Sunday 28 October 2012

సామాజికన్యాయం జరిగింది




ప్రజారాజ్యం అనేపేరుటో పార్టీని స్థాపించి "సామాజికన్యాయం తీసుకొస్తా", "ముఖ్యమంత్రినై తిరిగివస్తా" అంటూ ప్రచారం చేసిన చిరంజీవికి ఎలక్షన్ ఫలితాలు వచ్చినతరువాత ముఖ్యమంత్రి గావడం అంత వీజీ గాదని అర్ధమయింది. ఆతరువాత అదృష్టం కలిసొచ్చి రాజశేఖర్ రెడ్డి చనిపోవడం, జగన్ కాంగ్రేశ్‌ను వదిలి కొత్తపార్టీ పెట్టడంతో వచ్చిన అనిశ్చిత స్థితితో అదృష్టం కలిసొచ్చింది.

కాంగ్రేస్‌వారు అడగకున్నా తానే కాంగ్రేస్‌కు అడిగితే మద్దతు ఇస్తామని చెప్పిన చిరంజీవి కొన్నాళ్ళకు కాంగ్రేస్ ద్వారామాత్రమే సామాజిక న్యాయం (తన సామాజికవర్గానికి న్యాయం) జరగగలదని డిచ్లేర్ చేసి మరీ కాంగ్రేస్లో పీఆర్పీని విలీనం చేశాడు.

ఆలస్యం జరిగినా చివరికి కాంగ్రేస్ ద్వారా సామాజిక న్యాయం జరిగింది. తనసామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ఆతరువాత తన గ్రూపుకు చెంది, తనసామాజికి వర్గానికి కూడా చెందిన ఇద్దరికి రాష్ట్ర మంత్రిపదవులు దక్కడమే గాక ఎట్టకేలకు చిరంజీవికి ముందు కుదుర్చుకున్న బేరం ప్రకారం కేంద్రమంత్రిపదవి కూడా లభించింది.

కంగ్రాచ్యులేషన్  చిరంజీవి. టూరిజం పేరుమీద దేశమంతా టూర్లేయొచ్చు. ఎలాగూ రాజ్యసభమెంబరువు గనక వచ్చే ఎలక్షన్లలో పోటీచేస్తే ఎక్కడ వోడిపోతామో అన్న టెన్షన్ లేదు, అసలు పోటీ చేయాల్సిన అవసరమే లేదు. 2014 తరువాత కాంగ్రేస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు గనక ఆతరువాత మంత్రిపదవి దక్కుద్దా అనే టెన్షన్ కూడా లేదు!!
 

1 comment: