Tuesday, 16 August 2011

బ్లాగుల్లోనూ మెజారిటీ రాజకీయాలే!


తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకోవటానికి ముఖ్య కారణం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు, అసెంబ్లీలో ప్రజాప్రతినిధులకు మెజారిటీ లేకపోవడం వలన. మెజారిటీ లేకపోవడం వలన తెలంగాణ నాయకులకెప్పటికీ అధికారం రాదు. అసెంబ్లీలో వారి మాట నెగ్గదు. మెజారిటీ ఆధ్రాంగా నడిచే ప్రజాస్వామయంలో మెజారిటీలేనివాడికి న్యాయం జరగదు కనుక.

కొందరు అతితెలివి కలిగినవారు మెజారిటీ లేకపోతే మాత్రం తెలంగాణనుండి ప్రజాప్రతింధులు లేరా, మంత్రులు లేరా? ప్రజాస్వామ్యంలో అందరూ కలిసే కదా నిర్ణయాలు తీసుకునేది అని అతితెలివి చూపుతారు, కానీ వాస్తవాలు అందరికీ తెలిసిందే. భేధాలు లేనంతవరకే మెజారిటీ నిర్ణయాలు ఆమోదనీయం, మనం కలిసి ఒక్క రాష్ట్రంగా ఉన్నా ఎన్నడూ ప్రజలుగా కలిసి లేము, అధికారంలో కూర్చున్నవారు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా కాక ప్రాంతాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు.

ఇప్పుడు బ్లాగుల్లో జరుగుతుంది కూడా అదే. మెజారిటీ తెలుగు బ్లాగర్లు సీమాంధ్ర ప్రాంతం వారు. వీరిలో అధికభాగం పక్షపాతపూరితంగా తమది తప్పు అని తెలిసినా ఎదుటివారినే దెప్పిపొడుస్తారు. ఎవరైనా పొరపాటున తెలంగాణవాది తన బ్లాగులో ఒక చిన్న కవిత రాసుకున్నా అక్కడికి వెల్లి కావు కావుమంటూ కామెంట్లు అరిచి గీపెడతారు. పచ్చి అబద్దాలు చెబుతారు, అయినా ఎదుటివారివే అబద్దాలు అంతారు. కానీ మెజారిటీ ఉంది కదా.. ఎక్కువ కామెంట్లు వారివే కదా.. కనుక తెలంగాన వాదులు నోరుమూసుకుంటారు.

మచ్చుకు ఒక ఉదాహరణ: ఒక పెద్దమనిషి వెల్లి ఒక బ్లాగులో "ఏమిటి, మీ నల్లగొండలో ఫ్లోరసిస్ అని చెబుతున్నావు, నల్లగొండలో ప్రతి ఊరికి క్రిష్ణా నుండి తాగు నీరు వస్తుంది, 2000 సమవత్సరంలోనే ఫ్లోరసిస్ సమస్య తీరిపోయింది" అని గదమాయిస్తాడు. ఎదుటివారిని అబద్దాలు రాస్తున్నావని హుంకరిస్తాడు. ఎవరైనా అయ్యా నల్లగొండ జిల్లాలో ఏఊరికీ తాగునీరు క్రిష్ణా నుండి అందడం లేదు, ఫ్లోరసిస్ అలాగే ఉంది, ఘోరంగా ఉంది అని చెబితే మల్లీ దాని ఊసెత్తడు, కానీ అతనే మరో బ్లాగుకెల్లి తెలంగాణవారు అన్నీ అబద్దాలు చెబుతున్నారని గోలపెడతాడు. అక్కడ అతని మద్దతుగా మరో పది కాకులు కావుకావు మంటాయి. మధ్యలో సందట్లో సడేమియాల్లాగా రక్తచరిత్రలూ, సంకరులూ బయల్దేరుతారు, బూతు రాతలకు, హేళనలకు తెగబడుతారు, గోల చేస్తారు.

