Friday, 25 February 2011

వర్మ చేతిలో క్లీన్‌బౌల్డయిన రజనీకాంత్‌

రోజూ అందరినీ రకరకాల ప్రశ్నలతో కంఫ్యూజ్ చేసి కంగారుపెట్టే TV9 రజనీకాంత్ ఈరోజు రాంగోపాల్‌వర్మ చేతిలో కంప్లీట్‌గా క్లీన్‌బోల్డయ్యాడు. గంటసేపు జరిగిన ప్రోగ్రాంలో కనీసం ఒక్కసారి కూడా రాంగోపాల్‌వర్మకు సమానస్థాయిలో కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇవ్వలేకపొయ్యాడు. అనేక సందర్భాల్లో డిస్కషన్ ఎలా నడపాలో తెలియక వెర్రిమొహం వేశాడు. తనవాదనకు పనికొస్తారేమోనని ఇద్దరు మూవీ జర్నలిస్టులని పిలిస్తే వాల్లు ఇంకొంచెం కంఫ్యూషన్ క్రియేట్ చేశారు కానీ ఏవిధంగానూ రజనీకాంత్‌కు సహాయం కాలేకపొయ్యారు.

రోజూ అందరు పబ్లిక్ ఫిగర్లపైనా బురదచల్లి, మల్లీ వారొచ్చి తమపైన వచ్చిన వార్తలను ఖండిస్తే మరొకసారి అదికూడా చూపించి టీఆర్పీ పెంచుకోవడానికి చీప్‌ట్రిక్స్ ఆడే TV9 రాంగోపాల్‌వర్మతో ఎందుకు పెట్టుకున్నామురాబాబూ అనుకునేలా డిస్కషన్ నడిచింది. ఎలాగయినా సరే వర్మను వెధవను చేద్దామని అదే ప్రశ్నను మల్లీమల్లీ ఎపాటిలాగే అడిగిన రజనీకాంత్ ఈసారి మల్లీమల్లీ వెధవయ్యాడు.

రాంగోపాల్‌వర్మ పూర్తి డిస్కషన్‌లో ఒకే పాయింటుపైన ఉన్నాడు. తను తీసే సినిమాలు బాగులేవని విమర్శించొచు, కానీ వర్మ ప్రేక్షకులను వెధవలు అనుకుంటాడని ఆయన తరఫున వీరెలా చెబుతారనే దానికి రజనీకాంత్ దగ్గర సమాధానం లేదు. కాస్సేపు బురద జల్లుడు కార్యక్రమం, కాస్సేపు వర్మకు సలహాలిచ్చే కార్యక్రమం, కాస్సేపు ప్రేక్షకులను రక్షించబోయే కార్యక్రమం చేసి అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. ఇక ఏనాడూ సమాజానికి పనికొచ్చే ఒక్క స్పెషల్ రిపోర్టు చూపించక ఎప్పుడూ పనికిమాలిన డిబేట్‌లు పెట్టి ఒకరినొకరు తిట్టుకునేట్టు చెయ్యడం, లేకపోతే పబ్లిక్‌ఫిగర్లపై బురదజల్లడం చేసి టీఆర్పీ పెంచుకునే TV9 వర్మకు సామాజిక స్పృహ నేర్పే ప్రయత్నం చెయ్యబొయి బోర్లాపడ్డం గమ్మత్తుగా ఉంది. పనిలో పనిగా ఇందులో యండమూరి కూడా ఫూల్ అయ్యాడు.

6 comments:

 1. wonderful. nenu ippude chusaa. baga chepparu. dada pin counter with KA paul taruvaata baga enjoy chesina program idi. rajanikanth=ka paul, varma= dada.

  tv9 talchukunte yandamurinenti yevarinainaa fool cheyyataaniki chustundi. varma baga tikka kudirchadu.

  varma cheppinattu raktha charitra kante yekkuva violence chupistaaru ee channels lo. veellakeppudanna trp ratings padipote yevaru bathroom lo yem chestuntaaru, bed room lo yem chestuntaaro kaavaali. lekapote sagatu preshakudipai saamaajika spruhato teleenivaadiki kudaa voyarism laanti foreign concepts introduce chestaaru veellu.

  nenu regulargaa raayanu. yemanna poraptlu vunte kshaminchagalaru.

  ReplyDelete
 2. Nenu kooda ippude chusaanadi...varma dhaggarunna clarity,rajinikanth dhaggara ledhu...kaani adicchesadandi kasepu...chaalaa rojulu tharvaatha tv9 chusaanu ee program chuddhamani...

  ReplyDelete
 3. ఆ విధంగా వర్మగారు చేసి మంచి పని చేసారు.లేక పోతే మీడియా వాళ్ళు చివరికి భార్యా భర్తల మధ్య కూడా దూరుతున్నారు.ఒక్కక్క సారి భార్యా భర్తల మధ్య ఏవో చిన్న మనస్పర్థలు వస్తూ ఉంటాయి.తర్వాత సర్దుకుంటాయి. వీళ్ళ రేటింగ్ కోసం మధ్యలో వీళ్ళు దూరి వాళ్ళ తో లైవ్ ప్రోగ్రాం లు ఇప్పించి వాళ్ళ మధ్య ఇంకా దూరం పెంచుతున్నారు.మీడియా వాళ్ళు వ్యక్తిత్వ హనన కార్యక్రమాలు మానుకుంటే బావుంటుంది.

  ReplyDelete
 4. yandamoori is a big fool long back..

  ReplyDelete
 5. mmd,prabandhchowdary.pudota,రమణారెడ్డి,astrojoyd

  మీస్పందనకు ధన్యవాదాలు.

  ReplyDelete