Wednesday 26 May 2010

అబద్దానికి పరాకాష్ఠ - ఓదార్పు యాత్ర జరగదేమోనని హఠాన్మరణం

ఒక అబద్దాన్ని ఎంత వరకు సాగదీయవచ్చు? అది అబద్దమని అందరికీ తెలిసిన తరువాత కూడా ఆ అబద్దానికి తోడుగా మళ్ళీ మళ్ళి అబద్ధాలు చెప్పడం ఎలా సాధ్యం? మరి మన రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏదయినా సాధ్యమే కదా?

హెలికాప్టర్ కూలి వైఎస్సార్ చనిపోయిన తరువాత మొదటిగా వరంగల్ జిల్లాలో ఒక కుగ్రామంలో ఒక కుండలు చేసుకునే కుమ్మరి రోజులతరబడి అచేతనంగా ఉండి కూడా విచిత్రంగా వైఎస్సార్ మరణవార్త విని హఠాన్మరణం చెందాడు. విచిత్రంగా వాళ్ళింట్లో టీవీ కూడా లేకుండానే అతగాడు వైఎస్సర్ సంక్షేమ పధకాలగూర్చి తెలుసుకుని, అతను చనిపోతే ఆ పధకాలు ఉండవేమో అని చనిపోయాడట!!

వరంగల్లో ఒక వైఎస్సార్ అనుంగు భక్తురాలైన రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రిణి మొదలు పెట్టిన ఈ కొత్త ఆట రాష్ట్రమంతటికీ పాకి వారం రోజుల్లో ఐదు వందల మరణాలు రికార్డు అయ్యాయి. మరి ఆ వారం రోజుల్లో రాష్ర్టంలో ఇతర సహజ మరణాలు ఏవీ జరగలేదు, అనీ వైఎస్సార్ చనిపోతే తట్టుకోలేక గుండె ఆగిన చావులే!!ఆ అబద్ధాన్ని మన యువరాజు ఇంకాస్త పొడిగించి ఒదార్పు యాత్ర పేరుతో ఒక రాజకీయ యాత్రను సాగదీస్తున్నాడు. ఏది పెద్ద అబద్ధం? గుండాగిన చావు వార్తలా, లేక ఆ చావులకు ఓదార్పులా అని నాకు సందేహం వచ్చింది.

ఇప్పుడు ఆ రెండు అబద్దాలకంటే మరో పెద్ద అబద్దాల ఆట మళ్ళీ అదే రాజకీయ నాయకురాలు మొదలు పెట్టింది. వరంగల్ జిల్లాలో ఒక వ్యక్తి వై ఎస్ జగన్ యాత్రకు అడ్డంకులు కలుగుతున్నాయనే ఆవేదనతో షాక్ మరణం చెందాదట!! ఆయన షాక్ తిని చనిపోవడం ఏమో గానీ ఆ వార్త నాకు షాక్ ఇచ్చింది. అమ్మో..నేను కూడ ఒక సారి నా గుండెని టెస్టు చేయించుకోవాలి..ఇలాంటి వార్తలు విని నా గుండె తట్టుకునేలా లేదు!!

21 comments:

  1. ఈమధ్య రాష్ట్ర రాజకీయాలు పెద్దగా పట్టించుకోవట్లేదు లేండి. ఓదార్పు యాత్ర అంటే YSR మరణానికి సంబంధించిందా? సరిపోయింది. నేనింకా, ఆ మధ్య వచ్చిన వరదలదో లేక కరువుకు సంబంధించిందో అనుకున్నా

    ReplyDelete
  2. మళ్లీ వీరి ఓదార్చడానికి ఇంకొక యాత్ర చేస్తాడేమో

    ReplyDelete
  3. ఈ విషయం చదివి నేను కూడా నా గుండె పనిచేస్తోందా లేదా అని ఓ సారి తడిమి చూసుకున్నానండి :))

    ReplyDelete
  4. యాసర్ అరాఫత్ చనిపోయినప్పుడు ఒక్క పాలెస్తీనీయుడైనా ఆత్మహత్య చేసుకున్నాడా? సద్దాం హుస్సేన్ చనిపోయినప్పుడు ఒక్క ఇరాకీయుడైనా ఆత్మహత్య చేసుకున్నాడా? రాజశేఖర రెడ్డి ఏమీ వీళ్ళిద్దరిలాగ జాతి కోసం పోరాడలేదు. అతను ఒక ఫాక్షనిస్ట్. 1978 నుంచి అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇతని కోసం ఇతని బంధువులైనా త్యాగం చేస్తారంటే జోకే.

    ReplyDelete
  5. this is too much funny news.. కానివ్వండి.. ఇలా అన్న వాళ్ళ నాన్న ఇచిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు.. లేకపోతె ఏమి చేసుకోవాలో అర్ధం కాదు..

