Friday, 25 February 2011

అసలు లొల్లి మొదలయింది

తెలుగు జాతి కార్డు, సమైఖ్యభావన లొల్లి అంత ఉత్తదే అని తెలిసిపొయిది, సమైఖ్యాంధ్ర ఉద్యమం దొంగ ఉద్యమమనీ తేలిపోయింది, ఇక అసలు లొల్లి మొదలయింది. హైదరాబాదు ఎవరికి చెందుతుందనేదానిపై ఇప్పుడు చర్చ మొదలయింది. హైదరాబాదులో మేము పెట్టుబడులు పెట్టాము, మేం ఇక్కడ స్తలాలు కొనుక్కున్నాము, కబ్జాలు కూడా చేశాము, కనుక ఇప్పుడు హైదరాబాదు మాక్కూడా చెందుతుందని ఒకరంటె, మాకియ్యకపోతెమాయె మీగ్గుడ రాకుండ కేంద్రపాలితప్రాంతం జెయ్యండ్రని ఇంకొకరు. హైదరాబాదులో రిఫరెండం బెట్టాలి, హైదరాబాదు వాసుల అభిప్రాయం తెలుసుకోవాలని ఇంకొకరంటరు.మేము నగరాన్ని విడిచిపెట్టి మీరు పొమ్మంటే పోవాలా అని మరొకరు.

మొత్తానికి ఇదొక మంచిపరిణామం. సీమాంధ్రలో నాయకులు సమైఖ్యత సాధ్యం కాదనే విషయం గ్రహించి విడిపోతే తమకు కావలిసిందేంటో అడిగితే అది మెల్లగానయిన పరిష్కారానికి దారితీస్తుంది. అయితే ఇసుంట రమ్మంటే ఇల్లంత నాదే అన్నట్లు సొంతరాజధాని లేక రాజధాని అవసరంకోసం కలిసినవారు ఇప్పుడు హైదరాబాదులో వాటాను అడగడం బాగాలేదు.

"ఇది హైదరాబాదు, ఇది హైదరాబాదు, ఇది భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు" అని ఎవరో కవి చెప్పినట్లు నాటినుంచి నేతివరకు ఎందరో భిన్న జాతుల మనుషులు హైదరాబాదు వచ్చి వ్యాపారాలు చేసుకున్నారు,పొట్టపోసుకున్నారు, తమ ఐడెంటిటీలను కాపాడుకున్నారు. సింధీలు, మార్వాడీలు,పంజాబీలు, గుజరాతీలు, పార్శీలు,మరాఠీలూ ఇక్కడ స్థిరపడ్డారు, ఇక్కడి ప్రజలతో కలిసిపొయ్యారు. వరికెవరికీ లేని భయాలు ఇప్పుడు కొత్తగా కొందరు సృష్టిస్తున్నారు.

మేమిక్కడ పెట్టుబడులు పెట్టాం, కనుక మాకు హక్కు ఉంటుంది అనేవారికి, హైదరాబాదులో బిల్‌గేట్స్ కూడా పెట్టుబడులు పెట్టాడు అంతమాత్రం చేత ఇది అమెరికాకు ఇచ్చేయం అని తెలియక కాదు. పెట్టుబడులు ఎవరయినా లాభాలకోసం పేడతారు, ఒక నగరం మీద ప్రేమతో కాదు. మన ఓఎన్‌జీసీకి నైజీరియాలో, తజకిస్తాన్ వంటి చోట్ల పెట్టుబడులున్నాయి, అంత మాత్రాన ఆదేశాల్లో మనకు వాటా ఎన్నటికీ రాదు. తెలుగు వారి పెట్టుబడులు ఇక్కడే కాదు, మనదేశంలోని మిగతా పెద్దనగరాలలో చాలా చోట్ల ఉన్నాయి.

ఇక రెండొ విషయం, లేని అపోహలను సృష్టించడం: మాకు రక్షణ ఉండదు,మా మీద దాడులు చేస్తారు, మేము హైదరాబాదు వదిలి ఇప్పుడు వెల్లాలా లాంటి మాటలకు ఎలాంటి అర్ధం లేదు. ఇక్కడి సీమాంధ్రానుండి వచ్చిన ప్రజలు నిర్భయంగా ఉన్నరు, తొందరగా తెలంగాణా వస్తే తలనొప్పి తీరుతుంది అనుకుని అడ్డుపడేవారిని తిట్టుకుంటున్నరు. కానీ వీరికోసం ఎక్కడో ఉండేవారు మాత్రం తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నరు. ఇదేం దేశ విభజంకాదు, కేవలం రాష్ట్ర విభజన. కొత్తరాష్ట్రం ఏర్పడ్డంత మాత్రాన ఎవ్వరినీ ఇక్కన్నుంచి వెల్లమనడం లేదు. బాంబే స్టేట్ నుండి వేరుపడడకోసం మరాఠీలు ఉద్యమించినపుడు అక్కడి గుజరాతీలమీద దాడి చేసినట్లు ఇక్కడ ఎప్పుడూ చెయ్యలేదు.

