Tuesday 14 June 2011

తెలుగు భాష సరళతను కాపాడుదాం



తెలుగు భాషాపరిరక్షణ


తెలుగు భాష సరళతను కాపాడడానికి నలమోతు శ్రీధర్ గారు ప్రారంభించిన భాషా పరిరక్షణ ఉద్యమానికి నా సంఘీభావం ప్రకటిస్తున్నాను. ఈసందర్భంగా శివరామ ప్రసాద్‌గారి వాఖ్యను యధాతధంగా రాస్తూ నామాటకూడా అదేనని చెబుతున్నాను.

"నేను ఎన్నటికీ “గట్టిపళ్ళెం”, “జాలగూడు”, “విహారిణి”, “నియంత్రణా వ్యవస్థ”,”క్రమకర్తలు”,”ఖతి” ,”సంగణకం”, “విశ్వవ్యాప్త వలయం” “మృదులాంతకం” ,”పంపక సులభ కవిలె” “సంప్రకారం” వంటి భ్రష్ట పదాలను వాడను. నేను మాట్లాడాను లేదా వ్రాశాను అంటే ఇతరులకి అర్ధం కావటానికి కాని, నా పాండిత్య ప్రదర్శనకు కాదు అని తెలిసి ఉన్నవాణ్ని కనుక అలా చేయలేను."

10 comments:

  1. తర్జుమా చేసిన పదాలు సులభమయినవి అయితే జనాల్లొకి వెళ్ళేందుకు వీలుగా వుంటుంది. క్లిష్టమయిన పదాల పట్ల నాకూ ఆసక్తి వుండదు. మధ్యేమార్గంగా నేనయితే సులభమయినవి వాడేస్తాను, క్లిష్టమయినవి, చిత్రమయినవి వదిలేస్తాను. కొత్త తెలుగు పదాలు ముందుగా అందరం వ్రాతల్లో పాటిస్తున్నా నెమ్మదిగా వాటితోనే వ్యవహరించడం కుదరవచ్చు. ఏదయినా సరే ఎక్కడో అక్కడ మొదలవ్వాలి కదా.

    ReplyDelete
  2. don't waste time on useless things !

    ReplyDelete
  3. అవును ఎక్కడో అక్కడ మొదలవ్వాలి నిజమే. కొత్త సాంకేతిక పదాలు రావాలి అంటే కొందరు ఒక గుంపుగా ఏర్పడి దబ దబా కొత్త పదాలు చేసేసి ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు చరుచుకుని అవి జాబితాగా ప్రచురిస్తే వాడుకలోకి రావు. సామాన్య ప్రజలు తమకి ఏది కావాలో ఆ పదాలను వాడుకలో హాయిగా తయారు చేసుకుంటారు. సాంకేతిక పద కల్పనలో గ్రాధికం ఆధారంగా చేయటం, ఆంగ్లంలో ఉన్న పదాలకు యధాతథ అనువాదం అటువంటి పద సృష్టి సామాన్య ప్రజల నుండి దూరం చేస్తున్నది. ఏదో ఒక పదం తయారు చేసేసి, వాడుకలో ఇవ్వాళ ఎబ్బెట్టుగా ఉన్నా కాలక్రమేణ వాడుకలోకి వచ్చేస్తుందనుకోవటం భ్రమ మాత్రమే.

    మీరు తయారు చేసిన నినాదం బాగున్నది.

    ReplyDelete
  4. బహుళ మాధ్యమ మీటల బల్ల (మల్టీ మీడియా కీబోర్డ్) లాంటి అనువాదాలు పెద్దగా చదువుకోనివాళ్ళకే కాదు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి కూడా అర్థం కావు. ఇలాంటి అనువాదాలు వాడితే సాధారణ ప్రజలకి టెక్నాలజీ అర్థమయ్యే అవకాశం లేదు.

