Saturday, 18 September 2010

దశ-దిశలో కన్నీరు తెపించే దుశ్చర్ల సత్యనారాయణ ప్రసంగం





17 comments:

  1. Satynarayana garu made excellent case for telengana. his speech made all the audience enjoy. Did not make them weep as you said. perhaps Sri Satyanarayna best speaker. KCR stands next to him in public speaking.

    ReplyDelete
  2. ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంది, చాలా మంది అస్సలు పట్టించుకోనిది, అసలు నాగార్జున సాగర్ ప్లాన్ ఎందుఉ మార్చబడింది, శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి నీరు తెలంగాణాకు ఎందుకు రావటం లేదు?
    మొదటిదానికి సమాధానం, నెహ్రూ గారి బడ్జెట్ లో అసలు నాగార్జున సాగర్ కు నిధులు కేటాయించలేదు, ప్రభుత్వాలు చేతులెత్తేసిన సందర్భంలో ముక్త్యాల సంస్థానం రాజు, ఆ ప్రాజెక్ట్ కు నిధి సమకూర్చారు, అందువల్లనే లోటుతో కూడుకుని వున్న బడ్జెట్ వల్ల మాత్రమే ప్లాన్ మార్చబడింది.
    ఇక శ్రీశైలం అంటారా , మీరు ఆకాశం వైపు ఉమ్మి ఊస్తే అది భూమికి పడుతుందా లేక ఆకాశానికి పోతుందా, అలాగే, నీరు ఊడాను, తెలంగాణా వైపుకి మళ్ళించటం సాధ్యం కాకనే వాటిని, ఆంధ్ర వైపుకు తరలించారు, వీటి వల్ల ఆంధ్రకు మేలు కన్నా హానే ఎకువ, వరదల బెడద చాలా ఎకువైంది.

    ReplyDelete
  3. @రహ్మానుద్దీన్ షేక్

    శైలం నీరు ఆకశంలోనుంచి ఊడి పడడం లేదు, కుడి ఎడమగట్టు ఎంత ఎత్తులో ఉందో ఎడమగట్టు అంతే, కావలసిందల్లా ఒక చిన్న సొరంగం. వెలిగొండలో 18 కిలో మీటర్ల సొరంగాన్ని ఆఘమేఘాలమీద తొలచగా ఎడమ గట్టుకు అది అసాధ్యం కాదు. సాగర్ ఎడమగట్టుకూ, శ్రీరాంసాగర్ ఫేస్-2కు ఎన్నటికీ మోక్షం లేదు. ఇక ఎవడు నిధులిస్తే వాడి ఇంటి దగ్గర ప్రాజెక్టులుండవు, ప్రాంతాలమధ్య వాటా ఆధారంగా ఉండాలి.


    కుంటిసాకులు ఎన్నయినా చెప్పవచ్చు, కానీ నెట్ రిజల్ట్ ఏమిటంటే సమైఖ్యాంధ్రలో తెలంగాణా తమ న్యాయమయిన వాటాను కోల్పోయింది. విడిపోతే తప్ప తెలంగాణా తిరిగి క్రిష్ణా జలాలపై హక్కును నిలుపుకోలేదు.

    ReplyDelete
  4. So, what you need is SORANGAM, not state, right. Ok, noted. :)

    Be focused, know what you want and fight for it with your irri.minister Ponnala and ask him to resign, if he can't.

    ReplyDelete
  5. ఓహో మీరుకుడా సత్యా"వేషణ" చేస్తున్నారా..బాగా చెయ్యండి.
    ఎడమగట్టుకు సొరంగం ఎందుకు త్రవ్వలేము, కాకపొతే, ఏముంది, చక్కగా పంపులు అవి పెట్టి తెలంగాణ మొత్తం పంపొచ్చు.. మరీ అతిగా తవ్వితే, ప్రాజెస్ట్ పొతుంది, ఆ ఏముందిలే..

    ReplyDelete
  6. @snkr

    గొప్ప సలహా ఇచ్చావు సోదరా, పాపం ఇన్నాళ్ళూ ఎవరికీ తట్టినట్లు లేదు. కామెంటే ముందు ఒక్కసారి వీడియో చూడు, సొరంగం కోసం ముప్పై ఏళ్ళు కళ్ళు అరిగేలా తిరిగితే మిగిలిందేమిటో.పోనీలేలే కర్నూలు జనంలా అర్ధరాత్రి వెళ్ళి తూములు బద్దలు కొడదామంటె ఫాక్షన్ రాజకీయాలు తెలియవాయె, పోనీ లగడప్పాటి లాగ డాబ్బు వెదజల్లుదామంటే ఇక్కడ అదికూడా లేకపాయె.

