Thursday, 10 March 2011

బ్లాగుల్లో కాన్స్పిరసీ థీరీలు


చరిత్రలో కాన్స్పిరసీ థీరీలు అనేకం. 9-11 అంతా ఇన్‌సైడర్ జాబ్, అసలు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై కాలు పెట్టనే లేదు, జీసస్ క్రైస్ట్ కు సంతానం ఉండేది లాంటివి అనేక థీరీలు ఉన్నాయి. ఇవన్నీ చదవడానికి మాత్రం బాగుంటాయి, కానీ ఇవి సత్యదూరాలనేవి అందరూ ఒప్పుకునేవే. ఈ కాన్స్పిరసీ థీరీలకు సాధారణంగా ఎలాంటి ఎవిడెన్స్‌లూ ఉండవు, కేవలం కొన్ని ఊహజనిత కల్పనల ఆధారంగా ఇవి అల్లబడతాయి. ఇది ఇలా అయ్యుండొచ్చు, అలా జరిగుంటే వాడికి లాభం లాంటి వాదనలపైన ఈథీరీలు ఆధారపడతాయి కాబట్టి ఇవి ఎవరినయితే టార్గేట్ చేస్తాయో వారంటే ఇష్టం లేనివారు ఈథీరీలను సులభంగా నమ్ముతారు, లేక నమ్మినట్లు నటిస్తారు. ఉదాహరణకు అమెరికా అంటే గిట్టనివారు నాసా చంద్రునిపై లాండింగ్ ఫేక్ చేసిందంటే ఒప్పుకుంటారు, అది అబద్దమయినా.

సాధారణంగా కాన్స్పిరసీ థీరీల పుట్టుకకు రెండు కారణాలు ఉండొచ్చు. మొదటిది తమకు నచ్చని వారిపై దుమ్మెత్తి పొయ్యడానికి, నచ్చినవారిని నేరం నుంచి తప్పించడానికి కాన్స్పిరసీ థీరీలు వాడుకోవచ్చు. రెండవది కొందరు మానసిక జబ్బుతో బాధపడుతున్నవారు జరగని వాటిని జరిగినట్లు ఊహించుకొని ఎవరో తమపై కుట్ర చేస్తున్నారనే ఒక ఆందోళనతో బాధపడుతూ సంబంధం లేని డాట్స్‌ను కలుపుతూ థీరీని అల్లవచ్చు.

తెలుగు బ్లాగులు కూడా కాన్స్పిరసీ థీరీలకు కొత్తకాదు. అడపా దడపా ఎవరో ఒకరు "ఇది విన్నారా, చంద్రునిపై లాండింగ్ నాసా ఫేక్ చేసిందట" లాంటి టపాలు ఎవరో ఒకరు రాస్తూనే ఉంటారు, అదే ఫ్రీక్వెన్సీలో ఉన్నవారు కొందరు ఆవాదనను సమర్ధిస్తూ కామెంట్లు రాస్తారు. ఇవి ఎక్కడొ నెట్‌లో చదివిన థీరీలు. అయితే తెలుగుబ్లాగుల్లోనే పుట్టిన ఇండిజీనియస్ థీరీలు కూడా ఉన్నాయి. ఇందులో నాకు తెలిసినవి రెండు బ్లాగులు.

మొదటిది అందరికీ తెలిసిన అమ్మవొడి బ్లాగులోని సుదీర్ఘమయిన "భారత రాజాకీయ, ఆర్ధిక, సంస్కృతిక వ్యవస్థలపైన కణికవ్యవస్థ కుట్ర". ఇది చక్రవాకం సీరియల్‌లాగా ఎన్నటికీ అయిపోదు. పూర్తిగా ఊహాజనితం, ఏమాత్రం సంబంధం లేని చరిత్రలోని వేర్వేరు కాలాల, ప్రాంతాలకు చెందినివారిని కలుపుతూ అల్లిన కథ. దీని గూర్చి ఇంతకుముందు నేను రాసిన సటైరు ఇక్కడ చదవచ్చు.

