ఉద్యమాలు, నిరశనలు అనేవి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉపయోగించే ఆయుధాలు. ప్రజలు ప్రజాస్వామ్యంలో తమందరి తరఫునా నిర్ణయాలు తీసుకోవడం కోసం కొందరు ప్రతినిధులను గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తారు. అలాంటి ప్రభుత్వం తమ న్యాయమైన హక్కులను కాలరాస్తే మనకు ఆప్రభుత్వాన్ని వెంటనే దించివేసే హక్కులేదు, ఐదేళ్ళదాకా ఆగాల్సిందే. కనుక ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉద్యమాలు, నిరశనలు చేస్తారు. ఈనిరశనలు బందులూ, రాస్తారోకోలూ, సమ్మెలూ లాంటి అనేక విధానాలద్వారా చేస్తారు.
అయితే ప్రజలు లేని హక్కులకోసం ఉద్యమాలు చేస్తే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడమే. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతోందదే. ఆరోజోన్లో ఉద్యోగాలు ఆరోజోన్ వాసుల హక్కు. దానికోసం సీమాంధ్ర వారు బందులు చెయ్యడం, ఉద్యమాలు చెయ్యడం తమకు లేని హక్కును కోరడమే కాక ఆరోజోన్ ప్రజల హక్కులు హరించడమే. ఈసాంప్రదాయం ఇలాగే కొనసాగితే రేప్పొద్దున రాజస్థాన్ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలకోసం కూడా ఇదే సీమాంధ్రులు ఉద్యమాలు చెయ్యగలరు..రాజస్థాన్ వారికి మాత్రం తమ ప్రభుత్వోద్యోగాల్లో అర్హత ఇస్తే ఒప్పుకోరు. ఇలాంటి అన్యాయపు డీమాండ్లను కొందరు చెయ్యడం, వారికి కొందరు రాజకీయ నాయకులు వత్తాసు పలకడం క్షమించరాని నేరం.
అసలు సమైక్యవాదులు అని చెప్పుకునే వారు చేసే ఉద్యమమే ఒక హాస్యాస్పద ఉద్యమం. దీనికి అబద్దాలను జోడించి కావూరి సాంబశివరావు లాంటి నేతలు తెలంగాణవారు తెలంగాణ కావాలనుకుంటే సీమాంధ్రలో ప్రజలంతా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి రాష్ట్రాన్ని విడదియ్యడానికి వీల్లేదని చెప్పడం హాస్యాస్పదం. ముందుగా సీమాంధ్రలో అందరూ సమైక్యరాష్ట్రాన్ని కోరుకోవడమే పచ్చి అబద్దం, ఇక ఒకవేళ ఇది నిజమనుకున్నా రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని ఒక్కపక్షం వారే నిర్ణయించలేరు, అదివారి హక్కు కాదు.
ఒకభాగస్వామ్యం నచ్చనప్పుడు ఒకభాగస్వామి నాకీ పొత్తు నచ్చడం లేదు, నేను విడిపోతాను అని చెప్పగలడు, అలా చెప్పేహాక్కు ఒకభాగస్వామికి ఉంటుంది. అప్పుడు మరో భాగస్వామి మాత్రం విడిపోవడానికి వీల్లేదు, మనం కలిసే ఉండాలి అని చెప్పే హక్కు ఉండదు, ఉండేహక్కల్లా విడిపోయే పక్షంలో తన సమస్యలను పరిష్కరించుకోవడమే.
ఒకవేళ ఇద్దరు భాగస్వాములూ కలిసే ఉందామని ఇష్టపడుతున్నా ఎవరైనా బలవంతంగా విడగొడుతుంటే అప్పుడు ఇద్దరు భాగస్వాములూ కలిసి మేం కలిసే ఉంటామని చెప్పడం ఒక హక్కవుతుంది. దానికోసం, బలవంతపు విభజనకు వ్యతిరేకంగా ఇరు పక్షాలూ కలిసి ఉద్యమించవచ్చు. కానీ ఒక పక్షం వారంతా మేం విడిపోతాం మొర్రో అంటుంటే లేదు మీరు కలిసే ఉండాలని చెప్పడం హక్కు కాదు కదా, ఎదుటి వారి హక్కులను కాలరాయడమే.
