Friday, 17 June 2011
దేవుడి యజుర్మందిరంలో లక్షల కోట్లు??
సత్యసాయిబాబా మరణించి రెండునెలలు కావొస్తున్న సమయంలో సత్యసాయి అనారోగ్యానికి లోనయినప్పుడు తాళం పెట్టిన ఆయన వ్యక్తిగత గది యజుర్మందిరం తలుపులు నిన్న తెరిచారు. నదులో లక్ష కోట్ల దాకా విలువ చేసే డబ్బూ, బంగారం, వజ్రాలు, టన్నులకొద్దీ వెండీ ఉన్నట్లు తెలుస్తోంది. బాబా మరణం తరువాత ఇప్పటికే ఎంతో బంగారం, డబ్బూ బయటికి తరలించారనేది మరో విషయం. ఇదంతా కేవలం ఆయన వ్యక్తిగతహోదాలో తన మందిరంలో దాచుకున్న సంపద కాగా దేశవిదేశాల్లో ట్రస్టుకు ఇంకెంతో సంపద ఉందనేది తెలిసిందే.
బాబా తాగునీటి ప్రాజెక్టులూ, విద్య, హాస్పిటల్ వగైరాలను చూపించి అతని దేవుడి స్టేటస్‌కు జస్టిఫికేషన్ ఇచ్చేవారు సంక్షేమానికి వెచ్చించిన మొత్తం సొమ్ము ఆయన సంపదలో నీటిబిందువంత అని ఒప్పుకోకతప్పదు. అదికూడా సత్యసాయి సంక్షేమానికి డబ్బులు వెచ్చించింది ఆయనమీద అనేక ఆరోపణలు వచ్చినతరువాత ఆరోపణలనుండి బయటపడడానికి మాత్రమే కానీ 1980 ముందు అతను సేవకు పెద్దగా చేసిందేమీ లేదనేది మరొక విషయం. ఇంతకూ సమాజసేవ చేసిన వారంతా దేవుల్లయితే సొంతడబ్బులు సమాజసేవకు వెచ్చించిన పారిశ్రామికవేత్తలనెవరూ దేవుల్లనరు..ఒక్కరోజు పేపర్లో చదివి ఓహో అలాగా అనడం తప్ప. బిల్‌గేట్స్, వారెన్ బఫెట్, స్టీవ్‌వా లాంటి విదేశీయులు వారికి సంబంధం లేని మనదేశంలో సొమ్మును సమాజసేవకు ఖర్చు చేస్తున్నారు. మనదేశంలో అజీంప్రేంజీ, టాటా, నారాయణమూర్తీ లాంటివారు ఎంతో సొమ్ము సమాజసేవకు వెచ్చిస్తున్నారు. ఎవ్వరూ తాము దేవుల్లమని చెప్పుకోరు, వారిని వారి సేవచూసి ఎవరూ దేవుల్లని అనరు.
ఇంతకూ సత్యసాయి దేవుడని చెప్పుకున్నందుకు డబ్బులు సంపాదించాడా, డబ్బులు సంపాదించి అందులో కొద్దిమొత్తాన్ని సమాజసేవకు వెచ్చించినందుకు దేవుడయ్యడా అనేది మరో సందేహం. ఒక మామూలు వ్యక్తి ఎంతనిజాయితీగా సమాజసేవ చెయ్యడానికి ముందుకొచ్చినా డబ్బులు పెద్దగా రాలవు, దేవుడని చెప్పుకుంటే మాత్రం దండిగా వస్తాయి. డబ్బులిచ్చినవారిలో అధికభాగం డబ్బును ట్రస్టుకు ఇచ్చారు, ట్రస్టు స్థాపించిన ఉద్దేషం ఎలాగూ సమాజసేవే కనుక డబ్బును ఎందుకు ఇచ్చారో అందుకు అదికూడా అతికొద్ది శాతం ఖర్చు చేస్తే దేవుడెలాగ అయ్యాడో నాకయితే అర్ధం కాదు.
