Friday, 11 March 2011

తీవ్రవాదం తయారుచెయ్యడం ఎలా?




మీకు ఫలానా పిల్లి అంటే నచ్చలేదా,అయ్యో ఎలా? ఊరికే పిల్లిని చంపితే అందరూ తప్పు పడతారే? మరేం ఫరవాలేదు, ముందు పిల్లిని ఒక గదిలో బంధించి బెత్తంతో కొడదాం. అప్పుడు పిల్లి తిరగబడితే పిల్లిపై తీవ్రవాది అని ముద్రవేసి చంపెయ్యొచ్చు. ఇదీ మన ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇంకా అనేక దేశాలు చేసే పని.

నిన్న ట్యాంక్ బండ్‌పై జరిగిన సంఘటన ఒక ఇసోలేటెడ్ సంఘటన అయి సాయంత్రం ఒక గంటజరిగిన సంఘటణలను మాత్రమే తీసుకుంటే ఇది మూర్ఖత్వం. కానీ విషయాన్ని అనలైజ్ చయ్యాలంటే ఒక్క గంట సమయాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోదు, ఆరోజు, అంతకు మూడు రోజులు ముందునుంచి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చేస్తున్న పనులు, సంవత్సరం పైబడిన ఉద్యమ తీవ్రస్థాయి, యాభై ఏళ్ళ చరిత్ర తెలుసుకుంటే ఈపరిస్థితి ఎలా ఏర్పడిందో తెలుస్తుంది.

జగన్ ఓదార్పు యాత్రలకో, అద్వానీ రధయాత్రలకో రోజులతరబడి ప్రజాజీవనం స్థంభించిపోవడం, సెక్యూరిటీపరంగా ప్రభుత్వంపై ఖర్చు ఎంత జరిగినా సరే ప్రభుత్వం అలాంటివాటికి అనుమతులు ఇస్థుంది. యాత్రలు సజావుగా సాగడానికి సహకరిస్తుంది. కానీ తెలంగాణా ఉద్యమకారులు ఒక పిలుపును ఇస్తే దాన్ని ఎలా బలవంతంగా అణచివెయ్యాలనేదే ప్రభుత్వ ఆలోచన. అందుకోసం గత మూడురోజులుగా వేలమందిని తెలంగాణాలో అన్ని ప్రాంతాలలో అరెస్టులు చేశారు, లాకప్‌లలో పెట్టారు.అందరు ఉద్యమ నాయకులను అరెస్టులు చేశారు. అన్ని రోడ్లను పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు. భాష్పవాయువులు ప్రయోగించారు. ఉస్మానియాలో విద్యార్థులను అడ్డుకున్నారు. మొత్తంగా ఇందుకోసం పదివేల పోలీసులను మొహరించారు.

ఇంతగా అణచివెయ్యాలనుకున్నప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో చివరికి అలాగే జరిగింది. బహుషా ప్రభుత్వానికి కావలిసింది కూడా అదే, ఎదుటివారిని తప్పుచేసేలా రెచ్చగొడితేనే కదా అణచివెయ్యడానికి కారణం దొరికేది? బలవంతంగా అణచివేసే ప్రయత్నం చేసినపుడు అందులో కొందరు ఆత్మహత్యలకు ప్రయత్నించొచ్చు, మరికొందరు దాడులకు పాల్పడొచ్చు. ఉద్యమాన్ని అణచివెయ్యడానికి పెట్టిన ఎఫర్ట్‌లో సగం పెట్టి ఉద్యమాన్ని సజావుగా జరగడానికి ప్రయత్నించొచ్చు, కానీ అలా చేస్తే ఎదుటివారిని తీవ్రవాది అని ముద్ర వెయ్యలేం కదా?

బ్లాగుల్లో ఇది అప్రజాస్వామికం, ఘోరం, నేరం అంటూ గొంతు చించుకునే వారు ఎప్పటిలాగే అందుకు దారితీసిన పోలీసుల అణచివేతను మాత్రం కన్వీనియెంట్‌గా ఉపేక్షిస్తారు. ఒక పెద్ద మనిషి దీన్ని కరసేవకులు బాబ్ర్రి కూల్చివెయ్యడంతో పోల్చాడు. అసలా పోలికే తప్పు, కరసేవకులను ప్రభుత్వం పోలీసుబలంతో అణచివెయ్యడానికి చూడలేదు, రధయాత్రను సజావుగా సాగనించారు. ఇంతలో మరో పెద్దమనిషి కరసేవకులతో పోలిస్తే ఎలా వారు కట్టడాన్నే కూల్చివేశారు, తీవ్రవాదులతో పోల్చండి అంటాడు. అవును కట్టడం కూల్చడం దాడికాదు, అక్కడ దాడి చేసినవారు నామత పరిరక్షకులు కదా, ఏంచేసినా సమ్ర్ధించాలి మరి? అదే తెలంగాణా అయితే ఎవరిదో, వారిని ఎన్నైనా తిట్టొచ్చు.

