నాలుగురోజులు తెలంగాణ అంశంపై చర్చజరగాలని కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఘొరావ్ చేస్తే చివరికి తెరాస ఎమ్మెల్యేలనందరినీ బయటికి గెంటివేసి అధికార, ప్రతిపక్షపార్టీలు కలిసి అసెంబ్లీని నడుపుకుంటున్నారు. మధ్యలో ఒకటీ అరా సీట్లు కలిగిన బీజేపీ, లోక్‌సత్తా కాకుండా తమేపార్టీలో ఉన్నామో తెలియని వైఎస్సార్ అభిమాన(?)ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
ఇంతకూ తెలంగాణపై చర్చను కాదని, తెరాసను గెంటివేసి వీరు దేనిగురించి చర్చించారు అంటే షరా మామూలే. ఒకర్నొకరు తిట్టుకోవడం, ఎవరిడబ్బాలు వాళ్ళు కొట్టుకోవడం. మీదంతా అవినీతిమయం అని ప్రతిపక్షం అంటే మీహయాంలోనే అవినీతి మొదలయింది అని అధికార పార్టి అంటుంది. నువ్వు కేందరం సీట్లో కూర్చోబెడితే కూర్చునే డమ్మీ ముఖ్యమంత్రివి అని ప్రతిపక్షం అంటే నువ్వు మామను వెన్నుపోటుపొడిచి కుర్చీలాక్కున్నావని అధికారపక్షం.
ఏమాటకామాటే చెప్పుకోవాలి, తిట్లపురాణం ఇప్పుడు కాస్త తగ్గింది, అదే మన ప్రియతమ మహామేత ఫాక్షనిస్టు ముఖ్యమంత్రి హయాంలో నయితే తిట్లు మరోలాఉండేవి. నిన్ను కడిగేస్తా, అసలు తల్లికడుపులోనుంచి ఎందుకు బయటికి వచ్చానో అనుకునేలా చేస్తా అంటూ సవాళ్ళు వినిపించేయి. ఈతిట్లు వినడంకోసమేనా వీల్లను గెలిపించి పంపించింది? ఏనాడయినా అర్ధవంతమయిన చర్చలు వీరెప్పుడయినా జరగనిచ్చారా? ఒక ఆరోపణ వస్తే ఆఅరోపణకు సమాధానం ఇచ్చుకోవాలి గానీ మీహయాంలో కూడా ఇలాగే ఉండేది అంటే అది సమాధానమా? దొంగలూ దొంగలూ ఊళ్ళు పంచుకున్నట్టు!
తెలంగాణ అంశంపై రెండు సంవత్సరాలుగా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంటే తెలంగాణ అంశంపై చర్చించడానికి వీరికి భయం. ఈఅంశం కేంద్రం దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు అని తప్పించుకుంటున్నారు. రాష్ట్రానికీ, రాష్ట్రప్రజలకూ సంబంధించి నిర్ణయం కేంద్రం తీసుకోవాలంటే ఆనిర్ణయం మంచిచెడ్డలగురించి చర్చించాల్సిన అవసరం వీరికి లేదా? వీరు చర్చించి ఆసమస్యకు పర్ష్కారాన్ని వెతకలేకపోవచ్చు, వీరిచర్చ కేంద్రనిర్ణయంపై ప్రభావం చూపలేకపోవచ్చు కానీ రాష్ట్రభవిష్యత్తుకు సంబంధించి రాష్ట్రప్రతినిధులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది, ఎన్నాల్లిలా తప్పించుకు తిరుగుతారు చేవలేని దద్దమ్మల్లా?
నలుగురైదుగురు రైతులు ఆత్మహత్యచేసుకుంటే అదో పెద్ద ఇష్యూ అవుతుంది, అసెంబ్లీనుంచి పార్లమెంటుదాకా చర్చిస్తారు, అన్నిరాజకీయపార్టీలూ ఆసమస్యపై రైతుయాత్రలనీ, పోరుయాత్రలనీ చేస్తాయి, మరి వందలకొద్ది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటే సమస్యే లేనట్టు ఎన్నాల్లు నటిస్తారు? ఈమాత్రం సభ జరిగితే ఎంత జరగకపోతే ఎంత? వీల్ల చర్చలద్వారా జనానికి ఏంఒరుగుతుంది?