Thursday 23 January 2014

సినిమాను సినిమాలా చూడకండి



ఎవరైనా ఏదైనా సినిమాను విమర్శిస్తే వెంటనే కొందరు తెలుగు సినిమోద్ధారకులు బయల్దేరి సినిమాను "సినిమా"లాగా చూడాలంటూ నీఉలు చెప్పడం మొదలు పెడతారు. ఇలా చెప్పేవారి ఉద్దేషం బహుషా సినిమా అంటే వినోదాన్ని ఇచ్చేది కనుక సినిమాను అలాగే చూడాలి, అంతకంటే ఎక్కువ ఆశించొద్దు అని.

సరే వారు చెప్పినట్లు సినిమాను సినిమాగా ( వినోదాన్ని పంచేది), బట్టలను బట్టలుగా (ఓళ్ళు కప్పేది), ఇళ్ళును ఇళ్ళులాగా (తలదాచుకోవడానికి) చూసుకుంటూ పోతే ఇంకా మంచి బట్టలు, మంచి ఈళ్ళు, మంచి సినిమాలను కనుగొనేదెలాగ?

మరోరకం విమర్శకులు మీరో సినిమా తీసి చూపించండి, అప్పుడే విమర్శించండి అంటుంటారు. సినిమా తీస్తే గానీ సినిమాను విమర్శించొద్దు, మఖ్యమంత్రి అయితే గానీ ముఖ్యమంత్రిని విమర్శించొద్దు, వంటగాడయితే గానీ వంటను విమర్శించొద్దు అంటే కష్టం.

అలాగని సినిమా శాస్త్రీయంగా ఉండాలనుకోవడమూ తప్పే. సినిమా శాస్రీయంగా ఉంటే జానపదాలు, సైన్సు ఫిక్షన్లూ (రెంటికీ ఒక్కోసారి పెద్ద తేడా ఉండదు), దెయ్యాల సినిమాలు, హారర్ సినిమాలు తీయడం సాధ్యం కాదు. కానీ సినిమాకు తప్పకుండా ఉండాల్సింది లాజికల్ కన్సిస్టెన్సీ. అంటే దర్శకుడు తాను చెప్పాలనుకునే తర్కానికి సినిమా అంతా సరిపోయేలా చూసుకోవాలి. ఉదాహరణకు "టైం ట్రావెల్" అనేది సాధ్యం అనుకుంటే "బాక్ టు ద ఫ్యూచర్" సినిమా అంతా ఆతర్కానికి సరిపోయేలా ఉంటుంది.

"నేనొక్కడినే" సినిమాలో నాకు నచ్చని అంశాలు:హీరోకు మొదటి సీనులో మాత్రం కనిపించే హెలూసినేషన్లు మళ్ళీ ఎప్పుడూ కనిపించవు, హీరో మాత్రం అప్పుడప్పుడూ ఇది నిజమా భ్రమా అన్న సందేహంలో ఉంటాడు. రెండోది ఒక సైకలాజికల్ సినిమా తీయాలనుకున్న దర్శకుడు ఒక కమేడియన్ను డాక్టరుగా చూపించి వెకిలి వేశాలు వేయించడం.

నచ్చిన అంశం, ఇదొక కొత్త ప్రయత్నం, ఏ హాలీవుడ్ సినిమాకు కూడా మక్కీకి మక్కీ కాదు(నాకు తెలిసి). కాస్త వెరైటీగా తీసిన తెలుగు, హిందీ సినిమాల్లో హాలీవుడ్నుండి మక్కీకి మక్కీ కొట్టనివి అరుదు. (నేను చిన్నప్పుడు చూసిన లేత మనసులు అనే సినిమా కూడా ఒక హాలీవుడ్ సినిమాకి కాపీ అని తరువాత మరో ఇంగ్లీషు సినిమా చూస్తుంటే తెలిసింది). ఎవరో ఒకరు వకాయతో బెండకాయ పులుసు చేసే ప్రయత్నం చేయకపోతే బెండకాయ పులుసు ఎన్నటికీ ఆవిశ్కారం కాదు.

1 comment:

  1. "హీరోకు మొదటి సీనులో మాత్రం కనిపించే హెలూసినేషన్లు మళ్ళీ ఎప్పుడూ కనిపించవు"

    మరో సారి కూడా కనిపిస్తాయి. గుర్తు తెచ్చుకోండి. గోవాలో, విలన్ అనుకుని హీరోయిన్ని చంపబోయే సీన్.

    ఇక అతను నిజమా భ్రమా అన్న సందేహంలో ఉండటానికి కారణం - హీరోయిన్ ఆడిన నాటకాలు + డాక్టర్ చెప్పిన వివరాలు.

    ReplyDelete