Wednesday, 31 October 2012

బ్రాహ్మణులపై దాడిని ఖండిద్దాం!!




మనప్రజాస్వామ్యంలో ఆందోళనకారులపై దాడులు కొత్తకాదు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రజలు ఆందోళన చేస్తున్నప్పుడు చంద్రబాబు, పేదలకు భూములు పంచాలని సీపీఐ, సీపీఎం ఆందోళన చేస్తుండగా ముదిగొండలో వైఎస్సార్ కాల్పులు జరిపించారు. గతకొద్ది సంవత్సరాలుగా తెలంగాణవాదులపై ప్రభుత్వం పోలీసులు, కేంద్రబలగాలతో విచక్షణారహితంగా దాడులు చెస్తుంది. ఇవన్నీ ప్రభుత్వదాడులు కాగా తెలంగాణలో సభలు నిర్వహించుకోవడానికి సీమాంధ్రనుంచి దుడ్డుకర్రలు పట్టుకున్న కిరాయిమూకలను రక్షణకోసం తెచ్చుకున్న చంద్రబాబు, వై.ఎస్. విజయమ్మా కూడా ఆందోళణకారులపై దాడులు చేశారు.

ఈరోజు ఇలాంటిదే మరో సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. అయితే ఇది ఎప్పటిలాగా తెలంగాణవాదులపైనో, బడుగువర్గాలపైనో కాదు, ఈరోజు జైగిన దాడి బ్రాహ్మణులపై, అర్చకులపై. దాడులు చేసింది మోహన్‌బాబు కిరాయి రౌడీలు. దుడ్డుకర్రలతో రౌడీలు దాడిచేసిన ఈఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయని సమాచారం.


ఈసంఘటణకు నేపధ్యం ఇది: ముందు మోహన్‌బాబు తన చుంచుమొహం కొడుకు హీరోగా ఒక సినిమా తీశాడు. అందులో అర్చకులను, పురోహితులను కించపరిచేట్లుగా చూపించారుట. సెన్సారువారు అడ్డుచెబితే పలుకుబడితో సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోవడమేగాక సెన్సార్ సభ్యురాలిపై మోహన్‌బాబు విమర్శలు చేశాడు.  దీనితో నొచ్చుకున్న అర్చకులు కొద్దిరోజులనుండీ సినిమా ఆపేయాలని ఆందోళన చేస్తున్నారు. మోహన్‌బాబు ఇంటిముందు ఈరోజు వారు ఆందోళన చేస్తుంటే కిరాయిమూకలు వారిని చితకకొట్టారు.

కొందరు రాస్తున్నట్లుగా ఇది హిందూమతంపై దాడి, హిందువులందరిపై దాడి లాంటి వాదనలు నేను ఒప్పుకోను గానీ ఈసినిమా ఒక వర్గం వారి జీవనవిధానంపై జరిగిన దాడి. ఈరోజు ఆందోళనకారులపై జరిగిన కిరాయిమూకల దాడి ప్రజాస్వామ్యంపై దాడి. ఇలాంటి దాడులను ఖండించి డబ్బూ, పలుకుబడి  ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని విర్రవీగుతున్న మోహన్‌బాబులాంటి వారికి బుద్ధి చెప్పాల్సిందే.

Sunday, 28 October 2012

సామాజికన్యాయం జరిగింది




ప్రజారాజ్యం అనేపేరుటో పార్టీని స్థాపించి "సామాజికన్యాయం తీసుకొస్తా", "ముఖ్యమంత్రినై తిరిగివస్తా" అంటూ ప్రచారం చేసిన చిరంజీవికి ఎలక్షన్ ఫలితాలు వచ్చినతరువాత ముఖ్యమంత్రి గావడం అంత వీజీ గాదని అర్ధమయింది. ఆతరువాత అదృష్టం కలిసొచ్చి రాజశేఖర్ రెడ్డి చనిపోవడం, జగన్ కాంగ్రేశ్‌ను వదిలి కొత్తపార్టీ పెట్టడంతో వచ్చిన అనిశ్చిత స్థితితో అదృష్టం కలిసొచ్చింది.

కాంగ్రేస్‌వారు అడగకున్నా తానే కాంగ్రేస్‌కు అడిగితే మద్దతు ఇస్తామని చెప్పిన చిరంజీవి కొన్నాళ్ళకు కాంగ్రేస్ ద్వారామాత్రమే సామాజిక న్యాయం (తన సామాజికవర్గానికి న్యాయం) జరగగలదని డిచ్లేర్ చేసి మరీ కాంగ్రేస్లో పీఆర్పీని విలీనం చేశాడు.

ఆలస్యం జరిగినా చివరికి కాంగ్రేస్ ద్వారా సామాజిక న్యాయం జరిగింది. తనసామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ఆతరువాత తన గ్రూపుకు చెంది, తనసామాజికి వర్గానికి కూడా చెందిన ఇద్దరికి రాష్ట్ర మంత్రిపదవులు దక్కడమే గాక ఎట్టకేలకు చిరంజీవికి ముందు కుదుర్చుకున్న బేరం ప్రకారం కేంద్రమంత్రిపదవి కూడా లభించింది.

కంగ్రాచ్యులేషన్  చిరంజీవి. టూరిజం పేరుమీద దేశమంతా టూర్లేయొచ్చు. ఎలాగూ రాజ్యసభమెంబరువు గనక వచ్చే ఎలక్షన్లలో పోటీచేస్తే ఎక్కడ వోడిపోతామో అన్న టెన్షన్ లేదు, అసలు పోటీ చేయాల్సిన అవసరమే లేదు. 2014 తరువాత కాంగ్రేస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు గనక ఆతరువాత మంత్రిపదవి దక్కుద్దా అనే టెన్షన్ కూడా లేదు!!