నెల్లూరులో ఫిబ్రవరి 20న జరిగిన దళితమహాసభ రాష్ట్ర విభజనకు తమ మద్దతు ప్రకటించింది. దళిత మహాసభ ఫౌండర్ కత్తి పద్మారావు అధ్యక్షతన జరిగిన ఈ దళితమహాసభ రాష్ట్ర విభజనకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలిసి ఉద్యమనిచాలని పిలుపునిచ్చింది. సమైఖ్య రాష్ట్రంలో దళితులకు న్యాయం జరగడంలేదు, కేవలం కొన్ని అగ్రకులాలవారే ఆధిప్త్యం చేస్తున్నారు, దళితులపై దాడులు మానడంలేదు. రాష్ట్ర విభజన జరిగితేనే దళితులకు న్యాయం జ్రుగుతుందని వారు స్పష్టం చేశారు. సమీక్యాంధ్ర JAC దళితమహాసభ వారిని విభజనకు మద్దతు ఇవ్వొద్దని కోరినా, వారు పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన వార్తను డెక్కన్ క్రానికల్‌లో ఇక్కడ చూడవచ్చు. తెలుగు మీడియా మాత్రం దళితమహాసభ గురించి ఎక్కడ ప్రస్తావించినట్లు లేదు.
ఇప్పటికే బీసీ నాయకుడు ఆర్.క్రిష్నయ్య అధ్యక్షతలోని బీసీ ఐక్యవేదిక తెలంగాణాకు మద్దతు ప్రకటించింది. సీమాంధ్రకు చెందిన దళిత, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది ఇప్పటికే బహిరంగంగా విభజనకు మద్దతు ఇవ్వగా కొంతమంది మద్దతు ఇస్థున్నా ఇంకా బయటపడట్లేదు. విభజన కోరుతున్న సీమాంధ్ర నాయకులలో బొత్సా సత్యనారాయణ, హర్షకుమార్, మోపిదేవి వెంకటరమణ ప్రముఖులు.
సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణాలోనయినా, సిమాంధ్రలోనయినా అగ్రకులాలదే అద్ధిపత్యం. సమైఖ్య రాష్ట్రంలో పెద్ద నెట్‌వర్క్‌తో బలంగా ఉన్న దోపిడీ వ్యవస్థను ఎదిరించడం కష్టం, చిన్నరాష్ట్రాలయితేనే సులువు అనేది వీరి వాదన. చిన్న రాష్ట్రాలను కోరిన అంబేద్కర్ ఆశయం కూడా ఇదే ధోరణిలో ఉంది. ఎనభై శాతం ఉన్న దళిత, బీసీలు సీమాంధ్రలో తెలంగాణాకు మద్దతు ఇస్థుండగా మరి సమిఖ్యవాదం ఎవరికోసం? ఇరవై శాతం మించని అగ్రకులాలకోసమేనా?
కత్తి పద్మారావు బీసీ ఎప్పుడయ్యాడు ? ప్రత్యేక తెలంగాణ ఇచ్చెయ్యమని ఆంధ్రా బీసీలు ఎప్పుడు చెప్పారు ? వాళ్ళ తరఫున ఈయన వకాల్తా పుచ్చుకుని చెప్పడమేంటి ?
ReplyDeleteరాష్ట్రంలో అగ్రకులాల జనాభా ఆంధ్రా ఏరియాలోనే ఎక్కువ. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అయితే వారి శాతం 27. ఏ ఇరవైశాతం గురించి మాట్లాడుతున్నారు మీరు ?
Good post.
