Sunday, 10 January 2010

చిరంజీవి అమెరికా, రష్యాల వాదన


ఈ మధ్యన చిరంజీవి సమైఖ్య వాదం గురించి చెబుతూ తరుచుగా అమెరికా, రష్యా, జెర్మనీల గురించి జనాలను ఊదరగొదుతున్నాడు. బహుషా మాట్లాడ్డానికి పాయింటులు ఏమీ దొరక్క ఆలోచిస్తుంటే అల్లు అరవిందో, మరొకడో చెప్పి ఉంటాడీ అమెరికా, సోవిఎట్ రష్యా ల ఉదాహరణ. తనకు వాటిపై ఏమాత్రం అవగాహన లేకున్నా మీడియా ముందర వాటినే ఊదరగొడుతున్నాడు.

చిరంజీవి చెప్పేదేమంటే, యునైటెడ్ స్తేట్స్ గా కలిసి ఉండడం వల్ల అమెరికా అభివ్రుద్ధి చెందింది, కానీ విడిపోవడం వల్ల సోవిఎట్ రష్యా భాగస్వామ్య దేశాలు అభివ్రుద్ధి చెందడం లేదని.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే అప్పుడు అది మాత్రం యునైటెడ్ ఇండియాలో భాగం కాదా? తెలంగాణా వాల్లు ఏమైనా ఈ దేశం నుండి విడిపోతామని అంటున్నారా? అసలు అమెరికా ఉదాహరణే తీసుకుంటే ఇరవై కోట్ల జనాభా ఉన్న అమెరికాలో యాభై రాష్ట్రాలు ఉండగా వంద కోట్ల జనాభా ఉన్న మనదేశంలో మరో కొత్త రాష్ట్రానికి స్థానం లేదా?

అమెరికా ఒక ఫెడరల్ రిపబ్లిక్. అక్కడ రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉంటాయి, ఎక్కువ ఆదాయం ఉంటుంది. ఆదాయపు, అమ్మకపు పన్నుల్లో రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఉంటుంది. మన దేశంలో రాష్ట్రాలకు ఉండే అధికారాలు చాల పరిమితం. ప్రతి చిన్న విషయానికీ కేంద్రందగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు మనం అమెరికా ఉదాహరణ తీసుకోవాలంటే ఇంకా ఎక్కువ రాష్ట్రాలను ఏర్పాటు చేసి, ఎక్కువ అధికారాలను రాష్ట్రాలకు బదిలీ చెయ్యాలి. కానీ ఈయన ఏంటి, అమెరికాను చూసి సమైఖ్యంగా ఉండడం నేర్చుకుందామంటాడు మరి?

ఇక సోవిఎట్ రష్యా విషయానికి వస్తే, సోవిఎట్ రష్యాలో అంతర్భాగమైన రిపుబ్లిక్లన్నీ బలవంతంగానే సోవిఎట్ రష్యాతో కలిసి ఉన్నాయి, కానీ వాల్లెప్పుడూ స్వతంత్రంగా ఉండడానికే మక్కువ చూపారు. ఇప్పుడు ఈయన చెప్పిన సిద్ధాంతం వినిపించి పాత సోవిఎట్ అంతర్భాగ రిపబ్లిక్లని రష్యా తో కలవమంటే వాల్లు ఇష్టపడతారా? ఇకపోతే ఉత్పత్తిలో గానీ, జీవన ప్రమాణాల్లోగానీ ఆ దేశాలు అప్పటికంటే ఇప్పుడు వెనుకపడ్డయనడానికి చిరంజీవి దగ్గర ఆధారాలు ఎమైనా ఉన్నాయా? అప్పటి కమ్యూనిస్టు నియంత్రిత మీడియా ఇచ్చిన ప్రమాణాలనే వాస్తవాలుగా తీసుకుంటే ఎలా?

