తున్నా మాకు సరిగ్గా తిండి కూడా దొరకట్లేదు, అందుకే విడిపోవాలనుకుంటున్నామని చెప్పింది.


అప్పటిదాకా తమ్ముడి సంపాదనతో ఏ పనిచెయ్యకుండానే చక్కగా తింటున్న అన్నకుటుంబానికి ఈపరిణామం ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది. అమ్మో విడిపోతే రేపటినుంచి తాను ఏం చేసి కుటుంబాన్ని పోషించాలి అని అన్న అనుకున్నాడు. అమ్మో ఇప్పుడు ఉన్నపళంగా విడిపోతే నాఇంటిపనీ, వంటపనీ నేనే చేసుకోవాలి ఎలాగా అని అన్న  భార్య అనుకుంది. అమ్మో ఇప్పుడు చక్కగా ఆవు పాలూ, పెరుగు తాగుతున్నాం, విడిపోతే ఈ ఆవు మనకు దక్కదు అని అన్న పిల్లలనుకున్నారు. అంతా కలిసి ఎలాగయినా తమ్ముడి కుటుంబం విడిపోకుండా అడ్డుకోవాలనుకుని తామూ విడిపోడానికి వీల్లేదంటూ పద్దమనుషులదగ్గర ఎదురు పంచాయితీ పెట్టారు. ఇక పంచాయితీ మొదలయింది.


అదేంటి, మేం విడిపోవడానికి వీల్లేదంటూ చెప్పే హక్కు మీకెక్కడుంది? కలిసుండాలా విడిపోవాలా అని నిర్ణయించుకునే హక్కు మాకుంది. మేం విడిపోతామంటే సొమ్ములు ఎలా పంచుకోవాలనే విషయంపై పంచాయితీ పెట్టాలి గానీ విడిపోవాడానికి వీల్లేదంటూ పంచాయితే పెడితే ఎలా అంటూ తమ్ముడు నోరుబాదుకున్నాడు. మనది ఒకే వంశం, ముందు నుండీ కలిసే ఉన్నాం, మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇదంతా ఆపక్కింటి ఎల్లయ్యగాడి కుట్రగని లేకపోతే విడిపోవాలనే పాడు బుద్ది నీకెలా వస్తుంది? అంటూ అన్న ఎదురు ప్రశ్న వేశాడు.


"చూడు తిండిసరిగా దొరక్క నాడొక్క ఎలా ఎండిపోయిందో? ఇన్నాల్లూ నాసంపాదన మీరు దోచుకున్నారు, ఇక మీతో కలిసి ఉండడం నాకు సాధ్యం కాదు" అంటూ వల్లుమండిన తమ్ముడు చెప్పాడు. అమ్మో అమ్మో మీ సంపాదన మేం దోచుకున్నామా? మమ్మ్మల్ని దోపిడీ దొంగలంటావా? ఇల్లాగయితే నిన్నస్సలు విడిపోనివ్వం అంటూ అన్న భార్య హుంకరించింది.


నీడొక్క ఎండిపోతే దానికి మేమెలా భాద్యులం? నీసమస్యకు మమ్మల్ని కారణమంటావేం అంటూ అన్న లాజిక్ పెట్టాడు. నాసమస్యకు కారణం నువ్వనడం లేదు, అసలు నాసమస్యే నువ్వు అందుకే విడిపోతున్నాం. తమ్ముడు బుర్ర గొక్కుంటూ సనిగాడు.


మమ్మల్ని దోచుకున్నామని నువ్వు, నీభార్యా ఫలానా రోజు పెద్దమనుషుల దగ్గర అన్నారు, మీరు లెక్కలు తీసుకొచ్చి మేము మిమ్మల్ని నిజంగానే దోచుకున్నట్టు నిరూపిస్తేగానీ విడిపోవడానికి వీల్లేదు. మమ్మల్ని ఈసంఘం దృష్టిలో దోపిడీదారులను చేద్దామనా నీ ఐడియా? అన్న భార్య హుంకరించింది. ఇంట్లో లెక్కలు రాసేదీ, సామాన్లూ కొనుక్కొచ్చేదీ అన్నీ అన్నే చేస్తాడు కాబట్టి అన్న ముందే లెక్కల పద్దు తనకు అనుకూలంగా రాసుకున్నాడు. తమ్ముడు లెక్కలు చెప్పబోతే అవి చెల్లవు, నేను  రాసిన ఈ మన ఉమ్మడికుటుంబం అధికారిక పద్దులు చూపిస్తేనే నేను ఒప్పుకుంటా, వేరే లెక్కలు నేనొప్పుకోను అంటూ అన్న తెలివి ప్రదర్శించాడు.


