Monday 24 May 2010

నాస్తికవాదం కూడా ఒక నమ్మకమేనా?

నాస్తికుల వాదనను తిప్పికొట్టడానికి ఆస్తికులు ఉప్యోగించే ఒక ఆయుధం ఈ వాదన:"నాస్తికత్వం కూడా ఒక నమ్మకమే! దేవుడు ఉన్నాడని మేమెలా నమ్ముతామో, లేదని మీరు అలాగే నమ్ముతారు" అని. మరి ఈ వాదనలో నిజం ఉందా?

నాస్తికులు దేవుడు లేడు అని నమ్మరు. కేవలం వారు దేవుడు అనే ఒక నమ్మకం కలిగిఉండరు. ఏ నమ్మకమూ లేకపోవడమూ కూడా ఒక నమ్మకమే అవుతుందా? ఇది చిన్నప్పుడు మనం చదువుకున్న మౌల్వీ నసీరుద్దిన్ జోకు లాంటి వాదన. ఏ కారూ లేని వాడి దగ్గరకి వెళ్ళి నువ్వు నోకార్ (no car)కలిగి ఉన్నావు, రోడ్డు టాక్సు చెల్లించాల్సిందే అన్నట్లు.

లేనిదానిని నిరూపించడం అసాధ్యం అవుతుంది. ఎప్పుడైనా నిరూపించాల్సిన భాద్యత ఉన్నదని క్లెయిము చేసే వారిదే. దీనికి బెర్‌ట్రాండ్ రస్సెల్ ఇలా చెప్పాడు: నేను ఆకాశంలో శుక్రుడికీ, గురుడికీ మధ్యన ఒక టీ కప్పు తిరుగుతుంది అని చెప్పితే ఎవరైనా ఆకాశం అంతా తిరిగి ఆ టీ కప్పు లేదు అని నిరూపించగలరా? కాబట్టి దేవుడు లేడు అని నిరూపించమని నాస్తికులను అడగడం సరి అయిన వాదన కాదు.

46 comments:

  1. నాస్తికులు దేవుడు లేడు అని నమ్మరు. కేవలం వారు దేవుడు అనే ఒక నమ్మకం కలిగిఉండరు.
    _________________________________________________

    అలాంటప్పుడు "దేవుడు లేడు" అని వాదించకూడదు కదా. నాస్తికవాదులు "దేవుడు ఉన్నాడనే నమ్మకం నాకులేదు" అనడానికీ, "దేవుడు లేడు, నువ్వు చెప్పేది అబధ్ధం" అనడానికి చాలా తేడా ఉంది. తప్పయితే సరిదిద్దండి, కానీ నేను విన్నవి ఎక్కువగా రెండవ రకం మాటలే.

    ReplyDelete
  2. నమ్మకమూ లేకపోవడమంటే ఉన్నాడనీ నమ్మకపోవడం, లేడనీ నమ్మకపోవడం - ఉన్నడో లేడో తెలియని సందిగ్ధావస్తన్నమాట :))

    దేవుడూ లేడని నిరూపించాలంటే ఆస్తికులు అడిగే ప్రశ్నలన్నిటికీ సైంటిఫిక్ సమాధానాలు చెప్పాలి. అలాగే దేవుడూ ఉన్నాడూ అని నిరూపించాలంటే నాస్తికుల ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పాలి. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే రెండు గ్రూపుల్లో ఎవరూ కూడా సమాధానాలు చెప్పగలిగే స్థితిలో లేరు. దానర్ధం? సమాధానం తెలిసే దాకా ఇద్దరూ ఆగాలని.

    ReplyDelete
  3. దేవుడున్నాడు అనడానికి ఆస్థికులు చూపిస్తున్న ముఖ్య ఆధారాలు సృష్టి, విశ్వం. ఈ రెండిటికీ ఇంకా నాస్తికుల దగ్గర సమాధానం లేదు కదా! So wait until one finds answers.

    ReplyDelete
  4. అలాంటప్పుడు "దేవుడు లేడు" అని వాదించకూడదు కదా

    నాస్తికులు దేవుడు లేడు అని వాదించరు. అసలు వారికి దేవుడు అంటే ఏమిటో తెలియదు.తెలియని దాన్ని లేదు అని ఎలా చెబుతారు?