    ReplyDelete
  6. చాల బాగా చెప్పారు

    ReplyDelete
  7. ఈ వార్తని టీవి-5, సాక్షి టీవీ మాత్రమే ఎక్కువ హైలైట్ చేస్తున్నాయి.

    ఈ చనిపోయిన వ్యక్తి ముందు రోజంతా ఎండలో వై ఎస్సార్ విగ్రహం దగ్గర ఏర్పాట్లకై పని చేసాడట. టీవీలో చెపుతున్నారు. బహుశా వడదెబ్బ ఎక్కువై చనిపోయి ఉంటాడు. పోస్టు మార్టం చేస్తే గాని నిజం తెలియదు.

    ReplyDelete
  8. జగన్ అభిమానుల మూర్ఖత్వానికి పరాకాష్ఠ ఈ వార్త

    ReplyDelete
  9. వామ్మో.. పైత్యం తారాస్థాయికి చేరుతోంది ఈ రాజకీయ నాయకులకి.
    అయినా నాకో పెద్ద సందేహం.. వై యెస్ పోతే వాళ్ళింట్లో ఒక్కళ్ళకి కూడా గుండె నొప్పి గానీ, షాకు మరణం గానీ ఏవీ రాకుండా సుబ్బరంగా ఉన్నారు కదా! జనాలకే ఎందుకొచ్చాయో ఇవన్నీ.. అంటే, ఆపాటి ప్రేమ కూడా లేదన్నమాట పాపం ఆయన కుటుంబ సభ్యులకి. ప్చ్!

    ReplyDelete
  10. ఇంకో పెద్ద జోకేమిటంటే విజయవాడలో వీధి రౌడీ అయిన దేవినేని నెహ్రూ ఓడిపోయాడని ఆత్మహత్య చేసుకోవడం. దేవినేని నెహ్రూ ఒకప్పుడు ప్రైవేట్ పంచాయితీలు పెట్టి డబ్బులు సంపాదించేవాడు. ఫాక్షనిస్టులు, మాఫియా లీడర్ల కోసం కూడా ఆత్మహత్యలు చేసుకునే అమాయకులు ఉంటారా?

    ReplyDelete
  11. సత్యాన్వేషి గారూ,

    బాగా చెప్పారు. వై యెస్ పోయిన వారం రోజులూ నెలలతరబడీ తీసుకుంటున్న నూరేళ్ళ ముసలమ్మ దగ్గర్నించీ, పురిట్లో పోయిన శిశువు దాకా.. ఆయన పోయిన షాక్ వల్లే పోయారు.. జగన్ గారు మాత్రం ఎవరైనా ఆయన తండ్రిని మర్చిపోతున్నారన్న అనుమానం వచ్చినప్పుడల్లా.. ఇడుపులపాయ కి వెళ్ళి మొదలు విరిగిన చెట్టులా కూలబడుతూ ఉంటారు..
    పైగా 2 టీ వీ చానల్స్ దీన్ని లైవ్ టెలీకాస్ట్ చేయటం..

    కరెక్ట్..మధురవాణిగారూ,
    సురేఖ, కె వి పి, జగన్,విజయలక్ష్మి, చేవెళ్ళ చెల్లెమ్మ లాంటి వై యెస్ అను/సహ చరులకి మాత్రం ఒక వెంట్రుక కూడా రాలలేదు.

    జనాలంటే జోకైపోయింది వీళ్ళకి.

    కృష్ణప్రియ

    ReplyDelete
  12. నిజమే. నాకు నవ్వు పుట్టించే విషయం ఏమిటంటే మిగతా అన్ని పత్రికలలో కూడా వై.ఎస్ మరణ వార్త విని చనిపోయారని రాసారు. సాక్షి లో అయితే 800 మందికి పైగా చనిపోయినట్టు రాసారు.
    "వరంగల్ జిల్లాలో ఒక వ్యక్తి వై ఎస్ జగన్ యాత్రకు అడ్డంకులు కలుగుతున్నాయనే ఆవేదనతో షాక్ మరణం చెందాదట!! ఆయన షాక్ తిని చనిపోవడం ఏమో గానీ ఆ వార్త నాకు షాక్ ఇచ్చింది. అమ్మో..నేను కూడ ఒక సారి నా గుండెని టెస్టు చేయించుకోవాలి..ఇలాంటి వార్తలు విని నా గుండె తట్టుకునేలా లేదు!!"

    ఈ వార్త నేను కూడా నిన్న వాళ్ళ సొంతచానెళ్ళో డబ్బా కొట్టుకుంటుటే చూసాను.ఏమిటో ఈమద్య మన జనాల గుండెలు మరీ సున్నితంగా తయారయ్యయి.

    ReplyDelete
  13. సత్యాన్వేషి గారూ...,

    నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
    ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
    నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
    మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

    తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
    తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
    హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

    - హారం ప్రచారకులు.