అసలు కలిసి ఉండాలనేభావన ఒక ఉమ్మడి కుటుంబంలోని విలువ, దాన్నీ ఇద్దరూ గౌరవించి ఎవరికీ అన్యాయం జరగకుండా ఉంటే బాగానే ఉంటుంది, అలా కుదరనప్పుడు విడిపోవడం నాహక్కు దానికి అసలు ఏలెక్కలు మాత్రం ఎందుకు? లేని హక్కు కోసం నువ్వెలా పంచాయితీ పెడతావు? తమ్ముడు వాపోయాడు.


నువ్వు విడిపోతామనేది మీకు అరణంగా మీపుట్టింటివారిచ్చిన ఆవు ఉంది కనుకే. ఆఅవు ఇప్పుడు మన ఉమ్మడి పెరట్లో గడ్డితిని బలిసింది కనుక అది ఉమ్మడి ఆస్థి, దాన్ని నువ్వొక్కడివే కొట్టేద్దామని చూస్తున్నావ్! అన్న తెలివి ప్రదర్శించాడు. అయ్యో అది నాకు మాపుట్టింటివారిచ్చిన ఆవు, ఇన్నాల్లూ మీరే మా ఆవు పాలు తాగారు, విడిపోతే నాఅవు నాకుదక్కాలనుకోవడం కూడా తప్పేనా అనుకుంది తమ్ముడి భార్య.


ఇదీ కథ! మాఇంట్లో జరిగిన కథ, రాష్ట్రంలో జరుగుతున్న కథ. ముగింపు ఎలాగుంటుందనేది కాలమే నిర్ణయించాలి.

15 comments:

 1. super comedy ... you are rocking ... just like KCR

  ReplyDelete
 2. చాలా జీవితాల్లో జరిగే కథే...కానీ చదివుతున్నంతవరకే అయ్యో అనిపిస్తుంది. ఆ కష్టం- పడే వాళ్ళకి తప్ప అందరికీ వింతగా తోస్తుంది, అదే ఈ సమాజం, ఈ లోకం...నోరున్నోళ్ళదే రాజ్యం...అన్న సామెత ఊరికే రాలేదండీ!
  ప్చ్...
  ముగింపులో తమ్ముడికి మేలు జరక్కపోయినా, అన్నకి తెలివొస్తే తమ్ముడి బ్రతుకు ధన్యమే...

  ReplyDelete
 3. తెలంగాణాని ఆంధ్రలో విలీనం చేసినదే హైదరాబాద్ కోసం. దాని కోసం సోకాల్డ్ పెద్ద మనుషుల ఒప్పందం అంటూ దొంగ నాటకాలు ఆడారు.

  ReplyDelete
 4. అప్పటిదాకా తమ్ముడి సంపాదనతో ఏ పనిచెయ్యకుండానే చక్కగా తింటున్న అన్నకుటుంబానికి ఈపరిణామం ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది. అమ్మో విడిపోతే రేపటినుంచి తాను ఏం చేసి కుటుంబాన్ని పోషించాలి అని అన్న అనుకున్నాడు. అమ్మో ఇప్పుడు ఉన్నపళంగా విడిపోతే నాఇంటిపనీ, వంటపనీ నేనే చేసుకోవాలి ఎలాగా అని తమ్ముడి భార్య అనుకుంది. అమ్మో ఇప్పుడు చక్కగా ఆవు పాలూ, పెరుగు తాగుతున్నాం, విడిపోతే ఈ ఆవు మనకు దక్కదు అని తమ్ముడి పిల్లలనుకున్నారు. అంతా కలిసి ఎలాగయినా తమ్ముడి కుటుంబం విడిపోకుండా అడ్డుకోవాలనుకుని తామూ విడిపోడానికి వీల్లేదంటూ పద్దమనుషులదగ్గర ఎదురు పంచాయితీ పెట్టారు. ఇక పంచాయితీ మొదలయింది. There are mistakes in this paragraph. I guess not you wrote some facts as mistakes...

  ReplyDelete
 5. "ఉట్టినే బలాదూరుగా తిరగడం వల్ల ఊర్లో మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు". తప్పు ఎవరిది అంటారు? ఆన్నదా? ఊరిజనాలదా? రాసిన వారీదా? చదివిన వాళ్లదా?

