Sunday, 3 July 2011

హైదరాబాదులో రాజకీయ మతకల్లోహాలు ఏనాటివి?

మనదేశంలో మతకల్లోహాలు కొత్తగాదు, హిందువులూ, ముస్లిముల ఘర్షణలు కొత్త గాదు. అసలు మనదేశంలో అనేముంది ప్రపంచంలో అనేక చోట్ల మతయుద్ధాలు, ఘర్షనలు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటాయి. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఈమధ్య తగ్గాయి కానీ చరిత్రలో అక్కడ కూడా మతఘర్షణలు జరిగిన ఉదంతాలు అనేకం. మనదేశంలో ముస్లిములు అధికంగా ఉండే అన్ని ప్రాంతాల్లో మతఘర్షణలు అనేక సందర్భాల్లో జరిగాయి. మతం ఉన్నన్నాల్లూ మతఘర్షనలు ఏదో ఒకరీతిలో ఉంటాయనేది మత ఛాందసవాదులు తప్ప మిగతావారంతా ఒప్పుకునేదే. అందుకే ఈమతాల అడ్డుగోడలు తొలగిపోవాలని అభ్యుదయవాదులందరూ చెబుతారు.

మిగతా ప్రాంతాల్తో పోల్చినపుడు హైదరాబాదులో మతసామరస్యం బాగానే ఉండేది అనేది అందరూ ఒప్పుకునే విషయం. ఇంతమంది ముస్లిములు ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ హిందువులూ, ముస్లిములూ by and large కలిసే ఉన్నారు. కలిసి ఒకరి పండుగలు మరొకరు చేసుకున్నారు, ఒకరి పెల్లిల్లకు, ఫంక్షన్లకూ మరొకరు అతిథులయ్యారు. ఏదో కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా పెద్దేత్తున ఇక్కడ ఘర్షణలు జరిగిన ఉదంతాలు చరిత్రలో కనపడవు.ఇప్పటికీ పాతబస్తీలో హిందువులూ, ముస్లిములూ చక్కగా కలిసే ఉంటారు.

అయితే ఎప్పుడయితే రాజకీయ నాయకులు తమ రాజకీయ అవసరాలకు హైదరాబాద్ పాతబస్తీని వాడుకోవడం మొదలు పెట్టారో అప్పటినుంచీ ఇక్కడ పెద్ద ఎత్తున ఘర్షనలు చెలరేగాయి. వందల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అయితే ఇవి నిజమయిన మత ఘర్షనలు కావు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాలకు మతవిభేదాలను రెచ్చగొట్తడం ఒక ఎత్తు. అది దేశంలోని మిగతా ప్రాంతాల్లో మొదలయ్యింది. కానీ ఇక్కడి పరిస్థితి వేరు. రాజకీయ పార్టీలు తమ అనుచర బృందాన్ని ఇతర ప్రాంతాలనుండి తెప్పించి హత్యలు చేసి వాటికి మతం రంగు పుయ్యటం మాత్రం హైదరాబాదుకే ప్రత్యేకమయింది. ఇవి ఎంత ఘోరంగా జరిగాయి అంటే ఒకే బస్టాపులో హిందూ, ముస్లిం లిద్దరూ ఉంటే స్కూటర్ మీద వచ్చిన దుండగులు హిందూ, ముస్లిం లిద్దరిపై దాడి చేసినలాంటి ఉదంతాలెన్నో.

