Wednesday 2 November 2011

పొట్టి శ్రీరాములు గురించి తెలంగాణవాదిగా!!

ఈమధ్యన కొందరు తెలుగు బ్లాగరులు తెలంగాణవాదులు పొట్టిశ్రీరాములును ద్వేషిస్తున్నట్టూ, అవమానిస్తున్నట్టు ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి పొట్టి శ్రీరాములుపై తెలంగాణవాదులకు ఎలాంటి ద్వేషం లేకపోగా ఒక గాంధేయవాదిగా, తాను నమ్మినదానికోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తిగా గౌరవం ఉంది. తెలంగాణవాదులు ఎక్కడా పొట్టి శ్రీరాములును ద్వేషించలేదు, దూషించలేదు. కొండకచో కొందరు ఆవేశపూరిత ఉద్యమకారులు పొట్టి శ్రీములు విగ్రహాలను తొలగించడానికి ప్రయత్నం చేసినా అది పొట్టి శ్రీరాములుపై కోపం కాదు, తెలంగాణవాదుల కోపం కేవలం తమప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని తమ ప్రాంతంలో ఊరూరా (హైదరాబాద్ మాత్రమే కాదు, ప్రతి జిల్లాలో అని గమనించాలి) ప్రతిష్టించి తమ అభిజాత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం పైనా, చరిత్రను వక్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ అవతరణకు పొట్టిశ్రీరాములుకు ముడిపెట్టడం పైనా.


ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందుగా దీక్ష చేసింది గొల్లపూడి సీతారాం. అతని దీక్ష తరువాత కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంది. ఆతరువాత పొట్టి శ్రీరాములు దీక్ష చేసింది మద్రాసు నగరం రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడాలి అనే ప్రధాన డిమాండ్‌తో కాగా అతని డిమాండ్ తీరకుండానే పొట్టి శ్రీరాములు గతించారు.

నిజానికి ఎలాగూ దక్కదని తెలిసీ మద్రాసు నగరం కోసం పొట్టి శ్రీరాములును దీక్షకు ఉసిగొల్పిందీ, అతను దీక్షకు పూనుకుంటే ఈడిమాండ్ నెరవేరడం కాష్టమని చెప్పి  దీక్ష విరమణకోసం ప్రయత్నం చెయ్యనిదీ ఆంధ్ర నాయకులే. దీక్ష చివరిరోజుల్లో అపస్మారక స్థితిలో ఉండి తన స్వంత నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు విరమింపజేయాల్సింది ఆంధ్రనాయకులే అయినా వారు దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదు. ఈవిధంగా పరోక్షంగా పొట్టి శ్రీరాములు మృతికి కారణం ఆంధ్ర నాయకత్వమే.

ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఆంధ్రరాష్ట్ర ఉద్త్యమానికి ముందు పొట్టి శ్రీరాములు ఒంటరిగా దళిత అభ్యున్నతికై ఉద్యమిస్తూ రోడ్డుపై బ్యానర్ పట్టుకుని  కాల్లకు చెప్పుల్లేకుండా తిరుగుతుంటే ఏఆంధ్రా నాయకులూ అతనికి సహకారం ఇచ్చిన పాపాన పోలేదు. అప్పుడు ఆంధ్రా ప్రజానీకమే పొట్టి శ్రీరాములును పిచ్చివాడికింద జమకట్టి అవమానించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినతరువాత ఒక్కసారిగా పొట్టి శ్రీరాములు హీరోను చేసి ఆంధ్రాకంటే కూడా ఎక్కువ విహ్రహాలను తెలంగాణలో ప్రతిష్టించింది కూడా ఆంధ్రా నాయకులే. పాఠ్యపుస్తకాల్లో పొట్టి శ్రీరాములు మూలంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందనే అర్ధం వచ్చేలా పాఠాలు చొప్పించిందీ ఆంధ్రా నాయకత్వమే. పొట్టి శ్రీరాములు ఆత్మ నేడు ఎవరిచర్యలవల్ల క్షోభిస్తుందో!!

ఇప్పుడు తెలంగాణవాదులు మాకు సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలు మాప్రాంతంలో వద్దు, చరిత్రను వక్రీకరించి నవంబరు ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణకు, పొట్టి శ్రీరాములుకు ముడిపెట్టొద్దంటే తెలంగాణవాదులను ద్రోహులు అంటూ అవాకులు పేలుతున్నదీ ఆంధ్రా నాయకులూ, బ్లాగరులే.పొట్టి శ్రీరాములు విగ్రహానికి దండేయాల్సింది నవంబరు ఒకటిన కాదు, అక్టోబరు ఒకటి రోజు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ గూర్చి.