ఇక ఇంకొంతమంది వాదన మరోలా ఉంటుంది: హైదరాబాదు రాజధానికనుక వచ్చాము, ఇప్పుడు మరెక్కడికి వెల్లాలి అని. రాజధాని కదా అని ఎవరు వెల్లరు, వ్యాపార, ఉద్యోగ అవకాశాలు ఉన్న ఎక్కడికైనా వెల్తారు, అది రాజధాని కానవసరం లేదు. ఒకవేళ ఆంధ్ర, తెలంగాణా కలవక హైదరాబాదు తెలంగాణా రాష్ట్రం రాజధానిగా ఉంటే ఆంధ్రనుండి ఇక్కడికి వలసవచ్చేవారు కాదు అనుకోవడం పొరపాటు.

ఇక హైదరాబాదు కేంద్రపాలితప్రాంతం కావాలనో, లేక హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలనో అనేవారు ఏదోవిధంగా ఇరకాటు పెట్తాలనుకోవడం తప్పితే అది జరిగేపని కాదని అందరికీ తెలుసు.

చివరగా హైదరాబాదు ప్రస్థుత అభివృద్ధిలో ఆంధ్రా వారికీ వాటా ఉంది అనే వాదన. ఇది కొంతవరకూ నిజంగానే అనిపిస్తున్నా ఆరోజు పెద్దమనుషుల ఉప్పందం యధా ప్రకారం జరిగుంటే తెలంగాణా ఆదాయం తెలంగానాలోనే ఖర్చుపెట్టాలి, అలా చెయ్యకుండా తెలంగాణా ఆదాయాన్ని ఆంధ్రాలో ఖర్చుపెట్తారనేది బడ్జెట్ లెక్కలు చూస్తే తెలుస్తుంది. దానర్ధం హైదరాబాదు ఆదాయాన్ని సీమాంధ్రలో ఖర్చుపెట్టడం జరిగింది కానీ అక్కడి ఆదాయాన్ని హైదరాబాదులో ఖర్చుపెట్టలేదు. కాకపోతే మరో రాజధాని అవసరానికి సీమాంధ్ర నాయకులు కేంద్రాన్ని ఎంతోకొంత ప్యాకేజీ అడగొచ్చు కానీ మిగతావేవీ జరిగేపనికావు.అందుకే ఇన్నిరోజులూ సమైఖ్యగారడీలు!!

8 comments:

 1. సమైక్యాంధ్ర వాదం, తెలుగుజాతి వాదం బూటకమని బయట పడ్డాక హైదరాబాదు రాగం ఎత్తుకున్నారు.

  ఈరోజు ABN చర్చలో పాల్గొంటూ చలసాని శ్రీనివాస్ గారు ఒక అడుగు ముందుకు వేసి అసలు హైదరాబాద్ కూడా సమస్యకాదని, నీతి పంపకమే అసలు సమస్యని కుండ బద్దలు కొట్టారు.

  దీంతో హైదరాబాదు అంశం కూడా వీరి కుంటిసాకులలో ఒకటని తేలిపోయింది.

  నీటి పంపకాలకు అంతర్రాష్ట్రీయ ట్రిబ్యునల్లుంటాయని వీరికి తెలియదా? కానీ అప్పనంగా వాడుకునే జలాలకు ట్రిబ్యునల్లు ఒప్పుకోవు కదా! అదే వీరి భయం.

  ReplyDelete
 2. Spend Hyderabad income in Hyderabad Y to telangna. Spend Warrangal income in Warrangal ,similarly Mumbai income in Mumbai.
  I will Telagana is under developed when compared to Andhra. Rayalaseema under developed than Telagana.We have to find reasons for the under development of the regions.If Telagana existed as separate state it might developed well. May be the opprtunities in Hyderabad will be utilised mostily Telanganites.At the same Andhra might developed a good capital which may be comparable to present Hyderabad.If separated now Andhra will loose. Nobody wants to loose game. And one more thing Hyderabad not built only the income from Telagana ,under Nizam kingdom some Kannada districts,Martha districts alos contributed to Hyderabad development in Nizam's time.

  ReplyDelete
 3. @ హరి

  నేను ABN చర్చను కాస్సేపు చూశాను కానీ, ఇది గమనించలేదు. నీటిపై మాట్లాదిటే ఇప్పడిదాకా తెలంగాణాకు జరిగిన అన్యాయాలు వాల్లే చెప్పినట్లవుద్ది.

  @reachrala rudhurudu
  Hyderabad was not a separate entity, it was together with Telangana when the gentlemen agreement was made, so there was no question of spending Hyderabad income only in Hyderabad. Kannada, Marathee speaking district people have contributed to Hyderabad. They left on their own, if they want to come back Telanagana will accept them.