ఇక నీసొమ్మేమన్నా అడిగాడా, నువ్వేమన్నా నీడబ్బులు ఇచ్చావ, మరి నువ్వెందుకు అడుగుతున్నావు అంటూ విరుచుకుపడే వితండవాదులగురించి వాదన ఎలాగూ అనవసరం. ఒక రాజకీయనాయకుడు అధికారం అడ్డం పెట్టుకుని లక్షలకోట్లు దోచుకుని ప్రజలసొమ్మును తనసొంతడబ్బులాగా ఉచితపధకాలకు దానం చేసి దేవుడయిపొయాడు. ఒక బాబా దేవుడినని చెప్పుకుని లక్షలకోట్లు సొమ్ముచేసుకుని అందులో ఒక ఫ్రాక్షన్ ప్రజలసొమ్మును ప్రజలకు దానం చేసి దేవుడయిపొయ్యాడు. ఇద్దరిలో పెద్దతేడాలేదు.
Subscribe to:
Post Comments (Atom)
>>>>>
ReplyDeleteఒక మామూలు వ్యక్తి ఎంతనిజాయితీగా సమాజసేవ చెయ్యడానికి ముందుకొచ్చినా డబ్బులు పెద్దగా రాలవు, దేవుడని చెప్పుకుంటే మాత్రం దండిగా వస్తాయి.
>>>>>
సమాజ సేవ అసలు చెయ్యని కల్కీ భగవాన్‌కి కూడా కోట్లు విరాళాలు వస్తున్నాయి.
"ఒక రాజకీయనాయకుడు అధికారం అడ్డం పెట్టుకుని లక్షలకోట్లు దోచుకుని ప్రజలసొమ్మును తనసొంతడబ్బులాగా ఉచితపధకాలకు దానం చేసి దేవుడయిపొయాడు."
ReplyDeleteలక్షలకోట్లు దోచుకున్నది కొడుకయితే, ప్రజల 'సంక్షేమం' కోసం ఉచిత పథకాలను ప్రవేశపెట్టిన ఆ మహానేత...కాదు, కాదు, దేవుడిని ఎందుకు నిందిస్తారు?
@Tejaswi
ReplyDelete1) తండ్రికి తెలియకుండా కొడుకు అంత దోచుకోలేడు. తండ్రే తనకొడుకు కోసం తన అధికారాన్ని ఉపయోగించి దోచి ఇచ్చాడు.
2) ఉచితపధకాలు ప్రజల "సంక్షేమం" కోసం కాదు, వోట్లకోసం, దీనివల్ల రాష్ట్రం ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బ తిన్నది. అది తెలిసి కూడా ఇలాంటి పధకాలు పెట్టి అత్తెసరు మార్కులతో రెండోసారి గెలిచాడు.
ఇప్పుడు టాపిక్ ఆ మహా(?)నేత గురించి కాదు కనక దయచేసి టాపిక్ డైవర్ట్ చెయ్యొద్దు. కేవలం పోలిక కోసం ఆవిషయం ఎత్తవలసి వచ్చింది.
సత్యాన్వేషిగారూ,
ReplyDeleteనా కామెంట్ లోని శ్లేషను మీరు అర్ధం చేసుకోలేదు. నేను మీ పోస్టును విమర్శించడంలేదని గమనించ ప్రార్ధన.
:) నా ట్యూబ్‌లైటు తొందరగా వెలగలేదు.
ReplyDeleteseva ane musugulo dabbulu sampadinchadam chala easy. janam kuda mantralu mayalu easy ga nammi unnadanta samarpistunnaru deenini aasaraga teesukoni kontamandi babaluga avataristunnaru
ReplyDeleteదేవుడు అనే విషయంపై నేను అంతా అంగీకరించను కానీ, వీరి ప్రవర్తన చూడబోతే, ధన మూలం మిదం జగత్ అనే నానుడిని వీరు ప్రోత్సాహిస్తున్నట్లు మాత్రం నాకు అనిపిస్తుంది. అలాగే వీరు కూడా ధనాన్ని యధా ప్రకారంగా తీసుకునే ప్రముఖులకు దర్శనభాగ్యాన్ని ఇచ్చేవారని జగమెరిగిన సత్యం. కాబట్టి వీరుకూడా ఓ రకంగా వ్యాపారవేత్తలే తప్ప మహానుభావులు కాదుకదా, వారి గోటికి కూడా సరిపోరని నా అభిప్రాయం
ReplyDeleteవీరు ఆధ్యాత్మక వ్యాపారులు. ఇదొక పెద్ద బుజినెస్ అండీ, కల్కి భగవాన్, బాలసాయి, ఆసారం బాపు లాంటివారెందరు ఉన్నా ఈయనకి ఈవ్యాపారంలో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంది, అందుకే అందరికంటే ఎక్కువ సంపాదించాడు.
ReplyDelete