Saturday, 24 April 2010

దొరికితేనే దొంగ బాబా!!

పాపం నిత్యానంద స్వామి! ఒక నెల క్రింది వరకూ రాజభోగాలు అనుభవించాడు, ఎందరో భక్తులను కూడ గట్టుకున్నాడు. చక్కగా డబ్బున్న భక్తులనుండి సేకరించిన విరాళాలతో ఎన్నో ఆశ్రమాలను స్తాపించి ఆశ్రమాల ముసుగులో తన ఇహలోక కోరికలన్నీ తీర్చుకున్నాడు. భక్తులకి మాత్రం జనన మరణ బంధాల విముక్తి గురించి భోదనలు చేశాడు. సీక్రెట్ కెమెరాల పుణ్యమా అని ఒక్కసారిగా ఆయన జీవితం పూర్తిగా మారిపోయి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.


ఒక్క వీడియోతో ఒక్కసారిగా ఎన్నో కొత్త కేసులు బయటికి రాసాగాయి. నిత్యానంద ఆశ్రమాల మీద దాడులవల్ల ఆయన రాసలీలలపై ఎన్నో ఆధారాలు బయట బడ్డాయి.


అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మన దేశంలో నిత్యానంద ఒక్కడే కాదు, ఇంకా ఎందరో దొంగ స్వాములు, దొంగ బాబాలూ తామే దేవుళ్ళమని చెప్పుకుని వెర్రి జనాలని మోసగిస్తున్నారు. ఇంకా ఎక్కువ విరాళాలు సేకరిస్తున్నారు, ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆశ్రమాలమాటున ఎన్నో ఇల్లీగల్ చర్యలకు పాల్పడుతున్నారు. వారిని టచ్ చేసే ధైర్యం మీడియాకి గానీ, న్యాయవ్యవస్తకి గానీ ఇంకా రాలేదు.


పోనీ ఈ ఇతర బాబాలమీద ఇప్పటివరకూ ఆరోపణలు ఏమీ లేవా అంటే అలా కాదు. వీరిపై నిత్యానందపై వచ్చిన ఆరోపణలకంటే పెద్ద ఆరోపణలు ఎన్నో వచ్చాయి. మరి ఎందుకు ఎవరూ వీరి గురించి అడిగే సాహసం చెయ్యరూ అంటే కారణం వారు నిత్యానంద లాగా అడ్డంగా దొరికిపోలేదు. వారిపై ఇంతకుముందు వచ్చిన వీడియోలు నిత్యానంద లాగ క్రిస్టల్ క్లియర్గా కనపడలేదు. అందుకే ఈ బాబాలెవరూ పూర్తిగా దొరకక దొంగ బాబాలుగా కాక నిజం బాబాలుగా చలామనీ అవుతున్నారు.


మొత్తానికి నిత్యానంద ఎపిసోడ్ ఫలితంగా మీడియాలో దొంగ బాబాలగురించిన వార్తలు గత నెలరోజులుగా పెరిగాయి. అయితే ఇవి కేవలం ఏ కాళేశ్వర్ బాబా లేక మరో చోటా మోటా బాబాకో మాత్రమే పరిమితమయ్యాయి. అంతే కానీ తాము దేవుళ్ళ అవతారాలుగా చెప్పుకునే బడా బాబాల జోళికి మీడియా వెల్లలేక పోయింది.


నిత్యానంద ఎపిసోడ్ కంటే కొద్దిరోజులు ముందుగా కల్కి అమ్మ భగవాన్ గురించిన వార్తలు కొన్ని చానెల్స్లో వచ్చాయి. ఆ వార్తలలో చూపించినది మీడియా సొంత ఇన్వెస్టిగేషన్ కాదు, కొంతమంది మాజీ భక్తులు కల్కి బాగోతాన్ని వీడియో తీసి మీడియాకి ఇచ్చారు.


నిజానికి కల్కి భగవాన్ పైన వచ్చిన అరోపణలు నిత్యానంద కంటే సీరియస్ ఆరోపణలు. నిత్యానంద కేవలం ఒక సినీ తారతో రాసలీలలు జరిపి దొరికిపోయాడు. ఇది చట్టపరంగా నేరమేమీ కాదు. కాని ఆ వీడియో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పోలీస్ వ్యవస్థ కూడా రంగంలోకి దిగింది, చివరికి నిత్యానందని అరెస్టు చేశారు. అయితే కల్కి భగవాన్ భక్తి పేరుతో భక్తులను మత్తుమందులకి బానిసలు చేస్తున్నట్లు, భక్తులతో మత్తులో ముంచి కామక్ర్రిడలు చేస్తున్నట్లు ఆరోపణలు. అయినా కల్కి భగవాన్ పైన ఎలాంటి చర్యా తీసుకోబడలేదు.


ఇక సత్య సాయి, ఆసరం బాపు, బాల సాయి లాంటి బాబాల జోలికి చట్టం కాదు కదా, వారిని తప్పు పడితే సగం మంది బ్లాగరులే మన మీదికి దాడి చేస్తారు. మరి ఈ బడా దొంగబాబాలు దొరికేదెప్పుడు?