ఇక ఎవరో విశాలాంధ్ర వారు ఏదో సర్వేని ఒకటి చూపుతారు. వెంతనే మన బ్లాగు కాకులు కావు కావుమంటూ మల్లీ అదే సర్వేని దాని అసలు అర్ధాన్న్నే మారుస్తూ ప్రచారం చేస్తారు, కామెంటర్లు కామెంట్ల గోల పెడతారు. ఆఖరుకు బ్లాగుల్లో మేధావులుగా చలామనీ అయిపోయే కొందరు 14F లాంటి ఒక అన్యాయపు క్లాజును కూడా సమర్ధించడం, 14F తొలగింపును సీమాంధ్రలోనే అనేక నాయకులు, మేధావులు సమర్ధించినా అస్మెంబ్లీ నిర్ద్వంద్వంగా తొలగింపును సమర్ధించినా ఇంకా 14Fను వెనుకేసుకు రావడం, దానికి కొందరు కావు కావు మంటూ సమర్ధించడం అత్యంత శోచనీయం.

ఈగోలంతా భరించలేక చాలామంది తెలంగాణ వాద బ్లాగరులు తెలంగాణ గురించి రాయడం మానుకున్నారు, కొందరు తమ బ్లాగులను అగ్రిగేటర్లనుంచి తొలగించారు. కొందరు ఏదో తమకు నచ్చింది రాస్తున్నారు కానీ కామెంట్లను తీసివేశారు. ఇడీ ప్రస్తుత బ్లాగు మెజారిటీ రాజకీయాల పరిస్థితి.




6 comments:

  1. ప్రత్యేక తెలంగాణాకి వ్యతిరేకంగా వంద మంది నిరక్షరాస్యుల చేత వేలి ముద్రలు వెయ్యించమంటే ఆ పని నేనూ చెయ్యగలను. కేవలం పేరు మాత్రమే వ్రాయగలిగి మిగితా అక్షరాలు చదవలేనివాళ్ళు చాలా మంది కనిపిస్తారు పల్లెటూర్లలో. CSDS సర్వేలు చేసినది ఆ పల్లెటూరివాళ్ళతోనే.

    ReplyDelete
  2. ఓహో అదన్నమాట సంగతి.. తెలంగాణ కోరుకునే కొందరు బ్లాగరులు రెండు మూడు పేర్లతో బ్లాగు రాసేస్తున్నారు. పేరు పెట్టుకుని వచ్చి నీతులు రాస్తూనే (పద్యాలు కూడా రాసేస్తూంటారు), అజ్ఞాతలుగా వచ్చి వచ్చి బూతులు కూస్తున్నారు. కారణమిదన్నమాట! అర్థమైంది.

    ReplyDelete
  3. కల్లుండీ చూడలేని కబోదులకు తమవారు రాసే పచ్చి బూతులు కూడా హృద్యంగా ఉంటాయి, రక్తచరిత్ర, సంకరుల రాతలతో సహా. నచ్చని వారిపై మాత్రం మెజారిటీ ఉంది కదా ఎంత మర్యాదగా రాసినా వాటిని బూతులంటూ కావుకావుమని అరవండి. తమ కల్లలోనే ఉన్న పొరలు కనబడవు, ఎదుటివారికి కళ్ళజోడులాపాదిస్తారు కొందరు. రెండు మూడు పేర్లతో మీవాల్లూ రాస్తారు లెండి వివరాలెందుకు?

    కారణం అర్ధమయినందుకు సంతోషం. కొందరు ఎదుటివారి వారి వాక్స్వాతంత్రాన్ని హరిస్తూ ఒక చిన్న కవితపై కూడా దాడులు చేసి నోరు మూయిస్తుంటే ఏంచేస్తారు?

    ReplyDelete
  4. నిజమే, అలోచించదగ్గ విశయం.

