Friday, 22 January 2010

సమైఖ్య వాద బ్లాగరుల కొన్ని వింత వాదనలు.. హైదరాబాద్ ఉమ్మడి ఆస్థి. ??@#!!


1. హైదరాబాద్ ఉమ్మడి ఆస్థి. హైదరాబాద్ అబ్భివ్రుద్ధిలో అందరి వాటా ఉంది??

- ఒక విధంగా మనం ఇలా చెప్పే వాళ్ళను అభినందించవచ్చు. నిజాయితిగా వీల్లు తమ అసలు సమస్య హైదరాబాదే, సమైఖ్యమనే డొంక తిరుగుడు వాదం కేవలం ఒక కుంటి సాకు మాత్రమె అని ఒప్పెసుకున్తున్నట్లే. హైదరాబాద్ గురించి అప్పుడే అడిగితె చులకన అయిపోతామని వీరు సమైఖ్యమనే ముసుగు తొడుక్కుంటారు.

ఇక్కడ విషయం ఏమిటంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, హైదరాబాద్ తో పాటు వైజాగ్, కాకినాడ, తిరుపతి లాంటి నగరాలు కుఉడా చక్కగా అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ యాభై ఎల్లకిండా కూడా దేశంలో ఐదో స్థానంలో ఉన్న నగరమే, ఇప్పుడు కూడా దేశంలో ఐదో స్థానంలోనే ఉన్నది. విజాగ్ హైదరాబాద్ కంటే ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందినా నగరం. స్టీల్ ఫాక్టరీ, పోర్టు, నేవీ లాటివన్నీ వైజాగ్లో వచ్చాయి. కాకినాడలో ఎన్నో ఫెర్టిలైజర్ ఫాక్టరీలున్నాయి. అంత మాత్రం చేత తెలంగాణా వాదులు ఎమీ ఆ నగరాలలో వాటా అడగట్లేదు కదా? నిజాం కాలంలోనే ఏంటో అభివృద్ధి చెందినా హైదరాబాద్ గురించి ఎందుకు ఏడుపు? దీనికి ఒక బ్లాగరు చెప్పే సమాధానం ఏమంటే హైదరాబాదులో వచ్చే ఆదాయం మిగతా మొత్తం రాష్ట్రంలో వచ్చే ఆదాయం కంటే చాలా ఎక్కువట. అసలు ఏడుపు బయట పెట్టాడు.

మరి హైదరాబాద్ ఆదాయం ఈ మధ్యే పెరిగిందా ఒక్కసారిగా, లేక 1956 నుంచి ఎక్కువేనా? ఒక వేల 1956 నుచి ఎక్కువే అయితే అప్పుడు హైదరాబాద్ ఉమ్మడి ఆస్తి అనడంలో లాజిక్ ఏమిటి? హైదారాబాద్ ఆదాయాన్నే మిగతా ప్రాంతాల్లో ఖర్చు చేసినట్లు కదా? అందులో సింహ భాగం సీమాంధ్రకే ఖర్చు జరిగి ఉంటుందనడంలో సందేహం ఉంటుందా? ఇటీవల హైదరాబాద్లో ఇబ్బడి ముబ్బడిగా తెగనమ్మిన ప్రభుత్వ భూములనుండి వచ్చిన ఆదాయంలో ఎంత భాగం సీమాంధ్రకి జలవనరులని తరలించే జలయజ్ఞ ప్రాజెక్టులకి ఖర్చు చేసి ఉంటారో? మరి ఇవన్ని లెక్కలు తోడితే ఎవరు ఏవరికి ఋణం ఉన్నట్లో తెలిసి పోతుంది.