    దేవున్ని నమ్మే వారే ముందు తమ నమ్మకానికి నిర్వచనం చెప్పాలి. అనిర్వచనీయమయిన భావనను అవునని కానీ, కాదని కానీ నిరూపించడం సాధ్యం కాదు.

    ReplyDelete
  5. నాస్తికులు దేవుడు లేడు అని వాదించరు. అసలు వారికి దేవుడు అంటే ఏమిటో తెలియదు
    ________________________________________________

    నాస్తికులందరూ ఇలా (మీలా) ఉంటే అసలు ఇబ్బందే ఉండదు కదా!

    ReplyDelete
  6. నమ్మకమూ లేకపోవడమంటే ఉన్నాడనీ నమ్మకపోవడం, లేడనీ నమ్మకపోవడం - ఉన్నడో లేడో తెలియని సందిగ్ధావస్తన్నమాట :))

    కాదు. అలాంటి వారు agostics. నాస్తికులు traditional definition లోని దేవుడు అనే నమ్మకాన్ని రిజెక్ట్ చేస్తారు.

    నమ్మకం లేక పోవడం ఉన్నాడో లేడో తెలియని సందిగ్ధ స్థితి కాదు. నేను బుధుడూ, గురుడి మధ్య ఒక పెద్ద బ్రహ్మ రాక్శసి తిరుగుతోంది అంటే, ఎవరైనా అలాంటిది ఉన్నట్లు నిరూపించేంతవరకూ మేము నమ్మము అంటే వారు అది ఉన్నదో లేదో తెలియని సందిగ్ధావస్తలో లేరు. కేవలం వారు ఆ భావనను నమ్మరు, అంతే.

    ReplyDelete
  7. దేవుడూ లేడని నిరూపించాలంటే ఆస్తికులు అడిగే ప్రశ్నలన్నిటికీ సైంటిఫిక్ సమాధానాలు చెప్పాలి. అలాగే దేవుడూ ఉన్నాడూ అని నిరూపించాలంటే నాస్తికుల ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పాలి. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే రెండు గ్రూపుల్లో ఎవరూ కూడా సమాధానాలు చెప్పగలిగే స్థితిలో లేరు. దానర్ధం? సమాధానం తెలిసే దాకా ఇద్దరూ ఆగాలని.


    మీరు ముందు వాఖ్యలో ఉపయోగించిన సృష్టి అనే పదాన్ని నాస్తికులు నమ్మరు. ఇక విశ్వానికి మూలం, జీవానికి మూలం లాంటి ప్రశ్నలకు మనిషికి ఇప్పటికే కొంతవరకూ సమాధానాలు తెలుసు.

    అయితే తెలియని విషయాలకు తెలియదు అనే పొజిషన్‌ని మెయింటెయిన్ చేసి దానికి సమాధానం కోసం ప్రయత్నిస్తే సరి. తెలియని ప్రశ్నలకు కారణానికి ఒక రూపాన్ని ఆపాదించి సమాధానపడనవసరం లేదు.

    ReplyDelete
  8. You seem to be an ideal atheist. నేను మాట్లాడింది "దేవుడులేడనేదే సత్యం" అనే నాస్తికుల గురించి. People like you cause no problems at all.

    మీరు ముందు వాఖ్యలో ఉపయోగించిన సృష్టి అనే పదాన్ని నాస్తికులు నమ్మరు
    ________________________________________________

    Oh yeah, right - they think that the Universe just exists and it was never created

    తెలియని ప్రశ్నలకు కారణానికి ఒక రూపాన్ని ఆపాదించి సమాధానపడనవసరం లేదు.
    ________________________________________________

    సాధారణంగా పరిశొధనల్లో తెలియని విషయాలకి తమ అనుభవాన్ని ఒక సిధ్ధాంతాన్ని ఆపాదించి దానిని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే తెలిసేదాకా ప్రయోగాలను చేసుకుంటూ పోతారు. మొదటి రకం ఆస్తికత్వమైతే, రెండొది నాస్తికత్వం.

    ReplyDelete
  9. read అనుభవాన్ని as అనుభవంతో

    ReplyDelete
  10. సాధారణంగా పరిశొధనల్లో తెలియని విషయాలకి తమ అనుభవాన్ని ఒక సిధ్ధాంతాన్ని ఆపాదించి దానిని నిరూపించడానికి ప్రయత్నిస్తారు


    hypothesis కి experimental basis లేకపోయినా logical erasoning ఉంటుంది. కానీ దేవుడి నిర్వచనం ఏదీ కూడా లాజికల్‌గా కూడా సరిపోదు.