ఇలా ఎదుటివారి హక్కులను హరించే ఉద్యమాలను కొందరు చదువుకున్నవారు కూడా సమర్ధించడం, దానికి రాజకీయనాయకులు వత్తాసు తెలపడం మాత్రమే కాక ఆనాయకులే ఇలాంటి ఉద్యమాలను సృష్టించడం మనదేశంలో ప్రజాస్వామ్య భావనకే ఒక దెబ్బ. ఇలాంటి దొంగ ఉద్యమాలను లేవదీసేవారు ఎంతమాత్రం క్షమార్హులు కారు.
మొన్న సీమాంధ్ర నాయకుల బృందం ఆజాద్‌ని కలిసి రాష్ట్రంలో అరవై రెండు లక్షలమంది సీమాంధ్ర్లే ఉన్నారని చెప్పారు. అంటే దాదాపు రాజధానిలో దాదాపు ఎనభై శాతం మంది వారే వున్నారన్నమాట! మరి అలాంటప్పుడు 14F వల్ల అందరికన్నా ఎక్కువ లాభపడేది వారే! మరి ఉద్యమం ఎందుకు?
ReplyDeleteఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఇలా పచ్చి అబద్ధాలు చెప్పుంటూ, గత యాభై ఐదేళ్ళు పొద్దు పుచ్చినట్టుగా ఎల్లకాలం గడిపేద్దా మనుకుంటున్నారు.
సాధారణ పౌరుడు గారు, మీవాఖ్య అభ్యంతరకరంగా ఉంది కనుక ప్రచురించలేదు.
ReplyDeleteSirs, do you have any proof everybody in Telangana wants seperation?. There are couple of surveys published recently (you must have seen them) which tell the exact opposite. Telangana people are divided lot and seperate state with Hyd as capital was a preference only to a minority. On the contrary people in seemaa-kostaa region are far more united on this issue. They do not want seperation in any form rather overwhelingly.
ReplyDeleteOther than dismissing such surveys point blank do you have any other proof that shows there are as many people in Telangana who want seperation as in Kosta-Seema region who want unity.
Can you please share.?regards.
Srikaanthacaari gaaru,
ReplyDeleteI do not see much resistance to 14f from anybody. There could be some stray incidents here and there but certainly there isn't any big leader who opposed its removal(that includes Lagadapati too..he only asserts it could be challeneged since it was unconstitutional procedurally)
@Pavani
ReplyDeleteThere was opposition from Seemandhra JAC and there was Band calls. There was criticism from socalled andhra intellect forum. All this is for what? Just for some jobs for which they do not have any right to apply. Lagadapati was at its height..initially he said it can't be done, later he said it is unconstitutional and disgraced precident itself, when the procedure forllowed was same at the time of introducing the clause and removing.
The problem is that some people does not like to see the reality and depend too much on cooked up data and surveys that are only in their interest and make comments in the blogs as if they are all knowns. And they mak strange arguments that parliament cannot decide about state formation but state leaders should, this is the pity situation of our state.
Satyanveshi gaaru,
ReplyDeleteYou are going all over just as I feared.
1.Insead of blaming such surveys done by national media channels--do you have any proof as many in Telangana wants seperate state with Hyd as capital as there are in kosta-andhra who wants unity.
శంఖంలో పోస్తేనె తీర్థమౌతుంది. Just show the proof.
2. Lagadipati did say it (14F)can't be done. He is saying the same even today. He quoted reasons.Jury is yet to be out. We can certainly discuss as things eveolve in coming days.But please note--he is not opposng its removal.
