కేసీఆర్ గారూ, ఒకపక్క ఉద్యమం ఊపుమీద నడుస్తున్న సమయంలో తాబేలు లాగా అగ్నాతంలోకి వెల్లి చండీయాగం అంటూ తంతులతో కాలక్షేపం చేసింది చాలక పైగా ఆంధ్రా బ్రహ్మలకు నిష్ట తక్కువ, తెలంగాణా బ్రహ్మణులకు నిష్ట ఎక్కువ అంటూ అవాకులు పేలడం దేనికోసం? ఏం, తెలంగాణా అర్చకులు నిష్టతో చదివితే చింతకాయలేమన్నా రాలుతున్నాయా, ఆచింతకాయలతో తెలంగాణా సాధిస్తారా?
ఒకపక్క విమలక్క ధైర్యంగా వెల్లి లగడపాటి లాంకో హిల్స్‌లో జెండాలు పాతితే, మీరేమో ఇంట్లో కూర్చుని యాగాలు చేస్తారు కానీ కబ్జా భూములగురించి మాట్లాడరు. మాట్లాడ్డానికి ఇప్పుడు తెలంగాణాలో సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఒక శ్రీక్రిష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయం గురించో, ఒక 177జీవో గురించో, కబ్జాకు గురవుతున్న భూముల గురించో మాట్లాడక ఎందుకు ఈ బ్రాహ్మల సంగతి? మీరు మంచి వక్త. ఏ విషయాన్ని ఎత్తుకున్నా అనర్గళంగా మాట్లాడగలరు. నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగూ, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషలన్నింటిలో అణర్గళంగా మాట్లాడగలిగేది మీరొక్కరే. అలాగే మాట్లాడేప్పుడు ముక్కుసూటిగా విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలిగేదీ, వాదనకు కావలిసిన పాయింట్లను చటుక్కున పట్టుకోగలిగేదీ ఇంకెవరూ లేరు. మరి ఎందుకు ఇలా అనవసర విషయాలపై మాట్లాడి నాలుక కరుచుకునేది? బిర్యానీ గురించీ, అర్చకుల గురించీ వదిలేసి విషయం చూడండి.
No comments:
Post a Comment