ఇంకొంతమంది వాదం ఇంకో తీరు, ఉద్యమకారులను కంట్రోల్ చెయ్యలేని నాయకులు వీల్లేం నాయకులని విమర్శిస్తారు. అసలు నాయకులకు అంత అవకాశమెప్పుడిచ్చిందీ ప్రభుత్వం? దొరికినవారిని దొరికినట్టు అరెస్టుచేస్తుంటే పోలీసులనుంచి తప్పించుకోవడానికే వాల్ల శ్రమ అంతా పెడితే ఉద్యమమాన్ని నడిపించేదెప్పుడు?

1969లో తెలంగాణా ఉద్యమాన్ని దౌర్జన్యంగా అణచివెయ్యడంతో అక్కడ నక్సల్ ఉద్యమం పెరిగింది. ఇప్పుడు మల్లీ తెలంగాణా ఉద్యమాన్ని దౌర్జన్యంగా అణచివేసి మల్లీ తీవ్రవాదానికి ఆజ్యం పోస్తోందీ ప్రభుత్వం. ఇదీ మన ప్రజాస్వామ్యం. పోలీసులు విద్యార్హులను, ఆడ విద్యార్థులనూ హాస్టల్లలో తాళంపెట్టి లాఠీలతో కొట్టినప్పుడూ, ఒక్కొక్కరిపై వందలకొద్ది కేసులు పెట్టి జైల్లలో పెట్టినప్పుడూ ప్రజాస్వామ్యవిలువలగురించి ఒక్కరూ మాట్లాడరు. కనీసం సీమాంధ్రలో థెర్మల్ విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాలు నడుస్తుంటే ప్రభుత్వం కాల్పులు జరిపినప్పుడూ ప్రజాస్వామ్య విలువలు గుర్తుకురావు. కానీ ప్రాణం లేని విగ్రహాలు, అవీ ఏదో ప్రాచీన కళా సంపద కాదు, అతికిస్తే మల్లి నిలిచే విగ్రహాలపై మాత్రం అపారమైన ప్రేమ. అదేరోజు ఒక విద్యార్థి పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా పురుగుల మందు తాగితే స్పందించే హృదయాలే కరువయ్యాయి, ఇదే మన మానవత్వం.

జై తెలంగాణా!!

12 comments:

  1. ఎలా ఏంటి? మీరు చేసి చూపించారుగా? ఇంకా సందేహమెందుకు?

    ReplyDelete
  2. సత్యాన్వేషి గారూ: ఆ విగ్రహాలు అక్కడ నిలబెట్టింది వాళ్ళు తెలంగాణా ఉద్యమాన్ని విమర్శించినందుకు కాదన్న విషయం మీకు తెలిసేవుంటుంది. ఏవరినైనా విమర్శిస్తున్నామన్నా, ఎవరిదైనా విగ్రహాన్ని విరగ్గొడుతున్నామన్నా లేదా దిష్టిబొమ్మలు తగలెడుతున్నామన్నా మనం వాళ్ళతో విభేదిస్తున్నామని కదా అర్ధం. మరి ఇక్కడ మరి ఆమహనీయులతో ఏ విషయంలో విభేదిస్తున్నారని అర్ధమండీ? లేదనుకుంటే ఈ అర్ధంపర్ధం పనులు ఉద్యమానికి ఏ విధంగా వన్నెతేగలవు? జరిగిన తప్పుకు చింతించకుండా సమర్ధించుకోజూడ్డం దాన్ని మీలాంటివారు సమర్ధించడం.

    ReplyDelete
  3. @kiranpriya

    చూపించింది మన ప్రభుత్వ యంత్రాంగం అన్నది ఇంకా మీకర్ధం కాలేదేమో.

    @Indian Minerva

    జరిగిన దానిని ఎవరూ సమర్ధించడం లేదు, ఆ సంఘటనకు దారితీసిన పరిస్థితులగురించి ఈ టపా. ఇంతకుముందు పదిలక్షల మందితో మహా ఘర్జన జరిగింది, ఇప్పుడు కూడా పోలీసులు సహకరించి వుంటే ఏ దిష్టిబొమ్మో తగలేసి ఊరుకునేవారు, అణచివేత ఫలితాలకు అర్ధాలు దొరకవు, అణచివేతను మరచిపోయి ఫలితాన్ని గురించి మాత్రమే మాట్లాడ్డం తప్పు.

    ReplyDelete
  4. ఇప్పుదు మీరు చెప్పేది నిన్న జరిగింది జరగాల్సిందే జరిగింది అనా?

    ReplyDelete
  5. మీరన్నా ఒప్పుకున్నారు సంతోషం. పోలీసుల పనే శాంతి భద్రతలను కాపాడటం అన్నప్పుడు ఒక్కసారిగా లక్షలాదిమంది ఆవేశంగా సమావేశాలు జరప తలపించినప్పుడు, గతంలో జరిగిన పరిణామాలను దృష్ఠిలో నుంచుకొని అప్రమత్తంగా వుండటం వారి విధికదండీ (having said that... హాస్టళ్ళలో దౌర్జన్యాలకు నేను సమర్ధించబోవడంలెదు).

    ReplyDelete
  6. Nice post. well written. It is bringing out many important points.

