Saturday, 22 May 2010

దోషం మతంలో ఉందా లేక మనిషిలో ఉందా?


ఈ మధ్య తెలుగు బ్లాగుల్లో ఈ చర్చ వాడి వేడిగా అందరికీ వినిపిస్తుంది. సందర్భానికి తగ్గట్లుగా ఉంటుందని ఈ టపాని వ్రాస్తున్నాను.

ఎవరైనా మతాన్ని విమర్శిస్తే వెంటనే కొందరు ఇది తమ మతం పైన దాడిగా భావించి తిప్పికొట్తడానికి ప్రయత్నిస్తారు. వీరు ఇచ్చే సమాధానం ఇది మతం తప్పిదం కాదు, మతాన్ని అర్ధం చేసుకోని మనిషిదేనని. అయితే ఇలా చెప్పే వారిలో ఎక్కువమంది ఇతర మతాన్ని విమర్శిస్తే చూసి ఆనందించే వారే. వీలయితే తాము కూడా ఒక చేయి వేస్తారు. తమ మతవిశ్వాసాలకి దెబ్బతగిలినప్పుడు మాత్రమే వీరికి అది తప్పుగా తోస్తుంది.

నిజంగా దోషం మతంలో లేదా? వీరన్నట్లు అన్ని అనర్ధాలకూ మూలం మతాన్ని అర్ధం చేసుకోని మనిషేనా? ఎక్కడొ ఒక దగ్గర లోపం ఉంది అనేది మాత్రం అంతా ఒప్పుకునే అంశం అనుకుంటా. అక్కడ కాంట్రావర్సీ ఏమీ కనపడ్డంలేదు. మరి లోపం ఎక్కడ ఉంది?

మతం పూర్తిగా ఆచరణీయమా?

మతానికి మూలం మత గ్రంధాలు. మరి వీరు చెప్పినదే నిజమయితే మతగ్రంధాలలో ఉన్నది అంతా ఆచరణీయంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనిషి మతాన్ని సరిగ్గా ఆచరించగలడు. కానీ ఏ మత గ్రంధమయినా పూర్తిగా ఆచరణీయంగా ఉందా? "ఏమతం చూసినా ఏమున్నది గర్వకారణం, మతగ్రంధ సారం సమస్థం ద్వేషం, వివక్ష తత్వం" అన్నట్లు ఉన్నది మన గ్రంధాల పరిస్థితి. బైబిలు పాత నిబంధనా, ఖురానులలో ఎక్కువగా విగ్రహారాధకులపైని దాడులు ఉండగా వేదాల్లో స్త్రీలపై, శూద్రులపై వివక్ష కనిపిస్తుంది.ఇస్లాంలో కళలు (చిత్రకలా, గానం, సంగీతం లాంటివి) అన్నీ నిషిద్దం. మరి మతంలో నిజంగా దోషంలేనట్లయితే వీటిని యధాతధంగా ఆచరించగలమా?

అసలు మన సమాజంలో ఈ మాత్రం శాంతి ఇప్పుడు ఉన్నదంటే కారణం మనిషి మతాన్ని పూర్తిగా ఆచరించకుండా మెల్లి మెల్లిగా వాటిలోని కొన్ని చెడు అంశాలని వదిలివేయడమే.దీని అర్ధం మనం ఆచరించే మతం, అసలు మతం కన్నా కాస్తా నయం. అలాంటప్పుడు తప్పు మతానిది కాక మనిషిది ఎలా అవుతుంది?

అన్నిమతాల సారం ఒకటేనా?

ఉదారవాదులు ఎక్కువగా వాడే వాదం అన్ని మతాల సారం ఒకటే, మనిషుల ఆచరణలోనే విభేదాలు అని. మాక్రోలెవల్లో చూస్తే ఇది నిజమే: అన్ని మతాలు దేవుడు సృష్టికి మూలం అనే సూత్రం నుండి వచ్చినవే. అన్నింట్లో దేవుడు ఒక్కడే, అతనికి రూపం లేదు అని ఉంటుంది.

