Sunday, 18 March 2012

సమైక్యాంధ్ర మనకెందుకు?


బిడ్డా,
తెలంగాణ వస్తే నీకేమొస్తది?
కూడొస్తది, గూడొస్తది
తాగేటందుకు నీళ్ళొస్తయి
మన పొలం తడుస్తది
మన తమ్ముల్లకు నౌకర్లొస్తయి
గందుకే పెద్దాయినా
మనతెలంగాణ మనగ్గావాలె!!

బాబుగోరూ,
సమైక్యాంధ్ర మనకెందుకు?
హైదరబాదుల కబ్జాలకు
నాకంపనీ కాంట్రాక్టులకు
కాలువకింది బినామీపొలాల్లో
మూడోపంటకు నీల్లకొరకు
అంతా నాబాగుకోసమే
మీరంతా సమైక్యంగుండాలి!

14 comments:

  1. ఇంతకన్నా అందంగా కవిత్వం అవతలి పక్షం వాళ్ళు రాయలేరనా?
    ఇది చదవండిః

    అవకతకవ తవిక కవీ
    తెలి వెవరికి కవులిస్తివి
    చదువకనే కొలు విస్తదొ
    పగటి కలల తెలంగాణ

    అది వస్తది యిది వస్తది
    కుదురు తప్పుకున్న మదికి
    చెదర గానె పగటికల
    చిప్ప చేతి కొచ్చేస్తది

    కవిత్వం పేర వాళ్ళమీద వీళ్ళమీద అవాకులు రాయటం వలన తెలంగాణా వచ్చేటట్లయితే మీకన్నా అందమైన కవిత్వం వ్రాసి అది కాస్తా రాకుండా చేయగల వాళ్ళు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటారా నాయనా?

    అందు చేత నిందలకు స్వస్తి చెప్పి యేమన్నా విషయం ఉంటే మాట్లాడు.
    సరేనా?

    ReplyDelete
  2. శ్యామలీయం గారు,

    అవతలిపక్షం వారు కవితలు రాస్తానంటే నేనేమన్నా వద్దాన్నానా? రాసినవారికి ఇలా ఏమన్నా బోడి సలహాలు ఇచ్చానా? అయినా కవిత్వానికి అందం కన్నా అర్ధం ముఖ్యమని తమబోటివారికి తెలియనిది కాదు. అర్ధంలేని వాదనకు మద్దతుగా అర్ధవంతమయిన కవిత్వం ఎలాసాధ్యమో నాకయితే అర్ధంకాదు. చదవకనే కొలువు తెలంగాణ ఇవ్వదు గానీ సమైక్యాంధ్రలో పెద్దల ఆశీర్వాదంతో అక్రమంగా దొడ్డిదారిన కొలువులూ ప్రమోషన్లూ వస్తాయని తమబోటి పెద్దలకు తెలియంది కాదు, ఏదో వాదనకి అవాకులు రాస్తే ఏంలాభం?

    విషయం కావాలంటే పాతటపాలు ఓపిగ్గా చదువుకోండి. సరేనా!

    ReplyDelete
  3. నేను దుబాయి వెళ్ళి డబ్బులు సంపాదించడం తప్పుకాదు
    కానీ నా పక్క ఊరు వాడు నా ఊళ్ళో ఉద్యొగం చెయ్యడం తప్పు

    అసలు ఆంధ్రా అనే ప్రదేశం లేదు
    కానీ చరిత్రలో ఇప్పుడు ఉన్న అంధ్రా ప్రాంత వాళ్ళు అప్పడి సామ్రాజ్యం అని చెప్పడం

    ఉన్నది లేనిదీ చెప్పడం మనకు అలవాటే కదా

    జరుగుతున్నది
    రాజకీయ నాయకుల బంధువులకు మాత్రమే లబ్ధి చేకూరేలా నిధులు మళ్ళు తున్నాయి
    చెబుతున్నది
    ఆంధ్రా నాయకుల బంధువులకు మాత్రమే నిధులు అందుతున్నాయి.

    మనం పోరాడిల్సింది ముందు డబ్బులు మన దగ్గర నుంచీ దొచుకున్న వాళ్ళ పని పట్టడం.