రెండవది కలగూరగంపలోని కలగాపులగమయిన టపాలు. ఉదాహరణకు "నీళ్ళపై నిప్పులు: ఆర్డీఎస్ పై దాడి తెరాసవారే చేసి ఉండొచ్చు", "ఇండియన్ నేషనల్ కాంగ్రేస్ కుట్ర - తెరాస పుట్టుక". ఇవి చదివితే ఇందులో వాస్తవాలు సున్నా, ఇది కేవలం తెలంగాణాపై అక్కసుతో అల్లిన వంటకము మాత్రమే అని తెలుసుకోవడం అంతకష్టం కాదు. మూఖ్యంగా ఆర్డీఎస్ గురించి, అసలు చేసింది ఎవరనేది అందరికీ బహిర్గతం, అదేమీ రహస్యంగా చెయ్యలేదు,కొత్తగా చెయ్యలేదు, ఆతరువాతకూడా చేసినవారు బహిరంగంగానే స్టేట్‌మెంట్లు గుప్పిచ్చారు. అయినా ఇలా కేవలం గిట్టని వారిపై బురదజల్లడం కోసం మాత్రమే అల్లిన చత్త సిద్ధాంతాలవలన ఎవరికి లాభం?

12 comments:

 1. .ఇది చక్రవాకం సీరియల్‌లాగా ఎన్నటికీ అయిపోదు. పూర్తిగా ఊహాజనితం, ఏమాత్రం సంబంధం లేని చరిత్రలోని వేర్వేరు కాలాల, ప్రాంతాలకు చెందినివారిని కలుపుతూ అల్లిన కథ......

  ha ha ha !

  ReplyDelete
 2. ఇవ్వాళ నేనో కొత్త కుట్ర సిద్ధాంతం సంగతి తెలుసుకున్నాను. మిలియన్ మార్చిలో ట్యాంకుబండ్ మీది విగ్రహాలు కొన్నిటిని కూల్చేసారు. ఇదెలా జరిగి ఉంటుంది సారూ అని టీ-జాక్ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్యను అడిగితే, ఆయన కూడా ఇలాంటి కుట్ర సిద్ధాంతమే చెప్పాడు.. ’అది ఆంద్రోళ్ళ కుట్ర’ అని. :)

  ReplyDelete
 3. @ చదువరి

  దాన్ని సిద్ధాంతం అనరు, ఆరోపణ అంటారు. ఒక ఉద్యమ నాయకుని ఆరోపణకు, బ్లాగుల్లో తీరిగ్గా అనాలీసిస్ రాసుకొనే వారికీ తేడా ఇంది.

  ReplyDelete
 4. Sir, memu kuda adey cheputhunnamu! ikkada siddanthalakanna aaropanaley yekkuva ayyayi! cheema chachina adi andhra valla leela vilasamey antunnaru mari! asalu vaallevaru, valla abhiprayalu cheppataaniki.. memu cheppindey sila sasanam antunnaru! daaninemantaro cheppandi!

  ReplyDelete
 5. @Snkr

  Your comment is not published. I wish one day you will learn to make sensible comments.

  ReplyDelete
 6. *అసలు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై కాలు పెట్టనే లేదు..... కానీ ఇవి సత్యదూరాలనేవి అందరూ ఒప్పుకునేవే.*

