Wednesday, 28 November 2012

హెడ్‌క్వార్టర్స్ చంచల్‌గూడ



జైళ్ళో ఎవరుంటారు? నేరంచేసి శిక్షననుభవిస్తున్న ఖైదీలూ లేదా నేరారోపణలతో విచారణనెదుర్కుంటున్నవారు ఉంటారు.  అప్పుడప్పుడూ వారిని కలుసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు వెల్లి స్వీట్లు లాంటివి ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో మాత్రం గమ్మత్తయిన పరిస్తితి ఏర్పడింది. ఒక పార్టీ హెడ్‌క్వార్టరుగా చంచల్‌గూడ జైలు సేవలందిస్తుంది.

కాంగ్రేస్ పార్టీ ఆఫీసుగా గాంధీభవన్, తెదేపా ఆఫీసుగా ఎంటీఆర్‌ట్రస్టు భవన్ , తెరాస పార్టీ ఆఫీసుగా తెలంగాణభవన్ వ్యవహరిస్తుంటే  వైకాప ఆఫీసుగా మాత్రం ప్రభుత్వభవనం చంచల్‌గూడ జైలు మారింది.చక్కగా కిరాయి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.  పార్టీ కార్యకలాపాలు, పాదయాత్ర ప్లానింగు మొత్తం జైలునుండే నడుస్తుంది.

ముంబయి మాఫియా అంతా దుబాయి నుండి దావూద్ ఇబ్రహీం నడపడం మనం గతంలో విని ఉన్నాం. సూరి లాంటి కొందరు ఫాక్షనిస్టు లీడర్లు గతంలో జైలు నుండే ప్లానింగ్ చేసి ప్రతీకారాలు తీర్చుకోవడం చూశాం. జైలు నుండి పోటీచేసి ఎలక్షన్లలో గెలిచినవారిని చూశాం. ఇప్పుడు వెరైటీగా పార్టీకి జైలు హెడ్‌క్వార్టరుగా మారడం చూస్తున్నాం.

చంచల్‌గూడలో విజిటర్లు కుటుంబ సభ్యులు, వైకాప పార్టీ నాయకులు మాత్రమే కాదు. రోజుకొక తెదేపా నాయకుడు చంచల్‌గూడకు వెల్లడం, తెల్లారి అతను సస్పెన్షన్‌కు గురికావడం ఒక తంతుగా మారింది. మొన్న నాని, నిన్న ప్రవెణ్‌రెడ్డి, ఈరోజు ఉమ్మారెడ్డి..రేపెవరో!! చంద్రబాబుకు  చంచల్‌గూడ జైలు వెన్నులో చలి పుట్టిస్తుంది.


పక్కపార్టీలనుండి లీడర్లను కొనడానికి తండ్రిపాలనలో దోచుకున్న లక్షకోట్లు, కిరాయి అవసరం లేని పార్టీ ఆఫీసు, జైల్లో ఉన్నందుకు తల్లీ చెల్లెల్లూ ఏడుస్తూ కూడగట్టుతున్న సింపతీ. ఎలక్షన్లయ్యాక గెలిచినపార్టీకి మద్దతిస్తే కేసులు కూడా మాఫీ కావచ్చు. మొత్తానికి జగన్‌కి అంతా అనుకూలంగా నడుస్తున్నట్టుంది.

అయితే జగన్‌కూ చంద్రబాబుకూ చాలా పోలికలు కనబడుతున్నాయి. ఇద్దరిదీ రెండు కళ్ళసిద్ధాంతం, ఇద్దరూ తమ లేదా  తమ తండ్రి పాలన స్వర్ణయుగమని, అవతలివారిది దుష్టపాలన అనీ చెప్పుకుంటారు. ఇద్దరూ మరోవ్యక్తిని నమ్మరు. ఇద్దరి పార్టీల్లోనూ నంబర్ టూ ఎవరూ ఉండరు. ఇప్పుడు జగన్ జైల్లో పడ్డట్టే బహుషా భవిష్యత్తులో చంద్రబాబు కూడా జైలుకెల్లే వంతు వస్తుందేమో.

1 comment:

  1. good article .. i hope that will happen after 2014 elections..

    ReplyDelete