    ReplyDelete
  4. అతితెలివి చవక కవీ
    మతిలేని రాతలెందుకు?
    దొడ్డిదారి కొలువులకు
    మద్దతు పాడేదెందుకు?

    కలలు కనని మనిషికి
    గెలుపు ఎపుడు చిక్కదు,
    కలలను చంపేయువాడు
    రాకాసే, మనిషి గాదు!

    ReplyDelete
  5. ఈ బ్లాగుకు ' ఏది అసత్యం ' అని పేరు పెట్టుకుంటే సరిపొయ్యేది !

    ReplyDelete
  6. సమైక్యాంధ్రలో పెద్దల ఆశీర్వాదంతో అక్రమంగా దొడ్డిదారిన కొలువులూ ప్రమోషన్లూ వస్తాయని భావిస్తున్నారు. మంచిది, మీ వాదనలో నిజం ఉండవచ్చుననుకుందాం. కాని రేపు తెలంగాణా గనుక ప్రత్యేకరాష్ట్రంగా వస్తే, అప్పుడు కూడా తెలంగాణా పెద్దల ఆశీర్వాదంతో అక్రమంగా దొడ్డిదారిన కొలువులూ ప్రమోషన్లూ రావని మీరెలా భావిస్తున్నారో అర్థం కావటం లేదు. ఇటువంటి అవినీతికి యెల్లలూ సెంటిమెంట్లూ యేమీ ఉండవు గదా. ఇప్పుడు మీరు చూడటంలేదా? KCRగారి కుటుంబం తెలంగాణాలో ఒక రాజకుటుంబం లాగా పెత్తనం చేస్తోంది! ఆయన గారి చేతిలో బంగారు భవిష్యత్తు ఉందని ఆశపడుతున్నారా?

    ReplyDelete
  7. అర్థముంటే చాలనుకుంటే హాయిగా వచనం వ్రాసుకోవచ్చును. కవిత్వానికి అందమూ అతిముఖ్యమే.

    ReplyDelete
  8. తెలంగాణ భావన సత్యం ఈ దిక్కుమాలిన కె.సి.ర్ వల్ల రాదు అనేది ఆంతకన్నా పరమసత్యం.
    ఈప్రజలందరిని గొదాట్లొకలిపి తను తన కుటుంబం మాత్రం 700 మంది రక్తాన్ని తాగి చక్కంగా,చల్లంగావున్న వారిమీద యుద్దం చేయక మామీద సెటైర్ కవితలు .
    రాజినామాలు,అల్లాయ్ బల్లాయిలు,రొడ్డుమీద వంట ,సకల జనుల సమ్మె డ్రామాలు.(సమ్మె కావాలి జీతాలు కావాలి అది వీరి త్యాగం ),సీమాంద్రుల విద్వెష డ్రామాలు ఇవి అన్ని కాసుల కక్కుర్తితప్ప సమస్యపట్ల చిత్తసుద్ది లేని నాయకత్వం. కాబట్టి ఈరొజు మీరు నిర్ణయుంచూకొండి.
    ఆయినా మాభూములు ,మాఫ్యాక్టరిలు , ఇంకా మీరు అనే బొలెడు పొవాటానికి ఇదెమన్నా 1947 దేశం విడిపొవటమా ఒక వెళ జరిగినా మాప్రాంతం మీకన్న యెక్కువ ధరలు వస్తాయ్ ఇరు ప్రాంత ప్రజలు భేదభావం లేకుండా హాయిగా జీవిస్తారు కాబట్టి మాకు కూడా తెలంగాణ ఆర్జెంట్ గా కావాలి

    ReplyDelete
  9. శ్యామలీయం గారు,

    తెలంగాణలో మాకు సవతి తమ్ముల్లెవరూ లేరు, అందరూ అన్నాతమ్ముల్లే. కనుక ఇక్కడి ఒకరి అవకాశాలను మరొకరు దోచుకునే అవకాశంలేదు. తెలంగాణలో ముల్కీ, జోనల్ వ్యవస్థ లాంటి వాటి అవసరమే ఉండదు కనుక దోచుకునే అవకాశమే లేదు.

