Wednesday 20 April 2011

ముసుగేస్తే దాగదీ వివక్ష - ఇరిగేషన్


Image credits: http://www.gideetelangana.blogspot.com/

మన స్వయప్రకటిత మేధావి నాయకుడు జయప్రకాశ్ నారాయణ తెలంగాణా అంశంపై చాన్నాల్లపాటూ గోడమీద పిల్లిలా విన్యాసాలు చేసి ఇక తప్పనిసరి పరిస్థితిలో సమైక్యాంధ్రకు అనుకూలంగా శ్రీక్రిష్ణ కమీషనుకు ఒక రిపోర్టును వండాడు. ఈ రిపోర్టులో తెలంగాణాపై వివక్ష ఏమీ జరగలేదని నిరూపించడానికి అనేక లెక్కలను వండివార్చాడు. దీనిపై గతంలో నేను రాసిన టపా ఇక్కడ చూడొచ్చు. ఈమధ్యనే కొత్తగా వెలిసిన "విషాంధ" మహాసభ అనే ఒక బ్లాగువారు ఈమధ్య తెలుగుజాతిని కలిపి ఉంచే మహత్తర భాద్యతలో భాగంగా తెలంగాణా వాదులపై విషం చిమ్ముతూ పనిలో పనిగా అసలు ఇరిగేషన్‌లో తెలంగాణాపై ఎలాంటి వివక్ష జరగలేదు, అన్నీ కట్టుకథలు అని చెబుతూ ఒక టపా రాశారు. దానికోసం వారు పాపం మన జేపీగారి రిపోర్టును అరువు తెచ్చుకున్నారు.

వీరి వాదన టూకీగా గోదావరి భౌగోళిక స్వరూపంవల్ల శ్రీరాంసాగర్ తరువాత పోలవరం వరకూ ఎక్కడా డాం కట్టడానికి అనువైన స్థలం లేదు, ఎత్తిపోతలు ఖర్చుతో కూడినపని (అంటే ఇచ్చాపురం ప్రాణహిత-చేవెళ్ళ పధకాన్ని అటకెక్కించాలి). కనుక గోదావరి జలాలను తెలంగాణాలో వాడకంలో తేవడం సాధ్యం కాదు, పోలవరం దగ్గర ప్రాజెక్టు కట్టి నీటిని క్రిష్ణా డెల్టాకు మల్లించాలి, తద్వారా మిగిలిన క్రిష్ణా నీటిని రాయలసీమకు మల్లించాలి, తెలంగాణా నోట్లో మొత్తంగా మట్టికొట్టాలి. మన ప్రభుత్వ ఉద్దేషంకూడా ఇదే కానీ బయటికి చెప్పక తెలంగాణాలో కూడా ప్రాజెక్టులు చేస్తున్నాం అని కథలు చెబుతూ ప్రజలను ఏమారుస్తారు, వీరు మేధావులు కనుక బహిరంగంగానే తెలంగాణా నోట్లో మట్టికొట్టాలని ప్రవచిస్తారు. వీరి వాదనలో ఎక్కడా క్రిష్ణా నది ఊసెత్తరు, ఎందుకంటే అక్కడ జరిగే వివక్షను ఏమార్చడం ఇంతమేధావులవల్ల కూడా కాలేదు మరి.

ఇప్పటికే క్రిష్ణా పూర్తిగా తెలంగాణాకు కాకుండా పోయింది. మిగిలిన గోదావరిని కూడా తెలంగాణాకు కాకుండా చెయ్యడం అనే తమ ప్రణాలికను ఒకవైపు చెబుతూనే మరోవైపు తెలంగాణాపై వివక్షలేదని చెప్పడం వీరి వాదన. మీ ప్రాంతంలో నీల్లివ్వడం కష్టం, మీకు వ్యవసాయం లాభదాయకం కాదు, రైతులందరూ వ్యవసాయం వదిలేసి మీ భూములను సెజ్జులకిచ్చేయండి, ఆతరువాత ఆసెజ్జులు కట్టేప్పుడు రోజుకూలీలుగా పనిచేసి పొట్టపోసుకోండి, కడుపు నిండకపోతే ముంబైకో దుబాయికో వలస పోండి, కానీ మీకు ఎవరైనా వచ్చి ఇక్కడి సాగునీటి వాడకంలో మోసం జరిగిందంటే మాత్రం అస్సలు నమ్మొద్దు. ఇదీ వీరి వాదన.