ఇంకో సారి అదే బ్లాగరు పెద్ద మనిషి ఏమంటాడంటే హైదరాబాదు రాజధాని కనుక దాని అభివృద్ధి కోసం మిగతా ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టారట. ఏవిధంగా పణంగా పెట్టారు, ఒక వైపు వైజాగ్ అభివృద్ధి రేటు హైదరాబాదు కంటే ఎక్కువ, హైదరాబాద్ 1956 లో దేశంలో ఎ స్థానంలో ఉందొ ఇప్పుడూ అదే స్థానంలో ఉంది. హైదరాబాద్ రాజధాని కనుక రాజధాని అవసరాలకు ఏమైనా నిధులు ఖర్చు పెట్టారా అంటే అన్నీ నిజాం కాలంలో కట్టిన భవనాలే. మరి పరిరమలకూ, వ్యాపార సంస్థ లకూ ఎక్కడ అనువైన వాతావరణం ఉంటె అక్కడ అబివృద్ధి చెందుతాయి. ధిల్లీ రాజధాని కదా అని ముంబాయి, మద్రాసు, కోల్కతా లాంటి నగరాలు అభివృద్ధి చెందడంలేదా? ఎ విధంగా మిగతా ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టారు? ఇలాంటి ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం ఉండదు.

అసలు ఆంద్ర రాష్ట్ర నాయకులు హైదరాబాదు రాష్ట్రంతో కలవడానికి ముఖ్యమైన ఉద్దేశం వాళ్లకు ఆంద్ర రాష్ట్రంలో సరైన రాజధాని లేకపోవడమే. కర్నూలు లో డెరాలలో సేక్రతెరిఅత్ని పెట్టుకుని దాన్ని రాజధాని అవసరాలకు నిర్మించుకోవడానికి ఏంటో ఖర్చు అవుతుంది కనుక హైదరాబాదుతో కలిస్తే ఫ్రీగా రాజధాని లభిస్తుందని అప్పుడు ఆంద్ర ప్రదేశ్ ఏర్పాటుకు పట్టుబట్టారు. తమ అవసరాలకోసం హైదరాబాదుని రాజధానిగా చేసుకుని ఇప్పుడు అదే నగరంలో వాటా అడుగుతున్నారు. తిన్న ఇంటి వాసాలు లేక్కబెత్తడమంటే ఇదే కదా మరి?

తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పరచడం ఇష్టం లేనట్లయితే ఎందుకు అది సరి కాదో చెప్పాలి. ప్రత్యెక రాష్ట్రం కావాలని నిర్నయిన్చినట్లయితే ఆ తరువాత విభజనకు ఉన్న ఇబ్బండులేమితో చెప్పాలి. కానీ ఒక పక్క సమైఖ్యరాగం పలుకుతూ ఇంకో వైపు హైదరాబాదులో మాకూ వాటా వుందని లంకె పెట్టడం ఏవిధంగా సరి అయిన వాడమో తమను తాము తెలివైన వాళ్ళుగా భావించే సీమాంధ్ర సమైఖ్య వాదులే చెప్పాలి.

4 comments:

 1. అలాగే కరీమ్నగర్ వాళ్లొ, ఆదిలాబాద్ వాళ్లొ వచ్చి హైదరాబాద్ మాది అనటం మీకు రోత గా అనిపించటం లేదా? మీకు కావాల్సిన స్వపరిపాలన కోటి మందికి పైగా ఉన్న హైదరాబద్ వాళ్లకు ఎందుకు వద్దు అంటున్నరో వేర్పాటు వాదులు చెప్పగలరా?
  హైదరాబాద్ హైదరాబాద్ వాళ్లది కాని ఏ కడప వాళ్లదో, కరీమ్నగర్ వాళ్లదో కాదు అని ఎందుకు మేతావులకు అర్ధం కాదు?
  జై హైదరాబాద్, జై హైదరాబాద్ స్టెట్.

  ఒకటి గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ మాది అనటం సమైక్య వాదులనటం ఎంత కామెడీయో, మాదీ అని వేర్పాటు వాదులనటం అంతే కామెడీయే. అసలింతకూ హైదరాబాద్ వాళ్లు ఏమనుకొంటున్నారో అని ఒక్కరయినా ఆలోచించారా?