3. Seemandhra JAC is still in nascent stage. It is yet to find popular leadership. There were some incidents here and there but nothing major opposing 14f removal. For example there was no postponement. There was no any kosta-seema bandh. There weren't many calls to stop or abuses by any big leaders. Either they were calm or muted reactio. Some infact welcomed it. Like Purandhareswari, JP, Botsa. etc..
Best Regards.
One more thing. I made few comments in couple of blogs that the solution to Telangana is more in the hands of state leaders.I think you were refering them indirectly in your above response. I explained my reasons when I said those...
ReplyDelete1. All the three states formed in last decade were based on consensus. All stake holders agreed in those respective states.
2. The days of single party rule and strong center are gone to impose its will on states on such sensitive issus just becasue constitution allows it. AP is too big a state to risk such miadventure. Center, rightfully expects and demands unity and accountability from leaders of the state. It is the right thing to do. I sincerely believe there will be consensus. We just meed to spend time and all our eergies there than on these bandhs and abuses.
On a side note..I said this much much before those Azads and Chidambarams and Pranabs announced the same one after other.
It is not about what you can do constitutionally but but what you should do amicably.
Hope I conveyed you the context. We can always agree to disagree. That doesn't make either of us all knowns or little knowns. regards.
పావని గారు,
ReplyDelete1) ఈటపా ఉద్దేషం కొందరు ఏవిధంగా తమవి కాని హక్కులకోసం, ఎదుటివారి హక్కులను కాలరాయడం కోసం కూడా ఉద్యమాలు, నిరశనలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారో చెప్పడం.ఇక సర్వేల గురించి,మీరే సర్వేలగురించి చెబుతున్నారో వాటి నిజాయితీ ఎంతో నాకు తెలియదు, లగడపాటే అలాంటి ఒక సర్వే చేయించాడు, సర్వే చేసేవారు ఎక్స్ట్రాలిస్తూ తెలంగాణ వ్యతిరేకంగా ప్రచారం కూడా చెయ్యబోటే తన్ని తరిమేశారు, ఆతరువాత ఏవో లెక్కలు పెట్టి తెలంగాణలో ఎవరూ తెలంగాణ ఏర్పాటు కోరుకోవడం లేదని చెప్పారని నేను విన్నాను. ఇలాంటి దొంగసర్వేలగురించి మాట్లాడేబదులు మీకంత నమ్మకముంటే తెలంగాణలో రిఫరెండం పెట్టమని అడగండి. ఇక నేను చెప్పేదానికి ఆధారం స్వయంగా నేను చూశిన గ్రామ గ్రామాన ఉన్న ప్రజల ఆకాంక్ష, మొన్నటి బై ఎలక్షన్లు.
2)అంత నేసంట్ స్టేజ్‌లో సీమాంధ్ర జాక్ ఉంటే సమైక్య ఉద్యమాన్ని గొప్పగా చెప్పుకోవడం ఎందుకు? 14F విషయంలో ఏవిధంగా లేని హక్కుకోసం బందులు చేస్తున్నారో సమైక్య రాష్ట్రం కోసం కూడా అదేవిధంగా లేని హక్కు కోసం ఉద్యమాలు, బందులు చేస్తున్నారనే విషయమే నేను చెప్పేది.
3) మూడు రాష్ట్రాల్లో ఎకాభిప్రాయం వలన జరిగిందని ఎప్పుడూ అలాగే జరగాలనుకోవడం పొరపాటు. రాష్ట్రాల విభజనకోసం రాజ్యాంగం ఒక ప్రొసీజరు చెప్పింది, గత మూడు రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ఈప్రొసీజరు పాటించడంలో deviation తీసుకున్నారని, ఆ deviationనే ప్రొసీజరు అని చెప్పడం అత్యంత హాస్యాస్పద వాదన.అలా చెయ్యడం ఆర్టికల్ 3 యొక్క ఉద్దేషాన్నే విస్మరించినట్టవుతుంది. ఆ అధికారం కేంద్రానికి ఇచ్చిందే అన్నిసార్లూ ఏకాభిప్రాయం సాధ్యం కాదు, స్టేటస్ కువో వలన ఎవరైతే విపరీతంగా లబ్ది పొందుతున్నారో వారు మార్పును కోరుకోరు కాబట్టి.