9 comments:

  1. బాగా చెప్పారు. సత్య సాయిమీద బీబీసీ లో రిపోర్ట్ వచ్చింది కానీ మన మీడియాకీ, చట్టానికీ మాత్రం ఆయన్ని కదిలిచే ధమ్ము లేదు. ఈ అందరు బాబాల ఆశ్రమాలలో మర్డర్లు జరిగినట్లు వార్తలు వచ్చాయి, మరి వాటిపై ఏమీ ఎంక్వయిరీ లేదు.

    ReplyDelete
  2. బ్రహ్మచారినని చెప్పుకుంటూ రాసలీలలు చెయ్యడం మోసమే. ఈ విషయంలో నిత్యానంద స్వామిని తప్పు పట్టొచ్చు. మన దేశంలో అందరి కంటే ఎక్కువ సంపాదించే బాబా పుట్టపర్తి బాబాయే. ఇతన్ని వదిలేసి నిత్యానంద స్వామి లాంటి చిన్న చేపల్ని పట్టుకోవడం హాస్యాస్పదం.

    ReplyDelete
  3. పుట్టపర్తి సాయిబాబా గారి వల్లనే గ్రుక్కెడు మంచినీళ్ళుకూడా కరువైన అనంతపురం జిల్లా గ్రామవాసులమయిన మేము నేడు నిత్యం నీళ్ళు త్రాగగలుగుతున్నాం.ఆయన సంపాదించడం లేదు భక్తులిచ్చిన దానిని దేశవిదేశాల్లో సమాజసేవకే వినియోగిస్తున్నారాయన.

    ReplyDelete
  4. పుట్టపర్తి బాబా తానేమీ కష్టపడి సంపాదించిన డబ్బు దానం చెయ్యలేదు. జనం దగ్గర విరాళాలు వసూలు చేసి దానం చేశాడు. నెలకి 20 వేలు సంపాదించే HDFC బ్యాంక్ ఉద్యోగిని అడగండి "500 నోటు జేబు నుంచి తీసి ఇవ్వగలడో లేదో?" ఒకడి దగ్గర 100 నోటు వసూలు చేస్తే లక్ష మంది దగ్గర వసూలు చేసిన నోట్లు కలిపి కోటి రూపాయలు అవుతాయి. అందులో 50 లక్షలు దానం చెయ్యడం కష్టమేమీ కాదు. అనంతపురానికి చెందిన ఒక నాస్తికుడు అన్నాడు "ప్రభుత్వానికి మంచి నీటి సౌకర్యాలు కల్పించడం చేతకాక పుట్టపర్తి బాబా దగ్గర విరాళాలు అడుక్కునే స్థితిలో ఉందని".

    ReplyDelete
  5. ప్రభుత్వం టాక్సులుగా వసూలు చేసిన డబ్బు ఏమి చేస్తోంది? ఆ డబ్బుని అవినీతి అధికార్లు భోంచేస్తే పుట్టపర్తి బాబాకి డబ్బులు అడగాల్సిన అగత్యం రాదా?

    ReplyDelete
  6. నిత్యానంద కూడా పాపం సమాజ సేవ చేసాడు. ఇక్కడ చూడండి:
    http://picasaweb.google.com/NGCI2010

    ఆ మాటకొస్తే ఏ బాబా అయినా కొంత సమాజ సేవ చేస్తారు, చేశామని చెప్పుకుంటారు. అలా చేయడం విరాళాలు వసూలు చేసే కార్యక్రమంలో ఒక భాగం.

    వీరు ఈ సమాజసేవ ముసుగులో ఇంకా ఏమి చేస్తున్నారు, ఎంత డబ్బు సంపాదించి ఎంత ఖర్చు చేస్తున్నారు లాంటివి మనం గమనించాలి. ఒక్కసారి ఆ ముసుగు తీసేస్తే విరాళాలు రావు మరి.

    ReplyDelete
  7. Sceptic గారూ...,పాపం నిత్యానంద స్వామి! ఒక నెల క్రింది వరకూ రాజభోగాలు అనుభవించాడు, ఎందరో భక్తులను కూడ గట్టుకున్నాడు. చక్కగా డబ్బున్న భక్తులనుండి సేకరించిన విరాళాలతో ఎన్నో ఆశ్రమాలను స్తాపించి ఆశ్రమాల ముసుగులో తన ఇహలోక _____________________ఈ రోజు నుంచి నేను బ్లాగుల్లో అధమపక్షం కనీసం వందకు తగ్గకుండా కామెంట్లు వ్రాయాలనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ మధ్య తీరికలేక నేను కామెంట్లు వ్రాయడం మానేసాను. అందుకని

    ReplyDelete
  8. అంతా చదివి బాబా వీరందరినీ క్షమించు నాయ్నా అనుకునే తెలివైన వాళ్ళూ వున్నారు..

    ReplyDelete