మరో తెలంగాణా విద్యార్థి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణాలో ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలు కొత్తవిషయం కాదు, వందలాది విద్యార్థులు తెలంగాణా ఉద్యమం కోసం ఆత్మహత్యలకు పాల్పడ్డారు, నేడు ఆత్మహత్య ఇషాన్‌రెడ్డి వంతయింది.
అయితే ఈ ఆత్మహత్య మిగతా ఆత్మహత్యలకంటే భిన్నమయినది. ఇషాన్ అందరిలా తెలంగాణా వాదం బలపడాలి అనో, లేక తన చావుతో కేంద్రం తెలంగాణా ఇస్తుందనో భ్రమ పడి ఆత్మహత్య చేసుకోలేదు. ఇతను పీసీసీ ప్రెసిడెంట్ డీఎస్ ఓడిపోవాలని మైసమ్మకు మొక్కుకొని, తన కోరిక నెరవేరడంతో మైసమ్మకు తన మొక్కును తీర్చుకోవడం కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు అతని స్యూసైడ్ నోట్ ద్వారా తెలుస్తుంది.
మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ అంతా తెలంగాణా పళ్ళెళ్ళో గ్రామ దేవతలు. ఇక్కడి ప్రజలు ఈ గ్రామదేవతలదగ్గర తమ కోరికలు తీరిస్తే కోడిని కోస్తాను, మేకను కోస్తాను అని మొక్కుకుంటారు. ఇషాన్ ఇంకాస్తా ముందుకెళ్ళి తన ప్రాణాలనే అర్పిస్తానని మొక్కుకున్నాడు.
కొందరు తమ కోరికలు నెరవేరితే తిరుపతి వెంకటేష్వరునికి తలనీలాలు ఇస్తామని, హుండీలో డబ్బులు వేస్తామనీ మొక్కుకుంటారు. మరికొందరు సత్యనారాయణ వ్రతం చేస్తానని మొక్కుకుంటారు. ఇంత సోఫిస్టికేటెడ్ కాని కొందరు పోచమ్మకు మేకని బలి ఇస్తానని, మైసమ్మకు కోడిని ఇస్తామని మొక్కుకుంటారు.నేడొక తెలంగాణా విద్యార్థి తన సొంత ప్రాణాలనే మొక్కుకున్నాడు. ఇతని చావుకు కారణం దేవుడు లంచాలు తీసుకుని మొక్కులు తీరుస్తాడని బ్రెయిన్ వాష్ చేసిన మన సమాజమే అని నాకనిపిస్తుంది.
ఇందులో బ్రెయిన్ వాష్ ఎవరికి? అసలు బ్రెయిన్ వుంటే వాష్ చేయడానికి! అర్థంలేని బ్రతుకులు, అర్థంలేని చావులు. మూర్ఖ తెలంగాణా వాదం ఇక్కడి మూఢ నమ్మకం. మరోసారి రిజైన్ చేసి , మళ్ళీ ఎన్నికల్లో ఎన్నుకోండని వెంపర్లాడితే, మూర్ఖ జనం మళ్ళీ ఎన్నుకుంటారు. ఇందులో హేతువాదం వుందా అని వెతకండి.
ReplyDeleteతెలంగాణా వాదంలో హేతువు గురించి వాదన ఈ టపా ఉద్దేషం కాదు. దానికి వేరే టపాలు ఉన్నాయి, అక్కడ మీరు కామెంట్ చెయ్యొచ్చు.
ReplyDeleteఈ సంఘటన తెలంగాణాకు పరిమితం కాదు. రేపు మరో విషయంపై ప్రాణాలు అర్పిస్తానని సీమాంధ్ర వాడు మొక్కుకోవచ్చు, ఇంకోడు మొక్కుకోవచ్చు. మీరు అతని విశ్వాసంపై కామెంట్ చేస్తే బెటర్.
చాలా బాధాకరమైన సంగతి.