  Andhra didn't lose any by not having capital, growth rate of vizag has been higher than Hyderabad.

  ReplyDelete
 4. Asalu separate telangana separate andhra separate seema kante

  anni prantallo poor people ki oka package ichi rural areas lo water,infra,education ki immediate ga steps teesukunte ippativaraku jarigina damage konchem taggochu

  ReplyDelete
 5. @satsi

  అంత ఐడియల్ కండీషన్‌లో ఉంటే ఇలాంటి డిమాండ్‌లెప్పుడూ రావు. యాభై సంవత్సరాలలో మెరుగుపడనిది ఇప్పుడు ఏ ప్యాకేజీ వల్లనో మారదు.

  ReplyDelete
 6. దీన్నే అతితెలివి అంటారు. గుజరాతీలు, సింధీలు, మార్వాడీలు, x, y లు వచ్చి పెట్టుబడి పెట్టినప్పుడు అవి వ్యక్తిగత స్థాయిలోనే, పైగా వారిగి క్షుణ్ణంగా తెలుసు ఇది వారి ప్రాంతం కాదని. బిల్‌గేట్స్ పెట్టుబడి పెట్టినప్పుడు ఏ బుద్ది తక్కువ వాడు అనుకోడు ఇందులో వాటా అడగాలని. అలానే ఆంధ్రులు ఇతర ప్రాంతాలో పెట్టినప్పుడు అందులోనూ వాటా అడగరు. కానీ హైదరాబాద్ కి అచ్చంగా వ్యక్తిగత పెట్టుబడులే కాకుండా ఇతర ప్రాంతల రెవెన్యూ కూడా తరలించటం జరిగింది. అదే కాక ఒక రాష్ట్ర రాజధానిగా ఉండటం వల్ల కేంద్ర, రాష్ట్ర స్థాయి పరిశ్రమల్లో సింహభాగం ఇక్కడ నెలకొల్పటం జరిగింది. ఇలా అర్ధాంతరంగా విడిపోయే సూచనలే ఉంటే ఇందులో కొన్ని ఇతర ప్రాంత రాజధానులకి తరలి ఉండేవి. అలా ఒక ఉమ్మడి రాజధానిగా ఇది అందరి రాజధానిగా అభివృద్ది చెందటం వల్లే ఈ రోజు రాష్ట్ర ఆదాయం లో హైదరాబాదుకు గణనీయమైన వాటా ఉంది. మూడు ప్రాంతాలకు తగిన నిష్పత్తి లో చెందల్సిన ఈ వాటాను అప్పనం గా దొచేయటానికి చేస్తున్న ఈ అతితెలివి ఉద్యమమే తెలంగాణ ఉద్యమం.

  ReplyDelete
 7. @విజయ్

  దీన్నే అతితెలివి అంటారు.ఇతర ప్రాంతాల రెవిన్యూ హైదరాబాదుకు తరలించబడిందో లేక ఇక్కడి రెవిన్యూ ఇతర ప్రాంతాలకు తరలించబడిందో బడ్జెట్ లెక్కలు తిరగేస్తే తెలుస్తుంది, ఒకసారి సరిచూసుకోండి.

  ప్రభుత్వ పరిశ్రమలు తెలంగాణాలో ఒక్క హైదరాబాదులో మాత్రం ఉంటే ఆంధ్రాలో పలుచోట్ల పెట్టడం జరిగింది, ఆయా నగరాల స్థాయిని బట్టి. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాదు వాటా ఇప్పుడు కొత్తగా పెరిగిందేమీలేదు, 1956 నుంచీ ఎక్కువే. తెలంగాణాలో ఒక్క హైదరాబాదు అభివృద్ధి చెందింది కానీ ఆంధ్రలో చాలా నగరాలు 50 ఏళ్ళలో అదే రేటులో పెరిగాయి. వైజాగ్ గ్రోత్ రేట్ ఇంకా ఎక్కువ.

  ReplyDelete
 8. లెక్కలు చూపించిన వాళ్ళని తప్పుడు లెక్కలు అంటారు, మనం చెప్పేదే నిజమైన లెక్కలని అడ్డంగా వాదిస్తారు. ఒకసారి చూడు బాబు భార్గవ కమిటీ రిపోర్ట్. 72 కు ముందు హైదరాబాద్ లో ఏముంది? నగరాల స్థాయి ని బట్టి అంటే, ఎక్కడివి అక్కడే ఉంటాయి. మీకు కావల్సి వచ్చినప్పుడు గ్రోత్ రేట్ అంటూ పర్సంటేజ్ లో మాట్లాడుతారు. మరి తెలంగాణ పర్సంటేజ్ చూద్దామా ఎంత గ్రోత్ రేటో? విడిపోయిన మిగిలిన భాగాలతో పోల్చి చూద్దామా?

  ReplyDelete