    అసలే నీరు లేక గొంతెండిన జనం, ఒకసారి శ్రీశైలం ఎడమగట్టు, ఇంఖొసారీ సాగర్ ఎడమ గట్టు, శ్రీరాం శాగర్ ఎక్స్టేన్షన్ ఇలా ఇన్ని ఉద్యమాలు చేసి అలసిపోయారు, ఇక మిగిలింది తెలంగాణా సాధనే.

    ReplyDelete
  7. >>మారి దానికి పెట్టవలసిన ఖర్చు? తరువాత మారి దాన్ని మెయింటేయ్న్ చేయడానికి సరిపోయే వనరులు ఎక్కడినుంచి వస్తాయి

    ఎవరి సొమ్ముతో అనుమతులు లేని ప్రాజెక్టులకు కూడా వేలకోట్లు తగలేశారు? ఎక్కడి భూములను తెగనమ్మి ప్రాజెక్టులే కాకుండా కాలువలు తవ్వారు? గడచిన ఆరు సంవత్సరాలుగా జలయగ్నం పేరుతో ఎంత ఖర్చు చేశారు? మరి సొరంగం తవ్వడానికి ఇంకా టెక్నాలజీ సరిపోలేదా? శ్రీశైలం ఎడమకాలువ ఇస్తామని చెప్పి కుడి కాలువ, తెలుగు గంగలకు అనుమతులు పొందిన ప్రభుత్వానికి భాద్యత లేదా? అయినా ఉన్న ప్రాజెక్ట్ల గేట్లు బద్దలు కొడుతుంటే పట్టించుకోని వారు కొత్తకాలువలు తవ్వుతారా?

    ఇక త్రాగునీటికి వస్తే ఇంకుడు గుంతలు తవ్వినా, ఇంకే గుంతలు తవ్వినా వచ్చేది ఫ్లోరైడ్ నీరే.

    ఒకరు నీరు పల్లానికే వస్తాయంటారు, అక్కడికి తెలంగాణాకు క్రిష్నా నీరివ్వడం సాధ్యమే కాదన్నట్లు, దానికి సమాధానమిస్తే మరొకరు నీటికోసం ఉద్యమం చెయ్యమని ఉచిత సలహా ఇస్తారు, చివరికి అసలు నీరివ్వడం టెక్నికల్‌గా సాధ్యం కాదని మరొకరు అంటారు. ఇలా ఇప్పుడు బ్లాగర్లు కుంటిసాకులు చెబుతున్నట్లే యాభై సంవత్సరాలుగా ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి. ఇవి వినీ వినీ ప్రజలకి విసుగొచ్చింది.

    >>ప్రతిదీ ఎవరో వచ్చి, ఏదో చేస్తారని కాకుండా మీ చేతుల్లో ఉన్నవి చేసి, అవి కుదరకపోతే పోరాడినా అర్ధం ఉన్నది

    ఈ అభిజాత్యాం ఇక చాలు, వడ్డించేవాడు మనవాడయితే వెనుక వరసలో ఉన్నా అన్నీ దొరికినట్లు ప్రభుత్వం ఒక ప్రాంతానికి న్యాయంగా రావలసినా నీటి వాటాను ఇవ్వకుండా అంతా మరో ప్రాంతానికి తరలిస్తూ ఉంటే మధ్యలో ఈ ఉహిత సలహాలు వినే త్యాగబుద్ది మాకులేదు.

    ReplyDelete
  8. >>పోనీలేలే కర్నూలు జనంలా అర్ధరాత్రి వెళ్ళి తూములు బద్దలు కొడదామంటె ఫాక్షన్ రాజకీయాలు తెలియవాయె
    మీరిలా ప్రతీదానికి సీమప్రజలను కించప్రరుస్తూ మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.. చేతనైతే అర్థవంతమైన చర్చ చేయండి.. ఇలా దిగజారిన వ్యాఖ్యలు చేస్తుంటే మీకు జవాబివ్వలేమని అనుకోవద్దు.. గాయపడ్డ తెలంగాణా ప్రజలను ఇంకా విమర్శించడం సబబు కాదనే నేను సమ్యమనం పాటిస్తున్నాను.. ఈ విషప్రచారాలతోనే రాష్ట్రాన్ని మానసికంగా చీల్చారు.. చూద్దాం.. ఏం చివరకు ఏం సాధిస్తారో!!
    plz plz plz!! Dont test my patience with your derogatory remarks about people on the other side.. if you still want to play it that way go on, but do remember that it does no good to anyone..

    -Karthik

    ReplyDelete
  9. ఫ్లోరైడ్ నీళ్ళని గొంతు చించుకుంటున్నారుకదా.. నల్గొండ జిల్లకు అంతకంటే పెద్ద సమస్య మరొకటిలేదు..అవునా??
    ఒక మాట చెప్పండి, 1992 నుంచీ ఎంపీ ల్యాడ్స్ నిధులు ఉన్నాయి.. ఏడాదికి రెండుకోట్ల రూపాయలు ఎంపీలకు ఇస్తారు.. మరి ఇన్నేళ్ళల్లో ఎంత దాని నుంచీ ఖర్చుపెట్టారు?? ఖర్చుపెట్టడానికి ఎవరడ్డు పడ్డారు?? అవి పూర్తిగా ఎంపీల విచక్షణ మీదే ఆధార పడి ఉంటాయి..
    ఈ విషయంగా సమాచారా చట్టం నుంచీ సమాచారం పొందలేమా??
    తార గారు,
    సమాచార చట్టానికి ఆన్లైన్ అప్లికేషన్లు ఏమీలేవా??

    ReplyDelete
  10. కార్తిక్ ఇలాంటి వాళ్ళతో సక్రమైన చర్చ జరుగుతుందని నేను అనుకొను .... తుమ్మినా ..దగ్గిన రాయలసిమ అని ప్రాంతియ విద్వేశాలు రెచ్చగొడుతు ఉంటే నష్టం వాళ్ళకే తప్ప ఇతరులకు కాదు ...అయన ఇక్కడేదో కర్నులు తూములు బద్దలు కొట్టుకున్నారు అంటున్నారు ప్రభుత్వం తంతుల తరుపున సమయాికి నీళ్ళు ఇవ్వకుంటె కడుపు మండిన రైతు తిసుకున్న నిర్ణయం అది అప్పటికే వరుసుగా అయుదు సంవత్శరాలు నీళ్ళు ఇవ్వకపోతే తప్పని సమయంలో తిసుకున్న నిర్ణయం అది ...

    ReplyDelete
  11. గత ఆరు సంవత్సరాలుగా నలభయ్యారువేల కోట్ల రూపాయలు జలయజ్ఞం పేరుతో ఖర్చు పెట్టి కూడా దాహార్తి తో ఉన్న నల్లగొండకు మంచినీల్లిప్పించ లేక పోయారు. ఇది పాలక వర్గాలు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. పర్యవసానంగా ఎముకలు కుళ్ళి వేలాది మంది చిన్నారులు జీవచ్చవాలుగా పెరుగుతున్నారు.

    దీన్ని వదిలేసి రెండు కోట్ల రూపాయల ఎంపీలాడ్సు లెక్కలడుగుతున్నాడు పైనొక పెద్ద మనిషి! ఎంపీలాడ్సు నిధులతో ఎన్ని ఊళ్లకు డీ-ఫ్లోరిడేషను ప్లాంట్లు వస్తాయి? నిదుల్లేకుండా అవి ఎన్నాళ్ళు నిర్వహించ బడతాయి? వాటి నిర్వహణకు వాడవలసిన రసాయనాలను కొనడం ఖర్చుతో కూడుకున్న పని. క్షేత్రస్థాయిలో నిజాలు తెలుసుకో దలిచిన వారు ఒక సారి నార్కట్-పల్లి పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను దర్శించండి, ప్రజలు రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును ఎలా కోల్పోతున్నారో తెలుస్తుంది. అలాగే ఎన్ని డీ-ఫ్లోరిడేషన్ ప్లాంటులు జనాలు స్వొంతంగా నెలకొల్పుకున్నవి కూడా నిధులు లేక, నిర్వహణ లేక పాడుబడి పోయాయో కూడా తెలుస్తుంది.

    ఇక ఎంపీ లాడ్సు నిధులంటారా! అయ్యా, మీ ఆంధ్రా నాయకులెంత సుద్ద పూసలో, వీళ్ళూ అంతే. వాళ్ళూ, వీళ్ళూ ఒక తాను ముక్కలే. లక్ష కోట్ల బడ్జెటు పెట్టుకొని, వేలాది కోట్లు మూడో కారు స్థిరీకరించడానికోసం పోలవరం, పులిచింతల లాంటి ప్రాజెక్టులపై వెచ్చిస్తూ, మా తాగు నీటికోసం మాత్రం ఎంపీలాడ్స్ నిధులు వాడుకోమ్మని చెప్పడానికి నోరెలా వచ్చిందండీ?

    ReplyDelete
  12. @తార

    అయితే సొరంగం అయ్యే పని కాదని మీ ఆంధ్రా వారికి ముప్పై ఏళ్ళ క్రితమే తెలుసన్న మాట! అయినా తెలంగాణా వారిని అమాయకుల్ని చేసి బాగానే నమ్మబలికారు సొరంగం తొవ్వుతాం, నీటిలో సింహభాగం వాటా ఇస్తామని. ఇదొక్క కారణం చాలదూ, మీతో తెగతెంపులు చేసుకోవడానికి?

    ReplyDelete
  13. @అయితే సొరంగం అయ్యే పని కాదని మీ ఆంధ్రా వారికి ముప్పై ఏళ్ళ క్రితమే తెలుసన్న మాట!

    అంటే తెలంగాణాలో సివిల్ ఇంజనీర్లు ఎవరూ లేరాఅయ్యా, అది సాధ్యం అవుతుందో అవదో చెప్పడానికి?
    ఇదొక్కటి చాలదూ మీ వాదన ఎంత అర్ధరహితమో.

    ReplyDelete
  14. తెలంగాణా ఇంజనీర్లు ఉన్నారా లేరా, ఉంటే వారు వ్యతిరేకించారా లేదా అనే విషయాలు పక్కకు పెడదాం.

    సొరంగం ప్లానుతో డ్యాం మొదలు పెట్టారంటేనే అది సాధ్యమౌతుంది అని ప్రజలకి చెప్పే కదా చేశారు? ఇప్పుడు మీ వెర్షన్లో 'సాధ్యం' కానట్టైతే అది తెలంగాణా ప్రజలను మోసం చేయడమే కదా?

    ReplyDelete
  15. హరి,
    ఎంపీల్యడ్స్ నిధులనేవి ఉండేది ఎంపీల విచక్షణ మీద ఆధారపడి, అవసరం అనుకున్న పథకాలకు ఖర్చుపెట్టేందుకు.. సర్కారు ఎప్పుడో ఇస్తుంది అని వాళ్ళనూ వీళ్ళను తిడుతూ కూర్చునేదానికంటే తమ ప్రయత్నంగా ఎంపీల్యాడ్స్ నిధులను ఎందుకు ఉపయోగించలేదు?? ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం ఖర్చుతో కూడుకున్నదే అందులో ఎటువంటి అనుమానం లేదు.. ఎంపీల్యాడ్స్ నిధులు ఏ మూలకు సరిపోవు.. కానీ తాత్కాలిక పరిష్కారంగా అయినా ఆ నిధులు ఎందుకు వాడలేదు?? ఫ్లోరైడ్ సమస్య కంటే పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయా?? అసలు ఆ నిధులు ఎలా వాడారో తెలిస్తే ఈ విషయం మీద మరింత క్లారిటీ వస్తుంది..

    ఇక రాజకీయ చర్చకు వస్తే తెలంగాణా ప్రాంత ముఖ్యమంత్రుల కాలం లో దీని గురించి ఎందుకు ఏ చర్య తీసుకోలేదు?? ఆంధ్రా వాళ్ళు అడ్డుపడ్డారు అని చెప్పకండి.. టెక్నాలజీ సమస్యలా, నిధూల లేమీ సమస్యలా?? ఏది ఏమైనా, ఇంత ప్రమాదకరమైన సమస్యను ఇన్నాళ్ళుగా ఉపేక్షించడం ఒక సమాజం గా మనం తలదించుకోవాల్సిన విషయం.. అందులో కూడా ఆంధ్రా తెలంగాణ అంటూ విషం చిమ్మడం మరింత దారుణం..