ఇలాంటి ప్రపంచ విషయాలపై ఏమాత్రం అవగాహన లేని నాయకులని మనం నేతలుగా ఎన్నుకుంటే సమైఖ్యంగా ఉన్నా విడిపోయినా మన దేస్శం ఎన్నటికీ అభివ్రుద్ధి చెందదు మరి.

12 comments:

 1. Hello Friend, no matter what these politicians say, division of the state is tied to the future of the everybody in Andhra Pradesh. It's should not be done at the instance of the some minority. Politicians in Andhra are as dirty as politicians in Telangana(for that matter any place). Chiranjevi is a politician in a hurry, because he lost a chance at power once. If only you are willing to look at the otherside of the coin, most of the conflicts can be resolved.

  ReplyDelete
 2. మీకు చాలా నాలెడ్జి వుందండి బాబు.. బహుశ ఛిరంజీవి అమెరికా నుండి ఒకప్పుడు విడిపొదామనుకున్న దక్షినాది రాస్ట్రాల పొరాటం గురించి ఎందుకు అనుకోరు..

  ReplyDelete
 3. మీ వాదన మరీ బాగుందండి. తెలంగాణా వాళ్ళేమీ ఈ దేశం నుంచి విడిపోతామనత్లేదు, ఈ దేశంలోనే ఒక రాష్ట్రంగా ఉంటమంటున్నారు. ఇదేం ఇండియా, పాకిస్తాన్ లలాగ దేశవిభజన కాదు. దక్షిన అమెరికా రాష్ట్రాలలాగ సివిల్ వార్ కాదు.

  ReplyDelete
 4. Somebody told me the area of united states is 3 times of India and population is one third of India. How can we find out from this data, how many states India could reasonably have?

  ReplyDelete
 5. మీరు కాస్త అబ్రకదబ్ర గారి లెటెస్ట్ పొస్ట్లు చదవచ్చు కదా..

  ReplyDelete
 6. తెలంగాణాకీ, సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన దేశాలకీ మధ్య పోలిక అనవసరం. ఎందుకంటే సోవియట్ యూనియన్ నుంచి విడిపోయినవి వేర్వేరు జాతులు, వేర్వేరు సంస్కృతులకి చెందిన వర్గాలు. http://blogzine.sahityaavalokanam.gen.in/2010/01/blog-post_11.html

  ReplyDelete
 7. Well said !!!

  So far, I have not seen a single compelling reason to have Andhra people stay united with Telangana.

  ReplyDelete
 8. కుంభకర్ణ గారు..
  నేను తెలంగాణా వాదులని ఈ క్రింది ప్రశ్నలను 2-3 వారాలుగా అడుగుతున్నాను.. ఎవరూ జవాబు చెప్పలేదు.. కనీసం మీరైనా జవాబు చెప్పండి..

  కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు:
  కేంద్ర మంత్రిగా ఉన్న కే.సి.ఆర్. తెలంగాణ కు ఏమి చేశాడు??
  ఇప్పటి దాకా నల్గొండ ఎం.పీ. లుగా ఉన్న వారు ఫ్లోరైడ్ సమస్య గురించి ఎంత ఖర్చుపెట్టారు?? ఎం.పీ. ల్యాడ్స్ నిధులు పూర్తిగా ఆ ఎం.పీ. విచక్షణ మీద ఆధారపడి ఉంటాయి.. అవి ఖర్చుపెట్టడానికి ఆంధ్రా వాళ్ళు ఎలా అడ్డు తగిలారు??
  బీడీల పై పుర్రె గుర్తుకు కే.సీ.ఆర్. మంత్రిగా ఎందుకు అడ్డు చెప్పలేదు??

  ReplyDelete
 9. 1. తెలంగాణా అంటే కేసీఆర్ కాదు.
  2. తెలియదు
  3. ఎందుకు అభ్యంతరం చెప్పాలి అసలు ఎవరైనా? బీడీలు తాగి జనాల్లు చస్తే తెలంగాణా బాగుపదుతుందా?

