Tuesday, 5 January 2010

సమైక్యాంధ్ర వాదుల వితండ వాదాలూ, అబద్దపు ప్రచారాలు -1
తెలంగానా రాష్ట్రం కొరకు ఉద్యమం యాభై ఏల్లుగా సాగుతుంటే, డిసెంబరు పది చిదంబరం ప్రకటనతో రాత్రికి రాత్రి మొదలయ్యిన సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తెలుగు బ్లాగర్లలో ఈ మధ్య ప్రచారం మొదలయ్యింది. అయితే ఇలా రాత్రికి రాత్రి మొదలైన ఉద్యమానికి కారనాలు ఏమి చెప్పాలో ఎవరికీ అర్ధం కాక, ఎదో ఒకటి చెప్పి గోబెల్సు లాగే దాన్నే పదే పదే గట్టిగా అంటే సరిపోతుంది..పెద్దగ వినపడ్డం వల్ల జనం మన మాటే నమ్ముతారని వాల్లు ఆశ పడుతున్నారు లాగుంది. వీల్ల వాదనలు చాలా చిత్రంగా తలా తోకా లేకుండా, అసలు వాల్లు దేనికోసం ఉద్యమం చేస్తున్నారో కూడా తెలియనంత విచిత్రంగా ఉంటాయి. మచ్చుకు కొన్ని సమైక్య వాదుల వాదనలు.

1. రాష్ట్ర విభజన దేశ సమగ్రతకు పెద్ద సమస్య. ఇది వేర్పాటు వాదుల కుట్ర.

ఈ వాదన చూస్తే కాస్త బుర్ర ఉన్న ఎవ్వరికైనా నవ్వు రాక మానదు. ఒక రాష్ట్ర విభజనకీ, దేశ సమగ్రతకి సంబంధం ఏమిటి? అసలు దేశంలో రాష్ట్రాలే లేకుండా అంతా కలిసి ఉంటే సమగ్రత ఎక్కువగా ఉంటుందా? తెలంగాణా వాల్లేమైనా ఈదేశం నుండి విడిపోతామంటున్నారా? కొత్త రాష్ట్రం ఎర్పడితే అది ఈ దేశంలో భాగం కాద? మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడూ, ఝార్ఖండ్, ఉత్తరాంచల్, చత్తిస్గర్హ్ ఏర్పడ్డప్పుడూ ఈ దేశ సమగ్రతకు ముప్పు ఏమన్నా వచ్చిందా?

2. మీడియా, పోలీసులు తెలంగానా పక్షం??!!

అసలు మీడియా అంతా ఆంధ్రా వాల్ల చేతుల్లో ఉంది. మీడియా తెలంగాన పక్షం అని చెప్పడం విచిత్రంగా లేదూ? వీల్లు చెప్పేదేమంటే మీడియా ఎప్పుడూ తెలంగానా వాల్ల ఉద్యమాన్నే చూపిస్తుంది, ఆంధ్రా వాల్లు విశాఖ పట్నం లోనో, విజయవాడలోనో చేసేది చూపించరని. అవును అసలు ప్రజల్లో ఏమాత్రం మద్దతు లేని, కొంతమంది బడా నాయకులు తమ ప్రాబల్యం కోసం డబ్బులిచ్చి చేపిస్తున్న ఈ రాత్రికి రాత్రి మొదలయిన ఉద్యమాన్ని ఎవడు చూపిస్తాడు, చూపిస్తే ఎవడు చూస్తాడు? అక్కడొ పది మంది, ఇక్కడొ నలుగురు కలిసి ధర్నాలు చేసి దాన్ని ఎవరూ చూపించట్లేదంటారు.

ఇక వీల్లు చెప్పే మరో కారణం ఏమిటంటే తెలంగాణా నాయకుల సమావేషాలు, ప్రసంగాలు ఎక్కువగా చూపిస్తారు, ఆంధ్రా వాల్లవి చూపించరని. మరి అది నిజమే కదా? మిడియా ఎవరి ప్రసంగాలు ప్రజలు వినాలని కోరుకుంటున్నారో వాల్లవే చూపిస్తారు. చిరంజీవి, లగడపాటిల ఉపన్యాసాలు ఎవడైనా వింటాడా మరి?