ReplyDeleteనిన్న మొన్నటిదాకా ప్రాణాలైనా అడ్డేస్తాం గానీ తెలుగు జాతి రెండుగా విడిపోవడానికి మేమొప్పుకోం అంటూ అక్కడి+ఇక్కడి ప్రజలపై అవ్యాజమైన ప్రేమున్నవారిలా నటించినవారు ఇప్పుడు సడన్ గా హైదరాబాద్‌ను యూ.టీ చేస్తే విభజనకు ఓకే చెబుతామనడం ఇరు ప్రాంతాల ప్రజల చెవుల్లో కూనా సమైఖ్య నాయకులు పెడుతున్న క్యాబేజీలూ, కాలిఫ్లవర్లూ కాక మరేంటి. వీళ్ళకు కావలసింది హైదరాబాదుపై హక్కే గానీ, తెలుగువాళ్ళ ఐక్యతా తొక్కా తోలూ అంటూ చెప్పిన కాకమ్మ సెంటిమెంట్లు కాదని ఇప్పటికైనా వీరి వీరాభిమానాంధ్రులకు తెలిసొస్తే బాగుండు. హైదరాబాద్ సంగతేంటనో, మాకు కొత్త కేపిటల్ కోసం ఎంత కాంపెన్‌షేషన్ ఇస్తారనో, నదీ జలాల పంపకంపై మాకెలా న్యాయం చేస్తారనో డైరక్ట్‌గా అడిగి తమక్కావలసినవి తాము సాధించుకుని మా రాష్ట్రం మాకిచ్చేదానికి చల్లకొచ్చి ముంతదాయాడమెందుకు.
R.S.Reddy garu, welcome to my blog.
ReplyDelete@కుమార్ దత్తా
ReplyDeleteకత్తి పద్మారావు దళితుడు, దళితమహాసభ ఆయన అధ్యక్షతన జరిగిందనేది టపా సారాంశము, ఆయన బీసీ అని ఎవరు అనలేదే? బొత్సా బీసీ. అలాగే సమైక్యాంధ్రప్రదేశ్ బీసీ ఐక్యవేదిక కూడా విభజనకు మద్దతిచ్చింది. ఇక 20 శాతం కాకపోతే 27 లేదా 30. మిగతా డెబ్బయి శాతం మాట నెగ్గాలా లేక వీరిదా?
టోకెన్ నాయకత్వాలు అసలు ప్రజలకు ప్రాతినిధ్యం వహించవు. దళితులంతా కత్తి పద్మారావు అనుచరులా ? లేకపోతే బీసీలంతా కృష్ణయ్య అనుచరులా ? రాష్ట్ర విభజనకు అంతగా తెలుగు ప్రజామద్దతు ఉందని నిరూపించాలంటే రాష్ట్రవ్యాప్తంగా ప్లెబిసైట్ పెట్టాల్సిందే. ఇహ ఏదీ చెల్లదు.
ReplyDelete@కుమార్ దత్తా
ReplyDeleteసీమాంధ్రలో దళిత, బీసీలు విభజన కోరుకుంటున్నారు, కాని ఆడిమాండుని వినపడనీయకుండా అణచివేస్తున్నారనేది ఇక్కడ ప్రస్తావన, అంతే కానీ సీమాంధ్రలో మెజారిటీ ప్రజలు విభజన కోరితే కానీ తెలంగాణ రాదని కాదు. ప్లెబిసైటులూ, రిఫరెండంలకు మన రాజ్యాంగంలో ప్రోవిజన్ లేదు. ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడో, లేక ఝార్ఖండ్ ఉత్తర్‌ఖాండ్ విషయంలోనో ప్లెబిసైటులేమీ పెట్టలేదు. అసలు తెలంగాణా ఏర్పాటుకు సీమాంధ్ర ప్రజల అభిప్రాయమో, లేక బీహార్, డెన్మార్క్ ప్రజల అభిప్రాయంతో అవసరంకూడా లేదు. ఆమాటకొస్తే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఏమీ రిఫరెండం పెట్టి చెయ్యలేదు.
మళ్ళీ మీరు అవే లీగలిజాలూ, టోకెనిజాలూ మాట్లాడుతున్నారు. ఆంధ్రావారి మద్దతు లేకుండా తెలంగాణా రాదు. మొన్న రాబోయి ఆగిపోయింది ఆ కారణం వల్లనే అని తెలిసి కూడా ఎందుకిలా ప్రాంతీయ అహంకారంతో ఆత్మవంచన చేసుకుంటారు ? ఆంధ్రప్రదేశ్ మూడు ప్రాంతాల సమ్మతితో కలిసింది. విడిపోతే మూడు ప్రాంతాల సమ్మతితోనే విడిపోవాలి. ఇది చాలా సింపుల్ గా అర్థమయ్యే విషయం. అంతే గానీ ముగ్గురిలో ఒకడు లేచి ఏకపక్షంగా తాను విడిపోతానంటే అది సాధ్యం కాదు. ఇప్పటివరకూ అందుకనే సాధ్యం కాలేదు.
