Sunday, 30 May 2010

జగన్‌కి వరంగల్‌లో ఓదార్పు యాత్ర చేసే హక్కు ఉండాలా?

ఓదార్పు యాత్ర వెనుక జగన్ అసలు ఉద్దేషం, జగన్ యొక్క ఓదార్పు గుణం, ఓదార్పు యాత్ర ఆవశ్యకత లాంటి అంశాలజోళికి వెల్లకుండా నిజంగా వీరు చెప్పేట్లు జగన్ హక్కుని ప్రభుత్వం, తెలంగాణా వాదులు కాలరాశారన్న వాదనలో నిజం ఉందా?

ఒక వ్యక్తిగా జగన్‌కి గానీ, మరెవరికయినా దేశంలో ఎక్కడికయినా స్వేచ్చగా వెళ్ళే హక్కు ఉండాలి. దురదృష్టవశాత్తూ మనదేశంలో పౌరులు ఎన్నో చోట్లకు ఒంటరిగా వెళ్ళలేని స్థితి ఉంది. జగన్ ప్రాతినిధ్యం వహించే రాయలసీమలో చాలా చోట్ల ఒక వర్గం వారు ఇంకో ప్రాంతంలోకి వెళ్ళాలంటే శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వరు.

ఈ ఓదార్పు యాత్రలో జగన్ ఒక వ్యక్తిగా వెళ్ళడం లేదు, రెండువేలమని అనుచర బృందం, మందీ మార్బలం, వ్యక్తిగత రక్షణ సిబ్బందీ, వారి ఆయుధాలూ వగైరాలతో వెల్తున్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి కాచుకు కూర్చున్న కొండా దంపతులు వరంగల్ జిల్లాలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వీరికి మాత్రం తమ యాత్రలకు అనుమతి కావాలి, అందులో ఏవయిన గొడవలు జరిగితే భాద్యత ప్రభుత్వానిదీ, తెలంగాణా వాదులదీ కానీ విరిది కాదు.

మరి ఇంత మంది గుమి గూడి ఊరేగింపుగా వెల్లడానికి అనుకూలమయిన పరిస్థితులు వరంగల్ జిల్లాలో లేనే లేవు. తెలంగాణా ఉద్యమానికి ఆయువు పట్టయిన వరంగల్, నల్గొండా, కరీం నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాలలో సీమాంధ్ర నాయకులు నిరశన జ్వాలలు ఎదుర్కోక తప్పదు.

కేసీఆర్ నిరాహార దీక్ష చేసుకునే హక్కును బలవంతంగా కాలరాసి ముందస్తు అరెస్టు చేసి ఖమ్మం సెంట్రల్ జైలుకి తరలించిన ఈ ప్రభుత్వం జగన్ అరెస్టుకు ఎందుకు ఘర్షణలు చెలెరేగే దాకా ఆగినట్లు? శాంతిభద్రతలను కాపాడవలసిన హోం మినిష్టరు వ్యక్తిగత హోదాలో రాయబారాలు ఎందుకు చేసినట్లు?

తమ హక్కును కాలరాశారని మొసలి ఏడుపులు ఏడ్చే ఈ జగన్, సురేఖలు తమ తమ నియోజక వర్గాలలో ఆటవిక పాలన కొనసాగిస్తూ, సమాంతర ప్రభుత్వాలను నడిపిస్తూ ఇతర పార్టీ నాయకుల ప్రచారాన్ని అడ్డుకోవడం వాస్తవం కాదా?

ఇక అక్కడ నిజంగా తెలంగాణా వాదులు రాళ్ళు విసిరి రెచ్చగొట్టారా, లేక జగన్ వర్గీయులే ముందు రాళ్ళు వేసి కవ్వించారా అనేది మనకు తెలియని విషయం. విచిత్రంగా అక్కడ గాయపడిన వారంతా విద్యార్థులే. ఒక్క జగన్ యువసైనికుడు కానీ, కాంగ్రేస్ కార్యకర్త గానీ గాయపడలేదు. కాల్పులు జరిపింది రక్షణ సిబ్బంది మాత్రమే కాదు కొండా మురళి , మరియూ అతని అనుచరులు కూడా అనేది బహిరంగ రహస్యం.

ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఎలాగయినా విద్వేషాలు రెచ్చగొట్టి రోశయ్య ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం జగన్ వ్యూహం కాగా, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారనే పీవీ సూత్రం రోశయ్య చాణక్య నీతిలాగుంది. తమ స్వార్ధం కోసం టీఆరెస్ నాయకులతో సహా అంతా పంతాలకు పోతే పావులుగా మారి ప్రాణాలమీదికి తెచ్చుకుంది మాత్రం పేద విద్యార్థులే.

14 comments:

 1. మీ విచక్షణకు నా ప్రగాఢ సానుభూతి.

  ReplyDelete
 2. జగన్ హక్కుల గురించి మాట్లాడుతున్న సదరు వ్యక్తి తెలుగు దేశం అభిమాని. జగన్ తాను సమైక్యవాదినని చెప్పుకోవడం వల్ల అతనికి జగన్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది.