ముఖ్యమత్రులను మార్చాలన్నా, కొందరు నేతలకు తమ ప్రాబల్యం పెంచుకోవాలన్నా హైదరాబాదులో మతఘర్షణలను కృత్రిమంగా సృష్టించడం గత మూడుదశాబ్దాలుగా మొదలయిన నాయాట్రెండు. కృత్రిమంగా ఉద్యమాలే సృష్టించిన ఘనులకు కృత్రిమ మతఘర్షణలు సృష్టించడం పెద్ద విద్యేం కాదు. ఈ ట్రెండును సృషించింది, రాజకీయ అవసరాలకోసం హైదరాబాదుకు బయటినుండి తెప్పించిన గూండాలద్వారా మతకల్లోహాలు సృష్తించిందీ ఎవరనేది ఇక్కడ అందరికీ తెలిసినా బయటికి చెప్పలేని ఒక బహిరంగ రహస్యం. ఇది ఎవరి రంగప్రవేశం తరువాత మొదలయిందో కూడా తెలిసిందే. మజ్లీస్ లాంటి ఒక ముఠాకు అనవసర సీనిచ్చి దాన్ని బలంగా తయారుచేసింది కూడా ఈవర్గమే.

సాధారణంగా ఒక వ్యాసం రాసేప్పుడు విషయాన్ని వివరించగలిగే సౌలభ్యం ఉన్నట్టు టీవీ చానెల్స్‌లో అందునా సీమాంధ్రా మీడియా చానెల్లుగా ముద్రపడ్డ కొన్ని చానెల్లు ఒకరిపై ఒకరు అరుచుకోవడమే చర్చ అని చెప్పబడే చర్చాకార్యక్రమాల్లో ఉండదు. అలాంటి ఒక అరుపుల కార్యక్రమంలో ఒక తెలంగాణ అనుకూల మీడియా విశ్లేషకుడు హైదరాబాదులో మతఘర్షణలు మొదలయింది సీమాంధ్ర నేతల ప్రవేశం తరువాతే అని చెప్పాట్ట, నేనయితే అది చూళ్ళేదు. ఆచత్త కార్యక్రమాన్ని పట్టుకుని ఆ విశ్లేషకుడు చవకబారున్నర విశ్లేషకుడు, సిగ్గులేని ప్రొఫెసరు అంటూ రకరకాల పోస్టులు బ్లాగుల్లో వెలిశాయి, అక్కడికి ఈయన తప్ప మిగతా విశ్లేషకులందరూ పెద్ద సుద్దపూసలు, ఈయన తప్ప మిగతా వారు చెప్పేవన్ని చరిత్ర సత్యాలు. అంతే కదా మన పచ్చకల్లకు అనుకూలంగా మాట్లాడేవాడు గొప్ప విశ్లేషకుడు, వ్యతిరేకంగా మాట్లాడే వాడు చవకబారున్నర....మనం మాట్లాడిందే ఎప్పటికీ సత్యం.మనం ఇన్నాల్లూ పుస్తకాల్లో చదువుకున్న తెలుగుజాతి ఐక్యతకోసం పొట్టి శ్రీరాములు చనిపోయాడనేది గొప్ప సత్యం.

పచ్చకామెర్లు వచ్చిన కొందరికి తప్ప వేరెవరికి నచ్చని పచ్చబాబు రెండుకల్ల సిద్దాంతం మాత్రం గొప్ప నీతీ, నిజాయితీ, ధర్మం. ఇలాంటి రాతలు రాసేవాల్లందరూ నిజంగా తాము నమ్మినదాన్నే రాస్తారా.. ఏదో తమవర్గానికి కొమ్ముకాసేవారిని ఎలాగయినా సమర్ధించాలనేది వీరి తపన గానీ. అసలు తెలంగాణ లాంటి ఒక సున్నితమైన అంశంపై ఎక్కువమంది సాధారన ప్రజలకు ఏది మచిది అన్న కోణంలోనుండి కాకుండా రాష్ట్రాన్ని విభజిస్తే నాకు, నా సామాజిక వర్గానికి, నా అభిమాన రాజకీయ పార్టీకి, అభిమాన రాజకీయ నాయకుడికి ఎంత లాభం, ఎంత నష్టం అంటూ కూడికలూ తీసివేతలూ వేసేవారివలననే ఇలాంటి వాదోపవాదాలని నా అభిప్రాయం.

