Monday, 28 March 2011

డ్రైవర్ మల్లేష్, మంత్రి వివేకా

అసెంబ్లీ ఆవరణలో ఒక ఎమ్మెల్యేపై చిన్న దెబ్బ వేసినందుకు డ్రైవర్ మల్లేష్ పాపం అరెస్తయ్యాడు. ఏం కేసులు పెట్టారో, ఎప్పుడు వదులుతారో తెలియదు.

అసెంబ్లీ లోపల ఒక ఎమ్మెల్యేపై నేడొక మంత్రి చెయ్యిచేసుకున్నాడు. మరి ఇప్పుడు మంత్రిపై ఏం కేసులు పెడతారు? మంత్రిని అరెస్టు చేస్తారా? చట్టం సామాన్యుడిపై మాత్రమే అమలు, మంత్రులు చట్టాలకు అతీతులా?

3 comments:

  1. చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకున్న ఈ నాయకులను ఏం చేసినా తక్కువే అవుతుంది. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే ప్రజలు చట్టాలపై విశ్వాసం కోల్పోతారు.

    ReplyDelete
  2. చట్టం సంగతి తర్వాత .తెరాస సభ్యులు అనుచితంగా ప్రవర్తించారంటూ చిలవలు పలవలు చేసిన మీడియా ఈ విషయాన్నీ మాత్రం విస్మరించడం చాలా భాదాకరం .

    ReplyDelete
  3. చిన్న కులం వాడికి చిన్న తప్పుకి పెద్ద శిక్ష .పెద్ద కులం వాడికి పెద్ద తప్పుకి చిన్న శిక్ష అనే మనువాద నీతిని ఇప్పుడీ పాలకులు ,మీడియా ఇప్పుడు తెలంగాణా విషయంలో కూడా అమలు చేస్తునట్టు అగుపిస్తున్నది.

    ReplyDelete