Thursday 20 January 2011

రాజకీయ నిరుద్యోగులు, ఉద్యమాలు



"తెలంగాణా ఉద్యమం రాజకీయ నిరుద్యోగులు చేపిస్తున్న ఉద్యమం!!??". ఈ డైలాగు మొదట పీయార్పీ అధినేత చిరంజీవి ఉపయోగించగా తరువాత తరువాత సీమాంధ్ర నాయకులు, తెలుగు బ్లాగర్లూ కూడా తెలంగాణా ఉద్యమాన్ని కించపరచడం కోసం దీన్ని వాడుకున్నారు, ఇంకా వాడుకుంటూనే ఉన్నారు. ఒకరు ఒక ఉద్యమాన్ని చేపట్టితే ఆ ఉద్యమం యొక్క అంశం ప్రాధాన్యతను చూడాలిగానీ దాన్ని చేపట్టిన వారు ఎందుకు చేస్తున్నారు అనేది అంత ప్రాధాన్యమయిన విషయం కాదు. కానీ మనవారు తెలంగాణా ఉద్యమాన్ని విమర్శించడం చేతకానప్పుడల్లా నేతలను ఇలా విమర్శిస్తూ వచ్చారు.

నాకు కేసీఆర్ అంటే ప్రత్యేక అభిమానమేమీ లేదు. తెలంగాణా ఉద్యమంలో కేసీఆర్ ఒక నాయకుడు మాత్రమే.కేసీఆర్లో కొన్ని లోపాలు ఉండవచ్చుగాక. అయితే ప్రజల మద్దతులేకుండా కేవలం నాయకులు నడిపించిన సీమాంధ్ర ఉద్యమాన్ని చూసిన సంఖ్యాంధ్ర మద్దతుదారులు తెలంగాణా ఉద్యమం కూడా అలాగే అని భ్రమపడి వ్యక్తులను విమర్శించడం హాస్యాస్పదం. ఇప్పుడు తెలంగాణాలో ప్రజలందరూ తెలంగాణా రాష్ట్రాన్ని కోరుకుంటున్నారనే వాస్తవం బై-ఎలక్షను తరువాతే తెలిసిపోయినా ఇంకా కొందరు వ్యక్తులపై విమర్శలు చెయ్యడం సరికాదు. అందులోనూ చిరంజీవి లాంటి ఏమాత్రం రాజకీయ అవగాహన, పరిగ్నానం లేనివాడు, తాను సొంత స్లోగన్లు కూడా తయారు చేసుకోలేక ఇతరుల స్లోగన్లను వాడుకునే (ఉదా: మార్పు, సామాజిక న్యాయం, నిశ్శబ్ద విప్లవం) అతని డైలాగును వీరు కాపీ కొట్టడం మరీ హాస్యాస్పదం.

కేసీఆర్ తెలుగుదేశం వదిలిపెట్టి టీఆరెస్ పార్టీ స్థాపించకముందు అతని రాజకీయ ఉద్యోగం "డిప్యూటీ స్పీకరు". ఈ ఉద్యోగం గడచిన కాలంలో సీమాంధ్ర ఉద్యమాన్ని నెత్తినేసుకున్న అనేకమంది నాయకులకంటే గౌరవప్రదమయిన ఉద్యోగం. అదేమీ నిరుద్యోగమూ లేక చిరుద్యోగమూ కాదు. ఉదాహరణకు సీమాంధ్ర ఉద్యమంలో బాగా యాక్టివ్‌గా ఉన్న లగడపాటిది ఎంపీ ఉద్యోగం, చిరంజీవిది తనదే ఉద్యోగమో తనకే తెలియని ఉద్యోగం. మిగతా వారు నిరుద్యోగులు, చిరుద్యోగులూనూ.

తెలంగాణా, సీమాంధ్రా కాకుండా ఇంకే ఉద్యమం తీసుకున్నా ఉద్యమ నాయకులు సాధరణంగా ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు. ధరల పెరుగుదల విషయమైనా, బాబ్లీ విషయమైనా, నందిగ్రాం, సోంపేట థర్మల్ ప్రాజెక్టు లాంటి అన్ని విషయాలపై ఉద్యమాలు నడిపింది రాజకీయ నిరుద్యోగులే. అంతమాత్రం చేత ఆ ఉద్యమాల లక్ష్యం తప్పు కాబోదు.