17 comments:

 1. బాగు౦ది, టీ వీ లు సరే, మరి మీరూ చదువరి గారు అయినా ఆ సున్నితమైన అ౦శ౦ పై ఆరోగ్యకరమయిన చర్చ చెయ్యవచ్చును కదా!

  ReplyDelete
 2. అలాంటి ఆరోగ్యకరమయిన వాతావరణం బ్లాగుల్లో లేదండి.

  1) ఒక న్యూట్రల్ మోడరేటర్ లేనంతవరకూ ఎవరి బ్లాగుల్లో వారి వాదనే పైచేయి అవుతుంది.
  2) సంఖ్యాబలం ఉండడం వలన సీమాంధ్ర ఎమ్మెల్యేల అజెండా అసెంబ్లీలో ఎలా నెగ్గుతుందో అలాగే సంఖ్యబలంతో తెలంగాణవాదుల నోళ్ళను తెలంగాణ ద్వేషులు నొక్కేస్తారు.
  3) మధ్యమధ్యలో కొందరు ఆకతాయి వెధవలు (ఎక్కువగా సీమాద్ణ్రాకు చెందిన Snkr, రక్తచరిత్ర, లాంటివారు బూతులకు లంకించుకుంటారు. అయినా మన రంగుకల్ల మనుషులు తెలంగాణా వాదులే తిడుతారని ప్రచారం చేస్తారు. పదుగురాడు మాట పాడి మాట అన్నట్టు అదే గెలుస్తుంది.
  4) తాడేపల్లి లాంటి మరికొందరు తమ బ్లాగులకు కామెంట్ల అవకాశం ఇవ్వరు, ఇతరుల బ్లాగుల్లో తెలంగాణ ప్రజలగురించి అసహ్యంగా అవమానకరంగా హేళనాపూరిత వాఖ్యలు రాస్తారు.
  5) రెండుపొరల కల్లద్దాలు ధరించే కొన్ని వర్గాలవారు వాస్తవాలు ఒప్పుకోవడం కల్ల.
  6) తనదాకా వస్తే ఒకలాగ పక్కవారి విషయమైతే ఇంకోలాగ మనుషులు స్పందిస్తారు. తమిళులనుండి విడిపోవాలంటే అది తెలుగువాడి ఆత్మగౌరవం, తెలంగాణ విడిపోవాలని కోరుకుంటే వేర్పాటువాదం.

  ఇవన్నీ చూసి చూసి తెలంగాణ వాదులు బ్లాగుల్లో చర్చల జోళికి వెల్లడం లేదు. కేవలం తమ అభిప్రాయాలు తమ బ్లాగుల్లో రాస్తున్నారు.

  కొంతవరకూ HMTV వారి దశ-దిశ కార్యక్రమం ఒక నిశ్పాక్షిక చర్చకు వేదికను తయారుచెయ్యడంలో సఫలీకృతం అయ్యింది.

  ReplyDelete
 3. పసలేని సమైక్యవాదం నిజమైన ఆరోగ్యకరమయిన చర్చావేదికపై నెగ్గలేదు. అరుపులూ, గోలల టీవీ9 చర్చలూ, పక్షపాత బ్లాగుల్లో మాత్రమే నెగ్గుతుంది. మొన్నటికి మొన్న HMTV వారి లగడపాటి, కేటీఆర్ల చర్చ దీన్నే నిరూపిస్తుంది.

  అందుకే వీరికి చర్చ అంటే భయం. మెజారిటీ ఉండికూడా అసెంబ్లీలో ఈవిషయంపై ఇంతవరకూ చర్చ పెట్టలేదంటే సీమాంధ్రా కుహనా సమైక్య వాదులకు చర్చ అంటే ఎంత భయమో తెలుస్తోంది.