కానీ తరిచి చూస్తే ఏ రెండు మతాలు ఒకేసారి ఒప్పు కాలేవు. అన్నీ మ్యూచుయల్లీ ఎక్స్లూసివ్. క్రస్తవ ఇస్లాం మతాలు విగ్రహారాధనను వ్యతిరేకిస్తాయి. ఇస్లాం ప్రకారం మహమ్మద్ని ప్రవక్తగా కొలవనివాడు ఎంతమంచివాడయినా నరకానికే వెల్తాడు. హిందూ మతంలో దేవుడికి విగ్రహం ఉంటుంది, అనేక దేవతలు ఉన్నారు. అంటే ఒక మతం సత్యమయితే వేరొక మతం అసత్యం కావలసిందే.

మతమూ, మొరాలిటీ:

మనిషికి మొరాలిటీ (నైతిక విలువలు) అందించింది మతమేనా? మతం లేకుంటే తల్లికీ చెల్లికీ, తండ్రికీ, భర్తకీ తేడా ఉండేది కాదా?కుటుంబ వ్యవస్థకి మూలం మతమేనా?

ఈ వాదనే నిజమయితే ఏ మతమూ లేని అబోరిజన్లూ, మావరిలూ, ఆఫ్రికన్ తెగలూ, నేటివ్ ఇండియన్లలో కుటుంబ వ్యవస్థ ఉండకూడదు. కానీ అలా లేదే?

మనిషి నైతిక విలువలు మనిషి విగ్న్యానంతో పాటు evolve అవుతున్నాయి. ఒక వెయ్యేల్లకిందటికంటే వందేళ్ళక్రితం నైతిక విలువలు బెటరు, వందేళ్ళక్రితం కంటే ఈ రోజు బెటరు. దీనికి మతంతో సంబంధం లేదు.

మతం ఏది మంచో ఏది చేడొ చెబుతుంది. అయితే ఇది స్టాటిక్ స్టాండర్డ్. కానీ మంచీ చెడూల నిర్వచణాలు రోజు రోజుకూ మారుతుంటాయి. ఇప్పుడు గే మ్యారేజీలు తప్పు కాదు. కానీ మతం వాటిని తప్పంటుంది. కాబట్టి మతం అందించే మోరల్ కోడ్ ఆచరణీయం కాదు.

మతం వలన మనిషి మంచి నేర్చుకుంటాడా?

అన్ని మతాలూ ఇది తప్పు, ఇది ఒప్పు, ఈ తప్పు చేస్టే మనిషి చచ్చి నరకానికి వెల్తాడు లాంటి నమ్మకాలను భోదిస్తాయి. అయిటే ఇవి తెలుసుకొని మనిషి మంచి వైపు మల్లుతునాడా? ఇలా జరిగితే ఎక్కువమంది ఆస్తికులు ఉన్న మన దేశంలో పాపాలు తక్కువగా ఉండాలీ. ఎక్కువమంది నాస్తికులు ఉన్న స్వీడన్, డెన్మార్క్, నార్వే వంటి దేశాలలో పాపాలు ఎక్కువగా ఉండాలి. కానీ వాస్తవాలు అలా లేవు.

మతాల వలన జరిగిన మంచి కనపడడం లేదు, కానీ చెడుని చూస్తే చరిత్రలో ఎన్నో యుద్ధాలకి మతాలే కారణం. ఇప్పటికీ మత ఘర్షణలూ, తీవ్రవాదం లాంటి వాటికి కారణం మతమే.మతంతో సమంధం లేకుండా సమాజంలో మంచీ చెడూ రెండూ ఉంటాయి. కానీ మతం మంచి వారిని కూడా చెడువైపుకు మరలించడానికి ఉపకరిస్తుంది.


దీని గురించి స్టీవెన్ వీన్‌బర్గ్ మహాశయుడు ఇలా అన్నాడు: "మతంతో సంబంధం లేకుండా మంచివాడు మంచి పనులూ, చెడ్డవాడు చెడ్డపనులూ చేస్తాడు. అయితే మంచి వాడు చెడ్డపనులు చెయ్యడానికి కారణం మతమే."

మూలం: Richard Dawkins' "The God Delusion"


14 comments:

 1. excellent post. you are much more clearer than me. i too read that book.

  ReplyDelete
 2. మతమే నైతికత నేర్పలేదు.. మతం కూడా నేర్పింది.. గమనించగలరు..

