ఎన్‌టిఆర్ మహాత్మాగాంధీ, అంబేద్కర్ అంతటి మహనీయుడు. ఆయన విగ్రహం పార్లమెంటులో ప్రతిష్టించాలి.
-టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు
నేను స్థాపించిన తెలుగుదేశంలోనే కాంగ్రెస్ అక్రమ శిశువులు, గోముఖ వ్యాఘ్రాలు, మేక వన్నె పులులు తలెత్తుతున్నాయని ముందుగా తెలుసుకోలేకపోయాను...నేనే దేవున్ని అని చెబుతూ చాపకింద నీళ్లలాగా, పుట్టలో తేళ్లలాగా, పొదల్లో నక్కల్లాగా కుట్రలు, కుతం త్రాలు అల్లారు...ఇంతనీచానికి ఒడిగట్టిన చంద్రబాబు ఎన్‌టిఆర్ మా దేవుడు ఆయన విధానాలే అమలు జరుపుతానంటున్నాడు. చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకి పేల్చి గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సేను మించిన హంతకుడు చంద్రబాబు.
-1995 ఆగస్టులో తనకు వ్యతిరేకంగా జరిగిన విద్రోహంపై ఎన్‌టిఆర్ ఆగ్రహం ఇది.
‘నారా, నారా, పోరా, పోరా...’, ‘గతంలో ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్‌రావు కొంతయినా చరిత్ర మిగిల్చుకున్నారు. చంద్రబాబుకు అదికూడా మిగలదు’.
-ఎన్‌టిఆర్‌ను గద్దెదింపినందుకు నిరసనగా 1995 డిసెంబరులో నిర్వహించిన మాక్
అసెంబ్లీలో చంద్రబాబునాయుడుపై మోత్కుపల్లి నర్సింహులు ఆక్రోశం ఇది.
నారా చంద్రబాబునాయుడుకు నాడున్న ఇమేజి అది. ఎన్‌టిఆర్ ఆభిమానుల్లో ఉన్న ఆగ్రహానికి ప్రతీక ఆ నినాదం. చంద్రబా బు ఎన్‌టిఆర్‌కు చేసి న ద్రోహాన్ని జీర్ణించుకోలేనివారు ఇప్పటికీ కోట్లాది మంది ఉన్నా రు. అందుకే చంద్రబాబు తెలుగుజాతి ఆత్మగౌరవం గురించి, ఎన్‌టిఆర్ ఖ్యాతి గురించి మాట్లాడుతుంటే మనసు వెక్కిరిస్తూ ఉంటుంది. బతికి ఉన్నప్పుడు చిత్రవధ చేసి ఆయనను బలితీసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆయన విగ్రహాలకు దండలు వేస్తున్నారు. ఒక్క ఎన్‌టిఆర్‌నే కాదు తిరుగుబాటులో తన పల్లకీ మోసిన తోడల్లుడు దగ్గుబాటి వెంక బావ మరిది హరికృష్ణను, అనేక మంది సీనియర్ నాయకులను ఆయన ఆ తర్వాత కరివేపాకులాగా తీసి పారేశారు. రాజకీయాల్లో ‘యూజ్ అండ్ త్రో’ విధానాన్ని పక్కా గా అమలు చేసిన నేత చంద్రబాబే. స్నేహమయినా, బంధుత్వమయినా ఉపయో గపడితేనే కలుపుకుంటారాయన. ఆంతరంగికులను సైతం ఎప్పటికప్పుడు మార్చే చంద్రబాబుకు శాశ్వత శత్రుత్వాలు, మిత్రుత్వాలు, శాశ్వత బంధుత్వాలు ఉండవు.
విధా నాలయినా అంతే. ఎప్పటికప్పుడు మార్చకపోతే ఆయన చంద్రబాబే కాదు. ఇప్పటికీ వెల్లడి కాని విషయం- అభినవ గాడ్సే ఎన్‌టిఆర్ వారసుడెలా అయ్యారు? ఎన్‌టిఆర్‌ను అర్ధంతరంగా బలితీసుకున్నవాడు ఆయన కుటుంబానికి ఆత్మబంధు అయ్యారు? ‘వివూదోహ చంద్రబాబు’ను ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, పార్టీ రక్షకునిగా సమ్మతిని, సమర్థనను మాన్యుఫాక్చర్ చేసిన శక్తులు ఏవి?