    ReplyDelete
  5. శరత్ గారు, 'తర్జుమా' అనేది తెలుగు పదం కాదు. ఉర్దూ లేదా పర్షియన్ పదం అనుకుంటా. దాని బదులు 'అనువాదం' అంటే బాగుంటుందేమో. అయితే తెలుగు భాషా పరిరక్షణ గురించి శ్రీధర్ గారి బ్లాగు చూసాను. తన గురించి వాస్తూ ఆయన ఎన్నో ఆంగ్ల పదాలు వాడారు. ఉదాహరణకు "మంత్లీ", "ఎడిటర్", "మేగజైన్" ఇలాంటివి. వీటన్నిటికీ తెలుగు పదాలు ఉన్నాయి కదా. మాస పత్రిక, సంపాదకుడు, పత్రిక మొదలయినవి. మన దైనందిన జీవితంలో మనకు తెలియ కుండానే ఎన్నో ఆంగ్ల పదాలు వాడుతుంటాం. మరి సరళమైన తెలుగు వ్రాయాలని ఇన్ని పర భాషా పదాలు వాడుతున్నారే. మనకు కష్టంగా వున్న ఆంగ్ల పదాలకు నోరు తిరగని సంస్కృత ప్రత్యామ్నాయాలు వెదక నక్ఖరలేదు. వాటి ఆంగ్ల రూపంలోనే వాడొచ్చు. ఉద్దాహరణకు రైలు, బస్సు లాంటివి. కాకపోతే మనకు ఉన్న తెలుగు పదాలను వదలి సాధారణ పదాలను ఆంగ్లంలో వాడకుండా ఉంటే బాగుంటుంది. ఎవ్వరూ కావాలని కష్టమైన పదాలు వాడాలకోరు. అంతా అలవాటులో పొరపాటు. ఇది కేవలం సూచన మాత్రమే. ఆక్షేపణ అని అనుకోకండి.

    ReplyDelete
  6. I agree.. Majority of these looks like as it is translation and sounds a bit of sanskrit/kannada but not telugu. I mentioned kannada because it is more a bit kin to sanskrit but where as telugu is known for more simpler usage.

    paina perkonna padaalu vaadalante edo panti kinda paluku laaka ibbandi ga untundi.

    The intention is good to have telugu names for technical words but the haste to throw some word on to the users will backfire.

    ReplyDelete
  7. తర్జుమా అనేది ఇప్పుడు ఉర్దూ పదమని ఎవరూ అనుకోవడం లేదు. అది తెలుగు పదం కింద ఎప్పుడో మారిపోయింది. తరతరాలుగా విభిన్న సంస్కృతుల కలయిక వలన తెలుగులో చాలా ఉర్దూ, అరబిక్, పర్షియన్ పదాలు వచ్చి చేరాయి. అవి మన భాషను మరింత పరిపుష్టి చేశాయి గాని నష్టం ఏమాత్రం చేయలేదు. అలాంటి పదాలను ఉర్దూ అని వర్గీకరించడం అంత మంచిది కాదు.

    ఉదాహరణకి మేజా, దస్తావేజు, రుమాలు, రసీదు లాంటి పదాలు తెలుగు పదాలు కావని అనగలమా?

    కొత్త పదాల సృష్టి అటుంచి మనం ఉన్న పదాలను మరిచి పోతున్నామేమో అనిపిస్తుంది. గ్రామాలలోని జానపద భాషలోకి తొంగి చూస్తే ఎన్నో మనకు తెలియని పదాలు కనిపిస్తాయి. వాటి నిర్మాణాన్ని గనుక అధ్యయనం చేస్తే కొత్త పదాలు సృష్టించే మార్గాలు కూడా దొరకొచ్చు.

    http://cheekativelugulu.blogspot.com/2011/02/blog-post_27.html

    నల్లమోతు శ్రీధర్ గారి ఉద్యమానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను.

    ReplyDelete
  8. స్పందించిన అందరికీ ధన్యవాదాలు. ఈవిషయంపై చర్చించేందుకు నేనేమీ భాషాపండితున్ని కాకపోయినా నాభిప్రాయాన్ని తెలుపుతూ నలమోతు శ్రీధర్ గారికి నావంతు మద్దతు తెలిపాను.

