Sunday, 10 July 2011
భాద్యత కేంద్రానిదే..కానీ వ్యతిరేకించడం మా హక్కు
చివరికి అంతా అనుకున్నదే అయ్యింది. జగన్ తెలంగాణ విషయంపై చేతులెత్తేశాడు. తెలంగాణ ఇచ్చే లేదా ఆపే హక్కు నాకు లేదు, తేల్చాల్సింది కేంద్రమే అంటూ తానూ గోడమీద పిల్లినే అని చెప్పకనే చెప్పాడు. ఇదేమాట ఇన్ని రోజులూ రెండు కల్లూ సొట్టబోయిన చంద్రబాబూ చెబుతున్నాడు కనుక జగన్ కొత్తగా చెప్పిందేం లేదు.
తేల్చాల్సింది కేంద్రమేనంటూ భాద్యత కేంద్రంపై నెట్టివేసే ఈనేతలు కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా? కేంద్రం నిర్ణయానికి కట్టుబడడం అటుంచి తామే అంతకు కొన్ని గంటలముందు ఇచ్చిన హామీలకు కట్టుబడే ఉన్నారా అంటే లేదు.. ఇదే చంద్రబాబు స్వయంగా సీమాంధ్రలో తమ పార్టీనాయకులచేత కృత్రిమ ఉద్యమం సృష్టించడమే కాకుండా అందుకు కావల్సిన మెటీరియల్ మొత్తాన్ని తానే ఎంటీఆర్ భవన్ నుండి సమకూర్చాడు. మరోసారి కేంద్రం తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకుంటే రేపు చంద్రబాబు లాగే జగన్ కూడా అదే పని చేస్తాడు.ప్రస్తుతానికి ఇద్దరూ తెలంగాణలో తమ పార్టీ ప్రతినిధులచేత తామే రాజీనామాలు చేయించి తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు అని ప్రజలను భ్రమింపజేద్దామని ప్రయత్నం చేస్తున్నారు.
అంటే ఈరాజకీయ పార్టీలకు తెలంగాణపై నిర్ణయంలో భాగం పంచుకునే భాద్యత లేదు, కానీ కేంద్రం ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు మాత్రం ఉందన్నమాట. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు ఇప్పటిదాకా చంద్రబాబు దగ్గర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను విశ్వసనీయతకు మారుపేరు అని చెప్పుకునే జగన్ కూడా చేస్తూ తానూ ఆతానుముక్కనే అని నిరూపించుకున్నాడు. విశ్వసనీయత అంటే ఆచరణ సాధ్యం కాని ఉచిత పధకాలను గుప్పించి ఖజానాను గుల్లచేసి తన సొంత ఖజానా నింపుకోవడం కాబోలు.
ఇంతకూ చంద్రబాబుకూ జగన్‌కూ ఉన్న తేడా ఏమిటి? ఒకడు వేలకోట్ల అవినీతి చేస్తే మరొకడు లక్షల కోట్లకు అవినీతిని పెంచాడు. కాలం గడుస్తున్నకొద్దీ మన రాష్ట్ర బడ్జెట్ పెరిగినట్లే అవినీతి స్థాయి పెరగడంలో ఆశ్చర్యం లేదు. రేపు చంద్రబాబుకు అధికరం ఇస్తే అతను లక్షలకోట్ల అవినీతిని కోటికోట్లకు పెంచగల సమర్ధుడు. ఒకడు మామకు వెన్నుపోటు పొడిస్తే మరొకడు తండ్రి పదవి అడ్డం పెట్టుకుని లక్షలకోట్లు మేసి ఆస్తితోపాటు అధికారానికీ వారసున్ని నేనేనంటున్నాడు. ఇద్దరూ చేసేది కులరాజకీయాలు, ధన రాజకీయాలే..కానీ తాము రెప్రజెంట్ చేసే కులాల్లో తేడా, అందుకే వారి వారి సమర్ధకులు కూడా మారుతారు, రాష్ట్ర విభజన విషయం వచ్చేవరకూ అందరూ సీమాంధ్ర వాదాన్నే సమర్ధిస్తారు. ఈమాత్రం దానికి కొందరు మాబాబు గొప్ప అంటే కొందరు మా జగన్ గొప్ప అంటూ కేవలం తాము ఏసామాజిక వర్గానికి చెందినవారో చెప్పకనే చెబుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment