ఉద్యోగనిమిత్తం నార్వే వెల్లిన ఒక తెలుగు దంపతులు తమ కొడుకును హింసించారని అక్కడిపోలీసులు అరెస్టు చేశారు, తరువాత కోర్టు శిక్ష విధించింది. ఇక ఆవిషయాన్ని అదేదో ప్రపంచవింత అయినట్టు గత మూడు రోజులుగా మన టీవీ9, ఏబీఎన్,సాక్షి మొదలగు అన్ని ఛానెల్లూ డిస్కషన్లు పెట్టి ఊదరగొడుతున్నాయి. ఆఖరుకు నేషనల్ మీడియాకూడా దీన్ని కవర్ చేసింది.నార్వే ప్రభుత్వానికి పిల్లలపై ఉన్న శ్రద్ధను అభినందించాల్సింది పోయి అక్కడి చట్టన్నే తప్పు పడుతున్నారు. అసలు దేశంలో ఇదితప్ప ఇంకో ఇష్యూలేదు అన్నట్టు కేంద్రమంత్రి వాయలార్ రవి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, లగడపాటి అందరూ కంగారుపడిపోతున్నారు.
ఈలోగా యధాలాపంగా పేపర్లు చూస్తుంటే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక మూల ఇంకో వార్త కనిపించింది. నెల్లూరులో ఒకబాలకార్మికుడిని పనిలో పెట్టుకున్న ఒక డాబా వోనరు ఆబాలున్ని తీవ్రంగా కొట్టడంతో బాలుడు చనిపోయాడు. ఆపిల్లవాడి తండ్రి ఇంతకుముందు అదే డాబాలో పనిచేసేవాడట, డాబా వోనరుదగ్గర అతను పన్నెండువేలరూపాయలు అప్పుతీసుకున్నాడట. అప్పుతీర్చక పనిమాన్సేసినందుకు వెట్టిచాకిరీకింద కొడుకును పనిలోపేట్టుకున్నాడా డాబావోనరు.
నార్వేలో పిల్లాన్ని కొట్టినందుకు శిక్షవిధిస్తే ఇదేం విడ్డూరం అనిఊదరగొడుతున్న ఛానెల్లలో ఒక్కటికూడా ఈవార్తను మాత్రం ప్రసారం చేయలేదు. ఎందుకు చేస్తారు? మనదేశంలో బాలకార్మికులు ఉండడం వింతకాదు, వెట్టిచాకిరీ వింతకాదు, పిల్లలను కొట్టడం వింతకాదు, కొడితే పిల్లలు చనిపోవడం వింతకాదు. మరి ఎలాంటి విడ్డూరమూలేని ఆవార్తను ప్రసారం చేస్తే టీవీ ఛానెళ్ళ టీఆర్పీ ఎలా పెరుగుతుంది? అలాంటివర్తలు ప్రసారం చేస్తే జనం మాత్రం ఎందుకు చూస్తారు? ఛానెల్ మార్చి ఏడుపుగొట్టు సీరియల్లు చూస్తారు గానీ?
అయినా ఏఎన్నారైనో జైళ్ళో పెడితే మనకు వార్తగానీ కూలిపని చేసుకునే పిల్లగాడిని కొట్టిచంపితే అది వార్తెలా అవుతుంది? ఎన్నారైలలో మాత్రం ఐటీ ఇంజనీర్లకు ఏమన్నా అయితే వార్తగానీ ఏదుబాయి కెల్లిన కార్మికుడినో జైల్లో పెడితే అది వార్తా?
చక్కగా రాసారు, బాగుంది.
ReplyDeleteThank you for bringing this news to the world.
ReplyDeleteyes we are too narrow minded.
we should streamline our minds and society
nijame siggu padavalasina vishayam
ReplyDeleteనార్వే ప్రభుత్వానికి బాలల హక్కుల మీద ఉన్న అవగాహనలో మన వెధవలకు ఒక్క శాతం వచ్చినా బాగుంటుంది.
ReplyDeleteమన మీడియా & బ్లాగర్లు కూడా పిల్లలను బెల్టుతో కొట్టడాన్ని సమర్థించడం విడ్డూరం
అసలేంజరిగిందో ఎవరికి తెలుసు? నార్వే అఫీషియల్స్ వివరణ తీసుకోకుండా మనోళ్ళు ఏదిచెబితే అదే నిజమన్నటు మీడియా ఊదరగొడుతుంది. మొదట "ఇలాచేస్తే ఇండియాకి పంపిస్తాం" అన్నందుకే అరెస్టు అని చూపించారు, విచారణలో వాతలు, బెల్టు దెబ్బలు బయటపడ్డాయి.
Deleteమనోడు కాబట్టి మంచోడే అయుంటాడనే దృక్పధాన్ని మార్చుకోవాలి.
వార్నీయయ్య, బుద్ధి చెప్పేవాడు గుద్దితే మేలయా అన్న వేమన లెక్క పోతాం మనం. మనకి నారువే గీరువే లెక్కెందుకెహ?
Deleteసూపర్!!
ReplyDeleteచక్కగా చెప్పారు. ఈ సిగ్గుమాలిన చానెళ్ళకి మీ బ్లాగు చూసైనా సిగ్గొస్తే బాగుండును.
అక్కడి పోలీసులని అబినందించాల్సింది పోయి కేద్ర ప్రబుత్వం దగ్గనుండీ ఇదే చర్చ! వెధవ బుద్ది మనకు లేకుంటే వాళ్ళకీ వుండొద్దా? ఒకరు చెబితే వినం, మనంతకు మనం నేర్చుకోము. ప్రతిదానికో మాదో గొప్ప సంస్కృతి అని ఫోజు.
చీటికీ మాటికీ పిల్లలని కొట్టే జనాలకి ఇదొక వింత వార్త గనుక ఆ చానెళ్ళకీ అదే కావాలి, ఈ జనాలకీ అదే కావాలి.
సూపర్!!
ReplyDeleteచక్కగా చెప్పారు. ఈ సిగ్గుమాలిన చానెళ్ళకి మీ బ్లాగు చూసైనా సిగ్గొస్తే బాగుండును.
అక్కడి పోలీసులని అబినందించాల్సింది పోయి కేద్ర ప్రబుత్వం దగ్గనుండీ ఇదే చర్చ! వెధవ బుద్ది మనకు లేకుంటే వాళ్ళకీ వుండొద్దా? ఒకరు చెబితే వినం, మనంతకు మనం నేర్చుకోము. ప్రతిదానికో మాదో గొప్ప సంస్కృతి అని ఫోజు.
చీటికీ మాటికీ పిల్లలని కొట్టే జనాలకి ఇదొక వింత వార్త గనుక ఆ చానెళ్ళకీ అదే కావాలి, ఈ జనాలకీ అదే కావాలి.