    ReplyDelete
  5. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు (ఇది సామెత మాత్రమే.. వ్యక్తిగత నింద కాదు) విషయం జరిగిన నాలుగు రోజుల తర్వాత మీ పోస్ట్‌మార్టం కూడా తెలంగాణ వాదుల పద్దతిలోనే సాగింది. (అదే, నిజాల్ని కప్పిపెట్టటం)

    1) మొదట తను వ్రాసిన పోస్ట్ కి సంబంధం లేని కామెంట్ ప్రంచురించింది అతనే అని ఆ పోస్ట్ చూసిన ఎవరికైన అర్ధం అవుతుంది. నల్లగొండ ప్రజలు ఫ్లోరొసిస్ తో బాధపడుతుంటే గుంటూర్ ప్రజలు మూడోపంట కి కూడా నీటిని వాడుకుంటున్నారని విషం చిమ్మాడు.
    2) లెక్కలడిగేసరికి ఎంతోకొంత ఉండోచ్చు అంటూ మాట్లాడారు.
    3) నేను 2000 అని వ్రాసింది typo అని దాన్ని సవరించి 2005 అని చెప్పింది మీరు ఎందుకు ప్రచురించలేదో దీన్ని బట్టి అర్ధ సత్యాలు, వక్రీకరణలు ఎవరివో తెలుస్తుంది
    4) తర్వాత విశ్వరూప్ గారు వచ్చి నల్గొండ లో కేవలం నల్గొండ పట్టణానికి తప్ప ఇంకెక్కడా కృష్ణ జలాలు రావటం లేదని, 2011 లో కూడ ఇదే పరిస్థితి అని వాదించారు.
    5) దానికి సమాధానం గా నేను వివిధ రిఫరెన్సులు (తెలంగాణ వాదులు చెప్పినవే) క్రోడీకరించి అర్ధరాత్రి లేట్ అయినా కూడా ఉండి మరీ వ్యాఖ్య వ్రాసాను. అంతెందుకు, అక్కడే క్రింద శ్రీకాంతచారి వ్రాసిన కామెంట్ లోని వీడియోలు చూసిన తెలుస్తుంది విశ్వరూప్ చెప్పింది అబద్దం అని..
    6) మరునాడు ఉదయం 11 గంటలకు చూసే సరికి కామెంట్ మాయం. పోనీ అందులో ఏమైన అభ్యంతరకరమైనవుంటే తొలగించి ఇచ్చిన లింకులు వరకైన ప్రచురించవచ్చు.
    7) తొలగించాలనుకున్నప్పుడు అసంబద్ద చర్చ కాబట్టి ఇద్దరి కామెంట్లు తీసివేసిన బాగుండేది.
    8) నేను ఇదే విషయాన్ని అచంగ బ్లాగులో ప్రస్తావించాను. కానీ మీరు అందులో 'నా కామెంట్ తొలగించారు అని వ్రాసిన విషయం మీ పోస్ట్ లో కావాలని విస్మరించి తప్పుడు అర్ధం స్పురించేలా వ్రాసారు.
    9) నేను కామెంట్ తీసివేసినందుకు వివరణ కోరినా ఆయన నించి సమాధానం లేదు.
    10) 'మళ్ళీ దాని ఊసెత్తలేదు ' అంటూ నేనేదో చర్చ నించి తప్పుకొన్నట్లు వ్రాసారు. బహుసా delete చేసిన తర్వాతా మీరా పోస్ట్ చూసి ఉండవచ్చు కాబట్టి మీకలా అనిపించిందేమో.
    11) మీరు నిష్పక్షపాతం గా వ్రాసుంటే నా వ్యాఖ్య తొలగించిన విషయం మీరు ప్రస్తావించేవారు.
    12) ఇలా కామెంట్ పబ్లిష్ చెయ్యకపోవటం నాకు మొదటి సారి కాదులేండి. తెలంగాణ వాదుల బ్లాగులో నిష్పాక్షిక చర్చ కి తావులేదనేది నాకు నెమ్మది నెమ్మదిగా అర్ధం అయింది. (సంజు లాంటి అతికొందరు exception)
    13) ప్రజాస్వామ్యం, హక్కులు అంటూ గొంతు చించుకునే వారు కానీసం ఎదుటి వారి అభిప్రాయం చెప్పే అవకాశం ఇవ్వరని, ప్రచురించటానికి జంకుతారని బ్లాగుల్లో కూడ నిరూపితమైంది.

    ReplyDelete