    ఇక్కడ కొన్ని జిల్లాలవారు ఒక కూటమిగా ఏర్పడి మరికొన్నిజిల్లాలను అణగదొక్కేపరిస్థితి, ఆజిల్లాలవారు అధికారంలోకి వస్తే ఓర్వలేక వెంటనే దించివేసే పరిస్థితి ఉండదు. నదీజలాలను కొన్నిప్రాంతాలకు కాకుండా మరికొన్ని ప్రాంతాలకు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉండదు.

    ఒకప్రాంతంలోనూ ప్రజలమధ్య అంతరాలు ఉంటాయి, పాలకుల్లో అవినీతికూడా ఉండొచ్చు కానీ వ్యవస్థీకృత ప్రాంతీయ వివక్ష మాత్రం ఉండదు.

    కేసీఆర్ కుటుంబలో ఎవరూ అర్హతలేకుండా అధికారం చెలాయించడంలేదు (మన ఆంధ్రాలో లాగా). అందరూ చక్కగా మాట్లాడగలరు, నాయకత్వలక్షణాలు ఉన్నాయి కనుక అవకాశాలు దక్కించుకున్నారు, అంతే కానీ ఎలాంటి అర్హతలూ లేకున్నా మన లోకేశ్ నాయుడు, బాలక్రిష్ణ, జూ, జగన్ లలాగా అధికారానికి అర్రులు చాస్తున్నారని నాకనిపించడలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మేము వారిని ఓడించడానికి వెనుకాడం. ఎందుకంటే మాతెలంగాణ ప్రజలు వ్యక్తిస్వామ్యానికీ, కుటుంబపాలనకీ దూరం, కులాన్ని చూసి ఓట్లు రాల్చే తైపు గాదు, ఇక్కడ కులానికొక పార్టీచొప్పునలేవు. ఇక్కడ లక్షలకోట్ల అవినీతి చేసినవాడిని కూడా రాచరికంలో లాగా నెత్తినపెట్టుకుని భారిమెజారిటీతో గెలిపించరు.

    మరోమాట.. మా తెలంగాణలో కేసీఆర్ కాదు ఏదారినపోయే దానయ్యని ముఖ్యమంత్రిని చేసినా ఇప్పటికంటే బాగానే ఉంటుంది. కారణం ఒకతెలంగాణ ముఖ్యమంత్రి మానీళ్ళను, మానిధులను, మాకొలువులను ఆంధ్రాకో, కర్ణాటకకో తరలించే అవకాశం లేదు.

    చివరగా...కవిత్వానికి అర్ధంతోపాటు అందం కూడా అవసరమే..కానీ అందం చూసేవారికళ్ళలో ఉంటుంది. కొందరికి తమకు నచ్చని తెలంగాణయాసలో రాస్తే ఏదీ అందంగాకనబడదు. కాలోజీ కవిత్వం కూడా నచ్చనివారికి నాదోలెక్కా.

    ReplyDelete
  10. "ఇంతకన్నా అందంగా కవిత్వం అవతలి పక్షం వాళ్ళు రాయలేరనా"

    ఇక్కడ తన కవిత్వం అందంగా ఉందని ఆయన చెప్పుకోవడం లేదు. అలాగే తన కవిత్వం అందమే తన వాదనకు ఆయువు పట్టని కూడా వారు అనలేదు. పెద్దలు ఈ విషయం గమనించినట్టు లేరు.

    "కవిత్వానికి అందమూ అతిముఖ్యమే."

    అందం ముఖ్యమే కానీ అంతకన్నా నిజం ముఖ్యం. ఒట్టి అందం వల్ల ఒరిగేదేమీ లేదు. భావం లేని భాష బ్రతుకు లేని శవం లాంటిది.

    ReplyDelete
  11. @Aravind Palla

    ఈ బ్లాగుకు ' ఏది అసత్యం ' అని పేరు పెట్టుకుంటే సరిపొయ్యేది !

    మరీ మంచిది. సత్యం తెలుసుకోవాలంటే ముందు ఏది అసత్యమో కూడా తెలుసుకోవాలి.