4) రాష్ట్రాలమధ్య విభేధాలనూ, రాష్ట్ర విభజన వ్యవహారాలాను రాష్ట్రాలకే వదిలేస్తే అసలు కేంద్రం అవసరం ఎందుకు? అధికార వికేంద్రీకరణకు అర్ధాలను మార్చకండి.
1. నేను చెప్పింది లగడపాటి గారి సుర్వేల గురించి కాదు. CNBC చేసిన దాని గురించి. వారికి ఏదో ఒక ప్రాంతానికి అనుకూలంగా రాయాల్సిన అవసరం ఏముందో నాకు తెలియదు. రెఫెరెండం అన్నారు. మంచి ఆలోచనే. హైదరాబాదులో ఎంత మంది వాళ్ళకో ప్రత్యేక రాష్ట్రం కావలనుకుంటున్నారో కూడా తేలిపోతుంది.అలాంటిదేదో జరిగే దాకా, అందరూ విదిపోవాలనుకుంటున్నరని అందర్నీ నమ్మమంటం సరికాదు.
ReplyDelete2. సీమాంధ్ర JAC ఒక్కటే సమక్యాంధ్రాభిలాషకు కొలబద్ద అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం.
3.ఆ మూడు రాష్ట్రాల విభజనలో deviation ఎక్కడా తీసుకో లేదు.పూర్తిగా రాజ్యాంగబధంగా ఏర్పడిన రాష్ట్రాలవి. Resolution from the state assembly is very much part of the procedure and more sensible too when there is no national framework to divide. సమైక్యులు ఎక్కువ లబ్ది పొందారని మీ అభిప్రాయం లాగా ఉంది. అది నిరూపింపబడలేదని గమనించ ప్రార్థన.
4.రాష్ట్రాలను విడగొట్టటం ఒక్కటే కేంద్రం పని కాదు. అలాగే అధికార వికేంద్రీకరణ అంటే ముక్కలు చెయ్యటం అని అంతకన్నా కాదు. మీరే అన్నట్టు దయచేసి వాటి అర్థాలు మార్చకండి.
ఆ మాటకొస్తే ఇన్ని సమ్మెలు, అల్లర్లు జరుగుతున్నా వాటికి తలొగ్గకుండ-ఒక రకంగా కేంద్రం రాజ్యాంగమిచ్చిన అధికారాన్ని వాడుతోందనే అనుకోవాలి.
ధన్యవాదాలు.
1. అందరూ గాక నూటికి తొంభై మంది అనుకుంటే సరిపోతుందా మీకు?
ReplyDelete2. సీమంధ్ర JAC మాత్రమే కాదు, సీమాంధ్రలో ఇంకెవరు సమైక్యవాదం చేసినా అది లేని హక్కుగూర్చి ఉద్యమించడమే. అదే నేను చెప్పేది.
3. రాజ్యాంగం చెప్పిన ప్రొసీజరులో ఎక్కడ ఏకాభిప్రాయం కావాలని ఉందో సెలవిస్తారా?
4. కేంద్రానికి అనేక పనులు ఉండొచ్చుగానీ రాష్ట్రాలమధ్య, ప్రాంతాలమధ్య విభేధాలు వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సింది కేంద్రమే.
5. నేనే ప్రతివాదిని, నేనే న్యాయనిర్ణేతను అనే ఆధిపత్యభావజాలాన్ని చూపితే ఏదీ ఎక్కడా నిరూపించబడదు, దయచేసి వాదన అటువైపు మల్లించి ఇక్కడ నన్ను నిరూపించమనొద్దు.