    ReplyDelete
  11. కానీ దేవుడి నిర్వచనం ఏదీ కూడా లాజికల్‌గా కూడా సరిపోదు.
    _____________________________________

    సృష్టి , విశ్వ రహస్యం వెనకాల ఒక మానవాతీత శక్తి ఉంది. - This is the Hypothesis


    విశ్వంలో చాలా విషయాలు మానవుడి చేతిలో లేవు - So, మానవాతీత శక్తి ఉంది

    ______________________

    ఈ రీసనింగ్ చాలు, సిధ్ధాంతానికి

    వాళ్ళ experiments వాళ్లని చేసుకోనివ్వండి. లేకపోతే మీరు దానిని disprove చెయ్యండి, if you can.

    ReplyDelete
  12. " కాబట్టి దేవుడు లేడు అని నిరూపించమని నాస్తికులను అడగడం సరి అయిన వాదన కాదు."

    కానీ దేవుడున్నాడని నిరూపించడం మాత్రం సరైన్ వాదనే అని గట్టిగా నమ్ముతారు, అదే విచిత్రం.

    ReplyDelete
  13. సత్యాన్వేషి గారు, మీ పోస్టు, సమాధానాలు బాగున్నాయి.

    "విశ్వంలో చాలా విషయాలు మానవుడి చేతిలో లేవు - So, మానవాతీత శక్తి ఉంది"

    ఆ మానవాతీత శక్తి ఏమిటో నిర్వచించ వలసిన బాధ్యతా ఆస్తికుల పైనే ఉంది.

    ReplyDelete
  14. కానీ దేవుడున్నాడని నిరూపించడం మాత్రం సరైన్ వాదనే అని గట్టిగా నమ్ముతారు, అదే విచిత్రం

    అదేమీ విచిత్రం కాదు. ఎందుకో పైన టపాలో వివరణ ఉంది, ఒక సారి చూడండి. లేని దాన్ని నిరూపించడం సాధ్యం కాదు.

    ReplyDelete
  15. విశ్వంలో చాలా విషయాలు మానవుడి చేతిలో లేవు - So, మానవాతీత శక్తి ఉంది
    మానవుడి చేతిలో లేకపోవడం అంటే నాకు అర్ధం కాలేదు. మనిషికి తెలియని విశ్వ రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అయియే ఒక వెయ్యి సంవత్సరాల ముందు కంటే ఇప్పుడు ఎక్కువ తెలుసు, ఇది ప్రోగ్రెసివ్గా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది.

    మనకు తెలియని శక్తి ఏదయినా ఉంటే ఆ శక్తి కాన్షియస్‌నెస్,ఇంటెలిజెన్స్,డెసిషన్ మేకింగ్ ఉన్న శక్తి కావాల్సిన అవసరం ఏమిటో మీరు చెప్పగలరా?

    ReplyDelete
  16. లేని దాన్ని నిరూపించడం సాధ్యం కాదు.
    _________________________

    ఇక్కడ "లేదు" అన్న మీ వాదనని నీరుపించమని అడుగుతున్నారు. మీ శుక్ర గ్రహం సాసరే తీసుకోండి - అది తప్పు అని నిరూపించాలంటే అక్కశమంతా తిరిగైనా రావాలి, లేక అది అలా తిరిగే అవకాశం లేదు అని అయినా నిరూపించాలి. నిరూపించలేకపోతే "ఉన్నా ఉండచ్చు, లేకపోవచ్చు" అనేది సమంజసమౌతుంది.


    మనిషికి తెలియని విశ్వ రహస్యాలు ఎన్నో ఉన్నాయ
    ________________________________

    అవి తెలిసేదాకా, వాటికి కారణం దేవుడు అని సిధ్ధాతం ప్రతిపాదించే హక్కు ఆస్తికులకి ఉంది. లేడూ అని రూఢీగా చెప్పాలంటీ దానిని నిరూపించాలి మరి. నిరూపించడీ, లేకపోతే నీరూపించలేమని ఒప్పుకోండి. అలాగే, మానవాతీత శక్తి ఉంది అనేది నిరూపించాల్సిన అవసరం కూడ ఆస్తికులకి ఉంది. ఇద్దరిలో ఎవరూ నిరూపించలేకపోతే, ఏది నిజమో ఎవరికీ తెలియదు.

