Friday, 3 June 2011

రంగు కళ్ళజోళ్ళు


రంగు కల్లజోళ్ళు పెట్టుకుంటే లోకమంతా రంగుగా కనిపిస్తుందనేది అందరికీ తెలిసిన పాత సామెతే, అందరం తరుచుగా వాడే సమెతే. సమస్య ఏమిటంటే ప్రతివాడు ఎదుటివాడిని నీరంగు కల్లజోళ్ళు తీసెయ్యమనడం, కానీ తనదాకా వస్తే తనకల్లజోళ్ళసంగతి మరిచిపోవడం.

ఒక్కరిని అనేదేముంది, మన తెలుగు మీడియా అంతా రంగుకల్లజోళ్ళమయం. ఒకరికి పసుపు కల్లజోళ్ళయితే మరొకరికి మొన్నటిదాకా ఆకుపచ్చకల్లజోళ్ళు, ఇప్పుడేరంగో తెలియదు కానీ జగన్ జోళ్ళు. నేను రోజూ పొద్దున లేవగానే ఈనాడూ, సాక్షి అప్పుడప్పుడూ సూర్య పత్రికలు చదువుతాను. ఈమధ్య ఆంధ్రజ్యోతి వాడు వెబ్ ఏదిషన్ పైడ్ చేశాడు కాబట్టి చదవడం కుదరడం లేదు. సాధారణంగా ఒకే విషయంపై ఈనాడులో ఒక వార్త ఒకలాగ రాస్తే సాక్షి దానికి పూర్తిగా వ్యతిరేకంగా రాస్తుంది. ఏవిషయంలో ఏవార్తను నమ్మాలి అన్న దాన్ని కేస్ టు కేస్ బేసిస్లో డిసైడ్ చెయ్యాల్సి ఉంటుంది. జగన్ విషయమైతే ఈనాడు, చంద్రబాబు విషయమైతే సాక్షి వార్తలను నమ్మితే కాస్త వాస్తవానికి దగ్గరగా ఉంటుందనిపించింది.

మేముండే ప్రాంతంలో ఇండియన్స్ తక్కువే, అందులో తెలుగువాళ్ళు పెద్ద ఎక్కువ కాదు. కానీ ఉన్నకొద్దిమందిలో రెండు సామాజిక వర్గాలవారు గ్రూపులుగా కలిసి ఉంటారు. మిగతావారు ఒక వర్గంగా ఉండేంత మంది లేకపోవడంతో ఆవర్గాలు లేవు. మిగతా అన్ని రాష్ట్రాలవారు రాష్ట్రాలవారీగా గుంపులు కడితే తెలుగు వారు మాత్రాం ఇలా సామాజికవర్గాలు గా విడిపోవడం మామూలే. అయితే విషయం ఏమిటంటే ఏదయినా గెట్‌టుగెదర్ జరిగి జనం కలుసుకున్నపుడు టాపిక్ రాజకీయాల్లోకి వెలుతుంది. ఒక సామాజిక వర్గం చిరంజీవిని మరో సామాజిక వర్గం చంద్రబాబునూ సమర్ధిస్తుంది, అది ఎలాంటి విషయమైనా. ఇది ఎంతగా నంటే చిరంజీవి రాజకీయాల్లో రెండు సంవత్సరాల్లో పూర్తిపరువు పోగొట్టుకున్నప్పటికీ చిరంజీవిని ఒక వర్గం ఇంకా సమర్ధిస్తుంది. చంద్రబాబు నక్కజిత్తులు తెలిసినా ఒక వర్గం చంద్రబాబును సమర్ధిస్తుంది. ఫలానా వారు ఫలానా విషయాన్ని కేవలం తాము ధరించిన కల్లజోళ్ళకారణంగా సమర్ధిస్తున్నారని తెలిసినపుడు మనం వారితో విషయంపై చర్చించి ఏం లాభం?

ఈమధ్యన ఒకబ్లాగులో ఒకరు తెలంగాణ వాదులు తమ రంగుకల్లద్దాలను తీసి చూసినట్లయితే చంద్రబాబు రెండుకల్లసిద్దాంతంలో ఉన్న నీతిని చూడచ్చని రాసి తెలంగాణ వాదులందరికీ కలగలిపి రంగుకల్లజోళ్ళను అంటించారు. అవును తెలంగాణ వారికి తెలంగాణ రంగు కల్లజోళ్ళు, సీమాంధ్ర వారికి సీమాంధ్ర రంగు కల్లజోళ్ళు ఉంటాయి, ఇద్దరూ ఆ కల్లజోళ్ళలోంచే విషయాన్ని గమనిస్తారు. అసలు సీమాంధ్ర వాదులకు ఉన్నవి రంగు కల్లజోళ్ళు కావు, అవి "అంధులు" ధరించే నల్ల కల్లజోల్లు, కాబట్టి వారు నిజాలను ఎప్పుడూ చూడలేరు అని చెప్పేవారు కూడా ఉన్నారనుకోండి, కానీ అది వేరే విషయం.

