Friday, 28 May 2010

మేధావులు పాలనకు అసమర్ధులా?

మన్మోహన్‌సింగ్ దేశ ప్రధానమంత్రి భాధ్యత స్వీకరించినపుడు కాంగ్రెస్‌ని ఎప్పుడూ సమర్ధించని నేను కూడా ఒక విద్యావేత్తా, మేధావి, అర్ధికవేత్త, మనం దేశపు ప్రగతిశీల ఆర్ధిక విధానాల సృష్టికర్త ప్రధానమంత్రి అయినందుకు సంతోషించాను. కానీ అదే మన్మోహన్‌సింగుని ప్రతిపక్ష నేత అయిన అద్వానీ పదే పదే "నికమ్మా" అని పిలిచాడు. రాజశెఖర్‌రెడ్డి మృతి తరువాత రోశయ్య ముఖ్యమంత్రి అయినపుడుకూడా నేను ఎన్నోసార్లు ఆర్ధికమంత్రిగా బుడ్జెట్‌ని ప్రతిపాదించినవ్యక్తీ, అనుభవశాలీ అయిన రోశయ్య ముఖ్యమంత్రి అయినందుకు సంతోషించాను. కానీ ప్రతిపక్షమయిన టీడీపీతో సహా అనేకమంది రోజూ టీవీలలో ముఖ్యమంత్రిని అసమర్ధుడు అని అంటున్నారు.

ఒక రకంగా వీరిమాటలో నిజంలేకపోలేదు. వీరిద్దరు కూడా అనేక విషయాలలో ఖఠినంగా ఉండలేకపోతునారు. ఇద్దరికీ కూడా సోనియా అనుఙ్న్య లేనిదే ఏ నిర్ణయమూ తీసుకోలేరు. సోనియమ్మ లేకపోతే వీరి మాటలు కేబినెట్ కూడా వినదు. మన రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రి అయినతరువాత అన్నీ కష్టాలే పాపం.

మరి మనదేశంలో పరిపాలన చెయ్యాలంటే కుటిల రాజకీయాలు తెలిసినవారు, గూండాగిరీలో ఆరితేరినవారూ తప్ప మేధావులకి సాధ్యం కాదా? గొర్రెలమందని కర్రతో అదిలించినట్లు మన ప్రజలని కూడా ఎప్పుడూ అదిలించేవాడే పరిపాలన చెయ్యగలడా? ఎందుకిలా?

8 comments:

  1. సత్యాన్వేషి గారు,
    నాయకులకు మేథో సంపత్తి కంటే ఈ క్రింది లక్షణాలు చాలా ముఖ్యం.మేథస్సు కూడా కావలిసిందే, కానీ చాలావరకు దానిని అధికారులు అందిస్తారు.
    1. Sound judgement to balance between what is correct and what is possible
    2. Ability to carry people along with your decisions. (usually, scholarly people lack this )

    అందుకే ఎన్నికలు జరుగుతాయి ప్రజాస్వామ్యంలో. If we want meritocracy, then we do not need PM and CM. cabinet secretary is good enough..

    In the case of Dr. Singh, the missing qualities are compensated by Sonia Gandhi who supports him strongly and both of them it seems know their areas well. Whereas Rosaiah do not have that sort of support.

    ReplyDelete
  2. Well.. on the lighter side,

    గొర్రెల మందని అర్థం చేసుకోవడం, నాయకత్వం వహించడం ఒక తెలివైన గొర్రెకే సాధ్యం గానీ, ఒక మంచి ఆవుకి ఎలా సాధ్యం?

    ReplyDelete
  3. "గొర్రెలమందని కర్రతో అదిలించినట్లు మన ప్రజలని కూడా ఎప్పుడూ అదిలించేవాడే పరిపాలన చెయ్యగలడా?"