    మనకు తెలియని శక్తి ఏదయినా ఉంటే ఆ శక్తి కాన్షియస్‌నెస్,ఇంటెలిజెన్స్,డెసిషన్ మేకింగ్ ఉన్న శక్తి కావాల్సిన అవసరం ఏమిటో మీరు చెప్పగలరా?
    _________________________________________________

    అది ఎలాంటి శక్తి అయినా కావచ్చు. అదేమిటో తెలిసేదాకా అన్ని సిధ్ధాంతాలూ న్యాయబధ్ధమైనవే

    ReplyDelete
  17. This is the limitation of logic: Negativeness can't be proved. That is the reason always onus lies on the claimant to prove.

    ReplyDelete
  18. Negativity can be proved and have to be proved if one has to establish the truth. If it is not proved then it cant be established. It can only be believed until its proved wrong, which means that nobody knows whether it is right or wrong.


    A simple example: You DONT have your own picture on this web-page.

    It will not become true unless somebody goes through the page and finds that there indeed is no picture.

    Have you not seen any theorem at least in mathematics, thats proves the non existence of a few things?

    ReplyDelete
  19. Another simple n trivial proof for non existence:



    Hypothesis:

    There is no Second SUN in the solar system as big as our Sun

    Reasoning:

    If there is a second sun as big as ours, it should be visible to us atleast once a year.

    Experiment: Observe the skies for year

    Result: Second Sun is not seen

    Proof of non existence: There is no second sun in the solar system.

    ReplyDelete
  20. Going by your logic, if negativity does not warrant proof, then what about Negativity of Negativity?


    WHAT IF I SAY "THERE IS NO TRUTH IN NOT BELIEVING THE GOD"?

    Do you expect me to prove it or do you support it because it is negative?

    ReplyDelete
  21. >>>Another simple n trivial proof for non existence:<<<

    Similar proof I heard being said by a Muslim Monk.

    "There is no Second God as equal as Allah."

    Proof:
    God is Supreme and Omni Present. If there has to be a second God, then God can not be called Supreme and there can not be two people omnipresent at the same time. So God is one.

    Flaw in Malak's theory is...

    The Sun is cognizable. With the help of the Sun, you can attempt to proove non-existence of Second Sun.

    The muslim monk had a definition of God, and with that help he is able to disprove second God.

    Now let us consider the hypothesis.

    There is no $#@$#@^%(1) in the solar system as big as *&^%$$#$%(2)

    Unless we define 1 and 2 properly, any proof for negation is not possible.

    Define your God with all characteristics he may have. What are his capabilities, how he can affect individuals being a Super spririt, like that. Or the God meant just already defined Ram, Jehova, Allah? Once defined there would be scope for further debate.

    ReplyDelete
  22. non existenceని నిరూపించలేము అంటే ఏ కేసులోనూ నిరూపించలేమూ అని అర్ధం కాదు. రస్సెల్ టీ కప్పు ఉదాహరణలో టీకప్పు శుక్రుడికీ బుధిడికీ మధ్యన ఉంటే లేదని మనం నిరూపించలేము, కానీ టీ కప్పు నా ఎదురుగా ఉన్న బల్లపైన ఉందని అంటే లేదని నిరూపించవచ్చు. కానీ దానికి ముందు టీ కప్పు ఉన్నది అని చెప్పేవారు టీ కప్పుని నిర్వచించాలి, లేకపోతే అది సాధ్యం కాదు.

    టీ కప్పు అక్కడ ఉన్నది అని చెప్పే వారు అది ఆకాశంలో ఉన్నా, లేక బల్లపైన ఉన్నా నిరూపించగలరు, అలా కాకపోతే వారు ఉన్నదని ఎలా అంటారు?

    దేవిడి స్థానంలో మనం ఒక flying spaghetti monster, pink unicorn, russel tea cup, godzilla, dragon లాంటి వేటినయినా పెట్టవచ్చు. మరి అవన్నీ మనం నమ్మము, లేవని నిరూపించలేము కూడా.