ReplyDeleteమీ బ్రెయిన్ వాష్ సిద్ధాంతం మాత్రం తప్పులెండి. దేవుడికి దణ్ణం పెట్టకొనేవాళ్ళు + డియెస్ ఓడిపోవాలని కోరుకొనేవాళ్ళు కోట్లాది మంది అఉండుంటారు. కానీ ఒక్కడే బలి ఇచ్చుకున్నాడేంటి? కొన్ని తెలివితక్కువ జనమలు అంతేనండి. ఎవరిదో తెలివితక్కువతనానికి సమాజాన్నంటే ప్రయోజనమేముంది?
@చదువరి
ReplyDeleteఎందరో ఇస్లాం మతాన్ని చక్కగా పాటిస్తున్నారు, కానీ కొందరే తీవ్రవాదులుగా మారుతున్నారు. మనుషుల్లో ఎందరో మతాన్ని ఆచరిస్తారు, కానీ కొందరే మతఘర్షనలకు పాల్పడతారు.
మీ వాదన బ్రెయిన్ వాష్ లేదని నిరూపించదు, కేవలం బ్రెయిన్ వాష్ కి అందరూ ఒకే విధంగా రియాక్ట్ కారని చెబుతుంది.
మానసిక బలహీనులు అనిపిస్తొంది
ReplyDeleteNIJAMGA INTHA MOORKATWAMA.DAYACHESI MUNDU EE MOORKATWANNI POGOTTANDI.TARWATA DEVELOPMENT ADHE VASTHUNDI.ANTHEKANI PRATYEKA TELANGANA VACHHINANTHA MAATRANA MANA BATUKULU MAARIPOVU.MOORKATWANNI PARADROLUDAM MANA BATUKULU BAGUCHESUKUNDAM.
ReplyDelete/మీ వాదన బ్రెయిన్ వాష్ లేదని నిరూపించదు, కేవలం బ్రెయిన్ వాష్ కి అందరూ ఒకే విధంగా రియాక్ట్ కారని చెబుతుంది./
ReplyDeleteWere you talking on proofs for existance of 'Brain-washism'? humm .. May be .. you proved it.
Regarding Telangana Brain-wash, why don't you folks brain-wash them to your hETuvaadam. :) Your hETuvaadam is certainly better than stupid seperatism. I support it!
Is not Maoist-communism a type of brain-washism?
@RKRAJU
ReplyDeleteమూర్ఖత్వం ఎక్కడ లేదు చెప్పండి? రాయల సీమలో ముఠా కక్షలతో జనం కొట్టుకుంటే అందుకు సంబంధం లేని వారు తన్నుకు చస్తారు. జగన్ వెనకాల మూర్ఖుల్లా పరిగెడతారు.
తన కోరిక తీరాలని తలనీలాలివ్వడం, ప్రాణాలివ్వడం రెండూ మూర్ఖత్వమే, కొంచెం డిగ్రీలో తేడా, అంతే. ఈ మూర్ఖత్వం ప్రాంతాలకి అతీతంగా అన్ని చోట్లా ఉంది, దాన్ని గమనించకుండా తెలంగాణా ప్రజలని నిందించడం మూర్ఖత్వం.
ఈ మూర్ఖత్వం ప్రాంతాలకి అతీతంగా అన్ని చోట్లా ఉంది, దాన్ని గమనించకుండా తెలంగాణా ప్రజలని నిందించడం మూర్ఖత్వం.
ReplyDeleteఇక్కడ తెలంగాణా ప్రజలను ఎవరూ నిందించలేదే??
అసలు ఇక్కడ తెలంగాణా పేరు ఎందుకు? ఈ జరిగిన దానికి తెలంగాణాకు సంబంధం ఏమిటి?
ఒక వ్యక్తి ఇలా తనను తనే చంపుకోవడం నాగరిక సమాజానికి గొడ్డలిపెట్టు.. అది తెలంగాణా వాడైనా లేక కడపవాడైనా ప్రాణం విలువ ఒక్కటే..
మరోమాట,, రాయలసీమ గురించి సీమ ప్రజల గురించి చాలా ధారాళంగా మాట్లాడుతున్నారు.. మీరు సీమలో ఎన్ని రోజులు ఉన్నారు? లేదా మీరు సీమ గురించి ఏదైనా స్టడీ చేశారా?? In short what I am asking is your qualification/knowledge about people of Royalaseema..