తెలంగాణవాదులు పదేల్లుగా గణాంకాలను చూపిస్తూ జరిగిన అన్యాయాలను అనేక ఫోరంస్‌లో చూపిస్తూనే ఉన్నారు. సీమాంధ్రులు ఇన్నాళ్ళూ కేవలం తెలంగాణా అంటే కేసీఆరే, కేసీఆర్‌పై దాడి చేస్తే తెలంగాణ ఉద్యమం ఆగిపోతుంది అని ఊహించుకుని ఇన్నాళ్ళూ కేసీఆర్ పై మాత్రం దాడులు చేశారు. ఇప్పుడు సడేన్‌గా మీరు మేల్కొని ఏవో లెక్కలు తీసుకొచ్చి మీలెక్కలు తప్పు అనివాదిస్తూ కూర్చుంటే మీకు లెక్కలిచ్చే స్టేజీని మేము దాటి ఇంకా చాలా ముందుకు పోయాం, క్షమించాలి.
Thanks for your discussion.
1. సరిపోదు. నిరూపించబడే వరకు అది అబద్ధం కాబట్టి.
ReplyDelete2. ఐదున్నర కోట్లమంది హక్కులు ఫలానా లాగ ఉండకూడదు అని చెప్పటానికిమీరెవరు, నేనెవరు.ఈ రాష్ట్రంలో, రాజధానిలో వారు కచ్చితంగా హక్కుదారులు. వారి ఒప్పుదల లేకుండా విభజన జరుగుతుందనుకోవటం భ్రమ.
3. నేను చెప్పింది resolution గురించి.Please read my comments again. ఏకాభిప్రాయం ఎందుకవసరమో పై టపా లో చెప్పాను. Concensus is the quickest, fastest and easiest way to the solution.
4.కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి, assembly నించి ఒక resolution పాస్ చెయ్యండి, తిట్టుకోవటం మాని సంప్రదింపులకు రండి అని.
5.అర్థం కాలేదు.
6.మీరిచ్చిన లెక్కల్లో పస లేదని కుండబద్దలుకొట్టింది సమైక్యవాదులొక్కరే కాదండి.
చివరగా..నేను తెలంగాణా వ్యక్తిని. తర తరాలుగా.కాకపోతే ఈ hate movementని సమర్ధించలేను.
దీన్నిక్కడతో ఆపేద్దం. స్పందించినందుకు ధన్యవాదాలు.
typo..its not fastest...but fairest..
ReplyDelete1. ఉప ఎన్నికల్లో నిరూపించబడింది, తమ పార్టీ రిజిష్టర్డ్ కార్యకర్తల వోట్లు కూడా తెచ్చుకోనివారినడగండి.
ReplyDelete2. హక్కుదారులా, కాదా అనేది తర్వాతి సంగతి, ముందు వారు చెయ్యల్సిన ఉద్యమం సమైక్య ఉద్యమం కాదు, విభజనలో తమహక్కులకోసం ఉద్యమం. అలాచేస్తే సమస్య అదేపరిష్కారమవుతుంది. చల్లకొచ్చి ముంతదాచినట్లు లేనిప్రేమను ఒలకబోసి సమైక్యరాగం పాడితే పరిష్కారం జరగదు.
3. you can read article 3 once again and let me know where passing of Assembly resolution is mandatory. We are not talking about subjective opinions, but we are talking about constitutional procedures and the intention behind those, please do not disgrace constitution like lagadapati by repeatedly misinterpreting.
4. ఆ అవసరం లేదనే చెప్పేది. ఇక్కడ కేంద్రం తనపని తాను చెయ్యక, తన చేతకాని తనాన్ని మిగతా పార్టీలపై వేస్తోంది. కేంద్రం ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయాన్ని డిసెంబరు 9 నే తీసుకుంది, దాన్ని అమలు చేసే చేతకాక ఇప్పుడు తప్పించుకుంటోంది.