    కాబట్టి ముందు ఆస్తికులు దేవున్ని నిర్వచించాలి, ఆ తరువాత నిరూపించాలి. రెండు బాధ్యతలూ ఆస్తికులవే.

    ReplyDelete
  23. అయితే మలక్పేట గారూ, కొసమెరుపు గారు చెప్పినట్లు మీరు ముందు దేవుణ్ణి నిర్వచించండి చాలు. నిరూపణ అక్కరలేదు. మీ నిర్వచనం లాజికల్ టెస్ట్ తట్టుకుంటుందో లేదో తరువాత చూడొచ్చు.

    ReplyDelete
  24. My definition of God:

    A system that spans and controls the universe.

    ReplyDelete
  25. Rather, for more clarity


    Its a system that controls many objects directly and a few more indirectly in the universe.

    ReplyDelete
  26. Now, to prove the hypothesis wrong, you have to prove the "self-controlling" nature of the universe.

    ReplyDelete
  27. ఈ span of controlని ఎందుకు మనిషి పూజించాలి? మీ నిర్వచనం ఈ span of controlకి మనిషి మొరాలకించే స్పృహా, మనిషి అవసరాలు తెలుసుకునే ఙ్యానమూ, కోరికలు తీర్చే శక్తీ ఉందో లేదో చెప్పలేదు. మీరు మీ customized దేవుడికి నిర్వచనం కాదు, మనుషులు సాధారణంగా నమ్మే దేవుడి నిర్వచనం ఇవ్వండి.

    ReplyDelete
  28. ఈ span of controlని ఎందుకు మనిషి పూజించాలి?
    ______________________________________

    పూజించకపోతే మీ ఇష్టం. I offer my prayers out of respect.

    మనిషి అవసరాలు తెలుసుకునే ఙ్యానమూ, కోరికలు తీర్చే శక్తీ ఉందో లేదో చెప్పలేదు.
    ______________________________________________

    May be it does, may be it does not - nobody knows!


    మనుషులు సాధారణంగా నమ్మే దేవుడి నిర్వచనం ఇవ్వండి.
    ____________________________________

    LOLOLOLOLOLLLLLLLLLLLLLLLLLLLLLLLL

    నిర్వచనం కూడా మీరు చెప్పినట్టే ఇవ్వాలా? :))

    ReplyDelete
  29. అన్నట్టు బ్లాగులున్నది వాదులాటకు కాదు అన్న మీ stance మార్చుకున్నట్టేగా?

    లేకపొతే ఆ వాదన ఆ ఒక్క పోస్టుకే పరిమితమా?

    ReplyDelete
  30. అన్నట్టు ఇక్కడ విషయం ఎందుకు పూజించాలి అనేది కాదు.

    "Can Negativity be proved or not" అనేది. So you changed your stance and agreed that Negativity can be proved.

    So, to prove that your argument is valid, you have to disprove mine.

    ReplyDelete
  31. I didn't change my stance and maintained that negativity cannot be proved and always the onus lies in the claimer to prove. What I said is that the traditional god definition does not even pass logical test.

    By the way for this blog I am the "span of control". Here i define the code. I don't like such posts with LOLs. You can laugh as much as you want in your own, not in my blog.

    ReplyDelete
  32. I decide where to stop the argument, not you in my blog. if you keep on repeating the same questions and do not sea the logic provided, then it is your problem, I can't drag the discussion.

    Thanks for your comments and interest in my post anyway.Bye.

    ReplyDelete
  33. Your definition was not clear to show all aspects of the god. If you call a rock as God, that is your wish, no one needs to disprove that.

    Unless you maintain decency please do not comment here.

    ReplyDelete
  34. "LOL" - I understand your frustration - Bye

    ReplyDelete
    Replies
    1. "LOL" ani pettadam frustration teliyachesthundhi kani ...ala pettadu anadam kadu

      Delete
  35. Now let me use your style

    I define what my God is - Not you right? If you dont have enough brains to understand it, then its your own problem.

    ReplyDelete
  36. This comment has been removed by the author.

    ReplyDelete
  37. By the way I didnt repeat the question - I asked you one staright question and you didnt have any answer to that. You realized you were caught on the wrong foot, but too egoistic to admit that. Hence this frustration. Newayz as you said, if necessary I will use my blog hereafter. Ciao :))

    ReplyDelete
  38. >>>Its a system that controls many objects directly and a few more indirectly in the universe.<<<

    controls - What sort of controls?
    many objects - examples?
    few more indirectly - examples?