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు: తెలంగాణాపై ఎప్పుడు వివక్ష ఊసొచ్చినా సమైక్యవాదులు ఇచ్చే ఏకైక ఉదాహరణ శ్రీరాంసాగర్. చూశారా శ్రీరాంసాగర్ మీనిజాం కట్టించలేదు, సమైక్య ప్రభుత్వమే కట్టించింది. ఎంతసేపూ అందులో పూర్తిగాని స్టేజీలనే ఎందుకు మాట్లాడుతారు? పూర్తయిన చిన్నముక్కను చూసి సంతోషించొచ్చు కదా?

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సమైక్య ప్రభుత్వం తెలంగాణాపై ప్రేమతోనో, తమ భాద్యత గుర్తొచ్చో ఇవ్వలేదు. ఇక్కడి ప్రజలు 69లో రాష్ట్రం కొరకు ఉద్యమం చేస్తే ఉద్యమాన్ని బలవంతంగా అణచివేసినతరువాత ఏదో ఒకటి చెయ్యకపోతే ఎక్కువకాలం ఏమార్చలేమని ఈప్రాజెక్టును మొదలుపెట్టారు. గోదావరి నదిపై శ్రీరాం సాగర్ ఉన్న ప్రాంతం అత్యంత ఎత్తుపై ఉన్న ప్రాంతం, ఆప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కరీమ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలన్నింటికీ ఇచ్చే ప్రణాలికతో మొదలయిన ప్రాజెక్టు. పూర్తయితే ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరివ్వాల్సిన ప్రాజెక్టు అన్ని క్లియరెన్సులూ వచ్చిన తరువాత నలభై ఏల్లు గడచిన తరువాత కూడా ఇంకా ఐదు లక్షల ఎకరాలకు కూడా ఇవ్వలేకపోతుంది. నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజలు ఎప్పటికైనా తమకు పోచంపాడు(శ్రీరాంసాగర్) నీల్లొస్తాయని ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.

మన దేశంలో ప్రాజెక్టులన్ని ఇలాగే లేటవుతాయి అందులో పెద్ద వివక్ష ఏమీ లేదు అని తేల్చే వారు ఒక్క సారి మన రాష్ట్రంలోని నాగార్జునసాగర్, తెలుగు గంగ ప్రాజెక్టులు, ఇతర రాష్ట్రాలలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎన్ని రోజుల్లో అయ్యాయో గమనించాలి.

లిఫ్ట్ ఇరిగేషన్ పై అపోహలు: లిఫ్ట్ ఇరిగేషన్లో నదిపై అనువైన ప్రాంతంలో ఒక బ్యారేజీ కట్టి, స్టోరయిన నీళ్ళను ఒక ఎత్తయిన ప్రదేశంలో కట్టిన రిజర్వాయరుకు తరలిస్తారు. అక్కడినుంచి కాలువల ద్వారానో మరో విధంగానో ఆయకట్టుకు నీటిని తరలించొచ్చు. లిఫ్ట్ ఇరిగేషన్‌పై వచ్చే విమర్శలు ఏమిటంటే దీనివలన విద్యుత్ ఖర్చవుతుంది, ఇది అదనపు భారం. గ్రావిటీ ద్వారా నయితే ఫ్రీగా నీటిని తరలించొచ్చు.