ఓహో మీరు ఇందులోకి లాక్కొచ్చారా? కానీ దానికీ దీనికీ పోలిక అంతగా కుదర్లేదు. ఎందుకో చూద్దాం. అయితే ముందు, కింది స్టేటుమెంటు సంగతి:
ReplyDelete"మీ వాదన బ్రెయిన్ వాష్ లేదని నిరూపించదు, కేవలం బ్రెయిన్ వాష్ కి అందరూ ఒకే విధంగా రియాక్ట్ కారని చెబుతుంది." - నేను చెప్పిందీ అదేనండి- "ధారాళమైన నీతులు నోరూరగ చవులుపుట్ట నుడివెద సుమతీ" అని మొదలయ్యేవాటిని కొందరు నీతి సూత్రాలుగా భావించి పాటిస్తారు. కొందరు బ్రెయిన్ వాషనో మరోటో అనుకుంటారు. మన దృక్కోణాన్ని బట్టి మన దృష్టి. మీరు అలా అంటున్నారని నా ఉద్దేశం కాదు సుమండీ - (మీరు పద్యాలు రాస్తారని నాకు తెలుసు) నేను వేరే బ్లాగులో చదివాను, బ్రెయిన్ వాష్ గురించి.
దేవుడికి ఏదైనా ముడుపు కట్టుకుని మొక్కుకుంటే కోరిక నెరవేరుతుందని పెద్దలు చెబితే, (దాని వెనువెంటనే ’కృషి చెయ్యనిదే దేవుడు నీ తోడుండడ’నీ చెబుతారు) తెలివైన వాడు జుట్టు ఇస్తానని మొక్కుంటే, మూర్ఖుడు తల ఇస్తానని మొక్కుంటాడు. ఎక్కడో కోటికో శతకోటికో ఒక్కరు ఉంటా రలాంటివారు. అందుగ్గాను సమాజాన్ని తప్పు పడితే ఎలాగ? కూరగాయలు కోసే కత్తితో ఎవడో హత్యలు చేసాడని కత్తిని తప్పుపడతారా?
ఇక ఇస్లామిక్కు ఉగ్రవాదుల గురించి. అసలిప్పటి సంఘటనకూ దీనికీ సంబంధం లేదు. కానీ మీరు లేనెత్తారు కాబట్టి రాస్తున్నాను.
మనిషి తనను తాను బలి ఇచ్చుకోడానికి మన సమాజం శిక్షణ ఇవ్వడంలేదు. సహస్రాబ్దుల కిందట, శతాబ్దుల కిందటా సూక్తులైనవి నేడు పాటించడం లేదు. కొండొకచో పాటిస్తే తప్పు, నేరం కూడా. ఉదాహరణకు సతీ సహగమనం.
1. ఇస్లామిక్కు ఉగ్రవాదం అలాక్కాదు. అదొక వ్యవస్థీకృత నేరప్రపంచం. ప్రాణాలు తీసేందుకు జిహాదీకి శిక్షణ ఇస్తారు.
2. ఇస్లాము పేరిట జనాన్ని చంపమని వాళ్ళకు శిక్షణ ఇస్తున్నారు. దేవుణ్ణి నమ్మనివాడికి జిహాదులో చోటులేదు. ఇస్లామిక్ ఉగ్రవాదమని ఊరికే అనలేదు.
3. ఉగ్రవాదులని పెంచి పోషించే దేశాలున్నై - పాకిస్తానులాంటివి. ఎందుకు పోషిస్తున్నాయవి? మతమే కారణం! ఇలాంటి దేశాలు ఇంకా ఉన్నై. ముస్లిముల్లో ఉగ్రవాదులు చాలా తక్కువే. కానీ, నాలుక్కోట్లమందిలో ఒక్క ఇషాన్ రెడ్డి లాగా కాదక్కడ.అంతకంటే లక్షల రెట్లు ఎక్కువ. ఆ రెంటికీ పోలిక లేదు.