    అవునండీ, కాలాన్ని బట్టి వ్యవహారాలు నడుస్తాయి.త్రేతాయుగంలో తండ్రి మాట వినేవాళ్ళు,ద్వాపర యుగంలో తండ్రిని ప్రక్కన ఉంచి అరాచకాలు చేసారు,ఇది కలియుగం కదండీ ఇలాగే నడుస్తోంది.ఎవరి ధోరణి వారిదే.
    అదుపుతప్పిపోతోంది. ఒక్కోసారి మహిళల వల్లనేమో అనిపిస్తుంది.దేశాధ్యక్షులనుంచి హోంమంత్రుల వరకు మహిళలు ఉండటం, వారు కఠినంగా లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయేమో అనిపిస్తుంది.

    ReplyDelete
  4. వీకెండ్ పొలిటీషియన్ గారూ,

    మీరు చెప్పిన రెండు అర్హతలతో పాటు మనదేశంలో నాయకుడిగా ఎదగడానికి జనాకర్షణ ముఖ్య అర్హత. ఈ జనాకర్షణ మనదేశంలో సినిమా హీరోలకీ, వంశపారంపర్యంగా వచ్చినవారికీ దక్కుతున్నాయి. ఇవే కాక అమాయకులయిన జనాలని కుల, మత, ప్రాంత, వర్గ బేదాలతో రెచ్చగొట్టే వారికి కూడా జనాకర్షణ మెండుగా ఉండి నాయకులుగా ఎదుగుతున్నారు.

    కేవళం sound judgement, ability to drive people ఉంటే ఒక సంస్థకి సమర్ధుడైన CEOగా ఎదగవచ్చు కానీ రాజకీయాల్లో ఎదగడం కష్టం.

    సోనియా నాయకురాలిగా ఎదిగినతరువాత ఆమెలోని అన్ని వర్గాలను కలుపుకురాగల సామర్ధ్యం బయట పడింది, కానీ నాయకురాలిగా ఎదగడానికి కారణం కేవలం ఆమే రాజీవ్ భార్య కావడమే.

    జగన్‌లొ ఇంకా నాయకత్వ లక్షణాలు ఉన్నాయో లేవో ఎవరికీ తెలియదు, ప్రస్తుతం ఉంది మాత్రం వారసత్వంగా వచ్చిన ముఠాలు, అక్రమంగా కూడబెట్టిన సొమ్మూ మాత్రమే.

    పీవీలో మీరు చెప్పిన రెండు లక్షణాలూ ఉన్నప్పటికీ జనాకర్షణ లేక పైకి రాలేదు, చిరంజీవి వద్ద జణాకర్షణ ఉన్నప్పటికీ sounD judgement లేక ఫెయిల్ అయ్యాడు.

    ReplyDelete
  5. నేను నా టపాలో చెప్పాలనుకున్న విషయం, ఎక్కువ మంది చదువురానీ వారు ఉండి, ఏళ్ళతరబడి బానిసలుగా బతికిన మన ప్రజలు డబ్బున్న వాడినీ, వారసత్వంగా వచ్చిన వాడినీ, రెచ్చగొట్టే వాడినీ, అవసరమయితే గూండాగిరీకి వెనుకాడని వాడని మాత్రమే నాయకుడిగా ఒప్పుకుంటున్నారు.

    వీటికి దూరంగా ఉండే రోశయ్యా, జయప్రకాష నారాయణ, మన్మోహన్ లాంటివ్వారు నాయకులు కాలేకపోతున్నారు.

    ReplyDelete
  6. సత్యాన్వేషి గారు,
    my second point is nothing but జనాకర్షణ (ability to carry people with you). Its not about driving people.
    Anyway, I liked your clarification on the post.

    ReplyDelete
  7. @niharika

    baaga cover chesaaru...
    వారు కఠినంగా లేకపోవడం వల్ల సమస్యలు
    asamardhata valla kaadu antaru............

    medhavi ki koncham mondi teguva vunte chaalu........atanu good leader ani naa opinion.

    anthe gaani koncham bhaasha meeda pattundi padimandini attract cheyagaane vaadu great leader antam correct kaadani na opinion...

    ReplyDelete
  8. weekend poilitician for President .. I mean CM!!

    ReplyDelete