Sunday, 16 January 2011
కర్పూరపు జ్యోతులు..ప్రాణాలతో చెలగాటాలు
ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబరు నెలలు రాగానే అయ్యప్ప సీజను మొదలవుతుంది. అయ్యప్ప భక్తులు మండలం రోజులు దీక్ష తీసుకుని చలిలో పొద్దున్నే లేచి చన్నీల్ల స్నానం చేస్తారు, కాళ్ళకు చెప్పులు తొడుక్కోకుండా నల్ల బట్టలు ధరిస్తారు, రోజూ పూజలు చేస్తారు. దీనివల్ల మనిషిలో ఒక డిసిప్లైన్ వస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది అని నాకనిపిస్తుంది. ఇంతవరకూ బాగానే ఉంది.
వచ్చిన చిక్కేమిటంటే ఈ అయ్యప్ప దీక్ష తీసుకున్నవారు శబరిమలైలో అయ్యప్పగుడి దర్శనం చేసుకుని తమ దీక్ష విరమిస్తారు. ఇలా లక్షలమంది ఒకేసారి శబరిమల దర్శనం చేసుకోవడం వలన రైల్లూ, రోడ్డుమార్గాలలో విపరీతమయిన రద్దీ పెరుగుతుంది. విపరీతమయిన రద్దీ ఏర్పడుతుంది. లక్షల్లో జనాలు గుమికూడినపుడు ప్రమాదాలు జరగడం మామూలే. మొన్నటికి మొన్న విజయవాడకు చెందిన ఒక బృందానికి బస్సు యాక్సిడెంటు జరిగి 11మంది మరణించారు. ఇప్పుడు మకర సంక్రాంతి రోజు తొక్కిసలాట జరిగి వందకుపైగా చనిపోగా మరో వందకు పైగా గాయపడ్డారు.
మకర సంక్రాంతి రోజు ఇక్కడ ఒక మకరజ్యోతి కనిపిస్తుందనీ, ఆజ్యోతిని చూస్తే పుణ్యం వస్తుందని అనేది భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజు రాత్రి అక్కడికి దూరంగా ఉండే కొండల మీదుగా మూడు సార్లు జ్యోతి కనిపిస్తుంది. ఇదే మకరజ్యోతి అనీ, ఇది ఆకాశంలో కనిపించే నక్షత్రమని భక్తులు నమ్ముతారు. అయితే మూడు సంవత్సరాలక్రితమే కేరళలో కొందరు హేతువాదులు అసలు రహస్యాన్ని కనిపెట్టారు. కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన ఒక ఉద్యోగి రహస్యంగా ఆకొండలపై ఉన్న చదును ప్రదేశంలో రహస్యంగా పెద్దఎత్తున కర్పూరాన్ని మండిస్తూ దొరికిపోయాడు. ఆ వీడియో అప్పట్లో ఎన్‌డీటీవీ వారు దేశమంతటా ప్రసారం చెయ్యగా అది పెద్ద డిబేట్ టాపిక్ అయిపొయ్యింది. గతంలో ఎండీటీవీ వీడియో యూట్యూబ్‌లో కూడా ఉండేది, తరువాత డిలీట్ చేశారు.
కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగి ఒకరు ఈ తంతు ఎన్నో ఏళ్ళుగా జరుగుతోందనీ, ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారనీ చెప్పారు. ఆ కొండలదగ్గరికి వెల్లడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఉండదు. దీనిపై విమర్శలు పెరగడంతో శబరిమల ఆలాయం ప్రతినిధి ఆ కొండపై కర్పూరం మండించడం గిరిజన సాంప్రాదాయమయిన మకర విళుక్కు అనీ, దాన్నే ప్రభుత్వం తరఫున ఇప్పుడు చేస్తున్నారని, మకరజ్యోతి వేరే నక్షత్రమనీ సమర్ధించుకున్నాడు. మరి నిజంగానే అది గిరిజన సాంప్రాదాయాన్ని కొనసాగించడమే అయితే అంత రహస్యంగా చెయ్యడం ఎందుకు? భక్తులు మకర సంక్రాంతి రోజు శబరిమల వెల్లేది ఈ కర్పూరం వెలుతురు చూడ్డానికా, లేక నక్షత్రాన్ని చూడ్డానికా? ప్రభుత్వ ఆదాయం కోసం ఇలాంటి నమ్మకాలను ప్రచారం చెయ్యడం ఎంతవరకూ సమంజసం? లాంటివన్నీ ధర్మ సందేహాలు.
