Monday, 21 November 2011

పసలేని పరకాలవాదం


మూడు నాల్గు పార్టీలు మారి నాలుగుసార్లు ఎలక్షన్లలో నిలబడి డిపాజిట్టు కోల్పోయినప్పటికీ రాష్ట్రంలో పరకాల అంటే పెద్దగా ఇంతకుముందు ఎవరికీ తెలియదు. పీఆర్పీలో టికెట్ దొరక్క బయటికి వచ్చి అదోవిషవృక్షం అంటూ పరకాల హడావిడీ చేసినతరువాత మాత్రం కొన్నిరోజులు పరకాలకు టీవీల్లో మంచి పబ్లిసిటీ దొరికింది. ఆతరువాత మల్లీ ఎవరూ పట్టించుకోకపోయేసరికి ఎలాగోలా మల్లీ టీవీ హెడ్లైన్లలోకెక్కాలని ఈమధ్యన విశాలాంధ్ర మహాసభ అంటూ ఒక వెబ్‌సైటు పెట్టుకుని హడావిడీ చేస్తున్నాడు. అసలిది విశాలాంధ్ర మహాసభ కాదు, ఇదొక విషాంధ్ర మహాసభ, వీరికంటూ ఒక వాదం గట్రా ఏంఈలేదు, తెలంగాణా వాదాన్ని, తెలంగాణ ఉద్యమకారులను తిట్టడమే వీరి ఏకైక అజెండా అని జనాలు చెప్పుతున్నారనేది వేరే విషయం.

సరే ఈవెబ్సైటుతో మీడియా వర్క్‌షాప్ గట్రా అంటూ హడావిడీ చేసి తెలంగాణవాదుల్ని రెచ్చగొట్టి ఎలాగయితేనేం పరకాల మల్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎలాగూ పరకాలకు కావల్సిందదే, వార్తల్లోకి ఎక్కడం, పబ్లిసిటీ పెంచుకోవడం. ఇప్పటికే మూడు పార్టీలు మార్చి వెల్తూ వెల్తూ పీఆర్పీని తిట్టిని తిట్లకు ఎలాగూ ఇప్పుడూ ఎవరూ ఈయన్న పార్టీలోకి చేర్చుకోరు.

ఈవిషాంధ్ర మహాసభ వెబ్‌సైటూ, బ్లాగూ నడుపుతూ ఇంతవరకూ సాధించింది ఏంతయ్యా అంటే ఫలానా తెలంగాణ నాయకుడు ఫలానా టైంలో సమైక్యాంధ్రకు జైకొట్టాడు అంటూ పేపర్ కటింగులు పెట్టడం, లేదా తెలంగాణ వాదుల్ని వేర్పాటువాదులు అంటూ తిట్టిపొయ్యడం. మొదట్లో కొన్నిరోజులు అసలు తెలంగాణకు నీటిపారుదలలో ఎలాంటి వివక్షా జరగలేదంటూ లోక్‌సత్తా రిపోర్టును సాక్ష్యంగా చూపుతూ హడావిడీ చేశారు కానీ అవన్నీ తప్పని బ్లాగుల్లో నిరూపించబడడంతో సమాధానం చెప్పలేక నోర్మూసుకున్నారు.

పరకాల ఈమధ్య టీవీల్లో బాగా హడావిడీ చేస్తున్నాడు. పరకాలకు, ప్రొఫెసర్ హరగోపాల్‌కు మధ్యన  మహాటీవీలో ఒక చర్చా కార్యక్రమం జరిగింది. ఆసక్తి కరంగా ఉంది కదా అని నేనూ ఓపిగ్గా అన్ని వీడియోలు చూశాను. లండన్లో పీహెచ్డీ చేసిన ఈమహానుభావుడు ఏంచెబుతాడో చూద్దామంటే అసలు ఎంతసేపూ చెప్పిందే చెప్పి బోరుకొట్టించడం లేకపోతే ఎదుటివారిని ఎగతాళి చెయ్యడం తప్ప ఈయన వాదన శూన్యం. కాలికేస్తే మెడకేస్తాను, మెడకేస్తే కాలికేస్తాను అదే నావాదన అని నిరూపించుకుంటున్న ఈయన ఒకే అర్ధం వచ్చే విషయానికి వరుసగా పది పర్యాయపదాలు చెబుతూ అదే వాదన అని భ్రమ పడుతున్నాడు.