నిజమే నీటిని లిఫ్ట్ చెయ్యాలంటే విద్యుత్ కావాలి. ఐతే మన దేశంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. ఏదో అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా మనం వ్యవసాయం లాభసాటి అయితేనే చెయ్యం, వ్యవసాయం ఇక్కడ ఎందరికో జీవన విధానం. కాలువల ద్వారా నీరు రాకపోతే ప్రతి రైతూ ఒక బావి తవ్వుకోవాలి, బావిలో నీల్లు సరిపోవు కనుక అందులో ఒక బోరు వేసుకోవాలి, రెండు మోటార్లు పెట్టి బోరునీటిని పొలానికి తరలించాలి. అంటే రైతు కాలువవ్యవసాయం కంటే అదనంగా బావికి, బోరుకు, మోటార్లకు, విద్యుత్తుకు ఖర్చు చెయ్యాలి. ఆ విద్యత్తుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ప్రపంచ బ్యాంకు ఏడుపులు. ప్రతి రైతూ తన బోరుకోసం విద్యౌత్‌పై చేసే ఖర్చూ, అందుకు ప్రభుత్వ సబ్సిడీ అన్నీ చూసుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్‌లో అయ్యే విద్యుత్ ఖర్చు చాలా తక్కువ. తీరా వచ్చే కరెంటు కనీసం ఆరుగంటలు కూడా ఉండదు, అది ఎప్పుడొస్తుందో తెలియక నిద్రాహారాలు మాని పొలం దగ్గర పడిగాపులు చెయ్యాలి. ఇంతఖర్చు చేసి చివరికి పొలం ఎండిపోతే రైతులు అప్పులభాధకు ఆత్మహత్యలు చేసుకోవాలి.

మరి ఒక ప్రాజెక్టుకింద వ్యవసాయం చేసేవారు ఏదో నామమాత్రంగా ఎకరాకు యాభై రూపాయలు ప్రభుత్వానికిస్తాడు. మరి ప్రాజెక్టు కట్టిన ఖర్చూ, కాలువలు తవ్విన ఖర్చూ, వాటి మెయింటెనన్సు ఖర్చులూ, ప్రాజెక్టు కట్టినప్పుడు నిర్వాసితులకు పునరావాస ఖర్చు ఇవన్నీ ఖర్చులు కావా? ఇవన్ని ఎవరి జేబులోనుంచి వెల్తున్నాయి? కాబట్టి రైతుకు నీటిని ఇవ్వడం అనేది ప్రభుత్వ భాద్యత, అందులో లాభనష్టాలు బేరీజు వేసుకుని ఎక్కడ కాలువ తావ్వడం తక్కువ ఖర్చుతో అవుతుందో అక్కడే తవ్వుతాం, ఎక్కడ ఖర్చెక్కువ అవుతుందో అక్కడ తవ్వం అని ఏప్రభుత్వమూ లెక్కలు కట్టదు, ఒక్క మన ప్రభుత్వం తప్ప. మన పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్రలో, మిగతా చాలా చోట్ల చక్కగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఏర్పాటు చేసుకున్నారు, వారి వాటా నీటిని వాడుకున్నారు అంతే కానీ డెల్టా ప్రాంతం మాకు లేదు, డెల్టా అంతా కోస్తా ఆంధ్రలో ఉంది అక్కడయితే తేలిగ్గా నీటిని సరఫరా చెయ్యొచ్చు కాబట్టి ఈనీళ్ళను వారికే వదిలేద్దం అనుకోలేదు.మన రాష్ట్రంలోమాత్రం గడచిన యాభై ఏల్లలో శ్రీరాంసాగర్ నుంచి ధవలేశ్వరం మధ్యలో ఒక్క ప్రాజెక్టూ కట్టకపోవడానికి చూపించే సాకు గ్రావిటీ.

వాటర్ బేసిన్ ఉల్లంఘణలు: ఏ నదీ జలాలను ఆ నది బేసిన్‌లోనే వాడాలనేది ఇరిగేషన్‌లో ఒక ప్రాధమిక సూత్రం. మన రాష్ట్రం మాత్రం క్రిష్ణా జలాలను పూర్తిగా పెన్నా బేసిన్లో ఉన్న రాయలసీమకు,నెల్లూరుకూ తరలించి కనీసం పది శాతం కూడా తెలంగాణకు ఇవ్వట్లేదు. ఈ ఉల్లంఘణవల్ల నష్టం తెలంగాణాకు మాత్రమే కాదు, క్రిష్ణా ట్రిబ్యునల్ వద్ద కర్నాటక మనరాష్ట్ర రివర్ బేసిన్ వియోలేషన్లను సాకుగా చూపించి తను ఎక్కువ నీటి వాటాను పొందుతుంది. ఈ వాటర్ బేసిన్ ఉల్లంగణలవల్ల క్రిష్ణా ట్రిబ్యునల్ తీర్పులో మనరాష్ట్రానికి (మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌కు, తెలంగాణకు మాత్రమే కాదు) జరిగిన నష్తం గురించి నేను గతంలో రాసిన టపా ఇక్కడ చూడొచ్చు.