ఇక భక్తులు కూడా ఏదో మంచిజరుగుతుందనే నమ్మకంతో ఇలా లక్షల్లో జనాలు గుమికూడడం ఎంతవరకూ సమంజసం? లక్షలమంది ఒకదగ్గర గుమికూడినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలను పూర్తిగా నివారించడం అసాధ్యమని తెలిసీ ఎందుకు వల్లడం? దొరికే పుణ్యం మాటేమిటో గానీ ప్రాణాలకే రక్షణ లేకపోతే ఎలా? త్రొక్కిసలాటలు గుడుల్లోనే అవుతాయని చెప్పడం నా ఉద్దేశం కాదు, చిరంజీవి సినిమాకు, రోడ్డుషోలలోకూడా బాగానే తొక్కిసలాటలు జరిగాయి. అయితే గుడులలో అయితే జనం కాస్త పెద్దేత్తున ఎక్కువ ఇరుకు ప్రదేశాలలో గుమికూడుతారు గనక ప్రమాదాలు సంభవిస్తే జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
you are correct boss... lets start campaigning about this....
ReplyDeleteఅయ్యప్ప స్వామివారికి గిరిజన సాంప్రదాయం ప్రకారమే పూజలు నిర్వహించ బడతాయని, వాస్తవానికి మకర జ్యోతికి ముందు మకరనక్షత్రం మనకి కనబడుతుందని, అయ్యప్ప స్వామి వారి ఆభరణాలంకార కైంకర్యం తరువాత అక్కడి గిరిజన ప్రజలు ఆ మకరనక్షత్రానికి జ్యోతి(మకర జ్యోతి) తో హారతి పలుకు తారని, అయ్యప్ప పూజారులే కేరళ మీడియాకి ఇది వరకు వివరించారు.
ReplyDeleteఅయితే మకర జ్యోతి ’పొన్నంబలమేడు’ కోండల మద్యలో పుడుతున్నట్టు మనమూ చూడ వచ్చు.
కాని ఆకాశం లో మూడు మార్లు వరుసగా, అక్కడే, సమయాంతరాలలో వెలగడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
రెండవ విషయం స్వామివారి ఆభరణాల పెట్టె మోసుకు వెలుతున్నప్పుడు రెండు గరుడ పక్షులు విధిగా ఆకాశం లో తిరుగాడడం, వందల సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం జరుగుతున్న ఈ విషయం వింత గొలుపుతుంది.
ఆభరణాల పెట్టె ని కుడా మూడు రోజుల పాదయాత్రతో మోసుకు వస్తారు. ఒక్క మనిషి మోయలెని చాలా బరువుండే పెట్టేని ఒక్కరే గంతులు వేస్తూ తీసుకు రావడం విశేషం. ఇలా ఎన్నో విశేషాలతో అయ్యప్ప భక్తులు వారి యాత్ర నంతా గొప్ప అనుభూతితో కొన సాగించడం వలన అంత ప్రాశస్త్యం కలిగిన యాత్ర గా ఇప్పటికీ చేప్పుకో బడుతుంది.
కేరళ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించ పోవడం , కనీసం ఆలయ సమీపంలో (25 km) ప్రమాదం జరిగిన దారిలో విద్యుద్దీపాలు కూడా లేక పోవడం శోచనీయం.
-satya
సత్య గారూ, మకర నక్షత్రం కూడా కనిపించేట్టయితే బహుషా అది అన్ని ప్రాంతాలనుంచీ కనపడాలి, దానికోసం ప్రత్యేకంగా శబరిమల వెల్లాల్సిన అవసరం లేదు. అక్కడికి వెల్లే భక్తుల్లో ఎక్కువమంది కర్పూరపు మంటలనే మకరజ్యోతి అనుకొని చూడడం నిజం. వారు చెప్పే మరో మకర నక్షత్రం ఎవరూ చూసిన దాఖలాలు లేవు. ఆలయం వారు అది కర్పూరం మంట అని ఒప్పుకుంది మూడుసంవత్సరాలక్రితం అనేక విమర్శలతరువాత మాత్రమే. కానీ ఈ తంతు కనీసం ఇరవై ఏళ్ళుగా సాగుతుంది. ఆ జ్యోతి కేవలం వారు వెలిగించే హారతి అయితే అది అందరికీ తెలిసేలా చెయ్యాలి, అంతే కానీ ఎవరూ అక్కడికి వెల్లకుండా కట్టడి చేసి రహస్యంగా చెయ్యడం సరికాదు. అది ఖచ్చితంగా భక్తులను మోశగించడమే.
ReplyDeleteఇక మీరు చెప్పిన మిగతా వింతలు..రహస్యం తెలిసేవరకూ అన్నీ వింతలే. ఇక్కడ విషయం ప్రభ్త్వమే అబద్ధాలు ప్రచారం చెయ్యడంలో విగ్నత గూర్చి. కేరళ ప్రభుత్వం సరైన సదుపాయాలు చెయ్యకపోవడం నిజమే, కానీ అరవై లక్షలమంది గుమికూదినప్పుడు ఎన్ని చర్యలు తీసుకున్నా పెద్దగా లాభం లేదు.
మీరన్నదీ వాస్తవం!
ReplyDelete