7 comments:

  1. I told same this true lot of my Andhra friends but no use.. those people don't want truth they want some thing to talk which is publishing Andra mead and news channels.

    Thanks for good post..

    ReplyDelete
  2. చరిత్రలో నిజం అనేదేదీ ఉండదు. ఎవరు యేది బాగా ప్రచారం చేసుకోగలిగితే అదే చరత్ర కెక్కవచ్చును. దేశ కాల పరిస్థితులను బట్టి చరిత్ర అనే దానిని మనుషులు తోచినట్లు మార్పులు చేర్పులు చేయకుండా అడ్డు కోవటం సులభంకాదు. చివరికి చరిత్ర పేరుతో కనబడుతున్నదానికి కూడా దేశ కాల పరిస్థితులను బట్టి రకరకాల పరస్పరవిరుధ్ధ వ్యాఖ్యానాలు చెలరేగినా యెవరూ చేయగలిగింది యేమీలేదు. తమాషా యేమిటంటే అందరూ తమతమ వాదనలకు ఋజువులు చూపుతారు లేదా తయారు చేస్తారు. గందరగోగం మధ్య అసలు నిజం యేమిటో తెలిసే అవకాశం స్వల్పం. ఒకవేళ యెవరైనా చెప్పినా యెవరూ వినరు - అదొక కొత్త వాదంగానే మిగిలి పోతుంది. అయోమయంలో పడే ప్రజలు యేది నమ్మాలో తెలియక దేనినీ నమ్మకపోవచ్చు. కొందరు కొన్ని కొన్ని వాదాల వలలో పడవచ్చు. కొందరు తమ తమ ప్రయోజనాలకోసం నమ్మకాలు నటించవచ్చు. డబ్బున్న వాళ్ళ మహిమ వల్లనో నోరున్న వాళ్ళ మహిమవల్లనో అవకాశవాదుల మహీమ వల్లనో ప్రచారం గెలుచుకున్న కొత్త, పాత అసత్యాలతొ మరింత కుళ్ళు పేరుకుని మరింత అనుచితమూ అసందర్భమూ అనాగరికమూ అన్యాయమూ అవివేకమూ అవినీతి మయమూ అయిన కథనాల కలగలుపు చరిత్రగా చలామణి లోనికి వస్తుంది. కొన్నాళ్ళకు కథ మళ్ళీ మొదటికి వస్తుంది. అదీ సంగతి. అయితే ఒక్క విషయం, శ్రీకృష్ణ భగవానును మాటను గుర్తు పెట్టుకోవాలి:

    | సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత, బొంకుచే
    | పారము పొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షు లె
    | వ్వార లుపేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ ని
    | స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవముండెడిన్

    మనమన అవసరాలకోసం చరిత్రను వాడుకోవటం వల్ల భవిష్యత్తును శాసంచలేము. మన చిత్త విశుధ్ధి కారణంగానే సరిఐన భవిష్యత్తును గురించి సరిైన ప్రయత్నం చేయటానికి దారి కనబడుతుంది. ఆశామోహాలు యెప్పుడూ తప్పుదోవలే చూపుతాయి. తప్పు పరిణామాలకే దారితీస్తాయి. అందరూ గుర్తుంచుకోండి.

    ReplyDelete
    Replies
    1. charithraa antene nijam nijame charithraa.

      Delete
  3. ninnu champi darunanga vikrutanga .kaalchi ...charithra lo ninnu o paapi ga rasukunta ,,,,oka nikrushtunika rasukuntaaamu...
    charithre gaa ,,,nijalu evi vundavu neevannattu...maaaku bavishyattulo problem kuda ledu...

    ReplyDelete
  4. potti sriramulu garu represents the unity of telugu people, whether it is in 1952 or 1956.we respect people for their relavance and deeds such are the people like marx, lenin, mao,netaji,ramana maharshi,shivaji. potti sriramulu might have fought for separation from madras state where tamilians used to dominate in all fields due to the domination of ayyars and ayyangaars in education and power.as he sacrificed his life for the cause of telugus in madras state he was epitomized in whole of andhra pradesh including telangana. coastal or seema people never thought that pothanna, kakateeyaas, rasmdas, taanisha, C.narayana reddy or dasaradhi as alliens. they belong to every one of telugu people. similarly potti sriramulu garu.only few insensitive persons raise such arguments and hooligaans destroy statues. we have more statues of ambedkar than al other statues put together. people are there who argue against the thoughts of ambedker but they have good sense to limit it upto murmuring only . let us not write against such great people adversely. it pains who respect them.

    ReplyDelete
    Replies
    1. ayya maku sambadham ledu ante kadu mee valle anttarenti anna ....vallu maa valla kada andhimemu cheppali kani meeru kadu

      Delete