విషాదం ఏమంటే 1995లో ఎన్‌టిఆర్‌కు జరిగిన దుర్మార్గంపై ఇంతవరకు లోతైన పరిశోధన జరుగక పోవడం. వైస్రాయ్‌లో జరిగిన కుట్ర చరివూతను రికార్డు చేయకపోవడం. చంద్రబాబు, ఆయన వందిమాగధ మీడియా రాసిన అనుకూల చరిత్ర తప్ప, అసలేం జరిగిందన్న అంశంపై ఎవరూ శ్రద్ధపెట్టకపోవడం యాదృచ్ఛికంగా జరుగలేదు. అధికారంలో ఉన్నవారి చరిత్రే తర్వాతి తరాలకు చరివూతగా సంక్రమిస్తోంది. ఓడిపోయి పడిపోయిన వారి చరిత్ర రికార్డుల్లోకి రాకపోవడం అనాదిగా ఉంది.
వర్తమానంలోనూ అదే జరుగుతోంది. గెలిచినవాడి చరిత్ర చీకటి పార్శ్వాలు బయటికి రావడం లేదు. ఎన్‌టి ఆర్‌పైన, చంద్రబాబుపైన, ఆ కాలపు రాజకీయాలపైన కొన్ని పుస్తకాలు వచ్చినమాట వాస్తవం. కానీ అన్నీ రాయించినవి, చేసిన నేరాలను సమర్థించుకునేవే తప్ప, వాస్తవాలను ఆవిష్కరించే చరిత్ర రాలేదు. ఇప్పటికీ అందరినీ వేధించే ప్రశ్న ఒక్కటే-1984ఆగస్టులో నాదెండ్ల భాస్కర్‌రావు చేసిన ప్రయత్నమే, 1995 ఆగస్టులో చంద్రబాబు చేశారు. నాదెండ్లది వెన్నుపోటు ఎలా అయింది? చంద్రబాబు ది ప్రజాస్వామ్యం ఎలా అయింది? ఒకే తరహా ఘాతుకానికి రెండు నిర్వచనాలు ఎలా సాధ్యం? నాదెండ్ల ఎందుకు విఫలమయ్యాడు? చంద్రబాబు ఎలా సఫలీకృతు డయ్యాడు? చంద్రబాబును గెలిపించిన శక్తులేవి?
నాదెండ్ల అసంతృప్తి, అవమానాలతోనే తిరుగుబాటు ప్రయత్నం చేశారు. చంద్రబాబు కూడా ఇవే కారణాలు చెప్పారు. నాదెండ్ల లక్ష్యం అధికారాన్ని చేజిక్కించుకోవడమే. చంద్రబాబు అంతిమంగా ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు. నాదెండ్ల తిరుగుబాటు చేసినప్పుడు ఆయనతో ఉన్నది చాలా కొద్ది మంది. చంద్రబాబు పరిస్థితీ అదే. కానీ చంద్రబాబు అతివేగంగా పావులు కదిపి బలసమీకరణలో సక్సెస్ అయ్యారు. నాదెండ్ల విఫలమయ్యారు. ఇక్కడే చాలా శక్తులు పనిచేశాయి. నాదెండ్ల తిరుగుబాటు జెండా ఎగరేయగానే ఎన్‌టిఆర్‌ను అధి కారంలోకి తేవడానికి భూమీ ఆకాశం ఏకంచేసిన పత్రికలు దానిని ‘వెన్ను పోటు’గా, ‘ప్రజాస్వామ్యానికి విద్రోహం’గా చిత్రీకరిస్తూ అభివూపాయాన్ని కూడగట్టాయి. అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావడానికి, ఎన్‌టిఆర్‌కు వెన్నుదన్నుగా నిలవడానికి భూమికను పత్రికలు సృష్టించాయి. నాదెండ్ల వెంట ఎంతమంది ఉన్నారో, ఎన్‌టిఆర్‌తో ఎంత మంది ఉన్నారో ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ నాదెండ్ల వెనుక ఎమ్మెల్యేలు చేరకుండా సైకలాజికల్ వార్‌ఫేర్ నిర్వహించాయిపజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని పత్రికలు ముందుండి నడిపించాయి. రాజకీయాలు, పత్రికలు కలసిపోయి పనిచేశాయి. నాదెండ్ల పప్పులు ఉడకలేదు.