ఇకపోతే విచిత్రమైన విషయం ఏమిటంటే పోలీసులు తెలంగానా వాల్లవైపట!! ఉస్మానియా విద్యార్తులు క్యాంపస్ లో ఉంటే హాస్టల్లలోకి వచ్చి కొట్టిన పోలీసులు అనంతపురంలో బీఎస్సెన్నెల్ గోడౌన్లు కాలుస్తున్నా అక్కడే ఉండి చూస్తూ ఊరుకున్నారు. కేసీఆర్ని దారి కాచి ఖమ్మం జైలుకి తరలించిన పోలీసులు లగడపాటి హాస్పిటల్ నుండి సినిమాలో లాగా తప్పించుకుని హైదరాబాదు వచ్చినా చోద్యం చూసారు. అయినా వీల్ల కల్లకు పోలీసులు తెలంగానా పక్షపాతుల్లాగానే కనిపిస్తారు.

3. తెలంగానా రాష్ట్రం ఏర్పడ్డంత మాత్రానా అభివ్రుద్ధి సాధ్యమని గ్యారంటీ ఉందా?

అసలు దేనికయినా గ్యారంటీ ఉంటుందా? ఏదైనా మార్పుని కోరుకునే వాడు మార్పు మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆషిస్తాడు. కలిసి ఉంటే అభివ్రుద్ధి జరుగుతుందేమోనని యాభై ఏల్లు వేచి చూసారు. ఇంకా ఎంత కాలం చూడమంటారో చెప్పండి.

4. ఈ విభజన వాదుల బందుల వల్ల నష్టం జరుగుతుంది.

నిజమే మరి. ఎవరు మాత్రం ఇలా బందులూ, ధర్నాలు ఉండాలని కోరుకుంటారు చెప్పండి? తెలంగాణా ప్రక్రియ మొదలవుతుందని చిదంబరం చెప్పగానే మీరు కేంద్ర ప్రభుత్వ నిర్నయానికి కట్టుబడి ఉంటే ఈ గొడవలన్నీ ఉండేవి కావు కదా? సమైక్య వాదులేమైనా బందులూ, ధర్నాలూ, నిరాహార దీక్షలూ లాంటివేవీ చేయకుండా ఊరుకున్నారా మరి? అప్పుడేమయింది మీ ఈ విచక్షణ?

14 comments:

 1. (1999 - 2009) TOP-20 తెలుగు కథానాయికల్ని మీరే ఎంచుకోండి!
  visit to poll:
  http://blogubevars.blogspot.com/

  అనుకోకుండా కొందరి పేర్లు TOP-20 లిస్టు లో పెట్టలేక పోయాను, అక్కడ ఉన్నవారికి మీ వొటు వేయండి.

  ReplyDelete
 2. First you look at others, even Tamil nadu has different regions Maharashtra has different regions Karnataka has different regions each differs with others culturally and economically still they want to be united. These T-idiots doesn't have any sense. they let down the Telugu pride.

  ReplyDelete
 3. ఆంధ్రోల్లంత ఆత్మాభిమానం లేని జాతి ప్రపంచం లో మరొకటి లేదని రుజువు చేసుకుంటున్నారు.
  జంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకుని కలిసినం. మీరు ఆ అగ్రిమెంట్ ను 50 % కూడా పాటించలేదు. మీకు మాకు కుదరదు ర భై విడిపోదాం అంటే తెలంగాణా సొమ్ము తినమరిగి ఏదో లత్తకోరు సమైక్యపాట మొదలు పెట్టిండ్లు .
  తెలంగాణా ప్రజలు ఎంత చీత్క రించు కుంటున్నా, ఎంత అసహ్యించు కుంటున్నా కుక్క గోమార్ల లా పట్టి వదలడం లేదు.
  ఛి ఛి ఛి ఛీ ఏం మనుషులు.

  ReplyDelete
 4. babu.. neeku nachinatlu unte.. telugu media correct ga pani chestunnatlu..

  lekapote udyamam ki vyatirekam.. anthe kadha..

  media vallaki kavalsindi sensation.. trp.. ee telangana vallu boothulu maatladtu.. edo oka publicity kosam try chestaru kabatti.. media adhe prasaram chestundi..

  2.
  really telangana is a problem to a country's integrity. Right now itself u ppl are threatening others to kill or burn alive if they are not from telangana.. how can any one trust you that you will welcome others after forming the state.