అయితే నాకు తెలిసి తెలంగాణ వారి కల్లజోళ్ళకు ఒక లేయర్ ఉంటే సీమాంధ్ర వాదులకు ఉన్న కల్లజోళ్ళకు రెండు లేయర్లుంటాయి, ఒకటి ప్రాంతానికి సంబంధించిన లేయర్ కాగా మరొకటి కులాని సంబంధించినది. అందుకే జగన్ను విమర్శిస్తే ఒక వర్గం, చంద్రబాబును విమర్శిస్తే ఒక వర్గం, చిరంజీవిని విమర్శిస్తే మరో వర్గం మండిపడుతుంది. తెలంగాణపై మాత్రం పై అన్ని వర్గాలు ఎగిరిపడతాయి. మరి వీరు రెండు పొరలున్న ఈకల్లజోల్లను ఛేదించుకుని వాస్తవాలను ఎప్పటికైనా గ్రహిస్తారంటారా? ఇలాంటివారితో ఎవరైనా విషయంపై విభేదించి అవతలి వారికి తమవాదన వినిపించగలరా?

3 comments:

 1. సార్, ఉపమానాలకేముంది సర్?
  మీరు సీమాంధ్ర వాళ్ళది అంధుల కళ్ళజోడు అంటే వేరొకరు తెలంగాణ వాళ్ళకి కళ్ళజోడు అవసరంలేదు, ఎందుకంటే వాళ్ళకు కళ్ళే లేవు అనొచ్చు. ఇంకొకరు ఆంధ్ర వాళ్ళకు తలకాయే లేదు అనొచ్చు..ఇలా ఎస్కలేట్ అవ్వుకుంటూ పోతుంది..ఆంధ్ర వాళ్ళ కళ్ళజోడు కి రెండు కోటింగ్స్ ఉంటాయని మీరు చెప్పింది కరెక్ట్..అలానే తెలంగాణ వాళ్ళకి కూడా మతం అనే ఇంకొక కోటింగ్ ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకి కూడా మతం అనే కోటింగ్ ఉంటుంది కానీ తెలంగాణ వారికి ఉన్నంత మందం గా ఉండదు..ఇంతకీ మీరు చెప్పేది ఏమిటంటే తెలంగాణ వాళ్ళ కళ్ళ జోడు నిజం గా లేదనీ..అదే అసలైన ద్ర్ష్టి అనీ..కానీ మిగిలిన కళ్ళజోడుల వాళ్ళు కూడా సరిగ్గా ఇలానే అనుకొంటారు..అందరూ తమ తమ కళ్ళజోడులు పక్కన పెట్టి ఒక చోట చేరితే బాగుంటుంది..
  బాబు గురించి సాక్షి కథనాలనూ, జగన్ గురించి ఈనాడు కథనాలనూ నమ్మినట్లైతే మీరు చాలా అబధ్ధాలు నమ్మాల్సి వస్తుంది..

  ReplyDelete
 2. విషయం ఏమిటంటే, ఎవరి కళ్ళద్దాలు వారికి కనపడవు..ఎవరి కళ్ళు వారికి కనపడనట్లు గానే. రెండు వైపుల వారూ ఎదుటి వారి కళ్ళద్దాలను కాసేపు పెట్టుకొన్నట్లైతే తరువాత కళ్ళద్దాలు లేకుండా చూడటం సులువు ఔతుంది.
  మన కళ్ళద్దం మనకు హాయిగా ఉంటుంది. ఎదుటి వాడి కళ్ళద్దం అంత హాయిగా ఉండదు , కష్టం గా ఉంటుంది..ఇది మనం తగిలించుకొన్న ఇంకొక కళ్ళజోడు, స్వార్ధం వలన. ఈ స్వార్ధం కళ్ళజోదుని వదిలించుకోవటం చాలా కష్టం.

  ReplyDelete
 3. బొందలపాటి గారు,

  నేను తెలంగాణ వారికి కళ్ళజోడు లేదని ఎక్కడా చెప్పలేదు. తన రెండుపొరల కళ్ళజోడు సంగతి మరిచిపోయి తెలంగానవాదులకు మాత్రం కళ్ళజోడులు ఆపాదించినవారి సంగతి చెప్పానంతే.

  మతం అనే పొర ఎవరి కల్లజోడులో ఎక్కువగా ఉంటుందో చెప్పడం కష్టం. బ్లాగుల్లో బాబరీ కూల్చివేతను కూడా సమర్ధించే ఘనులు ఎక్కువగా సీమాంధ్రవాదులే. కల్లజోళ్ళలో అన్ని పొరలూ అన్ని సార్లు బయట పడవు, తెలంగాణ విషయమో చంద్రబాబు విషయమో వచ్చినప్పుడు మతం పొర ట్రన్స్పరెంట్ గా మారుతుంది, కనుక ఇక్కడ మతం పొర ఇర్రిలవెంట్.

  ఎదుటివారి కల్లజోల్లు పెట్టుకు చోఓడ్డం అంత సులువు కాదు, కల్లజోల్లు పుట్టుకతో వచ్చినవాయె.

  ReplyDelete