  ReplyDelete
 4. సమైక్యవాదుల౦టే హైదరాబాదు కు స౦బ౦ధి౦చిన ఆ౦ధ్ర పౌరులు అనుకు౦దా౦.(మిగిలినవారికి తెల౦గాణా వచ్చినా, రాకున్నా ఒకటే)

  వీరి సమస్యలు ఏ౦టి అన్నది మీరు ఆలోచి౦చారా?

  ౧.పెట్టుబడులు
  వ్యాపారాలు, సొ౦త ఇల్లు వీటికే ప్రమాద౦ లేదు.

  ౨.తెల౦గాణా నాయకత్వానికి తలవ౦చాల్సొస్తు౦దని

  కే సీ ఆర్ లా౦టోళ్ళని ముఖ్యమ౦త్రి గా చూడాలసి వస్తే కష్టమే కదా.  ఇలా కాకు౦డా ఇ౦కా మ౦చి కారణాలు ఉ౦టే ఆ వివరాలు వ్రాస్తే బావు౦టు౦ది కాని , ఈ విభేదాలే౦టి.

  * తాడేపల్లి గారి పై మీ వ్యాఖ్య సమ౦జసమైనదే. తన బ్లాగులో వ్రాసేఅవకాశ౦ ఇవ్వనపుడు, ఆ౦ధ్ర ప్రయోజనాలు, నష్టాలగురి౦చే చర్చి౦చాలి కాని వేరేవాళ్ళని దూషి౦చవచ్చునా

  ReplyDelete
 5. @అందుకే వీరికి చర్చ అంటే భయం.

  జయప్రకాష్ గారు చేస్తూనే ఉన్నారు కదా చర్చలు. ఆయతో నెగ్గ౦డి మీరు మీ వాద౦ లో న్యాయ౦ ఉ౦టే

  ReplyDelete
 6. విడిపోతే వారి సమస్యలు ఏమిటో వారు చెప్పాలి, చెప్పకుండానే మనం చర్చించలేము కదా? మీరు చెప్పిన రెండూ ఇంతవరకూ ఎవరూ ఎక్కడా చెప్పలేదు, అసలు అవి అభ్యంతరాలుగా కనపడడం లేదు.

  1) పెట్టుబడులకు, ఆస్థులకు భారత రాజ్యాంగం రక్షణ ఇస్తుంది, తెలంగాణ కాదు. మైక్రోసాఫ్త్ పెట్టుబడులకు లేని భయం వీరికెందుకు? అవి అక్రమ పెట్టుబడులూ, కబ్జాలని వారి భయమా?
  2) కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాల్సి వస్తే సీమాంధ్రులకేం నష్టం, వారి ముఖ్యమంత్రులు వేరే ఉంటారు కదా? చంద్రబాబు, వైఎస్సార్ లాంటి వారు ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ అయితే సమస్య ఏమిటి?

  ReplyDelete
 7. సీమా౦ధ్రులు లో సమైక్యవాదులు ఎవరో ము౦దు వ్యాఖ్య లో వివరి౦చాను కదా. వారికి మీరిచ్చే భరోసా ఏ౦టి, తెల౦గాణా పునర్నిర్మాణ౦ లో వారి ప్రాధాన్యతలు వారికి ఇవ్వాలి కదా మీరు?

  ఇప్పుడు ఇలా తిట్టుకు౦టూ వు౦టే, రేపు మీతో కలిసి వారు ఉ౦డగలగాలి కదా.

  ReplyDelete
 8. జయప్రకాష్ నారాయణతో ఎవరు చర్చించాలి, దానికి వేదిక ఏమిటి? ఆయన శ్రీక్రిష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికను నాతో సహా ఎంతోమంది తూర్పారబట్టారు.