  ReplyDelete
 2. మంచి ప్రశ్న. అయితే హైదరాబాద్ అంటే డానం ణాగెందర్, ముకేష్ మాత్రమే కాదు గదా? హైదరాబాద్ లోని ఆంధ్రా సెటిలర్స్ ఫోరం తో సహా మెజారిటీ ఇప్పటికే తెలంగాణాకు మద్దతు ఇచ్చారు. మీకు నమ్మకం కుదరక పోతే హైదరాబాదులో ఒక రెఫరెండుం కోసం అడగండి.

  అయితే నా టపా సమైక్యవాదుల ముసుగులో హైదరాబాద్ ఆశించే సీమాంధ్ర వాదులకోసం.

  ReplyDelete
 3. హైదరాబాద్ లో ఎన్నో తెలంగాణా జిల్లాలు కలిసిపోయివున్నాయి. హైదరాబాద్ విస్తరిస్తూ చుట్టు ఉన్న ప్రాంతాలన్నింటినీ కలుపుకుంది. ఈ రోజు హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ ఆ తెలంగాణా జిల్లాలవారిని మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వారితో కలిసి ఆ ప్రాంత ఉద్యోగాలు కాలేజీసీట్లూ పంచుకోమని అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం?
  వైజాగ్, లేదా విజయవాడను ఇలా ఫ్రీజోన్ గా ప్రకటించి అక్కడి లోకల్ వాళ్ళ ప్రభుత్వ అవకాశాలను మిగతా వారు దోచుకుంటే వూరుకుంటారా?

  ఉదాహరణకు కాకినాడ లేదా రాజమండ్రి రాష్ట్రరాజధాని అయ్యిందనుకొండి రాజధానీ నగరం పెరిగి గోదావరి జిల్లాలు మొత్తం రాజమండ్రి మెగా సిటీగా మారి గోదావరి జిల్లాలు అనేవే లేవు. అక్కడి ప్రభుత్వ ఉద్యోగాలు, కాలేజీ సీట్లు అన్నీ ఫ్రీజోన్ కింద వున్నాయి.అన్ని జిల్లాలవారికీ ఇది లోకల్ ప్రాంతం కిందకే పరిగణిస్తాం అంటే అక్కడి స్థానీయులకు ఎలాగుంటుంది?

  ఆంధ్రదేశం అంతటా ఎవరి ప్రాంతం వారికి లోకల్ కింద అవకాశాలు వున్నప్పుడు. రాజధానికోసం తమ ప్రాంతాన్ని ధారపోసిన వారు మాత్రం తమకంటూ ఓ లోకల్ లేకుండా మొత్తం దేశంతో పంచుకోవాలన్నమాట!

  ReplyDelete
 4. మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయంలో హైదరాబాదు నంచి సుమారు ౩౦శాతం వస్తుంది. అయితే ఈ ఆదాయంలో రాష్త్రం మొత్తానికి బాగస్వామ్యం ఉంది . ఎలాగంటే కాకినాడలో పర్టిలైజర్స్ కంపెనీలు ఉన్నా వాటి రిజిస్టర్డ్ కార్యాలయాలు మాత్రం హైదరాబాద్లో ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో అమ్మిన / ఉత్పత్తి చెసిన సరుకూపై పన్ను ను హైదరాబాద్ కార్యాలయం ద్వారా జమ చేస్తారు. ఇలాగే ఇతర పరిశ్రమలూనూ. హైద్ లో ప్రదాన కార్యాలయాలు ఉండటం వల్లే ఇక్కడ ఆపీసు ఉద్యోగాలు ఎక్కువ. విశాఖలో బారీ పరిశ్రమలున్నా వాటి ఉద్యోగాలలో స్తానికుల వాటా స్వల్పమే.

  ReplyDelete