Sunday, 13 February 2011

ప్రేమికుల దినం వచ్చింది ప్రేమికులారా జాగ్రత్త!!


వాలైంటెయిన్స్ డే వచ్చింది, ఇక మల్లీ డ్రామా మొదలవుతుంది. పార్కుల్లోనూ, కాఫీ క్లబ్బుల్లోనూ ఎక్కడయినా ఒక అమ్మాయి, అబ్బయి కనింపించారంటే చాలు, స్వయంప్రకటిత మోరల్ పోలీసులు వచ్చి తరిమి కొడతారు లేదా పెళ్ళిల్లు చేస్తారు. అక్కడ కలిసి ఉంది అన్న చెల్లెల్లు కావొచ్చు, ఆటో డ్రైవరు, ఒక ప్రయాణీకురాలు కావొచ్చు ఇంకెవరయినా కావొచ్చు. ఎవరయినా సరే తాళి కట్టి తీరాల్సిందే.

గత సంవత్సరం నాకు గుర్తున్న వార్తలు: ఒక అమ్మాయి ఏదో పరీక్షకోసం వెలితే తోడుగా ఇంకో అబ్బయి వెళ్ళి మధ్యలో కాస్త టైముంటే పార్కులో కూర్చున్నారు, వారికి తీళి కట్టించేశారు. ఒక అమ్మాయి ఆటోను ఎంగేజ్ చేసుకుని కాస్త వేచి ఉండాల్సి రావడంతో ఆటొ డ్రైవరుతో పార్కుకెలితే వారితో కూడా తాళి కట్టించారు. రేపిలాంటి వార్తలు ఎన్ని వినాలో! సంవత్సరమంతా ప్రేమికులు రోజూ పార్కుల్లో కూర్చుని ముద్దూ ముచ్చటలాడుకోవచ్చు, ఎవరూ పట్టించుకోరు. కానీ ఒకా ఫిబ్రవరి 14 రోజు మాత్రమే ఏ జంట ఎక్కడా కనపడకూడదు. ఆ రోజు కనపడితే తాళి కట్టడానికి రడీగా ఉండాలి.
మనదేశంలో ఒక గుంపుతో కలిసి ఎలాంటి అసాంఘిక కార్యక్రమమయినా చెయ్యొచ్చు. అది ప్రభుత్వ అస్తిత్వానికి, అధికారంలో ఉన్న వారికి కావలిసినవారికి ఆర్ధికంగా నష్తపరచనంతవరకూ ఎలాంటి చర్యలూ ఉండవు.

2 comments:

  1. ప్రేమికుల రోజున పార్క్‌లలో కనిపించినవాళ్లందరూ నిజం ప్రేమికులు కారు. వాళ్ల మీద మోరల్ పోలీసింగ్ చెయ్యడం అనవసరం. వాళ్లలో ఎంత మంది నిజంగా పెళ్లి చేసుకుంటారు? ప్రేమించేటప్పుడు కులం, మతం లాంటివి గుర్తు రావు. పెళ్లి విషయానికి వచ్చినప్పుడు అటువంటివి చెప్పే దాటవేస్తారు. ఈ సంస్కృతి పరిరక్షకులు అశ్లీల సినిమాలు, న్యూడ్ మోడలింగ్ విషయంలో ఏమి చేస్తున్నారు? యానా గుప్తా తన మర్మాంగం కనిపించే అశ్లీల పోజ్ ఇచ్చినప్పుడు ఎందుకు దాడి చెయ్యలేదు? ఏడాదికొకసారి పార్కుల్లోకి వచ్చి ప్రేమికులపై దాడులు చేస్తారు.

    ReplyDelete
  2. ఇంకో విషయం. తాళి కట్టినంతమాత్రాన పెళ్లి కాదు. చట్టం ప్రకారం పూజారి సమక్షంలో లేదా రిజిస్ట్రార్ ఆఫీస్‌లో జరిగిన పెళ్లే పెళ్లి అవుతుంది. వాళ్లు బలవంతంగా తాళి కట్టించినా తరువాత ఎవరికివారు విడిపోతారు.

    ReplyDelete