Saturday, 26 December 2009

మహబూబ్ నగర్, నల్లగొండల గోడు

క్రిష్ణమ్మ, తుంగమ్మ ఏకమైనను ఇచట
గ్రుక్కెడైనను నీల్లు దాల్చలేదె?
వరదలొచ్చిన నాడు మునిగిపోతిని నేనె,
కరువులొచ్చిన నాడు ఎండి పోతిని నేనె !!


నాదు దేహము తొలిచి త్రవ్వెనొక సాగరం
గొంతు తడప చుక్క ఇవ్వలేదె !
దిష్టి బొమ్మ లాగ నాపైని ఈడాము
నన్ను వెక్కిరించి పక్క దోవ పట్టె !!

No comments:

Post a Comment