    ReplyDelete
  16. @కార్తిక్

    నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య సగానికి పైగా జిల్లాలో గ్రామగ్రామాన ఉంది. ఎంపీల్యాడ్స్ పల్లు తోముకోవడానికి కూడా సరిపోవు, ఏదోలా అవతలి వారిపై తప్పును నెట్తడం మానేయండి. రెండు కోట్ల ఎంపీ ల్యాడ్స్ గురించి వివరాలు మీరు తెలుసుకోండి, అలాగే లక్ష కోట్ల రాష్ట్ర బడ్జెట్లో ఎంత ఖర్చులు పెట్టారో, ఎక్కడ ఎంత పెట్టారో, అందులో ఎంత సత్ఫలితాన్నించ్చిందో కూడా లెక్కలు తెలుసుకోండి, బాగుంటుంది. ఇప్పటికి ఈ టపాలో కుంటి సాకులు చాలా చెప్పారు, మీలాగే ప్రభుత్వం కూడా కుంటి సాకులు చెబుతూనే ఉంది, ఇంకా వినే ఓపిక జనాలకు లేదు.

    మహబూబ్నగర్కు నీరిచ్చే ఒక చిన్న ప్రాజెక్టును ఇప్పటికి మూడు సార్లు ధ్వంసం చేస్తే అది మీకు తప్పుగా తొచదు సరికదా, దానిని గురించి వ్రాయడమే తప్పన్నట్లు చెబుతున్నారు. ఇంకా మీతో అర్ధవంతంగా ఏం చర్చించమంటారు? ఒకచోట కొంతమంది చేసిన రౌడీఇజాన్ని ఎత్తిచూపినంతమాత్రాన మొత్తం రాయలసీమ ప్రజలను అన్నట్లు కాదు. రాయలసీమ సోదరులపై నాకెలాంటి ద్వేషం లేదు. న్యాయమయిన హక్కుల పోరాటం ఎక్కడయినా నేను సమర్ధిస్తాను, సోంపేటలోనయినా, కర్నూలులో నయినా లేక తెలంగాణాలో నయినా. అలాగే రౌడీ జులుం ఎక్కడ చేసినా ఖండిస్తాను, అది కొండా సురేఖ చేసినా, లేక బాలనాగిరెడ్డి చేసినా.

    విట్రేల్
    అధికారంలో ఉన్నవాడు తమ కీలు బొమ్మలను మంత్రులుగా చేసినంత కాలం మంత్రి ఎక్కడివాడయినా పెద్దగా తేడా ఉండదు.

    ReplyDelete
  17. >>నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య సగానికి పైగా జిల్లాలో గ్రామగ్రామాన ఉంది. ఎంపీల్యాడ్స్ పల్లు తోముకోవడానికి కూడా సరిపోవు, ఏదోలా అవతలి వారిపై తప్పును నెట్తడం మానేయండి. రెండు కోట్ల ఎంపీ ల్యాడ్స్ గురించి వివరాలు మీరు తెలుసుకోండి, అలాగే లక్ష కోట్ల రాష్ట్ర బడ్జెట్లో ఎంత ఖర్చులు పెట్టారో, ఎక్కడ ఎంత పెట్టారో, అందులో ఎంత సత్ఫలితాన్నించ్చిందో కూడా లెక్కలు తెలుసుకోండి, బాగుంటుంది.
    ఈ వాక్యంలో మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.. ఆ విశ్లేషణ ఐతే జరగాలి.. తెలంగాణ కోసమైనా కాకపొయినా, మన ప్రభుత్వం యొక్క ప్రియారిటీలు ఏమిటి అనే విషయమైనా అందరికీ తెలుస్తుంది.. ఇక ఫ్లోరైడ్ సమస్య గురించి వస్తే, మీ ప్రాంత నాయకులే ఆ సమస్యను గాలికొదిలేశారు ఇక ఆంధ్రా వాళ్ళను, సీమప్రజలను ఆడిపోసుకోవడం ఎందుకు? తెలంగాణ నుంచీ చాలామందే ముఖ్య మంత్రులుగా ఉన్నారు.. వాళ్ళ హయాం లో ఎందుకు జరగలేదు???

    ReplyDelete