మన ప్రభుత్వం మేం మిగులు జలాలను మాత్రమే వేరే ప్రాంతాలకు తరలిస్తున్నామని కుంటి సాకులు చెబుతూ వచ్చింది, నికరజలాలను వాడకుండా మిగులు జలాలు ఎలావాడుతారో చెప్పలేకపోయి క్రిష్ణాలో వాటాను తగ్గించుకుంది. ఇప్పుడు గోదావరి విషయంలో కూడా తెలంగాణాలో గ్రావిటీ సాకు చూపించి గొడావరి నీటిని ఇతర బేసిన్లకు తరలించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మన జేపీగారి మేధావి వర్గం అప్రూవ్ చేస్తుంది.

పోలవరం: ఇక గోదావరి నీటిని తెలంగాణాలో వాడడానికి గ్రావిటీ బూచిని చూపిస్తున్నవారు పోలవరంపై మాత్రం గగ్గోలు పెడతారు. లక్షల మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసి, ఎంతో ప్రకృతి సంపదను, పాపికొండలనూ, వన్యమృగాలనూ ముంచేసే పోలవరంపై వీరికి అపార ప్రేమ. తెలంగాణాలో అన్ని క్లియరెన్సులూ వచ్చేసి దశాబ్దాలు పెండింగులో ఉన్న ప్రాజెక్టులను వదిలేసి ఎన్విరన్‌మెంట్ అనుమతి లేని పోలవరంపై మాత్రం ఉద్యమాలు చేస్తారు.పోలవరంపై ఆదివాసీల అభిప్రాయాలు ఈవీడియోలో చూడొచ్చు.



రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు ఏం లాభం?: ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాలవడం వలన మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ఘర్ గోదవరిపై తమ హక్కును ఎలా కాపాడుకుంటున్నాయో అలాగే తెలంగాణ కూడా తమ గోదావరి జలాలపై తమహక్కును కాపాడుకుంటుంది. ఇది తెలుసుకోవడానికి సివిల్ ఇంజనీరింగ్ అక్కరలేదు, మేధావులు కానక్కర్లేదు. ఎలా గ్రావిటీ సమస్యను అధిగమిస్తారు నీటిని ఎలా పంపు చేస్తారు అనేది తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. ఇక గోదావరిపై తెలంగాణకు అన్యాయం ఏమీ జరగలేదని మోసపు రాతలు రాసేవారు మీ రాతలను కట్తబెట్టి మీపని మీరు చూసుకోవచ్చు.

13 comments:

  1. A very in-depth analysis. Keep it up.

    ReplyDelete
  2. సెజ్‌లు కట్టాలన్నా నీళ్ళు ఉండాలి. కొన్ని రకాల పరిశ్రమలు నీళ్ళని ఎక్కువగా వినియోగిస్తాయి.

    ReplyDelete
  3. I dont know if you are T or A but you got a valid point.

    If T is divided A will go to court and T will never get water.

    The main concern for A people in Hyd is security.

    ReplyDelete
  4. నాయనా సాధారణ పౌరుడు, ఇప్పుడేదో మన ప్రాంతంవాళ్ళు తెలంగాణాకి నీళ్ళిచ్చేస్తున్నట్టు భ్రమలో ఉన్నావా? జలాలని అదనంగా వాడుకునేవాళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడం తప్పు కాదనుకుంటున్నావా?

    ReplyDelete
  5. శ్రీకాంతాచారి, Sreenu, Praveen Sarma, సాధారణ పౌరుడు

    మీ స్పందనలకు ధన్యవాదాలు.