  ReplyDelete
 6. @Kishan


  తప్పు తమ్ముడిదే...అన్ని రోజులూ అన్నకు అలుసిచ్చినందుకు. అందుకే తన తప్పు తెలుసుకుని విడిపోతానంటున్నాడు.

  ReplyDelete
 7. @Kishan

  Thanks for pointing. Now I corrected those mistakes.

  ReplyDelete
 8. ఒక హీరో. ఒక విలను. హీరో చేసేవన్నీ మంచిపనులు. విలను చేసేవన్నీ చెడ్డపనులు. హీరో గెలిచి తీరాలి.అంతేనా?

  మీ ఇంట్లో బుడ్డోడుంటే చెప్పి చూడండి. అతను కూడా ఈ కథ నమ్మడు.

  ఈ కథవరకు హీరో గెలిస్తే అతడిది ’ideal' జీవితం అయిపోతుంది. కానీ అంత త్వరగా ఎందుకో ఏమో, జనజీవితాలు ’They lived happily ever after..' అనే ముగింపుకు నోచుకున్నట్లు కనబడి ఛావవు. అప్పుడు కూడా మేం కథ రాశాం చదవడం రాదు, మీదే లోపం అంటే సరిపోతుంది.

  ReplyDelete
 9. @ravi
  ఇక్కడ హీరో, విలనూ అంటూ ఎవరూ లేరు, హీరో ఏమీ హీరోయిక్‌గా ఫైటింగులు చెయ్యలేడు. ఈకథలో ఉన్నది ఒక బలవంతుడు, ఇంకో బలహీనుడు. బలహీనుడు ఎప్పుడూ బలవంతునిపై దౌర్జన్యం చెయ్యాలనుకోడు, అది బలహీనుడికి సాధ్యం కాదు. బలవంతుడికే దౌర్జన్యం చెయ్యడం సాధ్యం అవుతుంది. బలహీనుడికి సముచిత న్యాయం, గౌరవం ఇవ్వడంలోనే పెద్దరికం ఉంటుంది.

  న్యాయం గెలుస్తుందా లేదా అనేదే కధాంశం, న్యాయం గెలిచినంతమాత్రాన కష్టాలన్నీ ఒక్కసారి తొలిగిపోయి అంతా చాలాబాగుంటందని, శుభం కార్డు పడుతుందనీ అనుకుంటే పొరపాటు, న్యాయం జరిగితే ఆతరువాత తన కృషిఫలితం తనకే దక్కుతుందనే ఆశ తమ్ముడికుంది.

  ReplyDelete
 10. పేరేదైతేనేం లెండి. ఒకడు మంచి, ఇంకొకడు చెడు. ఒకడు జీవితాంతం అన్యాయం చేస్తాడు, మరొకడు జీవితాంతం అన్యాయాన్ని సహిస్తాడు. తెలుగు సినిమాలెన్ని రాలేదండి? అందులోనూ మరీ సాధారణంగా కథలో కృషంతా ఒకడే చేస్తాడు. మరొకడు పొఱబాటునా కూడా పని చేయక తింటూ ఉంటాడు! ఎంత చక్కగా, పసిపాపక్కూడా తెలిసేలాంటి కథ! పాపం అది తెలియక ఇన్ని కమిటీలూ, ఇంత రచ్చ!

  న్యాయం అనేది అంత త్వరగా నలుపు తెలుపుల్లా తెలిసిపోతే ప్రపంచంలో ఇన్ని బాధలెందుకుంటాయిలెండి?

  ReplyDelete
 11. తేడా ఉంది. మనుషులు స్వతహాగా కొన్ని విషయాల్లో మంచిగానూ, కొన్ని విషయాల్లో చెడ్డగానూ వ్యవహిరించొచ్చు, కానీ బలహీనుడు ఎన్నడూ బలవంతునిపై కొద్దిగా కూడా దౌర్జన్యం చెయ్యలేడు, అది సాధ్యం కాదు. అందుకే ఒక ఇష్యూ అంటూ వస్తే సాధారణమంగా బలహీనుడివైపే న్యాయం ఉంటుందని గమనించగలరు.

  ReplyDelete
 12. kadha maatram super... denitho polaachaaro adi maatram assaulu kudaraledu!!

  ReplyDelete
 13. అన్వేషి గారు !