    ReplyDelete
  12. "నేను దుబాయి వెళ్ళి డబ్బులు సంపాదించడం తప్పుకాదు
    కానీ నా పక్క ఊరు వాడు నా ఊళ్ళో ఉద్యొగం చెయ్యడం తప్పు"

    హైదరాబాదుకి బెజవాడ పక్క ఊరా, విడ్డూరంగా ఉందే! నెల్లూరుకు అతి దగ్గరలో ఉన్న చెన్నయి వాసులను మీరు రానిస్తున్నారా? ఇకపోతే అసలు విషయానికి వస్తే ప్రయివేటు రంగ ఉద్యోగాల గురించి ఎవరూ అడగడం లేదు. రామోజీరావు లాంటి వాళ్ళు తమ సంస్థలలో పైనించి కిందిదాకా అసమదీయులనే నియామకం చేసినా ఎవరయినా అడ్డుకున్నారా? ప్రభుత్వ రంగ ఉద్యోగాలాలలో ఉత్తరువుల ప్రకారం రాజ్యాంగ బద్దంగా రావాల్సిన వాటా అడిగితె మీకు ఒళ్ళు మంట ఎందుకు?

    దుబాయి అయినా అమెరికా అయినా ఎవరు ఏ ఉద్యోగాలు చెయ్యొచనే విషయం స్థానిక కారణాల వల్ల ఏర్పరుచుకున్న నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. గల్ఫు దేశాలలో తగినింత జనాభా లేకపోవడం వంటి కారణాల వల్ల కింది తరహా ఉద్యోగాలు అన్ని దేశాల వారికి ఇస్తున్నారు. అదే పాశ్చాత్య దేశాలలో అతి కొద్ది మంది ప్రాంతేతరులకు కథినమయిన ఆంక్షలతో అవకాశం ఇస్తారు. ఎవరి పద్దతి వారిది.

    దుబాయిలో తెలంగాణా వారు రాజభోగాలు అనుభవిస్తున్నారని అనుకుంటే అది పొరబాటు. ఉన్న ఊరిలో బతుకు తెరువు లేక పొట్ట చేత బట్టుకొని అనేక కష్ట నష్టాలను భరిస్తూ ఈసురోమని రోజూ చస్తూ బతుకుతున్న అభాగ్యుల మీద మీ లాంటి పెద్దలు ఈర్ష్య పడడం మానేసి చేతనయితే సానుభూతి చూపండి.

    ReplyDelete
  13. జై,

    తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, కానీ ఆంధ్రోల్ల మనసులు రంజింప జేయలేము. వీరితో వాదన చేయడం శుద్ద వేష్టు. నేనుండే చోటకూడా ఇలాగే మనమిక్కడ ఉద్యోగాలు చేయట్లేదా, మీదగ్గర మేంచేస్తే తప్పేంటని వాదిస్తారు, ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రైవేటు ఐటీ ఉద్యోగాలకూ తేడా తెలియదు, అసలు ఇష్యూ ఏంటో తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నం చెయ్యరు, కాలికేస్తే మెడకేయడం, మెడకేస్తే కాలికేయడం తప్ప.

    అసలు వీళ్ళకు వీరు మద్రాసునుండి విడిపోయేప్పుడు చేసిన డిమాండ్లు జై ఆంధ్రా ఉద్యమం చేసిన కారణాలు కూడా తెలియవు, తెలిసినా తెలియనట్లు నటిస్తారు. తెలంగాణవాదులను తిట్టడం తప్ప మరో విషయం తెలియని వీరికి విషయాన్ని వివరించడం అంటే దున్నపోతుపై నీల్లుపోసినట్టే.

    ReplyDelete
  14. @సత్యాన్వేషి: ఆంధ్రోల్లు అందరూ కాదన్నా. కొంత మంది మాత్రమె ఈరకం వితండ వాదం చేస్తరు. దురదృష్టం కొద్దీ ఈ బాచు వాళ్ళే బ్లాగులలో ఎక్కువ ఉన్నారు.

    A positive development of the present movement is a renewed interest in history. Unfortunately, however, much of the "history" being touted is false.

    ReplyDelete