తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకోవటానికి ముఖ్య కారణం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు, అసెంబ్లీలో ప్రజాప్రతినిధులకు మెజారిటీ లేకపోవడం వలన. మెజారిటీ లేకపోవడం వలన తెలంగాణ నాయకులకెప్పటికీ అధికారం రాదు. అసెంబ్లీలో వారి మాట నెగ్గదు. మెజారిటీ ఆధ్రాంగా నడిచే ప్రజాస్వామయంలో మెజారిటీలేనివాడికి న్యాయం జరగదు కనుక.
కొందరు అతితెలివి కలిగినవారు మెజారిటీ లేకపోతే మాత్రం తెలంగాణనుండి ప్రజాప్రతింధులు లేరా, మంత్రులు లేరా? ప్రజాస్వామ్యంలో అందరూ కలిసే కదా నిర్ణయాలు తీసుకునేది అని అతితెలివి చూపుతారు, కానీ వాస్తవాలు అందరికీ తెలిసిందే. భేధాలు లేనంతవరకే మెజారిటీ నిర్ణయాలు ఆమోదనీయం, మనం కలిసి ఒక్క రాష్ట్రంగా ఉన్నా ఎన్నడూ ప్రజలుగా కలిసి లేము, అధికారంలో కూర్చున్నవారు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా కాక ప్రాంతాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు.
ఇప్పుడు బ్లాగుల్లో జరుగుతుంది కూడా అదే. మెజారిటీ తెలుగు బ్లాగర్లు సీమాంధ్ర ప్రాంతం వారు. వీరిలో అధికభాగం పక్షపాతపూరితంగా తమది తప్పు అని తెలిసినా ఎదుటివారినే దెప్పిపొడుస్తారు. ఎవరైనా పొరపాటున తెలంగాణవాది తన బ్లాగులో ఒక చిన్న కవిత రాసుకున్నా అక్కడికి వెల్లి కావు కావుమంటూ కామెంట్లు అరిచి గీపెడతారు. పచ్చి అబద్దాలు చెబుతారు, అయినా ఎదుటివారివే అబద్దాలు అంతారు. కానీ మెజారిటీ ఉంది కదా.. ఎక్కువ కామెంట్లు వారివే కదా.. కనుక తెలంగాన వాదులు నోరుమూసుకుంటారు.
మచ్చుకు ఒక ఉదాహరణ: ఒక పెద్దమనిషి వెల్లి ఒక బ్లాగులో "ఏమిటి, మీ నల్లగొండలో ఫ్లోరసిస్ అని చెబుతున్నావు, నల్లగొండలో ప్రతి ఊరికి క్రిష్ణా నుండి తాగు నీరు వస్తుంది, 2000 సమవత్సరంలోనే ఫ్లోరసిస్ సమస్య తీరిపోయింది" అని గదమాయిస్తాడు. ఎదుటివారిని అబద్దాలు రాస్తున్నావని హుంకరిస్తాడు. ఎవరైనా అయ్యా నల్లగొండ జిల్లాలో ఏఊరికీ తాగునీరు క్రిష్ణా నుండి అందడం లేదు, ఫ్లోరసిస్ అలాగే ఉంది, ఘోరంగా ఉంది అని చెబితే మల్లీ దాని ఊసెత్తడు, కానీ అతనే మరో బ్లాగుకెల్లి తెలంగాణవారు అన్నీ అబద్దాలు చెబుతున్నారని గోలపెడతాడు. అక్కడ అతని మద్దతుగా మరో పది కాకులు కావుకావు మంటాయి. మధ్యలో సందట్లో సడేమియాల్లాగా రక్తచరిత్రలూ, సంకరులూ బయల్దేరుతారు, బూతు రాతలకు, హేళనలకు తెగబడుతారు, గోల చేస్తారు.
ఇక ఎవరో విశాలాంధ్ర వారు ఏదో సర్వేని ఒకటి చూపుతారు. వెంతనే మన బ్లాగు కాకులు కావు కావుమంటూ మల్లీ అదే సర్వేని దాని అసలు అర్ధాన్న్నే మారుస్తూ ప్రచారం చేస్తారు, కామెంటర్లు కామెంట్ల గోల పెడతారు. ఆఖరుకు బ్లాగుల్లో మేధావులుగా చలామనీ అయిపోయే కొందరు 14F లాంటి ఒక అన్యాయపు క్లాజును కూడా సమర్ధించడం, 14F తొలగింపును సీమాంధ్రలోనే అనేక నాయకులు, మేధావులు సమర్ధించినా అస్మెంబ్లీ నిర్ద్వంద్వంగా తొలగింపును సమర్ధించినా ఇంకా 14Fను వెనుకేసుకు రావడం, దానికి కొందరు కావు కావు మంటూ సమర్ధించడం అత్యంత శోచనీయం.
ఈగోలంతా భరించలేక చాలామంది తెలంగాణ వాద బ్లాగరులు తెలంగాణ గురించి రాయడం మానుకున్నారు, కొందరు తమ బ్లాగులను అగ్రిగేటర్లనుంచి తొలగించారు. కొందరు ఏదో తమకు నచ్చింది రాస్తున్నారు కానీ కామెంట్లను తీసివేశారు. ఇడీ ప్రస్తుత బ్లాగు మెజారిటీ రాజకీయాల పరిస్థితి.