1995లో సీను రివర్సయింది. ఎన్‌టిఆర్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ఆరాట పడిన పత్రికలకు ఆయనపై మోజు తీరిపోయింది. ఎన్‌టిఆర్ మునుపటిలా పత్రికలు, పారిక్షిశామికవేత్తలు చెప్పినట్టు నడుచుకునే రోజులు పోయాయి. అమాయక ఎన్‌టిఆర్ కాస్తా ముదిరిపోయారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తూ వచ్చా రు. ఆయన స్వతంవూతించి వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌టిఆర్‌పై యుద్ధం మొదలయింది. ఆయనతో ఎదురుపడి యుద్ధం చేయడం అసాధ్యం. ఆయనను ఓడించడం మామూలుగా అయ్యేపనికాదు. పైగా అఖండ విజయం సాధించి అప్పటికి ఎంతోకాలం కాలేదు. అందుకే లక్ష్మీపార్వతిని బూచిగా చూపడం మొదలు పెట్టారు. ఆమెను వివాహం చేసుకోవడం, ఆమెకు మర్యాద మన్ననలు ఇవ్వడం ద్వారా ఎన్‌టిఆర్ తెలుగుజాతి కొంపలు కూల్చుతున్నారన్నంత యాగీ చేశాయి ఆ పత్రికలు.
ఆమె వల్ల ప్రజాస్వామ్యం పాడుబడిపోతున్నదని, కుటుంబ గౌరవం నవ్వులపాలవుతున్నదని ఆ పత్రికలు రచ్చ చేశాయి. ఆమె ఎన్‌టిఆర్‌తో కలసి చైతన్యరథంపై ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఎటువంటి చర్చ జరగలేదు. ఎవరూ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ అధికారం అనుభవించే విషయం వచ్చే సరికి మాత్రం ఆమె పాత్ర కంటగింపయింది. మంత్రిపదవుల పంపకం దగ్గర మొదలయిన అసంతృప్తి, డిసిసిబి చైర్మన్ల ఎంపిక వరకు వచ్చే సరికి ముదిరి పాకాన పడ్డ ది. చంద్రబాబునాయుడు పావులు కదపడంమొదలు పెట్టా రు. మంతనాలు ప్రారంభించారు. తెలుగు దేశంలో అత్యధికులు చంద్రబాబుతో వెళ్లడానికి భయపడ్డారు. కానీ అప్పటికే లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా మీడియాను యధేచ్ఛగా వాడుకుంటున్న చంద్రబాబు తిరుగుబాటు కుట్రలో మీడియాను ప్రధాన భాగస్వాములను చేశాడు.
నాడు నాదెండ్లకు అడ్డం తిరిగిన మీడియా ఈసారి చంద్రబాబును భుజానికెత్తుకుంది. వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు వైపు సమీకరించడానికి అదే మీడియా మరోసారి సైకాలాజికల్ వార్‌ఫేర్ నిర్వహించింది. జర్నలిస్టులను, ఎడిటర్లను ప్రత్యక్షంగా రంగంలోకి దింపారు చంద్రబాబు. వాడొస్తున్నాడని వీడికి, వీడొస్తున్నాడని వాడికి జర్నలిస్టులతో, ఎడిటర్లతో చెప్పించి నమ్మబలికారు. వైస్రాయ్‌లో ఎంతమంది చేరారో తెలియదు, కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు పోగయ్యారని, ఎన్‌టిఆర్ పని అయిపోయిందని కొందరు జర్నలిస్టులు ఎమ్మెల్యేలకు అదేపనిగా ఫోను చేసి భయపెట్టారు. దగ్గుబాటి సన్నిహితులకు ఫోను చేసి ఆయన వెంట ఉండే ఎమ్మెల్యేలంతా చంద్రబాబుతో రావడానికి తయారయ్యారని, చంద్రబాబుతో చేతులు కలుపకపోతే ఏకాకి అవుతారని ఊదరగొట్టారు.