ReplyDelete@కుమార్ దత్తా
ReplyDeleteఒక పార్ట్‌నర్‌షిప్ ఏర్పడ్డానికి అందరు భాగస్వాముల మద్దతు కావలి, పార్ట్‌నర్‌షిప్ విడిపోవడానికి ఒక్కరి అభిప్రాయం చాలు, ఎలా విడిపోవాలన్నదే సమస్య. రాష్ట్రం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, ఇన్నిరోజులు ఇవ్వకపోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి కావల్సిన మెజారిటీ లేకపోవడమే. ఇప్పుడు NDAకూడా మద్దతు ఇస్తుండడం వల్ల తెలంగాణా ఇవ్వడం తప్పనిసరి, ఇప్పుడు కాకపోతే 2014 ఎలక్షన్ల ముందు.
Abbo ... ichesthe techesukondi.
ReplyDelete>>>> నిన్న మొన్నటిదాకా ప్రాణాలైనా అడ్డేస్తాం గానీ తెలుగు జాతి రెండుగా విడిపోవడానికి మేమొప్పుకోం అంటూ అక్కడి+ఇక్కడి ప్రజలపై అవ్యాజమైన ప్రేమున్నవారిలా నటించినవారు ఇప్పుడు సడన్ గా హైదరాబాద్‌ను యూ.టీ చేస్తే విభజనకు ఓకే చెబుతామనడం ఇరు ప్రాంతాల ప్రజల చెవుల్లో కూనా సమైఖ్య నాయకులు పెడుతున్న క్యాబేజీలూ, కాలిఫ్లవర్లూ కాక మరేంటి.
- ee jathi rendu gavidipokadadu ane feeling andhra lo appudu/ippudu undi ....
- kani inkokallu mondi pattu padithe, ivaatame anthima nirnayama ithe evari swalabhalu vallu choosukovatam lo thappu ledu kada. Hyderabad intha ga develop avvakapothe adi evvariki avasaram ledu .... even Telangana vallaki kuda.
@అనామకుడు
ReplyDeleteఇది ఒక్క జాతి అనే భావనే ఉంటే ఇన్ని సమస్యలు రావు. ఇన్నాల్లు లేని జాతీయతా భావం రాత్రికి రాత్రి దొంగ ఉద్యమం చేస్తే రాదు.
ఒకే జాతి అనే భావం తరతరాలుగా ఉంది కాబట్టే 1956 లో రాష్ట్రం ఏర్పడింది. అందుకు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ కూడా ఆ రోజుల్లో అనుకూలం తీర్మానం చేసింది. పనిగట్టుకుని దుష్ప్రచారాలతో, సామరస్యాన్ని తాత్కాలికంగా దెబ్బదీసినంత మాత్రాన ప్రజల్లో మనమంతా తెలుగువాళ్ళమనే భావనని శాశ్వతంగా చంపేయలేరు. ఈరోజు ఒకరు విడదీస్తే ఇంకొకరొచ్చి తప్పకుండా కలుపుతారు.
ReplyDeleteఏంటి ? అది పార్లమెంట్ ఒప్పుకుంటే చాలా ? ఆంధ్రోళ్ళు ఒప్పుకోనక్కరలేదా ? ఏది మరి, పార్లమెంట్ ఒప్పుకోవడం లేదేం ? ఒప్పించండి చేతనయితే ! NDA ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కనుక ప్రత్యేక రాష్ట్రం ఇస్తానంటుంది. కానీ UPA చేయలేనిది NDA చేయగలదా ? వీళ్ళకున్న ఇబ్బందులే ఆ సమయానికి వాళ్ళకీ ఉంటాయి.
ఎక్కడైనా కలిసే హక్కే ఉంటుంది. విడిపోయే హక్కు ఎక్కడా ఉండదు. అదే గనక ఉంటే ప్రపంచంలోని అన్ని రాష్టాల/ దేశాల కొంపా కొల్లేరే.