  ReplyDelete
 9. అసలు హైదరాబాదులోని ఆంధ్రప్రాంతం వారికి విభజన గురించి భయాలేం లేవు. వారు రాష్ట్రం కలిసి ఉండాలని ఏమీ పెద్దగా చెప్పడం లేదు, పైగా ఏదో ఒకటి తొందరగా తేలిపోవాలి, అనవసరంగా దీన్ని కొందరు సీమాంధ్ర జటిలం నాయకులు చేస్తున్నారు అనుకుంటున్నారు. మేముండే అపార్ట్మెంటులో అంతా ఆంధ్రా వారే. వారెవరికీ భయం లేనప్పుడు వారి గురించి ఎక్కడో ఉన్న లగడపాటికెందుకు భయం? ఇంకా వారికి భరోసా ఇచ్చేదేం ఉంది? అసలు ఆంధ్రా సెటిలర్స్ ఫోరం అనే ఫోరం ఇప్పటికే తెలంగాణ వస్తే తమకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పింది.

  ఆంధ్రా ప్రాంతం వారు ఒక్క హైదరాబాదులోనే కాదు, నిజామాబాద్, నల్లగొండతోపాటు ఊరూరా గుంటూరు వాడలు ఉన్నాయి. వారంతా నిర్భయంగా ఉన్నారు. విడిపోయినా వారికి భయం లేదు. అక్కడ లేని భయం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉంటుందనేది అర్ధం లేని వాదన. ఇది కేవలం లేని అపోహలు సృష్టించే సీమాంధ్రా నేతలు చెబుతున్నపుడు దానికి సమాధానం ఏమివ్వాలి? నిజంగా సమస్య ఉంటుందనుకునేవారు అడిగితే అందుకు ఒక పెద్దమనుషుల ఒప్పందం చేసుకోవచ్చు. మనకు ఒప్పందాలు కొత్తకాదుగదా.

  ReplyDelete
 10. @అసలు హైదరాబాదులోని ఆంధ్రప్రాంతం వారికి విభజన గురించి భయాలేం లేవు.

  హైదరాబాదు ప్రజాప్రతినిధుల౦తా సమైక్యవాదులే ఎ౦దుకయ్యారు (అన్ని పార్టీల్లో)

  ReplyDelete
 11. @నిజంగా సమస్య ఉంటుందనుకునేవారు అడిగితే అందుకు ఒక పెద్దమనుషుల ఒప్పందం చేసుకోవచ్చు. మనకు ఒప్పందాలు కొత్తకాదుగదా.

  హ హ, ఆ స౦గతి తెలిసే కదా ఈ సమస్య

  ReplyDelete
 12. హైదరాబాదు ప్రతినిధులలో ఒక్క జయప్రకాశ్ నారాయణ తప్ప అంతా తెలంగాణ వారే. మజ్లీస్ వారయినా, దానం, ముఖేశ్ లాంటి హైదరాబాద్ ప్రతినిధులయినా సమైక్యవాదులేం కాదు, కేవలం తమ రాజకీయ ఉన్నతి కోసం హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమో, ఇంకో రాష్ట్రమో చెయ్యాలంటున్నారు. అదెలాగూ సాధ్యం కాదని వారికీ తెలుసు. వారు ఆంధ్రప్రాంతం వారూ, సమైక్యవాదులూ కానప్పడు వారిగురించి అసలు చర్చ అనవసరం.

  ReplyDelete
 13. @కేవలం తమ రాజకీయ ఉన్నతి కోసం హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమో, ఇంకో రాష్ట్రమో చెయ్యాలంటున్నారు.

  మరి సీమా౦ధ్ర నాయకులయినా విభజన వద్ద౦టున్నది ఇ౦దుకే కదా. ము౦దు మీ నాయకులను మీ మనోభావలు అర్ధ౦ చేసికోమన౦డి .తరువాత సీమా౦ద్రులను తిట్ట౦డి.