5. There are lies, bigger lies and there are statistics. When we talk about our perceived misery, you talk about imaginary issues and statistics. We don't have patience to answer for all the silly remarks of those.
మీరు ఎక్కడివారనేది చర్చకవసరం లేదు, ఎంత నిజాయితీ ఉంది అనేది అవసరం. అది నాకు మీవద్ద కనబడడం లేదు. ధన్యవాదాలు.
Already I told several times that the very reason of making article 3 is itself that consensus cannot be sought at such situations. Finding mistake in that procedure is nothing but questioning the spirit of constitutional authors.
ReplyDeleteDo you know what is circular logic? First you make a lie that consensus is required when it is not, then to support that claim you say that the side who is opposing division is not getting disproportionate advantage which is another lie.
any way good bye.
You quote polls in 11 of 119 where it had already won once before since it was the latest though earlier results were miserable but stick to Dec 9th(which again refers to State resolution BTW) when there is a latest one.
ReplyDeleteWhen I said part of the procedure, you converted it into mandatory and asking me to prove. I can't prove something that I didn't say.
As you rightly said you are talking about perceived misery. Yes, this movement is built on perceptions not on facts.
Thanks for admitting you don't have patience. Truth hurts, I can understand your impatience. Good Bye.
I don't understand why you comment again but say let us stop it, do you want that always you should have the last word even if you are wrong?
ReplyDeleteYou want to believe only the one survey that is in support of you but don't want to belive election polls. Why do you think govt is afraid of conducting local body elections now?
I am not asking what you said or what is your opinion, I asked you what is article 3 and where it says it is mandatory? yes, truth hurts.. and we don't trust anything if it is not inline with our argument, even if it is constitution.
Every tom, dick and harry comes and say that your numbers are wrong, we have some better number that govt is using all these years to bluff you, do yoyu think we have to agree and stop our fight?
It is we who suffered all the while with the lack of ffunds for irigarion projects in our region, with all the descrimination. We now how to fight and with whome to fight.
If you people want to criticise constitution, disgrace precidential order it only shows your attitude. good bye.
http://telangaanaa.blogspot.com/2011/08/cnn-ibn-cnbc-tv18.html
ReplyDeleteపావని, సత్యాన్వేషి గార్ల చర్చ బాగుంది.
ReplyDeleteసత్యాన్వేషిగారు. రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రజలు అందరికి చెందినది కదా? అలాంటప్పుడు దానిని కేవలం ఒక zone కు పరిమితం చేయటం అన్యాయంకాదా? కేవలం ఆరో జోను వాళ్ళే రాజధానిలో ఉద్యోగాలు చేయాలా? ఇదెక్కడి న్యాయమండి బాబు. it is totally unfair. హైదరాబాదును ప్రత్యేకంగా చూసి అందరికి అవకాశం కల్పించాలి. (కానీ ఇప్పుడున్న ఉద్యమం పూనకంలో ఈ మాటలు వినేదెవరు?)
అయ్యా తెలుగు అభిమానిగారు,
ReplyDeleteఅసలా క్లాజు ఏమిటి, దానివలన ఏమి జరుగుతుంది అన్న కనీస అవగాహన లేకుండా ఏంఇటండీ మీ జడ్జిమెంటు? అసలు ఇంతసేపు వాదన చేసిన పావని గారు కూడా 14F ఉండాలని అనలేదు, ఉండాలని అనేవారిని సమర్ధించలేదు. ఇక్కడ అలాంటి వింత వాదనలు చేసే సీమాంధ్ర JACని అందరూ తప్పు పడుతున్నారు.
మీ ఇంఫర్మేషన్ కోసం: 14F హైదరాబాద్‌లో మాత్రమే ఉండే రాష్ట్ర స్థాయి ఉద్యోగాల గురించి కాదు, పోలీసు, ఎస్సై ఉద్యోగాల గురించి. మీజోన్లో మీవాల్లెలా అప్లై చ్సుకుంటారో అలాగే ఆరోజోన్ వారు అక్కడి పోలీసు ఉద్యోగాలు అప్లై చేసుకుంటారు. ఒకవైపు లేణి హక్కులకోసం బందులను గురించి రాస్తుంటే మైల్లీ మీరేంటండి ఇలాగా?