    Praveen Sarma: సెజ్జులకైతే నీల్లిస్తారు లెండి, రాజాగారి సిమెంటు, స్టీలు ఫాక్టరీలకిస్తున్నట్టు.

    సాధారణ పౌరుడు: మీ లాజిక్కేమిటో అర్ధం కావడం లేదు కానీ విడిపోతే ఇప్పుడు ఆంధ్ర, మహారాష్ట్ర,కర్ణాటక నీటిని ఎలా పంచుకుంటున్నాయో విడిపోతే అలాగే తెలంగాణా కూడా తన వాటా పంచుకుంటుంది. T won't get any excess water, but T would definitely get its fair share.

    ReplyDelete
  6. ముంబై సమీపంలోని భివాండీ ప్రాంతంలో తెలంగాణా నుంచి వచ్చిన వలస కార్మికులు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నారు. భూములు లాక్కుని నష్ట పరిహారం ఇవ్వకుండా సెజ్‌లు కడితే వలసలు పెరుగుతాయి.

    ReplyDelete
  7. look at kavery issue, its solved after 150 years in court. i dont think there will be an early solution for water disputes. the best things to do are.
    1. finish all T projects first with high priority. All T MPS and MLAS should sit for T projects completion. Then show that this much water is utilized for this much land. Unless you show proper cultivation land under projects its hard to get the water share. if you are depending on that you will get water.
    i think thats how Tamilnadu got major share as they show lot of belt under kavery.

    If Est&West godavary are making 3 crops per year, i am NOT selfish to deny at least one crop to the Telangana people. I want T people to get their share properly now itsef. Its easy to get now united if they properly deal. They can keep quiet until these projects were completed and bargain deal for it to complete in next 2-3 years.

    Once divided we A people will go to court and drag atleast for teasing and counter T activities.

    ReplyDelete
  8. @సాధారణ పౌరుడు

    The post is intended for those who argue that there is no discrimination in irrigation, let us not deviate the topic.

    To answer your question, Telangana has waited for 50 years for justice, there can't be justice if we wait for another 3 years.

    Just because A goes to court projects will not stop, they will continue. If you think taht just by going to court A can make T not to get their share then I am sorry for you.

    ReplyDelete
  9. ఏది సత్యం గారు..! మీరు చెప్పిన
    "ఏ నదీ జలాలను ఆ నది బేసిన్‌లోనే వాడాలనేది ఇరిగేషన్‌లో ఒక ప్రాధమిక సూత్రం. మన రాష్ట్రం మాత్రం క్రిష్ణా జలాలను పూర్తిగా పెన్నా బేసిన్లో ఉన్న రాయలసీమకు,నెల్లూరుకూ తరలించి కనీసం పది శాతం కూడా తెలంగాణకు ఇవ్వట్లేదు "
    మీ వాటా ఏమో గాని..కృష్ణా జలాలు పెన్నా బేసిన్లో రాయలసీమ వారు వాడు కుంటున్నారని చెబుతున్నారు.. మాది పెన్న ఒడ్డునే ఉన్న ఊరు.. కాని నా ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నా..పెన్నా నది ఎప్పుడు నీరుతో నిండి లేదు..! ఆ నదిలొ నీరు లేక..ఏటి ఇసుకను చుట్టుపక్కల ఊర్లన్ని తవ్వి తీసుకుపోయాయి..ఇప్పడక్కడ..పిచ్చి మొక్కలతో ఉన్న చెట్లు తప్ప ఏమి కనపడవు..! మరెప్పుడూ రాయలసీమలో కృష్ణాజలాలు వచ్చాయో కాస్త సంవత్సరాలతో సహ లెక్కలు చెప్పగలరా..? మాకు సంవత్సరానికి ఒక్క పంట పండడమే గగనం..! నేను చాలాసార్లు తిరుపతికి రైలులో వెళ్తున్నప్పుడూ తెలంగాణ నుండి తిరుపతికెళ్లె రైతు సోదరలనుండి విన్న మాటలు నాకిప్పటికీ చెవుల్లో వినపడుతూనే ఉంటాయి..! వాళల్లో వాళ్లు మాట్లాడుకునే వారు..రాయలసీమలోకి రైలు ప్రవేశించగానే దారిపొడవునా బీళ్లుబారిన భూములను చూస్తూ " అర్రె ఇట్లా భూములు మన వూళ్లొ ఖాలీగా ఎప్పుడూ కనపడలే..ఇట్టాంటి భూములు ఉంటేనా..పలాన పంట వేసేవాళ్లం " అంటూ వాళ్లు వేసుకునే పంటల గురించి చెప్పుకునే వారు. అది ఇప్పటి మాట కాదు..90 వ దశకం మొదట్లో మాట..! అంటే రాయలసీమ మిగతా రెండు ప్రాంతాలతో పోలిస్తే అత్యంత దయనీయ పరిస్థితిలో కరువుతో అల్లాడుతున్నట్లే కదా..?