4. కురాను కాఫిర్లను అసహ్యించుకోవాలి, వేధించాలి, బాధించాలి, చంపాలి, మానభంగం చెయ్యాలి, బానిసలుగా చేసుకోవాలి ఇలాటివేవో చెబుతుంది. మధ్యయుగం నాటి పద్ధతులే, నిజమే. అప్పట్లోను, అంతకు ముందూ అలాంటి మూర్ఖత్వం అన్ని మతాల్లోనూ ఉండేవని అంటే, సరే వాదించను. కానీ, సంగతేంటంటే, ఈ జీహాదీలు వాటిని ఇప్పుడూ పాటిస్తారు, పాటించమని బోధిస్తారు. ఈ జీహాద్ పేరిటే కదా, మనకూ, పాకిస్తానుకూ ఏమాత్రమూ సంబంధం లేకపోయినా, ఎక్కడినుంచో వచ్చి మెర్సినరీలుగా చేరి కార్గిల్లో యుద్ధం చేసింది. ఈ మతఛాందస ఉగ్రవాదులు కాదూ బమియాన్ బుద్ధ విగ్రహాలను పేల్చివేసింది? లక్షలాది ఉగ్రవాదులు, కోట్లాది సానభూతిపరులూ ఉన్న వ్యవస్థ అది. ఇప్పుడు అణ్వాయుధాలు వాళ్ళ చేతుల్లో పడతాయేమోని దేశాలే దడదడలాడుతున్నాయి.
దేశాలను పరిపాలించే స్థాయిలోను, దేశాలను కూల్చేసే స్థాయిలోను ఉన్న ఇస్లామిక ఉగ్రవాదంతో ఇషాన్ రెడ్డి ఆత్మబలిని పోలుస్తారేంటి? ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృతమై, ఇస్లాము బోధనలనే ఇంధనంగా చేసుకుని నడిచే ఈ ఉగ్రవాద వ్యవస్థను మన సమాజంతో పోల్చడమేంటసలు?
snkr,
ReplyDeletemoorkha telangana vaadam ani nuvvante...moorkha samaikyavaadam ani memu antaam..moorkha samaikya vaaadulu..
@ karthik
ReplyDelete>>>ఇక్కడ తెలంగాణా ప్రజలను ఎవరూ నిందించలేదే??>>> RKRAju నిందించాడు
>>>ఒక వ్యక్తి ఇలా తనను తనే చంపుకోవడం నాగరిక సమాజానికి గొడ్డలిపెట్టు.. అది తెలంగాణా వాడైనా లేక కడపవాడైనా ప్రాణం విలువ ఒక్కటే..
బాగా చెప్పారు.
>>>మరోమాట,, రాయలసీమ గురించి సీమ ప్రజల గురించి చాలా ధారాళంగా మాట్లాడుతున్నారు.. మీరు సీమలో ఎన్ని రోజులు ఉన్నారు? లేదా మీరు సీమ గురించి ఏదైనా స్టడీ చేశారా??
నేను రాయలసీమలో లేను, ధారాళంగా మాట్లాడాననేది అబద్ధం. నేను స్టడీ ఏదీ చెయ్యలేదు. రాసిన దానిలో తప్పేదయైనా ఉంటే చెప్పండి. జగన్ వెనుక పరుగెడుతున్నారని చెప్పింది రాయలసీమ వాసుల గురించి కాదు, అందరి గురించీ.
సారీ ముఠా కక్షల తర్వాత జగన్ గురించి రాసుంటే అది సీమ ప్రజల గురించి అనుకున్నాను..
ReplyDeleteఇక జగన్ వెనుక పరుగెత్తడం వెనుక ఆర్థిక కారణం బలమైనది నా అభిప్రాయం.. ఒక మనిషి రోజు మొత్తం కూలి చేస్తే వచ్చేది 70/- అదే ఏ రాజకీయ మీతింగుకో వెళితే 100+ భోజనం.. ఐదు వేళ్ళూ నోట్లోకి పోవాలంటే ఈ దేశంలో ఇలాంటివి తప్పవండీ..