    By giving this vague definition of God itself dismisses all existing notions of God.

    ReplyDelete
  39. dismisses all existing notions of God.
    _______________________________________

    THis is my definition of God and I dont care if it dismisses the existing notions. You asked my definition and I gave you.

    Examples for direct controls: Birth and Death of the Nebulae , Stars etc

    Example for indirect controls: Human evolution

    Now, the onus is on you to prove that everything is self controlled!

    And by the way the discussion here is about the notion of God, not vagueness or clarity. If you cant disprove my hypothesis honestly agree that you cant - instead of trying to sidetrack the issue.

    ReplyDelete
  40. By the way why are you bothered about the notions of God? You are as such a non believer. So all that you need is a definition of a super-universal force and I gave you one.

    Now there are two oprions - you either disprove it or accept the inability to do so. Keeping it simple.

    ReplyDelete
  41. >>>I dont care if it dismisses the existing notions<<<

    Here you have already accepted that the definition of yours already differing existing notions God.

    Saying that you have accepted your inability to define commonly accepted God.

    If you want to believe a God, who is sitting somewhere (nowhere?) and creating nebulae etc and indirectly causing evolution, it is upto you. But if you have to propose that theory, burden is on you to prove the God alone is doing all these things.

    You may have to further specify, if the God of your has the capabilities said to be possessed by commonly believed God like...

    - If you pray he will solve your problems
    - He will cleanse your sins
    - He will heal your wounds etc.

    If your God have the above qualities, then you have to prove how he performs these things.

    Else

    You are just another agnostic who is unsure about God.

    ReplyDelete
  42. Ohh is it?

    Do you have the proof that the commonly defined God has the three characteristics that you have mentioned?

    Even if we accept it as the definition, may be it does heal. Prove your point that EVERY healing is self controlled or every solution is self controlled then I will agree.

    I already said I am unsure about the form of God and until somebody proves are disproves it, I cant be sure.

    It's you guys who are saying that the God doesnt exist without putting forward any argument.

    ReplyDelete
  43. If you are unsure about God, there is no need of any argument at all.

    Theists coined the word God.

    They have to explain and prove.

    You are unsure of God.

    Which means you are not believing what Theists had to say in toto.

    Which means that you have already deviated a large extent from theists' argument. From surity to unsurity. From belief to non-belief.

    ReplyDelete
  44. శ్రీ సత్యాన్వేషి గారికి, నమస్కారములు.

    మీ వ్యాసం, దానిపై నడిచిన ఆసక్తికరమైన చర్చలు, ముఖ్యంగా, శ్రీ మలక్పేట రౌడీగారు వ్యాఖ్యలు చదివాను. "భగవంతుడు" గురించి, మీకు మరికొన్ని వివరాలు కావలంటే, నా బ్లాగు లోని " ఎవరీ భగవంతుడు? ( రెండు భాగాలు ) చదవండి. నా బ్లాగ్ లింక్ క్రింద ఇస్తున్నాను.

    http://madhavaraopabbaraju.wordpress.com/category/%e0%b0%86%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95%e0%b0%82spiritual/


    భవదీయుడు,
    మాధవరావు.

    ReplyDelete
  45. మాధవరావు గారూ,

    మీ టపాలు రెండూ చదివాను. అందులో మీరు భగవంతునిపై ఇచ్చిన వివరణ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిపై మన ఋషులు చెప్పింది సత్యము అనే pre conceived notion పైన ఆధారపడింది. ఇది circular logic అవుతుంది.

    మీరు మీ టపాలో భగవంతుడిని నిర్వచించి, మీ నిర్వచనానికి సరిపోయే తార్కిక వివరణ ఇవ్వలేదు.

    మీ టపాలో నాకు అర్ధమయింది ఏమిటంటే భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని. అప్పుడు విశ్వానికి భగవంతుడు అని మరో పేరు పెట్టి పూజించవలసిన అవసరం ఏమిటొ మీరు చెప్పలేదు. ఈ విశ్వానికి చైతన్యం, స్పృహా ఎలా ఉంటుందో తార్కిక వివరణ ఇవ్వలేదు.

    ReplyDelete