‘స్వర లయలు’వ్యాస సంపుటికి దక్కిన గౌరవం
సంగీతం విని స్వర లయలు రాసి
మారుమూల పల్లె నుంచి ఎదిగిన మహారచయిత
పలు భాషల్లో అందెవేసిన చెయ్యి
సంతోషంగా ఉందన్న సరస్వతీ పుత్రుడు
ఇది తెలంగాణకే అవార్డు
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 21(టీ న్యూస్): దశాబ్దాల సాహితీ సేద్యానికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ మాగాణ ప్రతిభ మరోసారి దేశాన తలెత్తి నిలిచింది. అడవి బిడ్డల ఒడిలో పుట్టిన కలం అక్షరాలను సానపడుతున్న తీరుకు జాతీయ అవార్డు ఆదిలాబాద్‌కు నడిచివచ్చింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు డాక్టర్ సామల సదాశివ మాస్టారును కేంద్ర ప్రభుత్వం ఈ యేడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక చేసింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత నేపథ్యంలో ఆయన రాసిన ‘స్వరలయలు’ పుస్తకానికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఫిబ్రవరి 14న ఈ అవార్డును ఢిల్లీలో ప్రదానం చేయనున్నారు. తెలుగు, ఉర్దూ, పార్శీ తదితర భాషల్లో సాహిత్యానికి ఆయన చేస్తొన్న కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం విశేషం. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్8 చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన రాజీవ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2010 సంవత్సరానికి కళారత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తాజాగా ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయనను వరించింది. అవార్డును అందించిన ఈ పుస్తకాన్ని వేద్‌కుమార్ సారథ్యంలోని చెలిమి ఫౌండేషన్ ప్రచురించింది.
మరాఠీ సంగీతం వినీ వినీ స్వర లయలు రాశాను
అవార్డు రావడం సంతోషంగా ఉంది. అయితే నేను ఎప్పుడు అవార్డుల కోసం ఏదీ రాయలేదు... ఇనాం కేలియే నహీ లిక్తా... (బహుమతుల కోసం రాయను ) స్వరలయలను మరాఠాలో సూరానిలయ్ అంటారు. మరాఠీ సంగీతం వినీ వినీ స్వరలయలు రాశాను. చాలా సంతోషం. గత రెండేండ్ల క్రితమే అవార్డు వస్తుందని ఒక అభిమాని చెప్పాడు. యాద్ జిందగీ హై... సంతోషం
- సామల సదాశివ
తెలంగాణ ఆణిముత్యం, సరస్వతి ముద్దుబిడ్డ సదాశివ
అడవుల జిల్లా ఆదిలాబాద్ లో పుట్టి పెరిగిన సాహితీవేత్త సామల సదాశివకు జాతీయ సాహిత్యఅకాడమీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణకే ఆణి ముత్యంగా గుర్తింపు తెచ్చుకున్న సదాశివ పండితుల, పామరుల నుంచి కూడా అభినందనలు అందుకుంటున్నారు... ఈ ఆణిముత్యం తెలంగాణ మాగానంలోని మారుమూల దహెగాం మండలం తెనుగుపప్లూలో జన్మించి జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. 2011, మే 11న 84 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ వైతాళికుడి శిష్యులు, అభిమానులు, అనుచరులు అక్షర కుసుమాలతో ఘనంగా నీరాజనం పలుకుతూ ఆయనను సాహిత్యం ద్వారా వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు... సదాశివ కావ్యసుధ పేరుతో ఆ రచనలను గ్రంథస్తం చేశారు. మూడు సంవత్సరాల క్రితం ఈ గ్రంథంను కాగజ్‌నగర్ పట్టణంలో ఆయన శిష్యులు ఘనంగా ఆవిష్కరించారు. సాహితీ లోకంలో సామల సదాశివ గురించి తెలియని వారుండరు.
పుట్టింది మారుమూల తెనుగుపప్లూలో...
సామల సదాశివ దహెగాం మండలంలో తెనుగుపప్లూలో 1928, మే 11న జన్మించారు. ఆయన తల్లిదంవూడులు సామన నాగయ్య పంతులు,చిన్నమ్మలు. ఎంఏ, బీఎడ్, డీ లిట్ చదివారు. డైట్ కళాశాల, ఆదిలాబాద్ ప్రిన్సిపాల్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్థుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఆయన నివసిస్తున్నారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, ఫారసి, మరాఠీ భాషలలో ఆయన పాండిత్యాన్ని సాగించారు. ఉర్దూ, ఫారసీ, హిందీ, మరాఠీ భాషలకు చెందిన ప్రసిద్ధ కవుల, రచయితల సాహిత్యాన్ని ఆయన అనువదించారు. మూడు వేల వ్యాసాలు ఉర్దూలోనూ, 450 వ్యాసాలు తెలుగులోనూ రాసి ప్రముఖ దిన, వార, పక్ష, మాస పత్రికలలో ప్రచురింపజేశారు. హైదరాబాద్, వరంగల్, కొత్తగూడెం, విశాఖపట్నం, ఆదిలాబాద్, ఆకాశవాణి కేంద్రాల నుంచి అసంఖ్యాకంగా ప్రసంగాలు, ఇంటర్వ్యూలు ఇచ్చారు.