  3.
  development will never be possible in a seperate state. see jharkand and uttaranchal.

  jharkand has 7 governments in 9 years. This itself describes the development.
  and your dumb kcr can never develop telangana. If he is honest, he would have fought on behalf of karimnagar or nalgonda people.

  so please stop your mind less.. base less arguments and talk logically.


  blog undhi kadha ani.. prathodu raaseyyatame.. chi..

  ReplyDelete
 5. Absolute stupidity, koopastha mandukam

  ReplyDelete
 6. తెలంగా'నా' కాదు, తెలంగా'ణా'. కారనాలు కాదు, కారణాలు. వాల్లు కాదు, వాళ్ళు. ఇంకా ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి.
  తెలంగాణా అనే పేరు ఎలా రాయాలో కూడా తెలియని, లేక తెలిసి కూడా తప్పు రాసే మీలాంటి వాళ్ళ మూలంగానే ఉద్యమం పరువు పోతున్నది. ముందు పేరు రాయటం నేర్చుకోండి. తర్వాత, వేరే రాష్ట్రం అడగొచ్చు.

  ReplyDelete
 7. అసందర్భ ప్రేలాపన అని అనుకోకుంటే మీకు కొన్ని అక్షర దోషాలు వాటి సవరణలు వివరిస్తాను
  తెలంగాణా - తెలంగానా కాదు
  ఏళ్ళు - ఏల్లు కాదు
  కారణాలు - కారనాలు కాదు
  వాళ్ళు - వాల్లు కాదు
  వీళ్ళ - వీల్ల కాదు
  అభివృద్ది - అభివ్రుద్ది కాదు
  విద్యార్థులు - విద్యార్తులు కాదు
  కళ్ళకు - కల్లకు కాదు
  సమావేశాలు - సమావేషాలు కాదు

  ReplyDelete
 8. enti babu.. naa comment accept chese guts levaa..?

  ReplyDelete
 9. అక్షర దోషాలని సరి చేసినందుకు తెలుగు భాషాభిమానికి ధన్యవాదాలు. కొన్ని తెలియక చేసిన తప్పిదాలు కాగా, ఎక్కువగా ఈ తెలుగు ఎదిటర్లో సరైన కీస్ వెతకడానికి బద్దకం కారణం.

  ReplyDelete
 10. వేణు గారికి,

  నేనేమీ మీడియా ఆంధ్రా వాల్ల వైపు అని ఏడ్వడం లేదిక్కడ. ఈ సమైక్యాంధ్రా వాల్లు ఏవిధంగా అబద్ధాలు చెబుతారో మాత్రమే వ్రాసాను.

  ReplyDelete
 11. 100%.................
  sollu.....
  samaikya vadame tappu annatlu matladu thunnaru...
  samikya andhra ante dabbu kosam annatla...
  samikya vadam lekapote... india lo inni staes kalisi vundadam... kastam....
  vidi povadam meeda vunna .. aikyata....
  samasya poradadam meeda enduku raadu......
  matladite...... 50 years poratam antaru.....
  eppudo rajakar's meeda chesina poratanni..... eppatiti paristhiki anvaestaru.....
  adi manchidi kaadu.....

  kashmeer,Assam,Arunachal .. kante goppa samasya.. telangana samasya....

  eppududippuday gadinapaduthunna rastranni.. malla 10 years venakki nettesaru.....

  kendra prabhutvam okati... desanni.. samikyam ga vunchataniki try cheyyali.. gani.... evidam ga cheyya kudadu.....

  naaku telisi.. 610 GO kante.... pramaada karamaina GO ledu....

  elanti.. prantheya .. vudvegalu chela regi nappudu... prabhutvaniki basataga vunda valasina.. adikarulu......
  pendown ani... Govt ni.. panicheyya kunda chesaru...

  yeha... asalu chduvu kunna valle.... ardam kanappudu .. inka.. samanyula pani enti.....

  naaku HYD lo kaani... ekkada... centu boomi ledu.. emi ledu kaani naaku samikya andhra ne kavali..

  edi na..... swachamaina .. manasutho koru kuntunna.....

  mana rastram paruvu teesaru.. Delhi lo... cha.. jeevitam

  ReplyDelete