  ReplyDelete
 14. ఎలక్షన్లలో గెలిచిన ప్రతివారూ నాయకులయిపోరు. ఈహైదరాబాద్ ఎమ్మెల్యేలు తెలంగాణకు అడ్డుపడడం లేదు, వారికంత సీను కూడా లేదు. వారికి లేని ప్రాముఖ్యాన్ని ఇవ్వడం ఎందుకు? హైదరాబాదుకు చెందిన ఆంధ్రా ప్రజలలో ఏవయినా భయాందోళనలు ఉంటే వారి ప్రతినిధులు ఆవిషయాన్ని ఎత్తాలి, కానీ వారు ఇప్పటికే తెలంగాణపై వారికి అభ్యంతరం లేదని చెప్పారు. మొన్నటి వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా.

  మేం సీమాంధ్రులను తిట్తడం లేదు, కొందరు డిసెంబర్ 7 నుండి 9 లోపట మాటలు మార్చి లేని ఉద్యమాన్ని ఉన్నట్లు చూపించినవారినే ఎవరైనా తిట్టేది. వారు సమైక్య అనే ముసుగును తీసివేసి వారికి ఏమయినా అనుమానాలుగానీ, గొంతెమ్మ కోరికలు కానీ ఉంటే వారే అడగాలి.

  ReplyDelete
 15. @హైదరాబాదుకు చెందిన ఆంధ్రా ప్రజలలో ఏవయినా భయాందోళనలు ఉంటే వారి ప్రతినిధులు ఆవిషయాన్ని ఎత్తాలి
  హైదరాబాదుకు చె౦దిన ఆ౦ధ్ర ప్రజల మద్దతు ఉ౦ది కాబట్టే మీ హైదరాబాదు ఎమ్మెల్యేలు ధైర్య౦గా వ్యతిరేకిస్తున్నారు.

  @కొందరు డిసెంబర్ 7 నుండి 9 లోపట మాటలు మార్చి లేని ఉద్యమాన్ని ఉన్నట్లు చూపించినవారినే ఎవరైనా తిట్టేది.

  సోనియమ్మ ఇవ్వదన్న నమ్మక౦ చెప్పారుకాని మీరవ్వన్నీ నిజాలని నిలదీసేస్తే ఎలా. అప్పుడు కేసీఆర్ అటో ఇటో అయితే ఉస్మానియా స్టూదె౦ట్స్ రావణకాష్ట౦ చేసేవారు కదా. ఆ హడావిడిలో చిన్న పొరపాటు చేసి౦ది అధిష్టాన౦. సీమా౦ధ్రులు సమయానికి పరిస్తితి చక్కదిద్దారన్నమాట. :)

  ReplyDelete
 16. ఫైనల్ గా చెప్పేదేమ౦టే

  సరే చెబుతున్నా౦. ఆ౦ధ్ర నాయకులకి, హైదరాబాదుతో వున్న బ౦ధ౦ విడదీయరానిది. అది నేను ప్రత్యేక౦గా చెప్పనవసర౦ లేదు. కాబట్టి సీమా౦ధ్ర నేతలకు కూడా అ హైదరాబాదు రాజధాని గా వున్న రాష్ట్రాన్ని పరిపాలి౦చే అధికార౦ వు౦డాలి, ప్రత్యేక తెల౦గాణా గా విడిపోయిన తరువాత కూడా. ముఖ్య౦గా జగన్, బాబు, చిర౦జీవి, ఇ౦కా లగడపాటి, రాయపాటి ........

  ఇదన్నమాట వీళ్ళొద్దు అనుకు౦టే హైదరాబాదుని వదిలేసుకోవాల. :))

  ReplyDelete
 17. మీరు చెప్పిన కోరికలోని హేతుబద్దత, చట్టబద్దత లాంటి విషయాలు పక్కన బెడితే దాన్ని ఎవరో బ్లాగులో అడగడం కాకుండా సీమాంధ్రా నాయకులు అడగాలి. లేని ప్రేమలు నటిస్తూ సమైక్యత, ఒకటే జాతి అంటూ చల్లకొచ్చి ముంత దాచితే పరిష్కారం జరగదు.

  ReplyDelete