  >>మరి మతంలో నిజంగా దోషంలేనట్లయితే వీటిని యధాతధంగా ఆచరించగలమా?
  దీనికి సమాధానం మీ కింది పేరాలోనే ఉంది.. ఆ స్టాటిక్ స్టాండర్డ్ ను పట్టుకుని ఉన్నవాళ్ళతోనే సమస్యాంత..

  >> అంటే ఒక మతం సత్యమయితే వేరొక మతం అసత్యం కావలసిందే.
  డాబా పైకి ఒకడు నిచ్చెన వేసుకుని వెళతాడు ఒకడు మెట్లు వాడి వెళతాడు.. మతాలు కూడా అలాంటివే..

  >>మతాల వలన జరిగిన మంచి కనపడడం లేదు
  I pity this person who ever made this claim.. if one wants a discussion one needs to come out of this mind set.. otherwise it will be another argument ending as futile..

  Finally, the Steven weinberg you mentioned is Noble Laurie t in Physics but his credentials as a philosopher/theologian/sociologist are questionable.. for me his opinion is not so valuble in this space..

  b/n is sociologist a right word??

  -Karthik

  ReplyDelete
 3. the Steven weinberg you mentioned is Noble Laurie t in Physics but his credentials as a philosophe

  తప్పుని సరిచేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మార్చాను.

  ReplyDelete
 4. @venkatakrishnanaram

  ధన్యవాదాలు.

  ReplyDelete
 5. This comment has been removed by the author.

  ReplyDelete
 6. వేదాల్లో స్త్రీలపై, శూద్రులపై వివక్ష కనిపిస్తుంది.
  _______________________________

  ఈ వివక్ష ఎక్కడుందో చూపిస్తారా?

  ఇస్లాంలో కళలు (చిత్రకలా, గానం, సంగీతం లాంటివి) అన్నీ నిషిద్దం
  ____________________________________________

  వేరే మతంలోకి మారండి, లేదా మీరే కొత్త మతం పుట్టించండీ ఎవడు కాదన్నాడు? Islam is a way of live where a man's focus is on divinity. If you dont like that life, choose another. Who cares?

  ReplyDelete
 7. వేదాల్లో ఆ వివక్ష నిజంగా ఉంటే, వెంటనే సరిదిద్దాల్సిన/మార్చాల్సిన/త్యజించాల్సిన అవసరం ఉంది. కానీ లేకపోతే?

  ReplyDelete
 8. If you dont like that life, choose another. Who cares?

  మీకు Apostasy in Islam గురించి తెలిసినట్లు లేదు!!

  వేదాల్లో ఆ వివక్ష నిజంగా ఉంటే, వెంటనే సరిదిద్దాల్సిన/మార్చాల్సిన/త్యజించాల్సిన అవసరం ఉంది.

  ఎన్నో ఉన్నాయి. వెతికితే మీకే దొరుకుతాయి. దురదౄష్ట వసాత్తు ఏ మతంలోనూ sacred textsకి మార్పులు చేయడం సాధ్యం కాదు.
  Ex:Satapatha Brahmana 14:1:1:31
  Yajur Veda – Taittiriya Samhita 6:5:8:2
  Rig Veda 8:33:17
  Satapatha Brahmana 5:3:1:13

  ReplyDelete
 9. Satapata brahmana & Rigveda
  _____________________________  Here is a response from a discussion group:


  Shatapatha Brahmana mainly explains how to conduct rituals such as Yajna,
  offerings to ancestors etc. Before commenting on Shatapatha Brahmana (14/1/1/31), let me quote Atharva Veda (14.1.64): “Let the man offer vedic prayers in front of her, behind her, at your centre and at her ends. By doing so, let God’s inviolable grace illuminate her home with good fortune and dignity.” Similarly, Rig Veda (3.53.4) clearly asks every husband to be accompanied by his wife during the Yajna ceremony. In the light of the above verses, let us consider the translation of Shatapatha Brahmana (14/1/1/31): “Let not the unintelligent partake in the sacrificial Yajna; and so are menstruating women, dog, and black crow during the performance of Yajna, for cleanliness is the essence of Yajna.” According to Shaastras (scriptures), persons performing the Yajna are required to possess the real knowledge of the mantras recited and maintain a clean environment throughout the duration of the ritual. Therefore, unintelligent people stayed away from such rituals for it is futile to remain there without understanding anything from the process. In those days, women, undergoing menstruation temporarily abstained themselves from attending the fire ceremony. This is the logical explanation for Shatapatha Brahmana (14/1/1/31). If what OP says is true, then Rig Veda (3.53.4) and Atharva Veda (14.1.64) should have corroborated his claim.