  నేను దీనిని నమ్ముతాను. మీరు అందరిఉ ఒప్పుకునేవి అని మీ అభిప్రాయాన్ని అందరిని నెత్తిన రుద్దుతున్నారు. మీరు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని పైకి ఎమైనా వేళ్ళారా? అంత ఖచ్చితం గా చెపుతున్నారు. అదే కాక జీసస్ పెళ్లి చేసుకోలేదని అంత ఖచిత్తం గా ఎలా చెపుతారు? ఎమీ చేసుకోవటం నేరమేమి కాదే?
  ---------------------------------
  *రెండవది కొందరు మానసిక జబ్బుతో బాధపడుతున్నవారు జరగని వాటిని జరిగినట్లు ఊహించుకొని ఎవరో తమపై కుట్ర చేస్తున్నారనే ఒక ఆందోళనతో బాధపడుతూ సంబంధం లేని డాట్స్‌ను కలుపుతూ థీరీని అల్లవచ్చు*
  మొన్ననే నాకు ఈ విషయం పైన జ్ఞానోదయ మైంది. నా మిత్రుడి తల్లి హైదరాబాద్ లో చనిపోయినపుడు అతను వేరే ఊరిలో ఉండి కనీసం ఆఖరుదశలో తల్లి బ్రతికి ఉన్నప్పుడు చూడలేక పోయాడు కారణం తెలంగాణా లో రైలు రోకో. దానివలన సకాలం లో తల్లిని ప్రాణంతో ఉన్నపుడు చూడలేక బోరు మన్నాడు. మొదట పది రోజులు ఆఫిసులు బహిష్కరణ, తరువాత రెండు రోజులు బంద్,
  ఆ తరువాత మళ్ళి రైల్ రోకో, ఇక ఈ రోజు జరిగింది మీకు ఎలాగూ తెలుసు. రాజకీయ పార్టిలు,నాయకులు తీసుకొవలసిన నిర్ణయాలను వారు సాధించలేక ప్రజలను ఇబ్బందులు పాలు చేయటం సబబేనా? వారు ఒక వేళ చేసినా మీ ప్రజలు చేతనైంతే మీనాయకులను నిలదీయాలి ఒక్కసారి కూడ జైపాల్ రేడ్డి ఎక్కడా కనిపించడు. అది మీనాయకుల కమిట్మెంట్. మిగతా వారు జనాలని పిచ్చేక్కిస్తున్నారు. ఒకరు, ఇద్దరు మనుషులు సమాజంలో ఉన్న వాటికి భిన్నంగా రాసినా, నడచుకొన్నా వారికి మానసిక జబ్బు లాంటివి అంటగట్టటం సహజం. అదే కొన్ని వందలమంది కలసి ఈ రోజు టాంక్ బండ్ మీద తమ మానసిక జబ్బు ప్రదర్సిస్తే దానికి మీలాంటి వారు పోరాటం, సాహసం, త్యాగం అని ముద్దుపేర్లతో పిలుచుకొంట్టూ మురిసి పోవటం. తెలంగాణా పేరు వినిపిస్తే గంగ వెర్రెలీతు ఎత్తటం దానికి వ్యతిరేకం గా ఎవరైనా రాస్తే వారిని నోటికి వచ్చినట్లు మాట్లడటం. వాళ్ళిద్దరిది మానసిక జబ్బు ఐతే మీది కూడా మానసిక జబ్బు కాదని ఎలా అనగలరు? మీ ఊరిలో కుచొని మీరు చేసేవన్ని సరి ఐనవనే మీరను కొంట్టున్నారు. ఇతర రాష్ట్రాలలో ఉంటే మీకు రోజు హైదరాబాద్ లో జరిగిన ఈ తతంగాన్ని చూస్తే నిజంగా చాలా పిచ్చి గా అనిపిస్తుంది అని మీకు అనిపించటం లేదా?

  ReplyDelete
 7. అమ్మఒడి బ్లాగు గురించి మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

  ReplyDelete
 8. @Srinival

  సరే అందరూ కాకపోతే ఎక్కువమంది ఉప్పుకునేవి. ఏవయినా నేను జీసస్ క్రైస్ట్‌నూ చూడలేదు, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్‌నూ చూడలేదు. అయితే ఈ థీరీల లాజిక్‌ను మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను. అసలు జీసస్ క్రైస్ట్ ఉన్నాడనడానికే బైబిల్ తప్ప మరే ఆధారం లేదు, ఇంకా ఆయన పెల్లి చేసుకున్నాడనడానికి ఆధరం ఏమిటి? పెల్లి చేసుకోవడం తప్పని నేనెక్కడా చెప్పలేదే?

  మానసిక వ్యాధి అనేది ఒక జెనరలైజేషన్, ఇలాంటి థీరీలు చెప్పేవారికి పారనోయ ఉండొచ్చనేది ఒక వాదన, నేనే బ్లాగర్‌నూ ఉద్దేషించి ఆమాత చెప్పలేదు.