సామల సదాశివ 1963 నుంచి 1983 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉర్దూ సలహా సంఘం సభ్యులుగా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులుగా పని చేశారు. ఆయన చేసిన అంజత్ రుబాయిలు అనువాదానికి 1964లో రాష్ర్ట ప్రభుత్వం ఉత్తమ అనువాద రచనగా గుర్తించింది. 1968లో పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ప్రదానం. 1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రతిభా పురస్కారం, 2002లో కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ప్రదానం, 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్8 రాజశేఖర్ రెడ్డి ప్రతిభా రాజీవ పురస్కారం ప్రదానం. 2011, డిసెంబర్ 21న స్వరలయలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటన.
ప్రచురించిన పుస్తకాలు
ప్రభాతము (పద్య సంకలనం), సాంబ శివ శతకము (పద్యాలు), నిరీక్షణము (పద్య సంకలనం), మంచి మాటలు (పద్యాలు), అపశృతి(నవల), ఉర్దూ సాహిత్య చరిత్ర (అనువాదం), అంజద్ రుబాయిలు(అనువాదం), మౌలానా రూమీ మన్నవి (ఫారసీ నుంచి అనువాదం), మీర్జా గాలీబ్ (జీవితం - రచనలు), ఉర్దూ కవుల కవితా సామాగ్రి (కేశవసూత్, మరాఠీ కవి జీవితం ), ఫారసీ కవుల ప్రసక్తి, అర్తి (పద్య కవిత), మలయమారుతాలు(వ్యాసాలు), ఉర్దూభాష కవితా సౌందర్యం (వ్యాస సంపుటి), యాది (జ్ఞాపకాలు), సంగీత శిఖరాలు (వ్యాసాలు)
ప్రచురించాల్సినవి
రేవతి (నవల), రాముడు( పిలాసఫీ ఆఫ్ రామా), సునోబాయి సాదూ(కభీర్ దోహల అనువాదం), సాహిత్య అవలోకనం (ఉర్ధూ సాహిత్య చరిత్ర), సాకీనామా(పద్యకావ్యం), విశ్వమివూతము(పద్యకావ్యం), సదాశివలేఖలు పాచీన ఆధునిక భాషా సాహిత్య విమర్శ)
ఇది తెలంగాణకే అరుదైన గౌరవం
ప్రముఖ రచయిత, తెలంగాణ ఆణిముత్యంగా అందరూ భావించే సామల సదాశివగారి రచనకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించడం, అది అతనికే కాక తెలంగాణ గడ్డకే లభించిన అవార్డుగా భావించాలి.
నవల ప్రక్రియకు అరుదైన గౌరవం
కేంద్రసాహిత్య అకాడమీ వెల్లడించిన పురస్కారాల్లో పలుభాషల నవలలు ఉండడం ఈ యేటి విశేషం. జీవితంలో అనేక సంఘటనలను కావ్యంగా మలచడంలో భారతీయ సృజనకారులు చేస్తొన్న కృషిని అకాడమీ గుర్తించింది. ఈ విభాగంలో హిందీ నవలా రచయిత కాశీనాథ్ సింగ్ రచించిన ‘‘రహేనా పర్ రగ్గు’’, కన్నడ రచయిత గోపాలకృష్ణ రచించిన ‘‘స్వప్న సరస్వత’’ నవలలకు ఈ గౌరవం దక్కింది. నవలలతో పాటు పలువరు కవులు రాసిన కవుల కావ్యాలకు అవార్డు ప్రకటించిన అకాడమీ ప్రముఖ కాలమిస్టు రామచంద్ర గుహ రచించిన ‘‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’’ చారివూతక కథనానికి కూడా కేంద్రసాహిత్య అకాడమి అవార్డును ప్రకటించింది.
(నమస్తే తెలంగాణ నుంచి)

http://endukoemo.blogspot.com/2011/12/telugu-literary-treasure-in-tamil-hands.html
ReplyDeletePlease find the news update of the above post
thanks
?!