  Rigveda 8/33/17:
  INDRASHCHIDDHA TADBRAVEETSTRIYA ASHASYAM MANAH, UTO AHA KRATU RAGHUM¨ This mantra has reference to context with the previous mantras wherein it is stated that he who is able to control his five senses, perceptions and mind by studying Vedas and doing hard practice of ashtang yoga, he is only able to get peace and long, happy life. So, this mantra states:
  (CHIT) again (INDRAHA GHA) totally controlled learned person also (IDAM) this (ABRAVEET) states.

  Meaning: If still a complete learned person, who has full control on his mind, intellect etc., states that (ISTRIYAHA) his wife’s (MANAHA) mind (ASHASYAM) is difficult to follow his Vedic path (UTO AHA) and definitely her (KRATUM) mind and action is (RAGHUM) feeble/weak i.e., if the learned person states that the views and mind of his wife are not according to his Vedic philosophy and it is not possible to turn the wife because her mind and the power to do pious deeds is weak then what to do?

  The answer of this question is given in the next mantra 18 that husband and wife both carry the family life like a chariot but the responsibility of the husband to bear the load is more than wife.

  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~~

  The idea of Rigveda mantra 8/33/17 does not indicate that the mind of a lady is unintelligent, brooks no discipline etc. But the idea of the said mantra is that if a learned husband realises that the thoughts of his wife are not compatible with him then as per next mantra the responsibility of the learned husband is more than the lady to cooperate with his wife. Actually, in mantra 8/33/17 it is pointed out that if the wife in any case is not capable to meet with the requirements of her learned husband then next mantra quoted above states that to maintain compatibility, the responsibility lies on the husband. In no case, the wife has been declared unintelligent in Vedas. On the contrary, in next Rigveda mantra 8/33/19 it is stated- “ISTREE HI BRAHMA BABHOOVITH” i.e., the woman, in the house of her husband, is placed at the status of Brahma.

  ReplyDelete
 10. Could you elaborate more on Taittiriya Samhita 6:5:8:2 ?

  ReplyDelete
 11. I mean - Could you recite the exact Sanskrit verse "6:5:8:2" ?

  ReplyDelete
 12. నేను మీతో వాదులాతకు దిగలేను. బ్లాగుల్లో అభిప్రాయాలు మాత్రమే పంచుకోవాలి కానీ వాదులాటలు సరి కావని నా అభిప్రాయం.

  వేదాలే కాక గీత, ఇతిహాసాలు, మనుస్మ్రితి లాంటి అన్ని చోట్లా మనకు వివక్శ కనిపిస్తుంది. హిందూ మతానికి అన్నీ ప్రామాణికాలే..ఒక దాన్ని మాత్రం తీసుకుని మిగతావి వదులుకోలేము. ఇక వాటిగురించి మీరు ఎక్కడొ జరిగిన చర్చలు ఇచ్చారు, వాటిని నేను చదవలేదు. ఇలాగే ఇతర మతాలలోని హింసను కూడా సమర్ధిస్తూంటారు. అయితే ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన విషయం గ్రంధాలలో interpretations సాధ్యము అయి మనిషి ఒకే textని మంచిగానూ, చెడుగాను తీసుకోగలిగితే అది గ్రంధం లోని లోపమే.

  దీని గురించి నేను ఇంతకన్న చర్చించలేను.

  ReplyDelete
 13. Alright, even I stop the discussion in this blog. But the fact is that Yajurveda has only three-numbered verses, not Four. People posting that message on the net got the number wrong.

  ReplyDelete
 14. @Satyanveshi

  Enduku charchincharu ... blanket statements ivvamante istaraaa???

  ReplyDelete