  ReplyDelete
 3. అసలు జగన్ స్థాయి ఏమిటి?? జగన్ ఒక ఉద్యమాన్ని నీరుగార్చేంత గొప్పవాడా??? తండ్రి పేరు చెప్పుకుని మొన్న ఎలక్షన్లలో గెలిచాడు తప్ప సొంతంగా ఏమైనా చెయ్యగలిగే దృశ్యం లేదు.. ఇలాంటివాడి యాత్రకు లేనిపోని అర్థాలు అంట గట్టి ఆ యాత్రను తెలంగాణాలో జరగనివ్వమని అనడం తాలిబానిజం తప్ప మరొకటి కాదు.. అంటే తమ మాటకు తాన తందాన అనని వారి మీద రాళ్ళదాడి తప్పదా??
  రోజుకు కొన్ని వేల మంది సీమాంధ్ర ప్రజలు తెలంగాణా జిల్లాల్లో రకరకాల కారణాలతో తిరుగుతూ ఉంటారు.. వారిని కూడా అడ్డుకుంటారా?? ఆ విద్యార్ధి నాయకులు హై. నుంచీ ఇంటికి పోతే వెనక్కు రానీమని ఎప్పుడో(జనవరిలో అనుకుంటా) బెదిరించారు లెండి..
  utter selfishness of all the parties is clearly manifested. everybody tried to get political mileage and as usual its the common people who are suffering..

  ReplyDelete
 4. పిడకలవేట, ఎక్కడ ఉద్యమాలు జరుగుతున్నా పోలీసుల మీదికి రువ్వడానికి రాళ్ళు ఎలా వస్తాయి?? కాశ్మీర్ నుంచీ కన్యాకుమారి వరకు ఎక్కడైనా ఇది మాత్రం కామన్. నేను మా ఊర్లో జరిగినవి కొన్ని చూశాను.. ఆ ఏరియాలో ముందెప్పుడూ రాళ్ళే ఉండవ్ కానీ ఆ రోజుకు మాత్రం రాళ్ళు చేరుతూ ఉంటాయి. ఇది నాకసలు అర్థం కాని విషయం.

  ReplyDelete
 5. >> సమాంతర ప్రభుత్వాలను నడిపిస్తూ ఇతర పార్టీ
  >> నాయకుల ప్రచారాన్ని అడ్డుకోవడం వాస్తవం కాదా?

  (forget about the veracity of the claims you made)
  మీ వాదన ఎలా వుందంటే, వంద మంది మర్డర్లు చెశారు, కాబట్టి నేను చేస్తే తప్పుకాదు అన్నట్టు వుంది.


  >> పావులుగా మారి ప్రాణాలమీదికి తెచ్చుకుంది మాత్రం
  >> పేద విద్యార్థులే.

  ఇది పరమ అసంబద్ధమైన రాజకీయ ప్రేలాపన!
  గొడవకి వెళ్తే దెబ్బలు తగులుతాయి అని పేద విద్యార్థులకి తెలియదా?
  (forget about, who mobilised them to the troubled spot & on what promises)

  ReplyDelete
 6. జగన్ ఉప ఎన్నికలు తరువాత ఓదార్పు యాత్ర చేస్తాడట. మరి కొన్ని సహజ మరణాలు గుండె పోటు మరణాలుగా వార్తలకెక్కుతాయి.

  ReplyDelete
 7. కార్తీక్ గారూ,

  జగన్‌కు ఎంత దృష్యం ఉందో మనకు ఇంకా తెలియదు, కానీ జగన్ వద్ద తండ్రి అధికారం ద్వార సంపాదించిన అపారమైన సంపద, తండ్రి ఎంచుకొని టికెట్లు ఇవ్వడం, ప్రమోట్ చెయ్యడం వల్ల గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీటి రెంటి ద్వారా ఇప్పుడు జగన్ రాష్ట్ర రాజకీయాలని శసించే స్థాయిలో ఉన్నాడు. అతని యాత్ర సక్సెస్ అయితే తెలంగాణా ఉద్యమం గురించి తప్పుడు సంకేతాలు వెల్తాయని తెలంగాణా వాదుల భయం.

  ఇక తాలిబానిజం గురించి, యాత్ర చెయ్యడానికి జగంకి ఎలా హక్కు ఉందో నిరశన తెలియజేసే హక్కు వారికీ ఉంది. ఎలాగైతే అనుమతి లేకుండానే జగన్ వర్గం యాత్ర కొనసాగించిందో అలాగే అనుమతి లేకున్నా అక్కడ వేలమంది విద్యార్థులు నిరశన తెలపడానికి వచ్చారు. అందులో మనం వారిని తప్పు పట్టలేము. వారిని కవ్వించింది గన్‌మెన్లు తోడు ఉన్నారనే గర్వంతో కాంగ్రేస్ కార్యకర్తలే, వారు కూడా బయటినుండి వచ్చినవారే అనేది తెలంగాణా వాదుల వాదన.