"సమైక్యవాదం ఒక గొప్ప ఉదాత్తమమయిన వాదం, తెలంగాణ అన్నిరంగాలలోనూ ఈఈ సూచీల్లో మిగతా ప్రాతాల్లోకన్నా ముందుంది, తెలంగాణలో లక్షలాది ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు." ఇవే విషయాలను పదే పదే వల్లించడం తప్ప ఇంక ముందుకు వెల్లడు, ఆయా వాదనలపై హరగోపాల్ అడిగే సహేతుక ప్రశ్నలకు ఈఅయన దగ్గర సమాధానం ఉండదు, పైగా మల్లీ మల్లీ వేర్పాటువాదుల వాదనలో పస లేదు అంటూ అరవడం. అసలు తెలంగాణవాదుల్ని వేర్పాటువాదులు అని పిలిచేవారినీ, అలా పిలవడాన్ని సమర్ధించే టీవీ చానెల్లను బొక్కలో వెయ్యాలని నా అభిప్రాయం, ప్రస్తుతం ఉన్న సీమాంధ్రప్రభుత్వంలో అది సాధ్యం కాదుగానీ.

జీడీపీలు, తలసరి ఆదాయాలు అభివృద్ధిని చెప్పలేవు, వాస్తవపరిస్థుతులు అలాలేవు. అన్నీ బాగా ఉంటే మరి క్రిష్నా పక్కనే ఉండగా నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య, మహబూబ్నగర్లో కరువు ఎందుకు ఉంటుంది అంటే అందుకు సీమాంధ్ర ఎలా కారణం అంటూ దాటవేస్తాడు. తెలంగాణ అన్ని రంగాల్లో మిగతాప్రాంతాలకంటే చాలా అభ్వృద్ధి చెందిందనే ఈయన వాస్తవపరిస్థుతులు చెబుతుంటే తప్పించుకోవడం ఎందుకు? అక్కడ వాదన మహబూబ్నగర్ ఎండిపోవడానికి సీమాంధ్ర ప్రజలే కారణమని కాదు, ఈయన చెప్పే తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది అనేది తప్పని చెప్పడం.

లక్షలాది ప్రజలు తెలంగాణలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అని పదేపదే వల్లిస్తాడు, మరి అందుకు సాక్ష్యం ఏది, ఏదయినా మహాసభ నిర్వహించారా, ర్యాలీ జరిగిందా అంటే సమాధానం ఉండదు. కానీ ఇదిగో నలమోతు తెలంగాణవాడే అని చెబుతాడు. ఆ బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టయితే ఈయనకు నలమోతు ఒక్కడే లక్షలాది ప్రజల్లాగా కనిపిస్తున్నారేమో.

సమైక్యభావన గొప్ప ఉదాత్తమమయిన భావన అనేది ఈయన మరో పాయింటు. మరి సమైక్యవాదంలో ప్రజలను సంతృప్తి పరచడానికి ఏదయిన ఆదాయవనరు ఉందా, సమైక్యవాదంలో కలిపిఉంచే అంశమేంటి అనడిగితే దానికీ సమాధానం ఉండదు. ఊరికే మమ్మల్ని సమైక్యవాదం ప్రచారం చేసుకోనీయట్లేదు అంటూ దొంగ ఏడుపులు మాత్రం ఏడుస్తుంటాడు. అయ్యా పరకాలా, నీవాదానికి నిజంగా నువ్వు చెప్పేట్లు లక్షలాది ప్రజల మద్దతు ఉంటే ఒకరు నీవాదాన్ని వినిపించకుండా ఆపలేరు, ప్రజలే నీకు మద్దతుగా వస్తారు, ఇక్కడ ఎవరూ సమైక్యంగా ఉండాలని కోరుకోవట్లేదు కాబట్టే నీకు ఒక మీటింగు పెట్టుకోవడం కూడా గగనమవుతుంది.  నువ్విక్కడీకొచ్చి వేర్పాటువాదులూ లాంటి భాషను ఉపయోగితూ ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలను అగౌరవపరచడం రెచ్చగొట్టడం తప్ప మరోటి కాదు, ఈవిషయం నీక్కూడా తెలుసుననుకో, అయినా ఇలా చెప్పాల్సి వస్తుంది.