  మీరు మహా చెడ్డ చమత్కారి కాక పోతే Code language లో సమస్య బాగా చెప్పారు
  కాని ఇక్కడ తమ్ముడు ఎవరు ? అన్నయ్య ఎవరు అనేది వీక్షకునికే వదిలేసారు ....
  ఎందుకంటే ఎవరికోణం లో వాళ్ళు చూస్తారు

  ఎవరి మనసుకి నచినట్టుగా వారికీ అనిపిస్తుంది
  (అదే అసలైన చతురత)
  ఇది ఉపనిషత్ మహర్షుల నాటిదే కొత్తదేమీ కాదు
  ద్వైతమని, అద్వైతమని, విసిస్టాద్వైతమని, అచల పరిపూర్ణ పరబయలని

  అప్పుడేమో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, బ్రహ్మ,
  ఇక్కడేమో తెలంగాణా , హైదరాబాద్, ఆంద్ర, కేంద్రం
  TOPIC మాత్రమె వేరు Concept ఒక్కటే
  "యద్ భావం తద్ భవతి " - ఎలా చూస్తే అలా కనిపిస్తుంది

  సురభి కల్పవల్లి, అదేనండి హైదరాబాద్ ని పాడి ఆవుగా అందరు accept చేస్తారు
  హైదరాబాద్ భౌగోళికంగా మూలం తెలంగాణా తమ్ముల్లదే,
  కాని పెత్తనం చేసింది, వృద్ధి చేసింది, వృద్ధి పొందింది మటుకు ఆంద్ర అన్నయ్యలె
  అయితే ఇప్పుడు మటుకు విక్రమార్కుడు రావలసినదే ...
  లేకుంటే ఆవు ఎవరింటికి వెళ్ళాలో
  పోతే తెలంగాణా తమ్ముడా? ఆంద్ర అన్నయ్యన ?
  తెలియక కానల (ఉగ్రవాదుల) పాలు కాక తప్పదు.

  విక్రమార్కుడు రావడానికి time పట్టేట్లుందని కేంద్రం అనే "కోతి"ని అడుగుతున్నారే
  అదే పొరపాటు
  ఆకోతి జిత్తులుమారిది
  ఈ రొట్టేని ఆ పిల్లికి కొంచం, ఈ పిల్లికి కొంచం ఇచ్చి
  సగం పైన అదే నోక్కేద్దామని TRY చేస్తుంది

  సమస్యను 2014 elections వరకు సాగదీసి
  ఎలా అంటారా " సమస్యాత్మక ప్రాంతం "అనే పేరు చెప్పి (paramilitary దేనికనుకున్నారు?)
  ఈ area లో elections జరగకుండా చేసి

  రాష్ట్రపతి పాలన వచ్చే దాఖలాలు అవకాశాలు లేదు కనుక
  calm గా గుట్టు చప్పుడు కాకుండా
  కేంద్రపాలిత ప్రాంతం చేస్తే బాగుండు కదా అని ఉహిస్తుంది

  కాని
  BILL పెడితే ప్రభుత్వం కుప్పకూలుతుందని భయం తో (మెజారిటీ లేక )
  ఏది అవ్వక ఎటు కాక అలా climax లేని కధగా
  అంతు చిక్కని కధ BERMUDA TRIANGLE లాగ
  ఇక్కడ పొడుపు విప్పని కథ
  తెలంగాణా, ఆంధ్ర, హైదరాబాద్.
  AP TG HYD Triangle
  గా చరిత్రలో నిలుస్తుంది.

  ఈలోపు ఆవు సుడిది అయిపోయి
  (అన్ని company లు దుకాణం bandh చేసాక)

  ఇంతకి నష్ట పోయేది ఎవరనుకున్నారు ?
  తెలంగాణా తమ్ముల & ఆంద్ర అన్నయ్యల పిల్లలు.

  లబ్ది పొందేది media నే !

  ReplyDelete
 14. తవుడు తిని బాగా బలిసిన పందులు తమకి తవుడు కొంచెం తగ్గితే ఆకలేసి అరిచాయట. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ ఇంపార్టెన్స్ తగ్గినా అక్కడ ఉన్న ఐటి కంపెనీలకి ప్రోజెక్ట్‌లు ఎలాగూ వస్తాయి. అయినా వాళ్ళకేదో ఆర్థిక నష్టం అన్నట్టు ఏడుస్తున్నారు.

  ReplyDelete