ఇంకొంచెం వెనక్కి వెలితే మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోవటానికి నిరాహార దీక్ష చేపట్టింది రాజకీయ కాంక్షలు లేని గాంధేయవాది అయిన అమరజీవి పొట్టిశ్రీరాములు అయినప్పటికీ ఆ ఉద్యమానికి రాజకీయంగా నాయకత్వం వహించింది మాత్రం ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి. ఇందులో ప్రకాశం పంతులు గారు మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని విశ్వప్రయత్నం చేసి, అది తనకు సాధ్యపడదని తెలుసుకోగా నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి అంతకుముందు జరిగిన ఎలక్షన్లో ఓడిపోయి కనీసం ఎమ్మెల్యే ఉద్యోగం కూడా దొరక్క ఖాళీగా ఉన్నారు. వీరందరికీ అప్పుడు తమ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికీ, తరువాత అధికారం చేజిక్కించుకోవడానికీ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఉద్యమం బాగా కలిసొచ్చింది, ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని వీరు తమ ప్రాబల్యం పెంచుకున్నారు. ఆ తరువాత రాష్ట్ర విభజన జరగగా వీరు ముగ్గురూ వరుసగా ఆంధ్ర రాష్ట్రానికీ, ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి సమఖ్యాంధ్ర మద్దతునిచ్చే మిత్రులారా, మీరు మరోసారి తెలంగాణా ఉద్యమాన్ని రాజకీయ నిరుద్యోగుల ఉద్యమం అనేముందు ఒక్కసారి ఆలోచించండి..బహుషా అది మీ సీమాంధ్ర ఉద్యమ నేతలకు, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఉద్యమ నేతలకే తగలవచ్చు.

8 comments:

  1. బాగా వ్రాశారు.

    వారి ఆకాంక్షలకు విరుద్ధంగా సాగుతున్న ఉద్యమం ఇంత గొప్పగా పుంజుకోవడం వారు జీర్నించు కోలేని విషయం. అందుకే పిచ్చి విమర్శలు చేస్తుంటారు.

    ReplyDelete
  2. >>ఇందులో ప్రకాశం పంతులు గారు మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని విశ్వప్రయత్నం చేసి, అది తనకు సాధ్యపడదని తెలుసుకోగా నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి అంతకుముందు జరిగిన ఎలక్షన్లో ఓడిపోయి కనీసం ఎమ్మెల్యే ఉద్యోగం కూడా దొరక్క ఖాళీగా ఉన్నారు
    References please..its not fair to make comments without references.. i expect to provide relevant references for the same..

    ReplyDelete
  3. @karthik

    ఫాక్షనిస్టులను ఫాక్షనిస్టులంటే మీరెందుకు గింజుకుంటారు? ఇంకా ఏదయినా కొత్తపదం ఉందా వాడడానికి? ప్రస్తుతానికి నాదగ్గర రెఫెరెన్సెస్ లేవు, దొరికితే ఇస్తా కానీ, 1952లో కమ్యూనిస్టులు ఆంధ్రాలో చాలా సీట్లు గెలుచుకోగా వీరిద్దరూ ఓడిపోయారని నాక తెలుసు. ఈలోగా తప్పయితే మీరు నిరూపించండి.

    ReplyDelete
  4. @karthik

    check this:
    http://en.wikipedia.org/wiki/Madras_State_legislative_assembly_election,_1952

    Anantapur T. Nagi Reddy CPI N. Sanjeeva Reddy INC
    Udayagiri Kovi Ramayya Chowdary KMPP Bezawada Gopala Reddy INC

    hope you will be satisfied now.

    ReplyDelete
  5. బ్రిటిష్‌వాళ్ల టైమ్ స్వాతంత్ర్య ఉద్యమం నడిపింది కూడా కాంగ్రెస్‌లో పదవులు లేని క్రింద స్థాయి నాయకులే. మన దేశంలో ఏ నాయకుడికైనా మంత్రి పదవో, MLA పదవో ఉంటే ప్రజా సమస్యలు గుర్తు రావు.

    ReplyDelete
  6. బెజవాడ గోపాల రెడ్డి గారి గురించి, సంజీవరెడ్డి గారి గురించి మీరన్నది నిజమే, కానీ ప్రకాశం పంతులు గారికీ కేసీఆర్ కు ఏమాత్రం సంబంధం లేదండీ.. ప్రకశం పంతులు గారు ఒక ఎన్నికల తర్వాత అతిపెద్ద సంకీర్ణానికి లీడర్ గా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు అందులో తప్పేమిటో నాకైతే కనిపించడం లేదు.. కానీ కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసం తెలంగాణ పాట ఎత్తలేదా?? మీకు గుర్తుందో లేదో 2000-2001 టైం లో కేసీఆర్ స్వయంగా చెప్పాడు, మా వాళ్ళు రాజకీయాలలో లేరు.. కనుక నాకంటూ స్వార్థం ఏమీలేదు అని.. తర్వాత ఏం జరిగిందో మీకూ తెలుసు..

    ReplyDelete
  7. ప్రకశం పంతులు గారు ఒక ఎన్నికల తర్వాత అతిపెద్ద సంకీర్ణానికి లీడర్ గా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు అందులో తప్పేమిటో నాకైతే కనిపించడం లేదు.

    అది తప్పని నేను మాత్రం ఎప్పుడన్నాను?

    ReplyDelete
  8. కానీ కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసం తెలంగాణ పాట ఎత్తలేదా?? మీకు గుర్తుందో లేదో 2000-2001 టైం లో కేసీఆర్ స్వయంగా చెప్పాడు, మా వాళ్ళు రాజకీయాలలో లేరు.. కనుక నాకంటూ స్వార్థం ఏమీలేదు అని.

    మీ భావం నాకు అర్ధం కాలేదు కానీ,
    Your words.."References please..its not fair to make comments without references.. i expect to provide relevant references for the same.."
    .

    ReplyDelete