  ఇక ఉద్యమం వలన జరిగే ఇబ్బందుల గురించి, అవును ఇవన్నీ కష్టమే, అయితే డిసెంబరు 9 తరువాత అందరు నాయకులూ తమ మాటకు కట్టుబడి ఉంటే ఇప్పుడీ అవసరం ఉండేది కాదు, దీనికి కారనం ఎవరో ఒకసారి గమనించండి.

  ReplyDelete
 9. @ శరత్

  అయితే కలగూరగంప గురించి ఏకీభవించడం లేదన్నమాట. ఎంతయినా మీ వంద ఉత్తమ బ్లాగుల్లో ఒకటి కదా?

  ReplyDelete
 10. :)

  కలగూరగంప గురించి అదే కామెంటులో వ్రాద్దామనుకుంటూనే మరచిపోయాను. వారి టపాలు నేను ఎక్కువగా చదవను - కొన్నే చదువుతాను. కొన్నిట్లో అతి కనిపించినా కాస్త విభిన్న కోణాల్ని అవిష్కరించడానికి కృషిచేస్తుంటారు. మంచి చేయితిరిగిన బ్లాగర్ వారు. వారి విశ్లేషణలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా చదవబుద్ధి అవుతాయవి. ఇహ పోతే మీరు మీరు ఉదహరించిన విషయాలపై టపాలు నేను చదవలేదు, ఆసక్తి లేదు కాబట్టి నేనేమీ వ్యాఖ్యానించలేను.

  వారిలో తెలంగాణా వారిని చిన్నచూపు చూడటం అనే ఆంధ్రా అహమూ ఎక్కువే. అది నాకు నచ్చదు.

  ReplyDelete
 11. @ శరత్

  వారి విభిన్న కోణాలకు కొన్ని ఉదాహరణలు:

  1) మగవారికి కోర్ట్‌షిప్ చేసే హక్కు ఉండాలి (ఆడవారికి మాత్రం ఉండొద్దు).
  2) అందరూ ఒకప్పుడు బ్రాహణులే( కావాలని వారే శూద్రులుగా మారారు).
  3) తెలంగాణా వారు తాగుబోతులు (ఆంధ్రా వారు పత్తిత్తులు).
  4) బ్రాహ్మణుల మార్గదర్శకత్వం దేశానికి అవసరం (మిగతావారిది అనవసరం)
  5) తెరాస వారే RDS ధ్వంసం చేశారు ( తామే చేశామని ఒప్పుకున్నవారు అమాయకులు).
  6) మతవిద్య లేకపోతే మనిషులు పెళ్ళి చేసుకునేవారు కారు
  7) తెలంగాణా వారు ఆంధ్రా వారి వద్ద నేర్చుకోవాలి.
  8) ఒక్క విజయవాడ-గుంటూరు ప్రజలు తప్ప మిగతా తెలుగు ప్రజలంతా మితిమీరిన ఆత్మన్యూనతతో బాధపడుతున్నారు, సంకుచిత స్వభావులు.

  నేనెన్నడూ ఆబ్లాగు చదవను, ఇప్పుడు కాస్త స్కాన్ చేస్తే తెలిసిందిది. ఇక ఊరికే గ్రాంధీకాలు రాస్తే అది మంచి శైలి అయిపోదు.

  ReplyDelete
 12. కలగూరగంప నిజ౦గానే సార్ధకనామధేయ౦ అనిపి౦చుకొన్న బ్లాగు :). కొ౦దరికి తెల౦గాణా టపాలు అభ్య౦తరకర౦ గా ఉ౦టే, ఇ౦కొ౦దరికి మగవారికి కోర్ట్‌షిప్ చేసే హక్కు ఉండాలి అన్న సబ్జెక్ట్ మి౦గుడుపడదు. అలాగే మిగతా వర్గాలు.

  వారు అభిప్రాయాలను నిస్స౦కోచ౦గా తెలియచేస్తారనడానికి (మనకి చాలా నచ్చవు అనుకో౦డి )ఈ టపా :

  http://kalagooragampa.blogspot.com/2010/07/blog-post.html

  ReplyDelete