దగ్గుబాటి వర్గం ఎమ్మెల్యేలకు ఫోను చేసి దగ్గుబాటి కుటుంబ సభ్యులందరితోపాటే చంద్రబాబుతో వచ్చేస్తున్నారని చెప్పారు. మరోవైపు వచ్చిన ఎమ్మెల్యేలను కట్టిపడేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ చంద్రబాబు వైస్రాయ్ నీడలో గుట్టుగా చేసుకుపోయారు. బయట జరుగుతున్నది లోపలివారికి, లోన జరుగుతున్నది బయటి వారికి తెలియనీయలేదు. పత్రికలకు ప్రజాస్వామ్యం కనిపించలేదు. ప్రజలు ఎన్‌టిఆర్‌ను చూసి గెలిపించారన్న సోయి లేకపోయింది. తెలుగుదేశాన్ని కాపాడడానికి తాను తిరుగుబాటు చేయాల్సివచ్చిందని చంద్రబాబు చెప్పారు. పత్రికలు దానిని జస్టిఫై చేశాయి. ప్రతి సంఘటనను విమర్శనాత్మకంగా విశ్లేషించే సిపిఐ, సిపిఎంలు సైతం పత్రికలు, రాజకీయ మ్యానిపులేటర్లు సృష్టించిన కొత్త నిర్వచనాన్నే స్వీకరించాయి. చంద్రబాబుకు జైకొట్టాయి. తాను నిర్మించిన రాజకీయ మహాసౌధం తన కళ్లముందే చేజారిపోవడం చూసి, తన రక్తం పంచుకుపుట్టినవారే తనపై కుట్రచేసిన తీరును చూసి, తాను గెలిపించిన వారే తనపై కత్తిగట్టిన మోసాన్ని చూసి, వగచి, విలపించి, గుండెలు పగిలి, ఐదుమాసాలు తిరగకుండానే ఎన్‌టిఆర్ కన్నుమూశారు.
ఎప్పుడయినా చంద్రబాబు ఉపయోగించే ట్రిక్కు ఒక్కటే. ఎవరినయినా దెబ్బకొట్టాలంటే వారికి వ్యతిరేకంగా ఒక అబద్ధాన్ని ఆయనే సృష్టిస్తారు. ఆ అబద్ధాన్ని వందిమాగధ పత్రికలు పతాక శీర్షికల్లో అచ్చేస్తాయి. ఆ అబద్ధాన్ని పదేపదే వాగడానికి కొన్ని పెంపుడు కుక్కలను చంద్రబాబే ఎగదోస్తుంటాడు. ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి జోక్యం అనే ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి, నాడు ఎన్‌టిఆర్‌ను దెబ్బకొట్టారు.
అధికారంలోకి వస్తూనే ఎన్‌టిఆర్‌ను మరిపించడానికి, చంద్రబాబును మహానుభావుడిని చేయడానికి పత్రికలు మేళ తాల సహితంగా ఆరున్నొక్కరాగం అందుకున్నాయి. ఆయన లోని సుగుణాలను కీర్తించడానికి, ఆయనను బిల్ క్లింటన్ సరసన కూర్చోబెట్టడానికి, ఆయనకు స్టార్ ఆఫ్ ఏసియా కిరీటం తొడగడానికి మీడియా తన్మయత్వంతో పనిచేసుకుంటూ పోయింది.
నిజానికి, చంద్రబాబుకు జనామోదం ఎప్పుడూ లభించ లేదు. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును శిక్షించారు. ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచినందుకు జనంలో ఆగ్రహం ఉండడం వల్లే రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మెజారిటీ లోక్‌సభ స్థానాలను(22) గెల్చుకోగలిగింది. టీడీపీ కూటమి ఒకసారి 20, రెండోసారి 15 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 1999లో కూడా కార్గిల్ యుద్ధ నేపథ్యం, వాజ్‌పేయి ఇమేజి ఎన్‌డిఏతోపాటు చంద్రబాబును గెలిపించింది. చంద్ర బాబు గొప్పతనమేమీ లేదు. ఎన్‌టిఆర్ అకాలమరణానికి కారకుడయిన చంద్రబాబును తెలుగు ప్రజలు ఇప్పటికీ క్షమించలేదు. ఎప్పటికీ క్షమించలేరు. ఆ పాపం చంద్రబాబును పటి ్టకుదుపుతూనే ఉంది.
ఇక ముందు కూడా అదే జరుగనున్నది. తెలుగుదేశంపై ఇప్పటికీ ఏదైనా అభిమానం మిగిలి ఉందీ అంటే అది ఎన్‌టిఆర్‌పై ఉన్న అభిమానమే తప్ప, చంద్రబాబుపై అభిమానం కాదు. చంద్రబాబు తెలంగాణలో కూడా ఇప్పుడు పాత ట్రిక్కులనే ఉపయోగిస్తున్నారు. అబద్ధాల ప్రచారం, పెంపుడు కుక్కల వీరవిహారం, వంది మాగధ పత్రికల పులకింత ఇవన్నీ చంద్రబాబు నాటకంలో భాగం. కానీ ఆ రోజు ఎన్‌టి ఆర్ మోసపోయి ఉండవచ్చు. ఇప్పుడు తెలంగాణ మోసపోవడానికి సిద్ధంగా లేదు.
-కట్టా శేఖర్‌రెడ్డి