శ్రీకాంతాచారి గారు,
ReplyDeleteమీ అనాలీసిస్ బాగుంది, ధన్యవాదాలు.
పావని గారు,
సర్వేలకు సంబంధించిన మీప్రశ్నకు ఇప్పుడూ సమాధానం దొరికిందనుకుంటాను. మనవాదనకు అనుకూలంగా ఎక్కడ ఏముక్క కనపడ్డా ఆలోచించకుండా అదే ప్రచారం చెయ్యడం సరికాదు.
నాకా ప్రశ్నలో గందరగోళం ఏదీ లేదండీ. SKC చెప్పిన ఆరిట్లొ మీకేది కావాలని అడిగారు.అది మొదటి ప్రశ్న.
ReplyDeleteమీరందరూ అడుగుతున్న--హైదరబాదు రాజధానిగా తెలంగాణా కావాలని 48% చెప్పారు. నాపై వ్యాఖ్యలు ఇంకోసారి చూసుకోండి, నేను చెప్పింది ఈ ఒక్క ఆప్షన్ గురించే. ఎందుకంటే అది తప్ప ఇంకేది ఆమోదయోగ్యం కాదని అంటున్నారు కాబట్టి.
రెండొది విభజన సెంటిమెంట్ తెలంగాణాలో ఎక్కువుందా, సమైక్య సెంటిమెంట్ మిగతా ప్రాంతాల్లో ఉందా అని తెసుకోవటాని ఉద్దేశించిని. విభజన సెంటిమెంట్ తెలంగాణాలొ 50% ఉంటే, సమైక్య సెంటిమెంట్ కొస్తా-సీమల్లో 90% ఉందని తేలింది. నాకందులో గందరగోళం ఏదీ లేదండి.
అదీ కాక అక్కడ Survey చేసేవారు, ప్రశ్న అడిగే వారికి విడమరిచిచెప్పరని ఎందుకనుకుంటున్నారు?
Since your question directed to me I am compelled to answer. Thanks.
ఆరు ఆప్షన్లలో నాలుగు విభజన ఎలా జరగాలనే. మిగతా ప్రశ్నలకు సమాధానాలు ఎంత శాతంలో వచ్చాయో మనకు తెలియదు. మనకి తెలిసేదల్లా తెలంగాణలో మెజారిటీ విభజన కోరుకుంటున్నారు, 48% హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ కోరుకుంటున్నారు అని.
ReplyDeleteసీమాంధ్రలో సమైక్యతకోసం ఎంత సెంటిమెంటు ఉందనేది అనవసరం. ఈటపా ఉద్దేషమే ఒక్క పక్షం వారే కలిసి ఉండడంపై నిర్ణయం తీసుకోలేరని. సీమాంధ్రలో 100% మంది ముక్త కంఠంతో రాష్ట్రం కలిసే ఉండాలని చెప్పినా అది సమైక్యతకు ఏవిధంగానూ సరిపోదు. అది లేని హక్కుకోసం డిమాండ్ చెయ్యడమే.
విభజన (ఏరకపు విభజన ఐనా సరే అక్కడ ఆప్షన్స్ ఏమీలేవు) కావాలనే వారు తెలంగాణాలో 50% మంది ఉన్నారని ఆ బొమ్మల్లోనే ఉంది. మరో సారి చూడండి. అందుకే divided lot అన్నది. నా అంచనా ప్రకారం వరంగల్, నిజామాబాద్, కరీం నగర్, మహబూబ్ నగర్ లలో అత్యధికంగా (బహుశా 60-70% దాకా), మిగిలిన ప్రాంతాల్లో 40 కి అటుఇటుగా (30-50% with Medak/Nalgonda close to 50 and Hyd/RR/KMM close to 30) వుంటుందంకుంటున్నా. ప్రూఫ్స్ ఏమీ లేవండి.పత్రికల్లో మీలాంటి వారు రాస్తే చదువుకోని assess చెయ్యటం అంతే.
