Monday 24 January 2011

కార్యకర్తపై లగడపాటి వీరంగం



రచ్చబండ కార్యక్రమంలో ఒక కాంగ్రేస్ కార్యకర్త లగడపాటి యొక్క సమైఖ్య ఉద్యమం తన ఆస్థులకోసమే కాదా అని ప్రశ్నించగా లగడపాటి అతనిపై చెయ్యిచేసుకున్నాడు. ఇది జరిగింది ఏ తెలంగాణా ప్రాంతంలోనో కాదు, సొంత నియోజకవర్గమైన విజయవాడలోనే. ప్రజల భాగస్వామ్యం లేకుండా నాయకులు జరిపించిన కృత్రిమ సమైఖ్య ఉద్యమంపై సీమాంధ్రలోనే అనుమానాలున్నాయని ఈ సంఘటన ద్వారా తేటతెల్లం అవుతుంది. ఈ సీనును ఈ క్రింది వీడియోలో చూడవచ్చు.


1 comment:

  1. విజయనగరంలో అశోక్ గజపతి రాజు, ఆముదాలవలసలో తమ్మినేని సీతారాం, ఇలా సీనియర్ రాజకీయ నాయకులు ఉన్న ఊర్లలోనే సమైక్యాంధ్ర కోసం హింస ఎక్కువ జరిగింది. లక్షకి పైగా జనాభా ఉన్న శ్రీకాకుళంలో పెద్ద హింస జరగలేదు కానీ కేవలం నలభై వేలు జనాభా ఉన్న ఆముదాలవలసలో హింస ఎక్కువ జరిగింది. అది కరెన్సీ నోట్లతో చెయ్యించిన హింస.

    ReplyDelete