    నా దృష్టిలో భాష అనేది వాడకం నుండి పుట్టుకురావాలి కానీ వాడుకలో ఉన్నపదాలను కాదని భాషాపాండిత్యం కోసం కొత్తవి బలవంతంగా రుద్దగూడదు. ఉదాహరణకు bus అనే ఇంగ్లీషు పదాన్ని మనం వాడుకలో బస్సు అని తెనుగీకరించుకున్నాం. ఇప్పుడు బస్సు కూడా తెలుగు పదమే. బస్సుకు ఇంగ్లీషు మూలం కాబట్టి ఇప్పుడు దాన్ని కాదని మరో కొత్తపదాన్ని, అది కూడా మరో భాష సంస్కృతం నుండి అరువుతెచ్చుకుని రుద్దితే ఎలా ఉంటుంది?

    పరభాషాపదాలను సులభంగా సొంతం చేసుకునే భాషలు ఎక్కువ వృద్ధి చెందుతాయి. ఇంగ్లీషు గొప్పతనం పరభాషాపదాలను సులభంగా కలుపుకోవడం. కొంతవరకూ తెలుగుకు కూడా ఈక్వాలిటీ ఉన్నప్పుడు మనం ఇంగ్లీషు పదాలను తెనుగీకరిచుకుంటే నష్టం లేదు. దానికి ప్రతిగా కష్టతరమయిన సంస్కృత పదాలు సృష్టించాల్సిన అవసరం లేదని నాభిప్రాయం.

    ReplyDelete
  9. ఉన్న తెలుగు పదాలు అంతరించిపోకుండా చూస్తే చాలు. కొత్త తెలుగు పదాలు కనిపెట్టడం వల్ల ప్రయోజనం సున్నా. ఉదాహరణకి "తుపాకీని ఇనుముతో తయారు చేస్తారు" అనడానికి గన్‌ని ఐరన్‌తో తయారు చేస్తారు" అనడం, తుపాకీ మందుని గన్‌పౌడర్ అనడం, గుండుని బుల్లెట్ అనడం, సీసంని లెడ్ అనడం, ఇలా ఆయుధాలకి సంబంధించిన పేర్లన్నిటినీ ఇంగ్లిష్‌లోకి మార్చేశాం. ఈ తెలుగు పదాలని పునరుద్ధరించడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు కానీ ఎవరికీ అర్థం కాని "పంపక సులభ కవిలె" లాంటి పదాలు కొత్తగా కనిపెడుతున్నారు.

    ReplyDelete
  10. శరత్, శివరాం ప్రసాద్, సత్య, హరి:

    కొత్తపదాలు గ్రాంధీకం లేకుండా. సంస్కృతం లేకుండా సరలమైన భాషలో ఉంటే వాటి తయారీకి నేను సమ్మతిస్తాను. అలాగే హరి గారు, ప్రవీణ్ గారు చెప్పినట్లు ఉన్న పదాలను మరుగున పడకుండా చూడాల్సిన భాద్యత కూడా ఉంది. అచ్చతెనుగు పదాలు వాడడమే తప్పు, మాండలీకపు పదాలు ఏవో తక్కువ లాంటి భావన మనలో కలిపించడం వలన చాలా తెలుగుపదాలు మరుగున పడిపోతున్నాయి.

    అలాగే కొంతమంది టీవీ ఆంకరమ్మలు ప్రతి వాక్యానికీ అవసరమున్నా లేకున్నా మూడు నాలుగు ఆంగ్ల పదాలను జోడించి, ఒక కొత్త పాష్ యాసలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఈమధ్యన సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగు చెప్పేవారు కూడా ఒక అదో రకం యాసలో మాట్లాడుతున్నారు. ఇలాంటివారివలన తెలుగుభాషకు చాలా ప్రమాదం ఉంది.

    జనం వాడుకలో మాట్లాడే తెలుగు పదాలను కాదని ఇంగ్లీషు పదాలను వాడడం ఎలా ఎబ్బెట్టుగా ఉంటుందో అలాగే వాడుకలో ఉన్న బస్సు, కంప్యూటర్ లాంటి ఆంగ్లపదాలస్థానంలో గ్రాంధీకం జోడించిన పదాలు వాడినా అంతే ఎబ్బెట్టుగా ఉంటుంది.

    ReplyDelete