ఏది ఏమైనా జరిగిన ఘోరానికి మనం ఒక సమాజం గా బాధ్యత తీసుకోవాలి.. ఒకరినొకరు మాటలనుకోవడం వల్ల ఉపయోగం లేదు..
b/n I just went through RKRaju's comment and he criticised telangana vaadam not people of telangana..
@ చదువరి గారూ,
ReplyDeleteఇస్లామిక్ తీవ్రవాదం గురించి సుదీర్ఘ వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పాయింటు అర్ధం కావడానికి ఉదాహరణ కోసం మాత్రమే నేను దాన్ని వాడాను. మరో తపాలో జిహాద్ గురించి విపులంగా చర్చిద్దాం.
ఇక మన సమజంలో తనను తాను బలి ఇవ్వడానికి శిక్షణ ఇవ్వలేదు. కానీ సమాజం "దేవుడు వరం ఇవ్వాలంటే ప్రతిఫలంగా ఏదో ఆశిస్తాడు" అనే మూర్ఖ వాదాన్ని చక్కగా శిక్షణ ఇచ్చింది. ఆ ప్రతిఫలం కొబ్బరి కాయ కావచ్చు, కోడి లేక మేక కావొచ్చు, పొర్లు దండాలు కావొచ్చు. ఇవన్నీ అయినప్పుడు ఆత్మ బలిదానం మాత్రం ఎందుకు కాకూడదు? ఇప్పుడు అదే జరిగింది. ఇది మొదటి సంఘటణ అని నేననుకోను, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగి ఉంటాయి, ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన. కొన్ని చోట్ల మేక పిల్లలకి బదులుగా చంటి పిల్లలని బలి ఇవ్వడం కూడా మీరు చదివే ఉంటారు.
@చదువరి
ReplyDeleteనా పద్యాలను గమనించినందుకు ధన్యవాదాలు. మీబోటి వారి ప్రేరణతో ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్నాను.
సత్యాన్వేషి గారూ,
ReplyDeleteఈ ఆత్మహత్య కేవలం మూఢ నమ్మకం కాదేమో ననిపిస్తుంది. ఆత్మ త్యాగం చేయ దలచిన వాడు ఏదో ఒక కారణం వెదుకుతాడు. అలా వెదికిన కారణంగా ఇది కనబడుతుంది.
ఈ ఆత్మహత్యకే కాకుండా ఇలాంటి ఆత్మహత్యలన్నిటికి కూడా ఈనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులే కారణంగా తోస్తోంది.
ప్రభుత్వం, ప్రభుత్వయంత్రాంగం నీతి నిజాయితీల్ని, జవాబుదారీతనాన్ని గాలికి వదిలేసింది. మొన్న డీయస్ అధికారులు, పోలీసు బలగాలు కొమ్ము కాస్తుండగా విచ్చలవిడిగా ఎన్నికల సమరంలో అవినీతి చర్యలకు పాల్పడుతుంటే మీడియా చేష్టలుడిగి నిలుచుంది. పెట్టుబడి దారుల కనుసన్నలలో నడుస్తున్న మీడియా, సెన్సేషన్ బరామీటరుతో కొలవకుండా ఏ పనీ చేయదు. ఆటువంటప్పుడు నిజామాబాదులో ఒకడు ప్రాణత్యాగం చేసి మీడియాకి కావాల్సిన సెన్సేషన్ ఇస్తూ, డీఎస్ ఆగడాలను కనీసం బయటి ప్రపంచానికి చెప్పగలిగాడు.
అలాగే ఈరోజు ఈశాన్ కూడా తెలంగాణా పేరు చెప్పి మొసలి కన్నీరు కార్చి, పిదప మోసం చేసిన తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలను ప్రజలముందు నేరస్తులుగా నిలుపగలిగాడు.
అంత మాత్రాన ఆత్మహత్యలను గాని, మూఢనమ్మకాలను గాని నేను సమర్థించడం లేదు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇది ఎలా ఒక ఉద్యమ రూపంగా మారిందో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను.
ఒకప్పుడు పేదవాడి కోపం పెదవికి చేటు అనే వారు. ఇప్పుడు అది ప్రాణానికి చేటుగా మారింది.
