Sunday 3 April 2011

దేవుడి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆందోళన

కలియుగ దైవం, శిర్డీసాయి, దత్తాత్రేయుల అవతారమైన సత్యసాయిబాబా ఆరోగ్యం పాపం కొద్దిరోజులనుండీ బాగోలేదట. తప్పదు మరి ఎంత అవతారమూర్తి అయినా వయసు మీదపడితే ఇంకేం చేస్తాడు. అయితే మనరాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఈవిషయంపై ఉన్నతస్థాయిలో ఆరోగ్యశాఖలోని అధికారులతో సమీక్షలు జరుపుతున్నాడట. నిపుణులను పుట్టపర్థికి పంపాలని ఆదేశించాడట. మన ఆరోగ్యమంత్రి గీతారెడ్డి కూడా పుట్టపర్థికి వెల్లి రెండురోజులుగా అక్కడే క్యాంప్‌వేసి మరీ ఆయన ఆరోగ్యాన్ని సమీక్షిస్తుందట.

ముఖ్యమంత్రి గారూ, దేవుడి ఆరోగ్యం గురించి మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు. మీరు రాష్ట్రం ఆరోగ్యం గురించి చూడండి. వయసు మీదపడ్డాక దేవుడికైనా మృత్యువు తప్పదు, రాష్ట్రంలో ఎందరో ఆరోగ్యసదుపాయాలు అందక వయసునిండకుండానే మరణిస్తున్నారు, కాస్త వారి సంగతి చూడండి.

3 comments:

  1. ప్రజలలో సైన్స్ విజ్ఞానం పెంపొందించాల్సిన నాయకులే మూఢ నమ్మకాలని నమ్మడం చూస్తోంటే నేను ఏ లోకంలో ఉన్నాను అని నాకే అనుమానం వస్తోంది.

    ReplyDelete
  2. క్రిష్న & ప్రవీణ్

    మీ స్పందనలకు ధన్యవాదాలు.

    ReplyDelete