ReplyDeleteఇందులో నాకు పనికొచ్చే విషయమేంటంటే, Mandate అంటూ పెడితే ఈ జిల్లాల్లో సమైక్యవాదులెక్కువ, ఈ జిల్లాల్లో విభజనవాదులెక్కువ అని చాలా స్పష్టంగా తెలుస్తుందనిపిస్తోంది. అది కొత్త ఆలోచనలకు దారితీస్తుందని నా నమ్మకం. To me there ends its(survey's) importance.
My question was do you have any such surveys conducted by national channels with some reputation. Here in US it is very very common we get surveys on almost every important issue on daily basis and they do in fact influence the decision making.
పావని గారు,
ReplyDeleteబొమ్మలో ఎడమవైపు వున్న ప్రశ్న, తెలంగాణా వారు చెప్పినా సమాధానాలు:
1. రాష్ట్రం రెండుగా విడిపోవాలి: 50% మంది అవునన్నారు.
2. రాష్ట్రం మూడూగా విడిపోవాలి: వివరాలు ఇవ్వలేదు.
3. రాష్ట్రం మొత్తం కలిసి వుండాలి: వివరాలు ఇవ్వలేదు.
2, 3 వివరాలు ఇవ్వకుండా, మొత్తం సర్వే గురించి చర్చించలేము.
ఇక కుడివైపునున్న ప్రశ్న, తెలంగాణా వారి సమాధానాలు:
యధాతధంగా వుంచాలి: 13 + 5 = 18%
విడదీయాలి: 48 + 4 + 1 + 2 = 55%
అసలు శ్రీకృష్ణ కమిటీ ఏమిటో తెలియదు అని 27% మంది చెప్పారు.
ఈ తెలియని 27% మందిని తీసివేస్తే విభజించాలని చెప్పిన 55% మంది మొత్తం సమాధానాలు చెప్పిన వారిలో 75% అవుతారు. ఇది నాలుగింట మూడొంతుల మెజారిటీ. విడిపోవడానికి ఆంధ్రావారి ఇష్టాయిష్టాలతో పని వుండదని గ్రహించండి, అది 90% అయినా వంద అయినా.
సత్యాన్వేషి గారు. ఈ clauseలు అసలు ఎందుకు ఉండాలి అన్నదే నా ప్రశ్న. పోలీసు ఉద్యోగాలైనా, ఇతర ఉద్యోగాలైనా, రాజధాని లో అన్ని జిల్లాలవారికీ అవకాశం ఉండాలి. కేవలం ఒక zone కే హైదరాబాదును ఎందుకు పరిమితం చేయాలి? may be it is a layman's doubt. పోటీ పరీక్ష ద్వారానే ఎంపిక జరుగుతుంది కదా.
ReplyDeleteహైదరాబాద్ అందరిదీ అని చెప్పి అక్కడి పోలీసు ఉద్యోగాలకు అందరు అర్హులయితే మరి హైదరాబాదులో ఉండే aspirants ఎక్కడ ఉద్యోగాలు వెతుక్కోవాలి? పోనీ హైదరాబద్ అందరిదీ అయితే హైదరాబాద్లో ఉండే వారు అన్ని ప్రాంతాల ఉద్యోగాల్లోనూ అర్హులుగా చేద్దామా? అప్పుడూ మీజోన్లో పోలీసు ఉద్యోగాలకు కూడా హైదరాబాద్ యువకులు అర్హులవుతారు?
ReplyDeleteకొంతమంది అనీ తెలిసి కూడా లేమాన్ల లాగా వ్యవహరిస్తున్నారు, వారికంటే మీరే నయం లెండి.
Good point.
ReplyDelete