తెలంగాణా ఉద్యమాన్ని, తెలంగాణా కోరుకునేవారిని కించపరచడానికి తరుచుగా మీడియా, కొందరు సీమాంధ్రా నాయకులు, తెలుగులో కొందరు బ్లాగరులు విరివిగా వాడెపదం "వేర్పాటు వాదులు". ముందుగా ఈపదాన్ని వాడింది లగడపాటి కాగా తరువాత తరువాత తెలంగాణా వ్యతిరేకించే నాయకులూ, సీమాంధ్రా మీడియా అందరూ వాడ్డం మొదలు పెట్టారు. ఎవరయినా అలా అనకూడదని చెబితే వీరిచ్చే సమాధానం విడిపోవడాన్నికి వేరుపడడం పర్యాయపదం, విడిపోవాలనుకునే వారిని వేర్పాటువాదులనే అంటారు అని.
నిజమే తెలుగులో విడిపోవడం, వేరు పడడం రెండూ ఒకటే. కానీ దానిపక్కన వాదం చేర్చినపుడు అది మామూలు వేరుపడడం కాదు, అర్ధం మారిపోతుంది. ఈ వేర్పాటువాదం అనేపదం ఆంగ్లంలోని separatism, secessionism అనే పదాలకు సరిసమానమయిన అర్ధం కోసం తెలుగులో వాడే పదం. separatism అనే పదం అర్ధం ఒక దేశ సార్వభుమత్వాన్ని ధిక్కరిస్తూ విడిపోవాలనుకునే భావజాలం. ఉదాహరణకు కాశ్మీర్, పంజాబ్, నాగాలాండ్, ఉల్ఫా లాంటి తీవ్రవాదులకుద్దేషించడానికి మనదేశంలో వేర్పాటువాదులు అనే పదాన్ని వాడతారు. అంతే కానీ ఒకదేశంలో ఆదేశ రాజ్యాంగానికి లోబడి ఒక కొత్త రాష్ట్రం కావాలనుకోవడం వేర్పాటువాదం కాదు. ఒకవేళ అది వేర్పాటువాదమయితే అసలు మన రాజ్యాంగంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అసలు వీలుండకూడదు, రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు ఎన్ని రాష్ట్రాలు ఉంటే ఎప్పటికీ అన్నే ఉండాలి. కానీ మన రాజ్యాంగం రాసినవారు అంత తెలివితక్కువ వారు కాదు, మన రాజ్యాంగం ప్రకారం ప్రజల, పాలన అవసరాలను బట్టి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు.
వీరు చ్ప్పేట్లు ఒక రాష్ట్రాన్ని విడగొట్టడమే వేర్పాటువాదమయితే మనదేశంలో ఎవరెవరు వేర్పాటువాదులు? వారిలెక్క ప్రకారం వేర్పాటువాదానికి ఆద్యులు స్వాతంత్రం వచ్చినతరువాత మొట్టమొదటిగా రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం చేసిన సీమాంధ్రా నాయకులు, ప్రజలు. అంటే వీరు వేర్పాటువాదులు అన్న ప్రతిసారీ పొట్టి శ్రీరాములు, టంగుటూరి లాంటి వారిని తీవ్రవాదులతో పోల్చినట్లు. ఇంకా మొన్నీమధ్యనే మూడు కొత్తరాష్ట్రాలను ఏర్పాటుచేసిన బీజేపీ ఒక వేర్పాటువాద రాజకీయపార్టీ. ఇంకా తెలంగాణాకు మద్దతు ఇస్తున్న మమతా బెనర్జీ, షరద్ పవార్, బీజేపీ లాంటి వారంతా వేర్పాటువాదులే. ఇంకా తమతమ పార్టీ మానిఫెస్టోలలో పెట్టినందుకు, ఎప్పుడో ఒకప్పుడు తెలంగాణాకు మద్దతిచ్చినందుకు టీడీపీ, కాంగ్రేస్లు కూడా వేర్పాటువాదులే. అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేసిన మన యూనియన్ హోం మినిష్టరు చిదంబరం కూడా వేర్పాటువాదే!! హతవిధీ, ఇలా చూస్తే ఈపదాన్ని ఉపయోగించే తెలంగాణా ద్వేషులు మొత్తంగా మన భారత శాంతిభద్రతల మంత్రినే తీవ్రవాదితో పోల్చారన్నమాట.
ఇద్దరు అన్నదమ్ములు విదిపొథె కుడా వెర్పటువదులె . కాబట్టి ఈ ప్రపంచం లొ అంధరు వెర్పటువదులె. I had explained this logic so many times to andhra guys. but no use దున్నపొతు మీద వాన పడ్డటు
ReplyDeleteచాలా వివరంగా, అద్భుతంగా చెప్పారు.
ReplyDeleteకానీ అనిత గారు అన్నట్టు ఎంత చెప్పినా వినేదెవరు?
దున్నపోతు మీద వాన పడ్డట్టే.
వేర్పాటు వాదులు, తెలబాన్లు,...ఇంకా ఏవేవో దుర్భాషలాడుతూ
పైశాచికానందం పొందుతున్న మన అననుగు సోదరులలో మార్పు రాదు గాక రాదు.
a good clarity !
ReplyDeletewell said
అనిత, గౌతం,సత్య
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలు. నిజమే, దున్నపోతుపై వర్షం పడితే ఫలితమేమీ ఉండదు, ఏదో మన ప్రయత్నం మనము చెయ్యడమే.
Good Post. Many people will use the wrong words not by mistake but by design because they know that they can pull it off.. :(
ReplyDeleteAnd they use all their logic and tact when questioned about the same. There is no point in arguing with them as they do not come to the table to understand but they come to a discussion to overpower others or to win their case.