  ReplyDelete
 10. మీరు ఒక పని చెస్తే చాల బాగుంటుంది అనుకుంటున్నను. తెలంగాఆణా లొ ఉన్న సమస్యలనీ ఒక టాపా లాగ రాయండి, దెబ్బకి అసలు సంగతి ఎమిటొ తెలిపొతుంది.

  ReplyDelete
 11. కేంద్ర మంత్రిగా ఉన్న కే.సి.ఆర్. తెలంగాణ కు ఏమి చేశాడు??
  తెలంగాణా అంటే కేసీఆర్ కాదు.
  తెలంగాణ అంటే కే.సి.ఆర్. కాదు కాని కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఏమైనా మంచి పనులు చెయ్యటానికి ఎవరూ అడ్డం పడలేదు కదా! అప్పుడు సైలెంటు గా ఉండి ఇప్పుడు ఎందుకు ఇంత రాద్దాంతం ఎందుకు చేయటం??

  ఇప్పటి దాకా నల్గొండ ఎం.పీ. లుగా ఉన్న వారు ఫ్లోరైడ్ సమస్య గురించి ఎంత ఖర్చుపెట్టారు?? ఎం.పీ. ల్యాడ్స్ నిధులు పూర్తిగా ఆ ఎం.పీ. విచక్షణ మీద ఆధారపడి ఉంటాయి.. అవి ఖర్చుపెట్టడానికి ఆంధ్రా వాళ్ళు ఎలా అడ్డు తగిలారు??
  తెలియదు
  can you try to get this info through RTI act? i think it costs only Rs 15. Dont you think this info will be a metric for the commitment of nalgonda leaders for solving the burning problem?

  బీడీల పై పుర్రె గుర్తుకు కే.సీ.ఆర్. మంత్రిగా ఎందుకు అడ్డు చెప్పలేదు??
  ఎందుకు అభ్యంతరం చెప్పాలి అసలు ఎవరైనా? బీడీలు తాగి జనాల్లు చస్తే తెలంగాణా బాగుపదుతుందా?

  మరి కరీం నగర్ ఎలక్షన్లప్పుడు ఎందుకు పుర్రె గుర్తుకు వ్యతిరేకంగా మాట్లాడాడు?? ఇది దిగజారుడు తనం కాక మరేమిటి?

  ReplyDelete
 12. కేంద్ర మంత్రి గా ఉన్నవాడు దేశం మొత్తానికి మంత్రి, ఒక్క తెలంగాణాకి కాదు. ఒక మంత్రి తన ప్రాంతానికి మాత్రం మంచి చేసుకోవడం అనైతికం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివ్రుద్ధి చేస్యడం ముఖ్య మంత్రి, రాష్ట్ర మంత్రి వర్గం పని.

  ఇక ఎంపీ లాడ్స్ గురించి...రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో ఎంపీ లాడ్స్ ఎన్ని వచ్చాయి, ఎలా ఖర్చు చేసారో చెప్పండి. తెలంగాణా ఎంపీలు మాత్రం న్యాయంగా ఉండాలి అనుకోవడం తప్పు. అవినీతి తెలంగాణా ఎంపీలలో, అంధ్రా ఎంపీలలో, మగతా రాష్ట్రాల ఎంపీలలో అంతటా ఉంది. రాష్ట్ర పాలనాధికారం తెలంగాణా నేతల వద్ద లేకపోవడం వల్ల ఈ ప్రాంతం అభివ్రుద్ధికి నోచుకోలేదు.

  ఇక బీడీలపై పుర్రె గుర్తు.. మీరది కావాలని అంటున్నారా, వద్దని అంటున్నార నాకర్ధం కాలేదు. తెలంగాణా విషయంపై పూటకో మాట మార్చే రాజకీయాల మధ్య ఈ పుర్రె గుర్తుపై మాట మార్చడం ఒక లెక్కా?

  ReplyDelete