    విగ్రహాలు పడగొట్టడం మతిలేని చర్య. చాలా బాధాకరం. ఇటువంటి విద్వేషపూరిత మైన వాతావరణం సృష్టించిందెవరు? మనందరం కాదా?

    A democratic government behaving dictatorially is being tolerated by our people when the dictatorship is in favor of their interest. This is a dangerous tendency.

    I appreciate your post.

    ReplyDelete
  7. Sadly, there are some people who simply think that Democracy means the dictatorship of the majority over the others.

    That means.. we are still not a mature democracy..:(

    ReplyDelete
  8. Weekend Politician, Thanks for your comments. Yes, we are still not a mature democracy.

    ReplyDelete
  9. Yes and we are getting matured democracy by demolishing out own culture...

    Police duty is to save law and order...dont simply blame police. It only show your immaturity on law and order system or u go by your rules and ready to break law and order to achieve ur personal goals.

    One more thing - when harish rao and KTR couldnot able to control and bunch of stupids and bashed JP, that too in assembly..on a sitting MLA by a car driver...why the HELL police should believe this so called agitation or movement or revolutin wht ever?

    ReplyDelete
  10. @Chandu

    The problem is in our great democratic country unless some violent events happen government gives a damn about any peaceful agitation, however justified the cause is. If state attemps to only curb the cause, the reaction will be like this.

    Here the agitation is not in the control of some leaders as you said, but it is in the hands of people. People cannot be controled by force. in a democratic country if goverment cannot heed to the voice of people, how can it be democratic? The fact that even with so many arrests and force so many people have made to the March shows the strength of cause.

    Governmen't duty is to allow a democratic possession with giving enough security to watch that proceedings will happen smoothly, not to deny permission, arrest tens of thousands of people and try to curb the agitation with force. There were bigger, longer, more sensitive agitations allowed in the past but permit for this was denied just to showcase that the agitation is not strong enough and they paid the price.

    అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు,
    అరెస్టులూ టియర్‌గ్యాస్‌లతో ఉద్యమాలనాపలేరు!!

    ReplyDelete
  11. "కానీ ప్రాణం లేని విగ్రహాలు, అవీ ఏదో ప్రాచీన కళా సంపద కాదు, అతికిస్తే మల్లి నిలిచే విగ్రహాలపై మాత్రం అపారమైన ప్రేమ." - ఆత్మగౌరవమే పునాదిగా రాష్ట్రాన్ని చీల్చాలనే వారిని సమర్ధించేవారు విగ్రహాల గురించి ఇలా రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి, ఆత్మగౌరవానికి ప్రాణముందా సార్?

    "Here the agitation is not in the control of some leaders as you said, but it is in the hands of people." - అంటే ప్రజలపై ఈ నాయకుల నియంత్రణ లేదనే కదండీ అర్థం? అలాంటి నాయకులు పోలీసు స్టేషన్లలో ఉంటే ఏంటి, బైటుంటే ఏంటి? తాము నియంత్రించలేమని తెలిసినపుడు లక్షలాది జనాన్ని హై. కి రమ్మని పిలవడమేంటి? కేవలం వేలే వచ్చారు కాబట్టి, పోలీసు చాలా నియంత్రణతో వ్యవహరించారు కాబట్టీ, ప్రజలకేమీ కాలేదు. అదే అనుకోని వేమైనా జరిగి ఉంటే..? తమ వల్ల కాని పనులను చెయ్యాలని తలపెట్టడమెందుకు?

    ReplyDelete
  12. @చదువరి

    అసలు ఈ టపాలో ఎక్కడా కూల్చివేతను సమర్ధించలేదు, కూల్చివేతను విడదీసి చూడకుండా అందుకు దారితీసిన పరిణామాలను కూడా చూడాలనేదే ఉద్దేషం. ఆత్మగౌరవం అని చెప్పి మద్రాసునుండి విడిపోయినవారు పక్కవారి ఆత్మగౌరవాన్ని వెక్కిరించడం ఎబ్బెట్టుగా ఉంది. ప్రాణాలు పోతుంటే వెక్కిరించేవారు విగ్రహాలపై మొసలికన్నీల్లు కార్చడం ఎందుకు, అంత ప్రేమ ఉంటే మీదగ్గర పెట్టుకోండి.

    @"అంటే ప్రజలపై ఈ నాయకుల నియంత్రణ లేదనే కదండీ అర్థం"

    అర్ధం అది కాదు, ఇక్కడ ఉద్యమాలు మీఉద్యమాలలాగా డబ్బూ,మీడియాలసాయంతో నడిచేవి కావు, ప్రజలు ఉద్యమిస్తున్నారని చెప్పడం.

    @"ప్రజలకేమీ కాలేదు. అదే అనుకోని వేమైనా జరిగి ఉంటే"

    ప్రజలకు ఏదయినా చేసే ఉద్దేషమే ఉంటే కొందరు హైదరాబాదులో కూర్చిని ఇలాంటి కబుర్లు చెప్పరు. అలాంటి పనులు ఎవరు చేస్తారో మీకూ తెలుసు కాబట్టి గుర్తుచెయ్యాల్సిన అవసరం లేదనుకుంటా.

    ReplyDelete