    ReplyDelete
  14. సత్యాన్న్వేషి గారూ,
    మీ అన్వేషణలో జగన్ యాత్రకు రావొద్దని జరిగిన మరణాన్ని కూడా ప్రస్తావిస్తే బాగుండేది. ఇక్కడ సమస్య అబద్దం కాదు. ఆతిశయోక్తి. ఏవో కొన్ని జరిగితే ఇంక వాటిని వాడుకోవటం మొదలు పెట్టేస్తారు మనవాళ్ళు. తెలంగాణా కోసం, తక్కువ మార్కులొచ్చాయనీ, సమైక్య రాష్త్రం కోసం of course ప్రేమ కోసం ఎన్నో కారణాలతో జరుగుతుంటాయి మరణాలు. వాటిని glorify చెయ్యడం అవివేకం, ఆవి అసలు జరగనే లేదన్నట్లు చెప్పడం అసత్యం. ఆటువంటివి జరగడం మాత్రం దారుణం అనేది సత్యం.

    ReplyDelete
  15. @ మధురవాణి
    మీరు చెప్పింది నిజమేనండోయ్. వాళ్ళ నాన్నగారు మరణించిన బాధతో ఇప్పుడయినా అర్జంటుగా జగనుకి గుండెపోటు రావాలని డిమాండ్ చేస్తున్నాను. అది కుదరకపోతే, రాకపోతే కం సే కం పెట్రోలు చల్లుకొని అయినా ఆత్మాహుతి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను!

    ReplyDelete
  16. రాజస్థాన్ లో కలవారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే, వారికి ఏడుపు రాక ఇతరులతో ఏడిపించుకుని డబ్బులిచ్చే సంప్రదాయం ఉంది. ఈ విషయం రుడాలి అనే హిందీ సినిమాలో చూడ వచ్చు. అలాగే మన జగనన్న కూడా...

    ReplyDelete
  17. ఈ రోజు ఇంకో వ్యక్తి గుండె ఆగి చనిపోయాడు. ఆ విషయం చెప్పినందుకు అతని కుటుంబ సభ్యులకి ఎంత డబ్బులు ఇచ్చారో? ఆకలితో బాధ పడే పేదవాళ్ళు కొన్ని వేల రూపాయలు, మరీ పేదవాళ్ళైతే కొన్ని వందల రూపాయలైనా తీసుకుంటారు, సహజ మరణం ఆత్మహత్య అని చెప్పడానికి.

    ReplyDelete
  18. ఏమిటో ఈ గుండెలు మరీ ఈ మధ్య బలహీనమైపోయాయి.ఓదార్పు యాత్ర జరగదేమో అని ఒక గుండె,జరుగుతూ జరుగుతూ మధ్యలో ఆగితే ఒక గుండె, జగన్ అరెస్ట్ అయితే ఒక గుండె, అరెస్ట్ అయిన గంట లో బెయిల్ రాకపోతే ఒక గుండె ఇలా ఎన్ని గుండెలు కావాలన్నా ఆగబడును అన్నట్లు తయారయ్యాయి గుండెలు!

    చిన్న చిన్న విషయాలకే తట్టుకోలేకపోతున్నాయి పాపం! ఎవరు ఎలా పోయినా వై యెస్ ఖాతాలోనో, జగన్ యాత్రా ఖాతాలోకో చేరే గుండెలెన్నో ఏమిటో!

    ముక్కూ మొహం తెలీకుండా ఇంతింత అభిమానాలెలా పుట్టుకొస్తాయో ఏమిటో, బొత్తిగా అర్థం కాదు!

    ఈ అబద్ధాలన్నీ వినీ వినీ విసుగేసి మన గుండెలు నిజంగానే ఆగకుండా జాగ్రత్త పడాలి!పిల్లలు గలవాళ్లం!అసలే మనకు ఆరోగ్యశ్రీ కూడా వర్తించదు.

    ReplyDelete
  19. సహజ మరణాన్ని గుండెపోతు మరణంగా చూపించడం పెద్ద కష్టం కాదు. ఆరోగ్యంగా ఉన్న మనిషి బతికేది నూరు సంవత్సరాలు(36,500 రోజులు). వైద్య సౌకర్యాలు సరిగా లేని నల్లమల, ఏటూరు నాగారం లాంటి ప్రాంతాలలో నలభై ఏళ్ళకే చనిపోవచ్చు. జన సాంద్రత తక్కువగా ఉన్న ఒక ప్రాంతంలో ఒక మండలంలో 36,500 జనాభా ఉందనుకుందాం. అక్కడ వైద్య సౌకర్యాలు సరిగా లేవనుకుందాం. అక్కడ రోజుకి ఒకరు కాదు, ముగ్గురు చనిపోయినా ఆశ్చర్యం లేదు.

    ReplyDelete