6 comments:

 1. పని లేని పరకాల గూర్చి మీరు పెద్ద పోస్ట్ రాశారు.

  ఆ మేరకు పరకాల తన ప్రయోజనాన్ని నెరవేర్చుకున్నట్లే గదా!

  పరకాలతో చర్చకి హరగోపాల్ ఎందుకు కూర్చున్నారబ్బా!!

  ReplyDelete
 2. పనిలేని పరకాలకు సపోర్టుగా బ్లాగుల్లో కొందరు ఒకటే గొలపెడుతుంటే, నాకు పనిలేదుకదా అని ఒక టపా రాశనండి! పాపం ఆ ప్రొఫేసర్ హరగోపాల్ కూడా మీరన్నట్టే అనుకున్నాడేమో, తప్పు తెలుసుకుని నాకు పరకాలతో వాదించి గెలవాలని ఏకోశానా లేదని అదే చర్చలో చెప్పాడు.


  పరకాల నిజానికి చాలా ప్రయోజనాలు నెరవేర్చుకున్నాడు... మరీ ముఖ్యంగా తనక్కావల్సినంత ప్రచారాన్ని కూడగట్టుకున్నాడు.

  ReplyDelete
 3. మూడు పార్టీల నుండి గెంటి వేయబడి, ప్రత్యక్ష (MLA) & పరోక్ష (MLC) ఎన్నికలలో ఓడిపోయిన ప్రభాకర్ గారికి ఇప్పుడు ఒక మంచి అవకాశం దొరికింది. ఇకనేం పొలోమని ప్రచారం మీద పడ్డాడు. రోజుకో సమావేశం, పూటకో ప్రెస్ కాన్ఫరెన్స్, ఘడియకో టీవీ లైవ్ షోలతో పబ్బం గడుస్తుంది.

  ఆంధ్రులు ఆరంభశూరులు కాబట్టి ప్రకటించిన సమావేశం జరగదు. ఆయనకు కావాల్సింది తద్వారా వచ్చే పబ్లిసిటి మాత్రమె కాబట్టి దాన్నే జుర్రుకుంటాడు.

  ఇంత రభస చేసినా వోటరు దేవుళ్ళు ఈ సారయినా కరుణిస్తారో లేదో పాపం! ఒక వేళ ఈ ప్రయత్నం కూడా బెడిసి కొడితే, ఒకసారి చొక్కా దులుపుకొని ఈ సంస్థని కూడా అనరాని మాటలన్నీఅనేసి తిరిగి కొత్త అవకాశం కోసం రోడ్ మీద పడతాడు.

  ReplyDelete
 4. /**ఇంత రభస చేసినా వోటరు దేవుళ్ళు ఈ సారయినా కరుణిస్తారో లేదో పాపం! ఒక వేళ ఈ ప్రయత్నం కూడా బెడిసి కొడితే, ఒకసారి చొక్కా దులుపుకొని ఈ సంస్థని కూడా అనరాని మాటలన్నీఅనేసి తిరిగి కొత్త అవకాశం కోసం రోడ్ మీద పడతాడు.**/


  పాపం ఈవిషాంధ్ర బాబులకు ఇంకా ఈవిషయం అర్ధమయినట్లు లేదు, పరకాలను ఆకాశానికెత్తేస్తున్నారు. రేపు ఎలక్షన్లలో సీటుదొరక్కపోతే ఇదే VMSను ఇదో లగడపాటి కంపనీ, విషవృక్షం అని తిడతాడు.

  ReplyDelete
 5. @సత్యాన్వేషి:

  Nalamotu Chakravarthy is a decent guy unused to such tricks. Parakala (and a few other guys) is using Chakravarthy because his credibility and posterboy looks help in media. They also found a 90 year old "freedom fighter" to parade.

  ReplyDelete
 6. Nalamotu Chakravarty is not the poster boy but a cunning wolf. Read this link: https://plus.google.com/111113261980146074416/posts/HGC6ECGdx31

  ReplyDelete