రాజకీయపార్టీలు ఒక నిర్ణయం తీసుకుంటే బిల్లు ఆటోమేటిక్ గా పాస్ అవుతుంది, అలాగే 1956లో బిల్లు పాస్ అయ్యింది, అంత మాత్రాన అందరూ అనుకూలంగా ఉన్నట్లు కాదు, మీరు ఇప్పుడు అడుగుతున్నట్లు రెఫరెండం ఏమీ జరగలేదు. ఇక తెలంగాణా, ఆంధ్రా కలయిక కొన్ని ఒప్పందాలకనుగునంగా జరిగింది. ఒప్పందాలు అమలుకాలేదనుకుంటే విడిపొయ్యే హక్కు ఉందనేది ఒప్పందం సారాంశం. ఆంధ్రోల్లు ఒప్పుకోనవసరం లేదు.
ReplyDeleteఅయితే ప్రస్తుత టపా సారాంశం ఆంధ్రాలో కూడా అనేకులు విభజన కోరుతున్నారు, సమైఖ్య ఉద్యమమనేది కొంతమంది నాటకం కాగా దానికి దళిత, బీసీలమద్దతు లేదనేది.
ఒకజాతి అనే భావన ఉండడానికి 1956 ముందు ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలంతా ఎప్పుడూ కలిసి ఉండడం జరగలేదు. జాతి అనే భావన ఉంటే పరిపాలనలో ఇంత వివక్ష ఉండదు. ఒక భాష మాట్లాడినంత మాత్రాన జాతి అనే భావన రాదు.
ReplyDeleteతాత్కాలిక ఉద్యమాల కోసం, వాటి తప్పుడు ఐడియాలజీ కోసం చారిత్రిక సత్యాల్ని దాచాలని దాస్తే దాగవు.
ReplyDeleteఒకే జాతి అనే భావనలేకపోతే ఆ రోజుల్లో ఆంధ్రావారు కూడా వచ్చి తమకేమీ సంబంధం లేకపోయినా తెలంగాణ ప్రజల కోసం ఎందుకు నిజాముకూ, రజాకార్లకూ వ్యతిరేకంగా పోరాడారు ? తెలుగుజాతినంతా ఏకం చేయాలనీ, అలా కలిసిన తెలుగుజాతికి హైదరాబాదు రాజధానిగా ఉండాలనీ ఆనాటి నిజామాబాద్ ఎమ్పీ ఎందుకు పార్లమెంట్‌లో మాట్లాడాడు ? అన్నింటినీ మించి ఆనాటి హైదరాబాద్ శాసనసభ తెలుగుజాతి అంతా కలిసి ఒకే రాష్టంగా ఉండాలని ఎందుకు ఆధికారికంగా తీర్మానం చేసింది ?
ఇక్కడి కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే అక్కడి కమ్యూనిస్టులు తమ సహకారం ఇచ్చారు, అందుకు వారికి ధన్యవాదాలు. అయితే అప్పుడు మీప్రాంతంలో కొందరు సహకరించారని ఎప్పటికీ మాపై పెత్తనం చేస్తానంటే కుదరదు. తెలుగు వారంతా కలిసి ఉంటే బాగుంటుందని మీరన్నట్లు ఇక్కడి ప్రాంతంలో కూడా కొందరు భావించారు, దానివలననే ఎన్నో అనుమానాలున్నా సరే కలిసి ఒక్కరాష్ట్రంగా ఉన్నాం, అది కూడా కొన్ని శరతులతో కూడిన ఒప్పందాలద్వారా. అయితే ఇన్నేల్లపాలననో ఏనాడూ తెలుగుజాతి భావన చూపకుండా ఒక్కొక్క ఒప్పందాన్ని తుంగలో తొక్కిన తరువాత ఇంకా మనది ఒక్కజాతి, కాబట్టి కలిసే ఉండాలి అని అంటే వినే పరిస్థితిలో ప్రజలు లేరు.
ReplyDeleteఅందుకు అక్కడి ప్రజల్లో కూడా దళిత,బీసీలు మద్దతు ఇస్తున్నారు.