చంద్రబాబు లాంటి జాతీయస్థాయిలో పలుకుబడి కలిగిన నాయకుడు మీడియాలో సెన్సేషన్ కలిగించడానికి (అతని రాజకీయపు తెట్టుగడలను కాసేపు పక్కన బెడదాం) మరో యాభై మంది ఎమ్మెల్యేలతో కలిసి బాబ్లీకి వెళ్లి తన్నులు తినాల్సి వచ్చింది.
ఒక పేదవాడు ఒక రోజుపాటు మీడియాలో తన వాదనను వినిపించడానికి తన ప్రాణాలను బలిపెడుతున్నాడు.
జరుగుతున్న యదార్థం ఇది. అయితే దీనికి పరిష్కారం ఆలోచించాల్సిందే.
చక్కటి టపాలు వ్రాస్తున్నారు, అభినందనలు.
నిజమే. ఇక్కడ మూఢ నమ్మకాలు ఇష్యూ కాకపోవచ్చు. జాతీయ విముక్తి ఉద్యమంలో పని చేసేవాడు (పాలెస్తీనా కావచ్చు, కుర్దిస్తాన్ కావచ్చు) తన జాతి కొరకు ఉరికంభం ఎక్కడానికైనా సిద్ధపడతాడు. ఉరికంభం ఎక్కేవాడు కేవలం స్వర్గానికి వెళ్తాననుకుని ఉరికంభం ఎక్కడు. లక్షలు, లేదా కోట్లలో ఉన్న తన జాతివాళ్ల సంక్షేమం కొరకు తన ప్రాణం పోయినా ఫర్వా లేదు అనుకుంటాడు. ఇక్కడ తెలంగాణావాళ్లు చేసుకున్నవి ఆత్మహత్యలు. ఉరికంభం ఎక్కేవాడు తాను పట్టుబడకపోవచ్చు అనుకుంటాడేమో కానీ ఆత్మహత్య చేసుకునేవాడు మాత్రం అలా కాదు. తన చేతితో తానే ప్రాణ త్యాగం చేసుకుంటాడు.
ReplyDelete@ హరి దోర్నాల, ప్రవీణ్ శర్మ
ReplyDeleteమీరు చెప్పినట్లు ఆత్మహత్యలకి అటెన్షన్ సీకింగ్ కారణం కావచ్చు.అలాగే నిరాశా వాదమూ, జాతికోసం త్యాగం చెయ్యలనే హీరోఇజం కావొచ్చు.
అయితే అందరిలా కాకుండా ఈషాన్ తెలంగాణా వాదులకు సంతోషం కలిగించే ఉప ఎన్నిక విజయం తరువాత ఆత్మ హత్య చేసుకున్నాడు. దీనికి డీఎస్ పై ఉన్న కోపం, తన వాదాన్ని ప్రపంచానికి చెప్పాలనే తపన ఎన్నికల ముందు ఉండి ఆ ఆవేశంలో అలా మొక్కుకుని ఉండొచ్చు. కానీ ఉప ఎన్నిక గెలిచిన సంతోషకరమయిన సమయంలో ఆవేశం తగ్గిపోతుంది. అయినా అతను ఆత్మహత్య చేసుకోవడానికి మొక్కును తీర్చుకోకపోతే తెలంగాణా రాదేమో అనే భయం కావొచ్చని నాకనిపిస్తుంది.
డీ.ఎస్. ఓడిపోతే తద్వారా తెలంగాణవాదం బలపడతదని మైసమ్మ తల్లికి తననుతాను బలిచ్చుకోడం ఆధునిక సభ్యసమాజంలో అంధ విశ్వాసం. అశాస్త్రీయం. కాదనలేం. కాని, దాని వెన్క దాగిఉన్న ప్రజల బలమైన తెలంగాణ ఆకాంక్షను గుర్తించకపోవడం ప్రజాస్వామ్యంలో ఆంతకన్న అశాస్త్రీయం. అనైతికం. అమానవీయం. ఇంకా చెప్పాలంటే క్రౌర్యం.
ReplyDelete