Wednesday, 25 August 2010

"రహస్య గూఢాచారి aka కణిక నీతి" (డా విన్‌చీ కోడ్ కు స్వేచ్చానువాదం)

గోల్కొండ కోటలో తానీషా జైలు దగ్గర ఉండే వాచ్‌మన్ ఒకరోజు హఠాత్తుగా మరణిస్తాడు. ఎవరో అతన్ని తుపాకీతో కాల్చివేశారు. ఆ తరువాత బుల్లెట్ గాయంతో వాచ్‌మన్ 10 మీటర్లు నడిచి ఒక బురుజు దగ్గర హిందీ 'ర ' ఆకారంలో ముడుచుకుని ప్రాణం విడుస్తాడు. అప్పుడే ప్రఖ్యాత కుట్రకోణాల స్పెషలిస్టూ గోల్కొండ కోట చూడ్డానికి వస్తుంది. పోలీసులు ఆవిడే వాచ్‌మన్ను చంపిందేమో నని వెంబడిస్తారు.

ఆ తరువాత వరుసగా భీమోజి ఫిల్మ్ సిటీలో ఒక తోట మాలీ, తానియా గాంధీ సెక్యూరిటీ వాడూ, కిద్వానీకి అంట్లు తోమే వాడూ, టాటా కారు డ్రైవరూ అంతా ఒకేసారి హత్య కావించబడుతారు.

తనపై వచ్చిన నేరారోపణని తుడిచేయడం కోసం, ఈ నాలుగు హత్యల రహస్యం తెలుసుకోవడం కోసం హీరోయిన్ అయిన కుట్రకోణాల స్పెషలిస్టూ ప్రయత్నం చేస్తుంది. తన పరిశోధనలో తెలిసేదేమంటే భారత దేశం ఆర్ధిక, రాజకీయ, ఇతిహాసాలపై నాలుగు వందల సంవత్సరాలుగా ఒక మహా కుట్ర జరుగుతుంటుంది. ఈ కుట్ర ఒక కణిక వ్యవస్థ నడుపుతుంటుంది. వీరంతా ఒక నెట్ వర్క్ లాగా ఏర్పడి తరతరాలుగా ఈ రహస్యాన్ని తరువాతి తరాలకి అందిస్తూ ఉంటారు.

వీరి కుట్ర యొక్క రహస్యం ఇంకో రహస్య గ్రూపుకి తెలిసి ఉంటుంది. ఈ రెండో రహస్య గ్రూపు కణిక వ్యవస్థలో ఒక్కొక్కరి ఇంటిలో పని వారు గానూ, వాచ్మన్, కారు డ్రవరుల్లాగా ఉంటారు. కణిక వ్యవస్థ నాయకుడైన భీమోజీకి ఈ రహస్యం తెలిసి ఒక కాంట్రక్ట్ కిల్లర్ ద్వారా అందరినీ ఒకే సారి చంపేస్తాడు. ఇప్పుడు ఆ రహస్యం తెలిసిన వారంతా చనిపోయారు, మరి మన కధానాయకురాలు ఈ రహస్యాన్ని ఎలా చేదిస్తుంది?

ఈ రహస్యాలను తెలిసిన భీమోజీ పత్రికలోని ఒక రిపోర్టర్ చిన్న చిన్న క్లూలను మనకు అందిస్తూ ఉంటాడు. అవి న్యూస్ హెడ్డింగులు గానూ, కార్టూన్ల రూపంలోనూ, అంతర్యామి లాంటి కాలంలలోనూ కనిపిస్తూ ఉంటాయి.

మధ్యలో ఫ్లాష్ బాక్ లో హీరోయిన్ హీరో ల సంభాషణ ద్వారా తెలిసేదేమంటే ఈ కణిక నెట్‌వర్క్ ఇప్పుడు మొదలు కాలేదు, బ్రిటిషు వారు ఇండియాను ఆక్రమించుకోవడానికీ, ఇందిరా గంధీ, రాజీవ్ గాంధీ ల హత్యలకీ, 911 సంఘటనకీ అన్నింటికీ మూలం ఈ కణిక వ్యవస్థే. త్వరలో విడుదల, గొప్ప అద్భుత థ్రిల్లర్.

20 comments:

 1. Please moderate ur comments on TOP PRIORITY. :D

  ReplyDelete
 2. confused :/

  parody to any blog ???

  ReplyDelete
 3. మీరు కూడా భీమొజి ఏజెంట్ కావొచ్చుగా.అందుకే ఈ పొస్ట్ రాసారు.

  ReplyDelete
 4. సుజాత గారికి,

  ఫరవాలేదు లెండి.

  జ్యోతి:

  నేను కూడా ఏజంట్ కావచ్చు. అంతా కణిక మాయ.

  క్రిష్ణ,

  అయితే మీకు తెలుగు బ్లాగుల్లో అతిపెద్ద కాన్స్పిరసీ థీరీ తెలియదన్నమాట.

  ReplyDelete
 5. హ హ హ మాస్టారూ పేరడీ బావుంది :)

  ReplyDelete
 6. సౌమ్య

  ధన్యవాదాలు.

  ReplyDelete
 7. నాకు తెలుసుగా...!!

  ReplyDelete
 8. వీకెండ్ పొలిటీషియన్‌కూ, హరి దోర్నాలకూ ధన్యవాదాలు.

  నాగర్జున,

  మీక్కూడా తెలిసిపోయిందా? :)

  ReplyDelete
 9. డిటెక్టివ్ సినిమాలకు సరిపోయే కధలా ఉంది, ఒక్కసారి వర్మ ని కలవకపోయారా?

  ReplyDelete
 10. పానీపూరి

  సినిమా తియ్యొచ్చు కానీ కధ మొత్తం నాది కాదులెండి, డాన్ బ్రౌన్‌తో పాటు మరొకరివద్ద కూడా అనుమతి తీసుకోవాలి.

  ReplyDelete
 11. > మరొకరివద్ద
  పేరు చెప్పలేదు? :-)

  ReplyDelete
 12. ఇలా పేరడి లు రాసే బదులు... అ సత్యమేదో మీరే అన్వేషించి చెప్తే మేము కూడా నిజ నిజాలు తెలుసుకుంటాము కదా.

  ReplyDelete
 13. చాల మంచి ప్రయత్నం (good Try). కాని మాతృక కన్న ఎక్కువ నవ్వు రాలేదు కాబట్టి ఇంకొంచం ప్రయత్నిచండి

  ReplyDelete
 14. @beekay

  ఇది కామెడీ కధకి థ్రిల్లర్ పారొడీ. మాతృకను మించి నవ్వు తెప్పించడం నా వల్ల కాదు.

  ReplyDelete
 15. కత్తి గారు, మీ మీద పారడి రాస్తే అంతగా బాధపడిన మీరు ఇప్పుడు ఇంకొకళ్ళ మీద పారడి కి స్మైలీ లు పెడుతున్నారే?

  ReplyDelete
 16. హహ్హహ్హా! :) బాగుందండి పేరడీ.

  అంతా సరిపోయింది గానీ, ఒక్క విషయంలో మాత్రం అతకలేదండీ.. ఒక నాలుగైదొందల టపాల తరవాత కూడా అర్థం కాకూడని విషయాలను మీరు ఒక్క టపాలోనే తెలిసిపోయేట్టుగా రాసేసారు. అక్కడ దెబ్బ తినేసారు.

  ReplyDelete
 17. సత్యాన్వేషి గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు

  హారం

  ReplyDelete