  WitReal
  నేనిక్కడ తెరాస బెదిరంపును సమర్ధించడం లేదు. అయితే జగన్‌కు ఎక్కడ నయినా వెళ్ళే హక్కు ఉన్నది అని వాదించేవారికి సాధారణంగా వెళ్లడానికీ, మందీ మార్బలంతో బలప్రదర్శన చెయ్యడానికీ తేడా చూపించడమే నా ఉద్దేషం. అలాగే ఉడుకు రక్తంతో పోరాడటం వలన పొయ్యేది ఏమీ లేదు, ప్రాణాలు తప్ప అని భ్రమ పడే విద్యార్థులని తర్ఫీదు పొందిన కిరాయి గూండాలతో పోల్చడం ఎత్తి చూపుతున్నాను.

  ReplyDelete
 8. Satyanveshi's comment is more realistic than others

  ReplyDelete
 9. Whatever the motive of Jagan is, the basis for TRS's opposition is not legal. A civil society should not appreciate that.

  Next, why should a vidyarthi fight? I assume vidyarthi is there to learn at a school. Even if he is 30+ aged pea brained, ఉడుకు రక్తం JAC candidate, he is supposed to study. Not to run around.

  ReplyDelete
 10. A bunch of people who are throwing stones so indiscriminately cannot be sympathized.. by the civil society. If they have a grievance we can understand that.

  But none of the so called leaders and intellectuals are condemning that behavior (Throwing stones as a method of protest in 2010 AD) while not mincing words about criticizing others...Come on folks shed the hypocrisy..

  ReplyDelete
 11. 2010 AD లో రాళ్ళు వేసి నిరసన తెలిపే వాళ్ళు అమాయక విద్యార్థులైతే, పాపం వోట్ల కోసం దారుణమైన రాజకీయాలు చేసే వాళ్ళు అమాయక నాయకులు. మనమంతా చాలా చాలా అమాయకులం.

  ReplyDelete
 12. వీకెండ్ పొలిటీషియన్ గారూ,

  అక్కడ గుమి కూడింది a bunch of hooligans కాదు,paid party workers కాదు, రెండు వేలమంది విద్యార్థులు, భావి భారత భవిష్యత్ నిర్దేషకులు. కొందరు నాయకులు తమ స్వార్ధం కోసం పిలుపునిస్తే రెండువేల మంది విద్యార్థులు పోగయ్యారంటే మన సమాజంలోనే మౌలిక లోపం ఉన్నట్లు. ఈ మౌలిక లోపం తీరనంతవరకూ 2010 అయిన, 2030 అయినా ఇలాగే ఉంటుంది.

  ప్రస్తుత విషయానికి వస్తే యాత్ర చెయ్యడానికి జగన్‌కి హక్కు ఉన్నట్లే నిరశన తెలిపే హక్కూ తెలంగాణా వాదులకూ ఉంటుంది. నిరశన్ ధ్వనులు వినిపిస్తే జగన్ పెద్దరికం తగ్గిపోతుందని పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తుండగా జగన్ యువసేన పెయిడ్ వర్కర్స్ విద్యార్థులను తరమడం కారణంగానే విద్యార్థులు రాళ్ళు విసిరారన్నిది తెరాస వాదన.

  ReplyDelete
 13. ఎవడో పనికిమాలినోడు వసున్నాడు అంటే, అంతకంటే పనికిమాలిన దొర & కంపెనీ రమ్మంటే వచ్చి రాళ్లేసె వాళ్లు మీకు "భావి భారత భవిష్యత్ నిర్దేషకులు", భేష్ మా బాగా చెప్పారు.

  మౌలిక లోపం తీరనంతవరకూ 2010 అయిన, 2030 అయినా ఇలాగే ఉంటుంది. "
  ఆ లోపం తీరాలంటే ఏమి చేయాలంటారు, దొర కూతురుకు, కొడుకుకూ, అల్లుడు కు కూడా కాలమొక్కుతునాం 2010 లో, ఇంకెతమందికి కాల్మొక్కితే లోపం తీరుతుందో చెప్తారా?

  ReplyDelete
 14. సత్యాన్వేషి గారూ,

  "అక్కడ గుమి కూడింది a bunch of hooligans కాదు,paid party workers కాదు, రెండు వేలమంది విద్యార్థులు, భావి భారత భవిష్యత్ నిర్దేషకులు."

  ఔరా ! కటకటా !
  భావి భారత భవిష్యత్ నిర్దేశకులు, స్వార్ధపరుల పిలుపు మేరకు భవిష్యత్తు నిర్మాణానికి తలో నాలుగు బండలు(రాళ్ళు) విసురుతున్నారన్నమాట!
  భేష్!
  నాలుగు రాళ్ళు వెనెకేసుకొనే స్వార్ధపరుల్లాగా కాకుండా నిస్వార్ధం గా పెద్ద పెద్ద బండలు ముందుకి విసురుతున్నారన్నమాట!

  Humor and sattire intended....

  ReplyDelete