    ReplyDelete
  10. కమల్ గారూ,

    ఈ లింకులో ఇండీఅ రివర్ బేసిన్స్ కనిపిసుంది. ఇందులో చూసి క్రిష్నా బేసిన్ తెలంగాణాలో ఎంత ఉందో రాయలసీమలో ఎంత ఉందో చెప్పండి. అలాగే SLBC కుడి కాలువ, తెలుగు గంగ, K-C kanaal,వెలిగొండ ప్రాజెక్టులు ఎక్కడ నీరుస్తున్నాయో కూడా చెప్పండి.

    http://www.mapsofindia.com/maps/india/river-basins.htm

    పెన్నాలో నీల్లు ఎక్కువ ఉన్నాయని ఇక్కడ చెప్పలేదు. నిజానికి అందరి అవసరాలకూ క్రిష్నా అయినా పెన్నా అయినా సరిపోవు. తెలంగాణా ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగా ఏల్లతరబడి పెండింగులో పెట్టి మిగతా ప్రాంతాలకు నీటిని తరలించడాన్ని ఎత్తి చూపడమే నా ఉద్దేషం.

    ReplyDelete
  11. నాకు తెలిసి కృష్ణా నది పెన్నాలో కలవదనుకుంటాను...?? నాకీ విషయంలో సందేహాలున్నాయి. పినాకని కర్నాటకలోని కోలార్ జిల్లాలోని నందిదుర్గ కొండల్లో పుట్టి అక్కడ నుండి మొదలయ్యి ఆంద్రప్రదేశ‌లోని అనంతపురం జిల్లాగుండా ప్రవహించి..మా వూరి మీదుగా సాగి నెల్లూరి జిల్లా మీదుగా సముద్రంలో కలుస్తున్నది..! మరెక్కడ తెలంగాణకు లింకు తగులుతున్నదో అర్థం కావట్లేదు..! ఈ నదికి ఎక్కడ తెలంగాణ జిల్లాలు కలవట్లేదు..! తుంగభద్ర కేవలం ఉపనది ద్వార కలుస్తుంది. మీరిచ్చిన మ్యాప్ లింక్‌లో స్పష్టత లేదు..! మరొక సారి పరిశీలించి చూడగలరని మనవి

    ReplyDelete
  12. కమల్ గారూ,

    క్రిష్ణా నది పెన్నాలో ఎలా కలుస్తుందండి, రెండూ వెల్లి బంగాళాఖాతంలో కలుస్తాయి గానీ? మీరు రివర్‌కూ, రివర్ బేసిన్‌కూ తేడా సరిగా అర్ధం చేసుకున్నట్లు లేరు. రివర్ బేసిన్ అంటే ఒక నది నీటిని కలెక్ట్ చేసే మొత్తం ప్రాంతం.

    http://en.wikipedia.org/wiki/River_basin

    నదిలో ప్రవహించే నీటిపై ఆప్రాంతవాసులకు మొదటి హక్కు ఉంటుంది, వారి అవసరాలు తీరితే మిగిలిన వాటిని మిగతా ప్రాంతాలకు ఇవ్వొచ్చు. ఇక్కడ విషయం తెలంగాణా క్రిష్ణా బేసిన్లో ఉంది, రాయలసీమ లేదు. క్రిష్ణా నది ఇరిగేషన్ గురించి డీటైల్‌గా ఇంకో టపా రాస్తానులెండి.

    ReplyDelete